శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్ తగులుతోంది. సీనియర్లు, యువనేతలు అనే తేడా లేకుండా చాలా మంది పార్టీని వీడుతున్నారు. పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉన్న గులాం నబీ ఆజాద్ శుక్రవారం రాజీనామా చేయగానే.. కశ్మీర్‌కు చెందిన మరో ఐదుగురు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆజాద్‌కు అత్యంత సన్నిహితులైన వీరంతా.. ఆయన బాటలోనే నడుస్తామని తేల్చి చెప్పారు.
ఆజాద్ తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కశ్మీర్ నేతల్లో జీఎం సరూరి, హజి అబ్దుల్ రషీద్, మొహమ్మద్ ఆమిన్ భట్, గుల్జర్ అహ్మద్ వాని, చౌదరి మహ్మద్ అక్రమ్ ఉన్నారు. వీరితో పాటు సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ఆర్ఎస్ చిబ్ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
జమ్ముకశ్మీర్ అభ్యన్నతి కోసమే తాను ఆజాద్‌తో కలిసి ముందుకుసాగాలనుకుంటున్నట్లు చిబ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని కోల్పోయిందన్నారు. అందకే పార్టీ గ్రాఫ్ అంతకంతకూ పడిపోతూ వస్తోందని చెప్పారు.
చదవండి: బీజేపీతో టచ్‌లో లేను.. ఆజాద్ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment