కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళశారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలో జరిగిన ఈ వేడుకలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే.. నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్‌పీపీ)కి చెందిన 54 ఏళ్ల హరిణితో చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎన్‌పీపీకి చెందిన మరో ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు విజితా హెరాత్, లక్ష్మణ్ నిపునరాచ్చిని కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శ్రీలంకలో దిసనాయకే, హరిణితోసహా మొత్తం నలుగురి సభ్యులతో శ్రీలంక మంత్రివర్గం కొలువుదీరింది. ప్రధానితోపాటు ఆమెకు న్యాయం, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలకమైన మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు.
ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను ప్రస్తుతం హరిణి చేపట్టారు. కాగా సిరిమావో బండారు నాయకే తర్వాత(2020 తర్వాత) ప్రధాని పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా హరిణి నిలిచారు.
హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ లెక్చరర్‌గా పనిచేసిన అమరసూర్య శ్రీలంకలో సామాజిక న్యాయం, విద్యకు గణనీయమైన కృషి చేశారు. ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతిని సూచించడమే కాకుండా ప్రగతిశీల నాయకత్వం, సంస్కరణపై ఎన్‌పీపీ దృష్టిని నొక్కి చెబుతుంది.
ఇక శ్రీలంకకు మూడో మహిళా ప్రధానిగా హరిణి చరిత్ర సృష్టించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన బండారునాయకే తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడుసార్లు(1960–65, 1970–77, 1994–2000) ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ఆ పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతికెక్కారు. ఆమె తర్వాత చంద్రికా కుమారతుంగ(1994) ప్రధాని పదవిలో రెండు నెలలు కొనసాగారు.
ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయంతో శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని దిసనాయకే సోమవారం చెప్పడంతో శ్రీలంకలో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment