new prime minister
-
ఫ్రాన్స్ ప్రధానిగా ఫ్రాంకోయిస్
ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇ మ్మానుయేల్ మాక్రాన్ శుక్ర వారం అధికార కూటమికి చెందిన నేత ఫ్రాంకోయిస్ బైరూ పేరు(73)ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. గత వారం నేషనల్ అసెంబ్లీ పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో ఓడిపోవడంతో మైకేల్ బెర్నియర్ ప్రభుత్వం గద్దె దిగడం తెలిసిందే. ఫ్రాన్సు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న బైరూ అందరికీ తెలిసిన వ్యక్తి. పార్లమెంట్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే సత్తా బైరూకు ఉందని భావిస్తున్నారు. -
పదవి నుంచి తప్పుకోను: మాక్రాన్
పారిస్: పదవీకాలం ముగిసేదాకా కొనసాగుతానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. కొత్త ప్రధానిని మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రధాని మైకేల్ బార్నియర్ రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాక్రాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఫ్రెంచ్ ఫార్ రైట్, హార్డ్ లెఫ్ట్ పార్టీలు రిపబ్లికన్ వ్యతిరేక ఫ్రంట్‌కు సహకరిస్తున్నాయని ఆరోపించారు. ‘‘నా నిర్ణయాలపై వ్యతిరేకతతో రాజకీయ ప్రత్యర్థులు గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి దృష్టి ప్రజల సమస్యలపై కాదు. కేవలం అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది’’ ని విమర్శించారు. తదుపరి ప్రధాని ఎవరనే దానిపై మాక్రాన్ సంకేతాలివ్వలేదు. రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్, అంతర్గత మంత్రి బ్రూనో రిటైల్లీయు, ఫ్రాంకోయిస్ బేరూ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. -
అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు
టోక్యో: అధికార పగ్గాలు చేపట్టేలోపే జపాన్ కాబోయే ప్రధాని షిగెరు ఇషిబా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిచ్చారు. నేడు ప్రధానిగా ప్రమాణం చేయనున్న ఇషిబా సోమవారం మాట్లాడారు. ‘‘ నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తా’’ అని అన్నారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఇషిబా విజయం సాధించడం తెల్సిందే. దీంతో ఫుమియో కిషిద వారసుడిగా ఇషిబా ఎంపికయ్యారు. మంగళవారం ప్రమాణస్వీకారం కోసం ఎల్డీపీ ముఖ్యనేతలంతా సిద్దమవుతున్న వేళ ఇషిబా తదుపరి ఎన్నికలపై ముందే ఒక ప్రకటనచేయడం గమనార్హం. -
కిషిదా వారసుడిగా ఇషిబా
టోక్యో: జపాన్ నూతన ప్రధానమంత్రిగా షిగెరు ఇషిబా(67) బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఫుమియో కిషిదా వారసుడిగా ఆయన ఎన్నికయ్యారు. రక్షణ శాఖ మాజీ మంత్రి అయిన ఇషిబాను జపాన్ అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) శుక్రవారం తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిదాపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచి్చంది. పార్లమెంట్లో మెజార్టీ ఉన్న పార్టీ అధ్యక్షుడే ప్రధానమంత్రి కావడం ఆనవాయితీ. కిషిదా తప్పుకోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపిక కోసం ఓటింగ్ నిర్వహించారు. ఎల్డీపీ పార్లమెంట్ సభ్యులతోపాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి పదవి కోసం ఇద్దరు మహిళలు సహా మొత్తం 9 మంది ఎంపీలు పోటీపడ్డారు. ఇషిబాతోపాటు ఎకనామిక్ సెక్యూరిటీ మంత్రి సనాయే తకైచి చివరి వరకు బరిలో కొనసాగారు. కానీ, ఇషిబాను విజయం వరించింది. ఒకవేళ తకైచి గెలిచి ఉంటే జపాన్ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించి ఉండేవారు. ఎంపీల ఓట్లు 368, స్థానిక ప్రభుత్వాల్లోని ఓట్లు 47 ఉన్నాయి. ఇషిబాకు అనుకూలంగా 215 ఓట్లు, తకైచి అనుకూలంగా 194 ఓట్లు వచ్చాయి. కొందరు ఎంపీలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. జపాన్ ప్రధాని కిషిదా, ఆయన కేబినెట్ మంత్రులు అక్టోబర్ 1న రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు పార్లమెంటరీ ఓటింగ్‌లో ఇషిబాను ప్రధానిగా లాంఛనంగా ఎన్నుకుంటారు. తర్వాత అదే రోజు ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. జపాన్ను సురక్షితమైన దేశంగా మారుస్తా: ఇషిబా ప్రజల పట్ల తనకు ఎనలేని విశ్వాసం ఉందని ఇషిబా చెప్పారు. ధైర్యం, నిజాయతీతో ఎల్లప్పుడూ నిజాలే మాట్లాడుతానని అన్నారు. ఎల్డీపీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇషిబా శుక్రవారం టోక్యోలో మీడియాతో మాట్లాడారు. జపాన్ను సురక్షితమైన, సౌభాగ్యవంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. ద్రవ్యోల్బణం, అధిక ధరల నుంచి ప్రజలకు విముక్తి కలి్పంచడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతానని తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్దపీట వేస్తానని వెల్లడించారు. అణు ఇంధనంపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆసియా ఖండంలో ‘నాటో’ తరహా కూటమి ఏర్పాటు కావాలని ఇషిబా ఆకాంక్షించారు. జపాన్‌లో పెళ్లయిన మహిళలకు ఏదో ఒక ఇంటిపేరు ఉండాలి. పుట్టింటివారు లేదా అత్తింటివారి ఇంటి పేరుతో కొనసాగవచ్చు. కానీ, రెండు ఇంటి పేర్లతో కొనసాగేలా చట్టం తీసుకురావాలని ఇషిబా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి చట్టం కావాలని ఆయన ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు స్వలింగ వివాహాల పట్ల సానుకూల వ్యక్తం చేస్తున్నారు. ఎవరీ ఇషిబా? షిగెరు ఇషిబా న్యాయ విద్య అభ్యసించారు. బ్యాంకింగ్ రంగంలో సేవలందించారు. తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1986లో 29 ఏళ్ల వయసులో ఎల్డీపీ టికెట్‌పై తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 38 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ఎల్డీపీ సెక్రెటరీ జనరల్‌గా వ్యవహరించారు. వ్యవసాయం, రక్షణ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రి పదవిపై ఎప్పుటినుంచో కన్నేశారు. గతంలో నాలుగుసార్లు గట్టిగా ప్రయతి్నంచి భంగపడ్డారు. ఎట్టకేలకు ఐదో ప్రయత్నంలో విజయం సాధించారు. ఇషిబా తండ్రి సైతం రాజకీయ నాయకుడే. ఆయన కేబినెట్ మంత్రిగా పనిచేశారు. కిషిదాకు, ఇషిబాకు మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఎల్డీపీలో ఇషిబాకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టారన్న విమర్శలున్నాయి. ఎల్డీపీలో ఇషిబా పలు సందర్భాల్లో అసమ్మతి గళం వినిపించారు. -
శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య
కొలంబో: శ్రీలకం నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య అధికారికంగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె మంగళశారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొలంబోలో జరిగిన ఈ వేడుకలో శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసనాయకే.. నేషనల్ పీపుల్స్ పవర్(ఎన్పీపీ)కి చెందిన 54 ఏళ్ల హరిణితో చేత ప్రమాణ స్వీకారం చేయించారు.ఎన్పీపీకి చెందిన మరో ఇద్దరు పార్లమెంట్ ఎంపీలు విజితా హెరాత్, లక్ష్మణ్ నిపునరాచ్చిని కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో శ్రీలంకలో దిసనాయకే, హరిణితోసహా మొత్తం నలుగురి సభ్యులతో శ్రీలంక మంత్రివర్గం కొలువుదీరింది. ప్రధానితోపాటు ఆమెకు న్యాయం, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలకమైన మంత్రిత్వ బాధ్యతలను అప్పగించారు. ఇదిలా ఉండగా ఎన్నికల తర్వాత అధికార మార్పిడిలో భాగంగా దినేష్ గుణవర్ధన తన ప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ బాధ్యతలను ప్రస్తుతం హరిణి చేపట్టారు. కాగా సిరిమావో బండారు నాయకే తర్వాత(2020 తర్వాత) ప్రధాని పదవి చేపట్టిన మొదటి మహిళా నేతగా హరిణి నిలిచారు.హక్కుల కార్యకర్తగా, యూనివర్సిటీ లెక్చరర్‌గా పనిచేసిన అమరసూర్య శ్రీలంకలో సామాజిక న్యాయం, విద్యకు గణనీయమైన కృషి చేశారు. ఆమె నియామకం రాజకీయాల్లో మహిళలకు పురోగతిని సూచించడమే కాకుండా ప్రగతిశీల నాయకత్వం, సంస్కరణపై ఎన్పీపీ దృష్టిని నొక్కి చెబుతుంది. ఇక శ్రీలంకకు మూడో మహిళా ప్రధానిగా హరిణి చరిత్ర సృష్టించారు. శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన బండారునాయకే తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మొత్తం మూడుసార్లు(1960–65, 1970–77, 1994–2000) ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ప్రపంచంలో ఆ పదవిని అధిరోహించిన మొదటి మహిళగా ఖ్యాతికెక్కారు. ఆమె తర్వాత చంద్రికా కుమారతుంగ(1994) ప్రధాని పదవిలో రెండు నెలలు కొనసాగారు.ఇటీవల జరిగిన శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే సంచలన విజయంతో శ్రీలంక నూతన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత పార్లమెంట్‌ను రెండు రోజుల్లో రద్దు చేస్తామని దిసనాయకే సోమవారం చెప్పడంతో శ్రీలంకలో ముందస్తు పార్లమెంటు ఎన్నికలు నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది. -
ఫ్రాన్స్ ప్రధానిగా మైకేల్ బార్నియర్
పారిస్: ఫ్రాన్ నూతన ప్రధాని మైకేల్ బార్నియర్‌ను దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ గురువారం నియమించారు. బ్రెగ్జిట్ చర్చల్లో యూరోపియన్ యూనియన్‌కు 73 ఏళ్ల బార్నియర్ ప్రాతినిధ్యం వహించారు. హంగ్ పార్లమెంటు ఏర్పడటం వామపక్షాలు అతిపెద్ద గ్రూపుగా అవతరించడంతో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎన్నికల్లో ఓటమితో గాబ్రియెల్ అట్టల్ జూలై 16న ప్రధానిగా రాజీనామా చేసినా ఒలింపిక్స్ క్రీడల దృష్ట్యా మాక్రాన్ ఆయన్నే తాత్కాలిక ప్రధానిగా కొనసాగించారు. లెఫ్ట్ కూటమి ఇదివరకు ఒకరిని ప్రధానిగా ప్రతిపాదించగా మాక్రాన్ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లి ప్రభుత్వాన్ని నడపగల అభ్యర్థి కోసం మాక్రాన్ శిబిరం అన్వేíÙంచింది. చివరకు బార్నియర్‌ను ఎంపిక చేసింది. ‘దేశానికి, ఫ్రెంచ్ ప్రజలకు సేవ చేయడానికి ఏకీకృత ప్రభుత్వాన్ని నడిపే బాధ్యతను బార్నియర్‌కు అప్పగించాం’ అని మాక్రాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బార్నియర్ గతంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రిగా, పర్యావరణ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. యూరోపియన్ యూనియన్ కమిషనర్‌గా రెండు పర్యాయాలు చేశారు. -
థాయ్‌లాండ్ ప్రధానిగా పేటోంగ్టార్న్ ఖరారు!
బ్యాంకాక్: థాయిలాండ్ నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తమ అభ్యర్థిగా నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర పేరును నామినేట్ చేసింది. కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పత్రికా సమావేశంలో ఫ్యూ థాయ్ ప్రకటించింది. శుక్రవారం జరగబోయే పార్లమెంటరీ ఓటింగ్‌లో ఆమె గెలిస్తే షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర దేశ ప్రధాన మంత్రులుగా చేశారు. పేటోంగ్టార్న్ను ఏకగ్రీవంగా నామినేట్ చేశామని ప్యూ పార్టీ ప్రధాన కార్యదర్శి సొరవాంగ్ థియేన్థాంగ్ చెప్పారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి థాయిలాండ్ రాజ్యాంగ ధర్మాసనం తప్పించడం విదితమే. -
Bangladesh Political Crisis: బంగ్లా సారథిగా యూనుస్
ఢాకా: నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనుస్(84)ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమితులయ్యారు. ఈ హోదా ప్రధానమంత్రితో సమానమైనది. గురువారం అధ్యక్ష భవనం ‘బంగభవన్’లో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. యూనుస్‌కు 16 మందితో కూడిన సలహాదారుల మండలి పాలనలో సహకరించనుంది. ఈ మండలికి ఎంపికైన వారిలో రిజర్వేషన్ కోటా ఉద్యమానికి నాయకత్వం వహించిన నాహిద్ ఇస్లాం, ఆసిఫ్ మహ్మూద్తోపాటు మహిళా హక్కుల కార్యకర్త ఫరీదా అఖ్తర్ తదితరులున్నారు. వీరితో కూడా అధ్యక్షుడు ప్రమాణం చేయించారు. పౌరులకు భద్రత కలి్పంచడానికి తన ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకు తనకు సాయపడాలని యూనుస్ ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరారు. -
నేపాల్ ప్రధానిగా ఓలీ ప్రమాణం
కఠ్మాండు: నెలల వ్యవధిలో ప్రభుత్వాలు కూలి కొత్త ప్రభుత్వాలు కొలువుతీరే హిమాలయాల దేశం నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్) అధినేత కేపీ శర్మ ఓలీ ప్రధానిగా సోమవారం ప్రమాణం చేశారు. ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి ఓలీ, షేర్ బహదూర్ దేవ్బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో ఆయన విశ్వాసపరీక్షలో ఓడిపోవడం, ప్రధానిగా రాజీనామా చేయడం తెల్సిందే. దీంతో ఓలీ, దేవ్బా ఏడు అంశాలపై ఏకాభిప్రాయంతో కూటమిగా ఏర్పడి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. నేపాలీ రాజ్యాంగంలోని ఆరి్టకల్76–2 ప్రకారం ఓలీని నూతన ప్రధానిగా దేశాధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓలీ ప్రధానిగా ప్రమాణంచేశారు. ఓలీ ప్రధాని పదవి చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. సోమవారం కాఠ్మాండూలోని రాష్ట్రపతిభవన్(శీతల్ నివాస్)లో దేశాధ్యక్షుడు పౌడెల్ ఈయన చేత ప్రధానిగా ప్రమాణంచేయించారు. సుస్థిర సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ఆశించారు. కూటమిలోని నేపాలీ కాంగ్రెస్ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోని తీసుకోవాలన్న విషయంలో భేదాభిప్రాయాలు పొడచూపడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నూతన ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని ప్రపంచ పార్టీ విమర్శలు సంధించింది. కూటమిలో కీలక పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ భార్య అర్జో రాణా దేవ్‌బాకు విదేశాంగ మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 30 రోజుల్లోపు ఓలీ పార్లమెంట్లో బలపరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది. -
India-UK Free Trade Agreement: స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధం
లండన్: భారత్– బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) ఆచరణలోకి తెచ్చేందుకు సిద్ధమని బ్రిటన్ నూతన ప్రధాని కియర్ స్టార్మర్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో శనివారం ఆయన ఈ మేరకు ఫోన్లో చర్చలు జరిపినట్టు బ్రిటన్ ప్రకటించింది. ఆర్థిక బంధాన్ని బలోపేతం చేయడానికి, ఇరు దేశాల ప్రజల వికాసానికి కట్టుబడి ఉన్నామని మోదీ ట్వీట్ చేశారు. వాతావరణ మార్పులు, ఆర్థికాభివృద్ధి అంశాల్లో మోదీ నాయకత్వాన్ని స్టార్మర్ స్వాగతించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. 2030 రోడ్‌మ్యాప్‌పై ప్రధానులు చర్చించారని, పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి అంగీకరించారని వెల్లడించింది. త్వరలో భేటీ అవాలని నేతలిద్దరూ నిర్ణయించారు. 38.1 బిలియన్ పౌండ్ల ద్వైపాక్షిక వాణిజ్య భాగస్వామ్యంపై భారత్, బ్రిటన్ 2022 నుంచి సంప్రదింపులు జరుపుతున్నాయి. -
తుపానులా వచ్చాడు... స్టార్మర్ ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం
నిరుపేద కుటుంబం. తండ్రి పనిముట్ల తయారీ కారి్మకుడు. తల్లి నర్సు. నలుగురు సంతానంలో రెండోవాడు. కుటుంబాన్ని నిరంతరం అప్పుల బాధ వెంటాడేది. దాంతో ఫోన్ బిల్లును తప్పించుకునేందుకు దాన్ని నెలల తరబడి వాడకుండా పక్కన పెట్టే పరిస్థితి! ‘‘కార్మికునిగా ఫ్యాక్టరీలో తన తండ్రి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. దాంతో విపరీతమైన ఆత్మన్యూనతకు లోనై జనానికి దూరంగా మెలగడం అలవాటు చేసుకున్నారు’’ అంటూ ఆవేదనగా గుర్తు చేసుకుంటారు స్టార్మర్. అందుకే స్థాయిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూడటం తనకు చిన్నప్పటి నుంచే అలవాటైందని చెబుతారు. లేబర్ పార్టీ తొలి నాయకుడైన కియర్ హార్డీ అంటే తల్లిదండ్రులకు ఎంతో అభిమానం. ఆ పేరునే స్టార్మర్‌కు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడదే పార్టీకి ఘనవిజయం సాధించి పెట్టడమే గాక ప్రధాని పీఠమెక్కడం విశేషం. విపక్షంలో ఉండగా లేబర్ పార్టీ పగ్గాలు చేపట్టి గెలుపు బాటన నడిపిన ఐదో నేతగా కూడా నిలిచారు... తమ కుటుంబంలో కాలేజీ చదువు చదివిన తొలి వ్యక్తి స్టార్మరే. అప్పుడు కూడా డబ్బుల కటకట బాగా వేధించేది. దాంతో డబ్బుల కోసం స్టార్మర్ ఓసారి బీచ్‌లో మిత్రులతో కలిసి చట్ట విరుద్ధంగా ఐస్‌క్రీం అమ్ముతూ పట్టుబడ్డారు! లీడ్స్‌లో న్యాయశాస్త్రం చదివాక ఆక్స్‌ఫర్డ్‌కు వెళ్లారు. 1987లో బారిస్టర్ పూర్తి చేశారు. మానవ హక్కుల చట్టంలో స్పెషలైజేషన్ చేశారు. కరీబియన్, ఆఫ్రికాల్లో ఉద్యోగం చేశారు. పని రాక్షసునిగా పేరుపడ్డారు. 2008లో ఇంగ్లండ్, వేల్స్ చీఫ్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. రాజకీయ ప్రవేశం... స్కూలు దశ నుంచే స్టార్మర్ రాజకీయాల పట్ల మొగ్గు చూపేవారు. తొలుత వామపక్ష రాజకీయ పట్ల ఆకర్షితులయ్యారు. 2015లో 52వ ఏట పూర్తిస్థాయిలో రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉత్తర లండన్‌లోని హాల్‌బోర్న్ అండ్ సెయింట్ పాంక్రాస్ నియోజకవర్గం నుంచి 2015లో ఎంపీగా గెలుపొందారు. తాజా మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా సరిగ్గా అదే రోజున తొలిసారిగా ఎంపీగా ఎన్నికవడం విశేషం! నాటి లేబర్ పార్టీ నాయకుడు జెరెమీ కార్బిన్‌కు నమ్మకస్తునిగా పేరుబడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయంతో కార్బిన్ తప్పుకున్నారు. దాంతో 2020 ఏప్రిల్‌లో స్టార్మర్ లేబర్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. పార్టీలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. విలువల విషయంలో రాజీ పడేందుకు ససేమిరా అంటారాయన. తమ కంచుకోటైన హారి్టల్పూల్ స్థానంలో మూడేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికలో లేబర్ పార్టీ తొలిసారి ఓటమి చవిచూసింది. ఆ పరాభవానికి బాధ్యత వహిస్తూ పార్టీ సారథ్యం నుంచి తప్పుకోవడానికి స్టార్మర్ సిద్ధపడ్డారు. సీనియర్ నాయకుల విజ్ఞప్తి మేరకు కొనసాగారు. 2019 ఓటమితో చతికిలపడి ఉన్న పార్టీలో జవజీవాలు నింపడమే గాక ఐదేళ్లకే ఘనవిజయం సాధించి పెట్టారు. ఇది తేలిగ్గా ఏమీ జరగలేదు. పార్టీకి పునర్వైభవం... లేబర్ పార్టీకి పునరై్వభవం తేవడానికి స్టార్మర్ చాలా కష్టపడ్డారు. హారి్టల్పూల్ ఉప ఎన్నిక ఓటమి తర్వాత ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవడంపై దృష్టి సారించారు. వర్సిటీల ట్యూషన్ ఫీజుల రద్దు, ఇంధన, నీటి కంపెనీల జాతీయీకరణ వంటి గత వాగ్దానాల నుంచి వెనక్కు తగ్గారు. ఇది నమ్మకద్రోహమని, పార్టీ వాగ్దానాలను తుంగలో తొక్కారని సీనియర్లే ఆరోపించినా వెనక్కు తగ్గలేదు. కొన్నేళ్లుగా బ్రిటన్‌లో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. ధరలు విపరీతంగా పెరిగి, ప్రజల ఆదాయం తగ్గి జీవన ప్రమాణాలు పడిపోయాయి. వీటితో పాటు ప్రధాన సమస్యయిన ఆరోగ్య రంగంపైనా స్టార్మర్ దృష్టి సారించారు. బ్రిటన్‌లో వైద్య సేవలుందించే ప్రభుత్వ విభాగం ఎన్హెచ్ఎస్లో వెయిటింగ్ జాబితాను తగ్గిస్తామని, పన్ను ఎగవేతలకు అడ్డుకట్ట వేస్తామని, పన్ను చెల్లింపుల్లో లొసుగులను నిర్మూలించి ఎన్హెచ్ఎస్కు నిధులు సమకూర్చుతామని హామీలిచ్చారు. అక్రమ వలసలను అడ్డుకునేందుకు సరిహద్దు భద్రత కమాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా సొంతిల్లు లేనివారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో చట్టాలను సంస్కరించి 15 లక్షల కొత్త ఇళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. ప్రైవేట్ స్కూళ్లకు పన్ను మినహాయింపులు ఎత్తేసి ఆ సొమ్ముతో 6,500 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పారు. ఇవన్నీ జనాన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేణుగానంలో నిపుణుడు స్టార్మర్‌కు సంగీతంలో లోతైన ప్రవేశముంది. చాలాకాలం పాటు శాస్త్రీయ శిక్షణ తీసుకున్నారు. ఫ్లూట్, పియానో, వయోలిన్ అద్భుతంగా వాయిస్తారు. కాలేజీ రోజుల్లో ఆయన వేణుగానాన్ని అలా వింటూ ఉండిపోయేవాళ్లమని నాటి మిత్రులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ రోజుల్లో స్టార్మర్ ఎంతో చురుకైన ఫుట్‌బాల్ ఆటగాడు కూడా. 2007లో విక్టోరియా అలెగ్జాండర్‌ను పెళ్లాడారు. ఆమె నేషనల్ హెల్త్ సరీ్వస్ (ఎన్హెచ్ఎస్)లో ఆక్యుపేషనల్ థెరపిస్ట్. వారికి ఒక కొడుకు, కూతురున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
UK Election Result 2024: ఇక స్టార్మర్ శకం
లండన్: అంతా ఊహించిందే జరిగింది. గురువారం జరిగిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో విపక్ష లేబర్ పార్టీ ఘనవిజయం సాధించింది. హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 స్థానాలకు గాను ఏకంగా 412 సీట్లు కైవసం చేసుకుంది. ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలతో ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఏకంగా 252 స్థానాలు కోల్పోయింది! ఇది ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన పరాజయం. లేబర్ పార్టీకి 33.7 శాతం రాగా కన్జర్వేటివ్‌లకు 23.7 శాతమే లభించాయి. శుక్రవారం మధ్యాహా్ననికల్లా ఫలితాలు వెలువడటం, సునాక్ రాజీనామా చేయడం, లేబర్ పార్టీని విజయపథంలో నడిపిన కియర్ స్టార్మర్ దేశ 58వ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. దాంతో 14 ఏళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెర పడింది. భారత మూలాలున్న తొలి ప్రధాని సునాక్ పాలన కూడా 20 నెలలకే ముగిసింది. రిచ్మండ్–నార్త్ అలెర్టన్ స్థానం నుంచి ఆయన ఘనవిజయం సాధించినా మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌తో పాటు గ్రాంట్ షేప్స్, పెన్నీ మోర్డంట్, జాకబ్ రీస్ మాగ్ వంటి పలువురు కన్జర్వేటివ్ హేమాహేమీలు ఓటమి చవిచూశారు. దాంతో ఫలితాల అనంతరం మాట్లాడుతూ 44 ఏళ్ల సునాక్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘లేబర్ పార్టీకి, స్టార్మర్‌కు అభినందనలు. ఘోర ఓటమి చవిచూసిన నా కేబినెట్ సహచరులకు సానుభూతి. నాయకునిగా వారిని గెలిపించుకోలేకపోయినందుకు క్షమాపణలు. ప్రజల అంచనాలు అందుకోలేకపోయినందుకు వారికి కూడా క్షమాపణలు’’ అన్నారు. ఓటమికి బాధ్యత వహిస్తూ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు సునాక్ ప్రకటించారు. అయితే ప్రధానిగా తన బాధ్యతలకు నూరు శాతం న్యాయం చేశానన్నారు. ప్రధానిగా కుటుంబంతో కలిసి అధికార నివాసంలో జరుపుకున్న దీపావళి వేడుకలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ‘‘మా తాతల కాలంలో చేతిలో పెద్దగా ఏమీ లేకుండా ఇంగ్లండ్ వచి్చన కుటుంబం మాది. అలాంటిది రెండే తరాల్లో నేను ప్రధాని కాగలిగాను. నా పిల్లలు డౌనింగ్ స్ట్రీట్ మెట్లపై దీపావళి ప్రమిదలు వెలిగించగలిగారు. అదీ దేశ గొప్పదనం’’ అంటూ కొనియాడారు. ‘‘నా వారసునిగా అత్యంత సవాళ్లమయమైన బాధ్యతను స్వీకరిస్తున్న నూతన ప్రధానికి 10, డౌనింగ్ స్ట్రీట్‌కు హార్దిక స్వాగతం. నూతన బాధ్యతల్లో ఆయన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ఆయన విజయమే మనందరి విజయం. ప్రచారంలో విమర్శలు గుప్పించుకున్నా స్టార్మర్ చాలా మంచి వ్యక్తి. ఆయన వ్యక్తిత్వాన్ని ఎంతగానో అభిమానిస్తాను’’ అన్నారు. అనంతరం రాజు చార్లెస్–3కు సునాక్ రాజీనామా సమర్పించారు. తర్వాత భార్య అక్షత, పిల్లలతో కలిసి అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. స్టార్మర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.దేశాన్ని పునర్నిర్మిస్తాం : స్టార్మర్ ప్రజలు మార్పు కోసం నిర్ణాయక రీతిలో ఓటేశారని 61 ఏళ్ల స్టార్మర్ అన్నారు. శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఆయన తొలి ప్రసంగం చేశారు. ‘‘ప్రజల త్యాగాలకు, ప్రతిగా వారికందుతున్న సేవలకు మధ్య అంతరం ఈ స్థాయిలో పెరిగితే భవిష్యత్తు పట్ల వారిలో మిగిలేది నిరాశా నిస్పృహలే. ముందు వారిలో విశ్వాసాన్ని పాదుగొల్పాలి. ఇది మాటలతో కాదు. చేతల్లోనే చూపాలి. మనముందు భారీ లక్ష్యాలున్నాయి. కనుక నేటినుంచే పని మొదలవుతుంది’’ అన్నారు. ‘‘సేవే ఏకైక లక్ష్యంగా లేబర్ పార్టీని పునర్ వ్యవస్థీకరించాం. దేశమే ముందు, ఆ తర్వాతే పార్టీ అంటూ సమూలంగా మెరుగుపరిచి ప్రజల ముందుంచాం. అలాగే దేశాన్ని కూడా అన్ని రంగాల్లోనూ బలోపేతం చేసి చూపిస్తాం. ‘సేవల ప్రభుత్వం’గా పని చేస్తాం. లేబర్ పార్టీకి ఓటేయని వారికి కూడా అంతే చిత్తశుద్ధితో సేవ చేస్తాం. ప్రజలందరి నమ్మకాన్నీ నిలబెట్టుకుంటాం. బ్రిటన్ను పూర్తిస్థాయిలో పునర్నరి్మస్తాం’’ అని ప్రకటించారు. సునాక్‌పై ప్రశంసల జల్లు ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారంటూ స్టార్మర్ ప్రశంసలు కురిపించడం విశేషం! 20 నెలల పాలనలో దేశ ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధితో ఎంతగానో కృషి చేశారంటూ కొనియాడారు. ‘‘ఆసియా మూలాలున్న తొలి బ్రిటిష్ ప్రధానిగా సునాక్ ఎంతో సాధించారు. ఆ ఘనతలను ఏ మాత్రం తక్కువ చేసి చూడలేం. ప్రధానిగా ఆయన పనితీరుకు జోహార్లు’’ అన్నారు. ఫలితాలు వెలువడగానే స్టార్మర్ బకింగ్‌హాం రాజ ప్రాసాదానికి వెళ్లి రాజు చార్లెస్–3తో భేటీ అయ్యారు. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా స్టార్మర్ను రాజు లాంఛనంగా ఆహ్వానించారు. కేబినెట్లోకి లీసా నందిస్టార్మర్ మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న 44 ఏళ్ల లీసా నందికి చోటు దక్కింది. ఆమెను సాంస్కృతిక, క్రీడా, సమాచార ప్రసార మంత్రిగా నియమించారు. విగాన్ నుంచి ఆమె వరుసగా రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. లీసా తండ్రి దీపక్ విద్యావేత్త. 1950ల్లో బ్రిటన్ వెళ్లారు. అక్కడి అమ్మాయిని పెళ్లాడారు. జాతుల సయోధ్యకు బ్రిటన్‌లో గుర్తింపు పొందారు. లీసా 2020లో లేబర్ పార్టీ నాయకత్వం కోసం స్టార్మర్తో పోటీపడి మూడోస్థానంలో నిలిచారు. -
Janata Party: కేంద్రంలో తొలిసారి కాంగ్రెసేతర సర్కారు
ప్రజల హక్కులను కాలరాస్తే, ప్రజాస్వామ్యా నికి పాతరేస్తే ఏమవుతుందో ఆరో లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరాగాం«దీకి అనుభవంలోకి వచి్చంది. ఇందిరకు, కేంద్రంలో కాంగ్రెస్‌కు తొలి ఓటమి రుచి చూపడమే గాక తొలి కాంగ్రెసేతర సర్కారుకు బాటలు పరిచిన ఎన్నికలుగా అవి చరిత్రలో నిలిచిపోయాయి. ఎమర్జెన్సీ ముసుగులో ప్రతిపక్షాల నేతలందరినీ జైల్లోకి నెట్టిన ఇందిర వారి చేతుల్లోనే మట్టికరిచారు. జనతా పతాకం కింద ప్రధాన విపక్షాలన్నీ ఒక్కటై ‘ఇందిర హటావో, దేశ్ బచావో’ నినాదంతో కాంగ్రెస్‌ను ఓడించాయి... 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 దాకా 21 నెలల కొనసాగిన ఎమర్జెన్సీ దేశ ప్రజలకు పీడకలగా మారింది. పౌర హక్కులను హరించడం మొదలుకుని తీవ్ర నిర్బంధం అమలైంది. పత్రికా స్వేచ్ఛను కాలరాశారు. మగవాళ్లకు బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల వంటి చేష్టలతో ఇందిర సర్కారు బాగా చెడ్డపేరు తెచ్చుకుంది. మొరార్జీ దేశాయ్ మొదలుకుని జయప్రకాశ్ నారాయణ్ దాకా విపక్ష నేతలంతా జైలుపాలయ్యారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విపక్షాల కార్యకర్తలు ఊచలు లెక్కించారు. ఎమర్జెన్సీ అనంతరం ఏడాది ఆలస్యంగా 1977లో ఇందిర ఎన్నికలకు వెళ్లారు. ఆమెను ఢీ కొట్టేందుకు కమ్యూనిస్టేతర ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, సంయుక్త సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమక్రసీతో పాటు కాంగ్రెస్ (వో) కూడా జేపీ స్థాపించిన జనతా పారీ్టలో కలసిపోయాయి. మొరార్జీ దేశాయ్‌ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జేపీ ‘ఇందిరా హటావో, దేశ్ బచావో’ నినాదం దుమ్మురేపింది. ఎమర్జెన్సీపై జనాగ్రహం ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది. జనతా పార్టీ 41.32 శాతం ఓట్లతో 295 స్థానాలు సాధించింది. మిత్రపక్షాలతో కలిపి జనతా బలం 330కి చేరింది. 492 స్థానాల్లో పోటీ చేసిన ఇందిర కాంగ్రెస్ (ఆర్) కేవలం 154 స్థానాలతో కుదేలైంది. అంతటి ప్రజా వ్యతిరేకతలోనూ దక్షిణాది 92 స్థానాలతో ఇందిరకు అండగా నిలిచింది. వాటిలో 41 ఆంధ్రప్రదేశ్ చలవే. హిందీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచింది రెండే సీట్లు! రాయ్‌బరేలీలో ఇందిర ఓటమి చవిచూశారు! ఎమర్జెన్సీ వేళ రాజ్యాంగేతర శక్తిగా మారిన చిన్న కొడుకు సంజయ్‌గాంధీ కూడా అమేథీలో పరాజయం పాలయ్యారు. తొలి కాంగ్రెసేతర ప్రధాని మొరార్జీ తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ 1977 మార్చి 24న ప్రమాణం చేశారు. అయితే మూడేళ్లకే సర్కారులో లుకలుకలు మొదలయ్యాయి. నేతలు జనతా పార్టీని వీడడంతో లోక్‌సభలో బలం తగ్గింది. దాంతో మొరార్జీ గద్దె దిగాల్సి వచి్చంది. రాజ్ నారాయణ్... జనతాలో ముసలం ఈ సందర్భంగా రాజ్ నారాయణ్ గురించి తప్పక చెప్పుకోవాలి. 1977 ఎన్నికల్లో రాయ్‌బరేలిలో ఇందిరను ఓడించిన ఈయన తదనంతరం జనతాపారీ్టలో ముసలానికీ కారకుడయ్యారు. జనతాను వీడి జేడీ(ఎస్)ను స్థాపించారు. మొరార్జీ రాజీనామాతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహా్వనించాలంటూ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డిని అభ్యరి్థంచారు. కానీ ఇందిరా కాంగ్రెస్ సహకారంతో జనతా పార్టీ నేత చౌధరీ చరణ్‌సింగ్ 1979 జూలై 28న ప్రధాని అయ్యారు. అయితే ఇందిర బ్లాక్మెయిల్ రాజకీయాలకు విసిగి నెలలోపే రాజీనామా చేశారు! విశేషాలు... పెరిగిన ఓటింగ్ ► 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 60.49 శాతానికి పెరిగింది. ► 1971 జనాభా లెక్కల ఆధారంగా లోక్‌సభ స్థానాలను 542కు పెంచారు. ► 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరిగాయి. ► ఐదు జాతీయ పార్టీలు, 15 రాష్ట్ర పారీ్టలు, 14 రిజిస్టర్డ్ పారీ్టలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొన్నాయి. ► ఎమర్జెన్సీ విధింపు పట్ల ఇందిర ఏనాడు పశ్చాత్తాపడలేదు. మరో దారి లేకపోయిందంటూ సమర్థించుకున్నారు. షెడ్యూల్ ప్రకారం 1976లోనే ఎన్నికలు జరిపి ఉంటే తానే గెలిచేదాన్నని కూడా ఇందిర అభిప్రాయపడటం విశేషం! ఆరో లోక్‌సభలో పారీ్టల బలాబలాలు (మొత్తం స్థానాలు 542) పారీ్ట స్థానాలు జనతా పారీ్ట 295 కాంగ్రెస్ 154 సీపీఎం 22 అన్నాడీఎంకే 18 ఇతరులు 43 స్వతంత్రులు 10 – సాక్షి, నేషనల్ డెస్క్ -
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని
ఇజ్రాయెల్‌తో యుద్ధం వేళ.. పాలస్తీనాకు కొత్త ప్రధాని నియమితులయ్యారు. మొహమ్మద్ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. ముస్తఫా చాలాకాలంగా అధ్యక్షుడు అబ్బాస్ వద్ద సలహాదారునిగా పని చేస్తుండడం గమనార్హం. అయితే.. ఈ ఎంపికపై పాలస్తీనాలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం.. ప్రధానిగా ఉన్న మొహమ్మద్ శతాయే ఫిబ్రవరిలో రాజీనామా చేశారు. అప్పటి నుంచి అధ్యక్షుడు అబ్బాసే ప్రధాని పేషీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నమ్మకస్తుడు ముస్తఫాకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణలు చేపట్టాలని ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలోనే ఈ నియామకం చేపట్టినట్లు అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రకటించారు. అయితే.. అమెరికా ఒత్తిళ్లతోనే అధ్యక్షుడు ఈ నియామకం చేపట్టినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ముస్తఫా నేపథ్యానికి వస్తే.. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌లో సభ్యుడిగా ఉన్నారు. ఆర్థికవేత్తగా.. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. 2014లో గాజాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత పునర్నిర్మాణ పనుల్లో ముస్తఫా భాగం కావడం గమనార్హం. అయితే.. కొత్త ప్రధాని అధికారాలు ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో చాలా పరిమితంగానే ఉండనున్నాయి. ధ్వంసమైన గాజా స్ట్రిప్ పునర్నిర్మాణం, పలు వ్యవస్థల సంస్కరణల బాధ్యతలను ప్రధానికి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. 2007 నుంచి గాజా స్ట్రిప్ హమాస్ నియంత్రణలోకి వెళ్లగా, వెస్ట్‌బ్యాంక్‌లో పాలస్తీనా అథారిటీ అధికారంలో ఉంది. గాజాలోని పరిస్థితుల్ని అమెరికా ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నది తెలిసిందే. ఇక గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మారణకాండలో 1,200 మంది చనిపోయిన విషయం తెలిసిందే. సుమారు 250 మందిని మిలిటెంట్లు బందీలుగా చేసుకున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ భీకర దాడుల్లో పాలస్తీనా భూభాగంలో 31,000పైగా ప్రజలు మృతి చెందారు. -
పాక్ ప్రధానిగా షహబాజ్ ప్రమాణం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్(72) రెండోసారి ప్రమాణం చేశారు. అధ్యక్షభవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయనతో ప్రమాణం చేయించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సింధ్ సీఎం మురాద్ అలీ షాతోపాటు ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. గతంలో, 2022 ఏప్రిల్–2023 ఆగస్ట్ వరకు పార్లమెంట్ రద్దు కాకముందు షహబాజ్ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆదివారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో షహబాజ్ సునాయాసంగా మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. -
Pakistan General Elections 2024: పాక్ ప్రధానిగా షహబాజ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పీఎంఎల్–ఎన్ నేత షెహబాజ్ షరీఫ్(72) ఎన్నికయ్యారు. నూతన ప్రధానిని ఎన్నుకోవడానికి పాకిస్తాన్ పార్లమెంట్లో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 336 ఓట్లకు గాను çషహబాజ్ షరీఫ్‌కు 201 ఓట్లు లభించాయి. ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్‌కు కేవలం 92 ఓట్లు దక్కాయి. షెహబాజ్ షరీఫ్‌కు సాధారణ మెజార్టీ కంటే 32 ఓట్లు అధికంగా లభించడం విశేషం. పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సంకీర్ణ ప్రభుత్వానికి ఆయన నాయకత్వం వహించబోతున్నారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ కూటమికి ముత్తహిదా ఖ్వామీ మూవ్మెంట్, పాకిస్తాన్ ముస్లిం లీగ్(క్యూ), బలూచిస్తాన్ అవామీ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్(జెడ్), ఇస్తెఖామ్–ఇ–పాకిస్తాన్ పార్టీ, నేషనల్ పార్టీ మద్దతిస్తున్నాయి. షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ 24వ ప్రధానమంత్రిగా ఎన్నికైనట్లు పార్లమెంట్ స్పీకర్ సర్దార్ అయాజ్ సాదిక్ ప్రకటించారు. షహబాజ్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఓటింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులైన కొందరు ఎంపీలు సభలో అలజడి సృష్టించారు. అనంతరం షహబాజ్ మాట్లాడుతూ కశ్మీర్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. కశ్మీరీల, పాలస్తీనియన్ల స్వాతంత్య్రం కోసం ఒక్కటి కావాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. వారి స్వేచ్ఛను కోరుతూ పార్లమెంట్లో తీర్మానం చేయాలన్నారు. -
పాకిస్తాన్లో సంకీర్ణమే
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపకంపై పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) ఎట్టకేలకు తుది ఒప్పందానికి వచ్చాయి. నూతన ప్రధానమంత్రిగా పీఎంఎల్–నేత షహబాజ్ షరీఫ్(72), అధ్యక్షుడిగా పీపీపీ సీనియర్ నాయకుడు అసిఫ్ అలీ జర్దారీ(68) బాధ్యతలు చేపట్టనున్నారు. రెండు పార్టిల మధ్య మంగళవారం అర్ధరాత్రి కీలక చర్చలు జరిగాయి. అనంతరం పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో మీడియాతో మాట్లాడారు. పీఎంఎల్–ఎన్, పీపీపీ భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే సంకీర్ణ ప్రభుత్వ ప్రధానిగా షహబాజ్ షరీఫ్, అధ్యక్షుడి పదవికి తమ ఉమ్మడి అభ్యరి్థగా అసిఫ్ అలీ జర్దారీ పేర్లను ఖరారు చేసినట్లు ప్రకటించారు. తమ కూటమికి పార్లమెంట్లో తమకు సంఖ్యా బలం ఉందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని బిలావల్ భుట్టో స్పష్టం చేశారు. అయితే, ఎంతమంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారన్న విషయాన్ని ఆయన బహిర్గతం చేయలేదు. ఒప్పందం ప్రకారం.. జాతీయ అసెంబ్లీలో స్పీకర్ పదవికి పీఎంఎల్–ఎన్ పార్టికి, డిప్యూటీ స్పీకర్ పదవి పీపీపీకి, సెనేట్‌లో చైర్మెన్ పదవి పీపీపీకి లభించనుంది. చర్చలు సానుకూలంగా ముగించినందుకు పీఎంఎల్–ఎన్, పీపీపీ నేతలకు షహబాజ్ షరీఫ్ కృతజ్ఞతలు తెలియజేశారు. మంత్రి పదవుల విషయంలో పీపీపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. అసిఫ్ అలీ జర్దారీ 2008 నుంచి 2013 దాకా పాకిస్తాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. మరోసారి అదే పదవికి చేపట్టబోతున్నారు. నవాజ్ షరీఫ్ సోదరుడైన షషబాజ్ షరీఫ్ సైతం గతంలో ప్రధానమంత్రిగా సేవలందించారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని, ఈ ఎన్నిలను రద్దు చేసి, మళ్లీ నిర్వహించారంటూ మాజీ సైనికాధికారి అలీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఇలాంటి పిటిషన్ పబ్లిసిటీ స్టంట్ అంటూ కొట్టేసింది. -
బంగ్లా ప్రధానిగా అయిదోసారి హసీనా ప్రమాణం
ఢాకా: అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా(76) గురువారం బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా అయిదోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలి ఎన్నికల్లో అవామీ లీగ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీతోపాటు ఆ పార్టీ మిత్ర పక్షాలు బహిష్కరించాయి. అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ దేశ 12వ ప్రధానిగా హసీనాతో ప్రమాణం చేయించారు. దీంతో వరుసగా నాలుగోసారి, మొత్తమ్మీద అయిదోసారి ఆమె ప్రధానిగా పగ్గాలు చేపట్టినట్లయింది. అనంతరం మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. -
బంగ్లా పీఠంపై మళ్లీ హసీనాయే
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో అంతా ఊహించినట్టుగానే పాలక అవామీ లీగ్ నెగ్గింది. ఆదివారం పోలింగ్ జరగ్గా రాత్రికల్లా తొలి దశ ఫలితాలు వెలువడ్డాయి. 300 స్థానాలకు గాను ఇప్పటికే 200 చోట్ల నెగ్గి అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. దాంతో ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి పగ్గాలు చేపట్టనున్నారు. ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో పాటు విపక్షాలన్నీ బహిష్కరించిన ఈ ఎన్నికలపై జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో కేవలం 40 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించారు. సాయంత్రం పోలింగ్ ముగియగానే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో 2018 సాధారణ ఎన్నికల్లో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఈసారి అది ఏకంగా సగానికి పడిపోవడం గమనార్హం. మొత్తం 300 నియోజకవర్గాలకు గాను 299 చోట్ల పోలింగ్ నిర్వహించారు. ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. 27 పార్టీల నుంచి 1,500 మందికిపైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 436 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. హసీనా 2009 నుంచి అధికారంలో కొనసాగుతున్నారు. భారత్ పొరుగుదేశం కావడం అదృష్టం ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్టు పారీ్ట–జమాత్–ఇ–ఇస్లామీ కూటమికి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదని ప్రధాని షేక్ హసీనా విమర్శించారు. ఓటు వేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించామని చెప్పారు. భారత్ తమకు అత్యంత నమ్మకమైన మిత్రదేశమని చెప్పారు. భారత్ లాంటి దేశం పొరుగున ఉన్నందుకు తాము చాలా అదృష్టవంతులమని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ స్వాతంత్య్ర ఉద్యమానికి భారత్ ఎంతగానో సహకరించిందని చేశారు. 1975 ఆగస్టులో తన తండ్రిని, తల్లిని, ముగ్గురు సోదరులను, ఇతర కుటుంబ సభ్యులను సైనికాధికారులు దారుణంగా హత్య చేశారని పేర్కొన్నారు. -
స్పెయిన్ ప్రధానిగా మళ్లీ పెడ్రో సాంచెజ్
మాడ్రిడ్: స్పెయిన్ ప్రధాని పీఠాన్ని సోషలిస్ట్ పార్టీకి చెందిన మరోసారి పెడ్రో సాంఛెజ్ అధిష్టించనున్నారు. గురువారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో 350 మందికి గాను 179 మంది ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపారు. కేటలోనియా వేర్పాటు ఉద్యమ నేత చార్లెస్ పిడ్గెమాంట్కు క్షమాభిక్ష ప్రకటించేందుకు పెడ్రో సాంఛెజ్ అంగీకరించడం.. బదులుగా వేర్పాటువాద పార్టీలు ఆయన ప్రభుత్వంలో చేరేందుకు అంగీకరించడంతో మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నూతన ప్రభుత్వంలో రెండు కేటలోనియా వేర్పాటువాద పార్టీలు సహా మొత్తం ఆరు చిన్న పార్టీలు భాగస్వాములు కానున్నాయి. జూలై 23న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. 2017లో స్పెయిన్ నుంచి విడిపోతున్నట్లు కేటలోనియా వేర్పాటువాదులు ప్రకటించడంతో దేశంలో సంక్షోభం ఏర్పడింది. వేర్పాటువాద నేత చార్లెస్ పిడ్గెమాంట్ను ప్రభుత్వం నేరగాడిగా ప్రకటించింది. -
మార్పునకు ఓటేసిన న్యూజిలాండ్: కొత్త ప్రధానిగా లక్సన్
న్యూజిలాండ్ నూతన ప్రధానిగా నేషనల్ పార్టీ నేత, మాజీ వ్యాపారవేత్త క్రిస్టోఫర్ లక్సన్ ఎన్నిక కానున్నారు.. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల లెక్కింపు శనివారం కొనసాగుతూండగా లక్సన్ నిర్ణయాత్మక విజయం సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో జెసిండా ఆర్డెర్న్ నేతృత్వంలో ఆరేళ్ల క్రితం ఏర్పాటైన ప్రభుత్వ హయాం ముగియనుంది. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జెసిండా ఆర్డెర్న్ ఈ ఏడాది జనవరిలో అనూహ్యంగా ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆమె నిష్క్రమణ తరువాత విద్యా మంత్రి హిప్కిన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ... ఆయన తొమ్మిది నెలలు మాత్రమే అధికారంలో కొనసాగ గలిగారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నప్పటికీ ప్రధాన మంత్రి క్రిస్ హిప్కిన్స్ ఓటమిని అంగీకరించడంతో క్రిస్టోఫర్ లక్సన్ ఎన్నిక లాంఛనం కానుంది. న్యూజీలాండ్ ప్రజలు ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటు వేసినట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో తుది ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే తమ పార్టీ ఓటమిని అంగీకరించినట్టు హిప్కిన్స్ తన మద్దతు దారులకు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఇప్పటివరకూ సహకరించినందుకు ఆయన తన మద్దతుదారులకు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఇది తాను కోరుకున్న ఫలితం కాదని వ్యాఖ్యానించారు. దీంతో ప్రత్యర్థి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. నేషనల్ పార్టీ 51 సీట్లు, లేబర్ పార్టీ 33, గ్రీన్స్ 13, యాక్ట్ 12, NZ ఫస్ట్ 8 , టె పతి మావోరీ నాలుగు సీట్లు గెలుచు కోవచ్చని న్యూజిలాండ్ హెరాల్డ్ నివేదించింది. మూడింట రెండు వంతుల ఓట్లను లెక్కించగా, లక్సన్ నేషనల్ పార్టీ దాదాపు 40 శాతం ఓట్లను సాధించింది. క్రిస్ లక్సన్ తొలిసారిగా 2020లో పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. 2021 నవంబర్‌లో ప్రతిపక్ష నాయకుడయ్యారు. అత్యంత కీలకమైన ఈ ఎన్నికల ప్రచారంలో మధ్య-ఆదాయ వర్గాలకు పన్నుల తగ్గింపు, నేరాల అణిచివేత లాంటివాటిని లక్సన్ తన ప్రచార అస్త్రాలుగా వాడుకున్నట్టు తెలుస్తోంది. కాగా గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన జెసిండా ఆర్డెన్ ఈ ఏడాది జనవరిలో అనూహ్యంగా ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆమె నిష్క్రమణ తరువాత విద్యా మంత్రి హిప్కిన్స్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కానీ... ఆయన తొమ్మిది నెలలు మాత్రమే అధికారంలోకొనసాగ గలిగారు. ఇదిలా ఉంటే... పలు కారణాలతో న్యూజీలాండ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు సంక్షోభంలో కొనసాగుతోంది. ప్రజల జీవన వ్యయం పెరిగిపోవడం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం, అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఉక్రెయిన్... రష్యాతో యుద్ధం చేస్తూండటం దేశ ఆర్థి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపింది. దీనికి తోడు తీవ్రస్థాయి వరదలు, తుఫాన్లూ పరిస్థితిని మరింత దిగజార్చాయి. -
మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతిచ్చిన బద్ధ శత్రువు
కౌలాలంపూర్: మలేసియా సీనియర్ నేత, సంస్కరణలవాదిగా పేరున్న అన్వర్ ఇబ్రహీం(75) ఆ దేశ నూతన ప్రధానమంత్రి అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ 112 సీట్లు కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో అన్వర్ నేతృత్వంలోని అలయెన్స్ ఆఫ్ హోప్ 82 సీట్లు గెలుచుకుంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కక హంగ్ ఏర్పడటంతో రాజు జోక్యం చేసుకున్నారు. అన్వర్ సారథ్యంలోని ఐక్య కూటమి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు బద్ధ వ్యతిరేకి, దీర్ఘకాలం అధికారంలో ఉన్న యునైటెడ్ మలయీస్ నేషనల్ ఆర్గనైజేషన్ అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీంతో సందిగ్ధానికి తెరపడింది. నేషనల్ ప్యాలెస్‌లో గురువారం రాజు సుల్తాన్ అహ్మద్ షా ప్రధానిగా అన్వర్‌తో ప్రమాణం చేయించారు. చదవండి: కిమ్‌కి అంత భయమా?.. ట్రంప్‌ని మించి పోయాడు! -
ఇజ్రాయెల్ ప్రధానిగా నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్‌లో రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ (73)కు చెందిన లికడ్ పార్టీ ఆధ్వర్యంలోని సంకీర్ణ కూటమి విజయం సాధించింది. దాంతో, రికార్డు స్థాయిలో 15 ఏళ్లకుగా పైగా ప్రధానిగా చేసిన ఆయన మరోసారి పగ్గాలు చేపట్టనున్నారు. 120 స్థానాలున్న పార్లమెంటులో 64 స్థానాలతో లికడ్ కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించింది. ఫలితాలను నవంబర్ 9న ధ్రువీకరిస్తారు. ప్రధాని లపిడ్ ఓటమి అంగీకరించారు. నెతన్యాహూకు ఫోన్ చేసి అభినందించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా రాకెట్ దాడులు ఎన్నికల ఫలితాల వేళ పాలస్తీనాలోని గాజా నుంచి ఇజ్రాయెల్‌పైకి నాలుగు రాకెట్లను ప్రయోగించారు. మూడు లక్ష్యం చేరలేదు. ఒకదాన్ని ఇజ్రాయెల్ గాల్లోనే పేల్చేసింది. అంతేగాక ప్రతిదాడులతో గట్టిగా బదులిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు గాజాలో హమాస్ గ్రూప్ రహస్యంగా నిర్వహిస్తున్న రాకెట్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశాయి. -
ఇజ్రాయెల్ పయనం ఎటు?
సర్వేల జోస్యాన్ని నిజం చేస్తూ ఇజ్రాయెల్ ఎన్నికల్లో లికుడ్ పార్టీ నేతృత్వంలోని అతి మితవాద, మత, ఛాందసవాద పార్టీల కూటమి ఘనవిజయం సాధించింది. ఆ కూటమి 120 స్థానాలున్న పార్లమెంటులో 64 గెల్చుకుని సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు మొదలెట్టింది. ఈ నెల 1న జరిగిన ఈ ఎన్నికలు మితవాద పక్షాలకు దేశ చరిత్రలో తొలిసారి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకామిచ్చాయి. అవినీతి ఆరోపణల్లో విచారణ నెదుర్కుంటూ రాజకీయంగా మసకబారుతున్న విపక్ష లికుడ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూను ఈ ఫలితాలు తిరుగులేని నేతగా స్థిరపరిచాయి. నాలుగేళ్లకోసారి జరగాల్సిన పార్లమెంటు ఎన్నికలు అస్థిర రాజకీయాల కార ణంగా మూడున్నరేళ్లలో అయిదోసారి వచ్చిపడటంతో దేశ పౌరులు విసుగుచెందారనీ, పరస్పరం పొసగని పక్షాలున్న కూటమిని నమ్ముకోవటం కంటే పక్కా మితవాదంవైపు పోవటమే సరైందన్న నిర్ణయానికొచ్చారనీ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పుడు గద్దె దిగబోతున్న మధ్యేవాద కుడి, ఎడమ పక్షాలు, అరబ్‌ల పార్టీల కూటమి ప్రభుత్వం దేశంలో సామరస్యత నెలకొల్పడం మాట అటుంచి మెరుగైన ఆర్థికాభివృద్ధికి దోహదపడే చర్యలు తీసుకోలేకపోయింది. ద్రవ్యోల్బణాన్ని, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోయింది. అందుకే ఆ కూటమి 51 సీట్లకు పరిమితమైంది. ఏడాదిన్నర క్రితం జరిగిన ఎన్నికల్లో పదవీభ్రష్టుడైన నెతన్యాహూ ఆ కూటమి వైఫల్యాలను పూర్తిగా తనకనుకూలంగా మార్చు కోగలిగారు. జియోనిస్టు పార్టీ, మరో రెండు తీవ్ర ఛాందసవాద పక్షాలనూ కలుపుకొని కూటమి కట్టారు. మూడు దశాబ్దాలుగా పార్లమెంటులో చెప్పుకోదగ్గ స్థానాలతో వెలిగిన వామపక్షం మెరెట్జ్ ఈసారి కొన్ని వేల ఓట్లకే పరిమితమై చట్టసభకు వెలుపలే ఉండిపోయింది. సమస్యల మాటెలా ఉన్నా మితవాద కూటమి అధికారం మెట్లెక్కడంలో మీడియా ప్రధాన పాత్ర పోషించింది. జియోనిస్టు పార్టీ నేత బెన్ గవీర్కు అపరిమితమైన ప్రచారమిచ్చి ఆయన పార్టీ దూసుకుపోయేందుకు దోహదపడింది. ఈ ప్రచారం ఏ స్థాయిలో సాగిందంటే ఆయనతో కూటమి కట్టి లాభపడిన నెతన్యాహూ సైతం అది మోతాదు మించిందని అంగీకరించాల్సి వచ్చింది. ఇదిగాక వాట్సాప్, టెలిగ్రాం యాప్‌లలో వందకుపైగా గ్రూపులు ఏర్పాటుచేసి బెన్ గవీర్ స్వీయ ప్రచారంతో హోరెత్తించారు. ఎప్పటికైనా ప్రజా భద్రతా మంత్రినవుతానని బెన్ గవీర్ నిరుడు జోస్యం చెప్పిన ప్పుడు ఆ పదవికి ఆయన పనికిరాడని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు. తీరా రాజకీయ అవసరాల రీత్యా అదే పార్టీతో కూటమి కట్టక తప్పలేదు. ఇప్పుడాయనను మంత్రిని చేసి, ప్రజా భద్రత శాఖ అప్పగించినా ఆశ్చర్యం లేదు. స్వదేశంలోనే యూదులకు రక్షణ కరువైందనీ, ఉగ్రవాదులు ఏ నిబంధనలకూ లోబడకుండా దాడులు చేస్తుంటే వారిపై పోరాడే సైనికులకు నిబంధనలు సంకెళ్లుగా మారుతున్నాయనీ బెన్ గవీర్ తరచు వాపోయేవారు. ఈ మాదిరి ఉపన్యాసాలు యూదుల్ని బాగా ఆకట్టుకున్నాయి. పైగా 1994లో ఒక మసీదులో తలదాచుకున్న 29 మంది పాలస్తీనా పౌరులను ఊచకోత కోసిన బరూక్ గోల్డ్స్టీన్ను ఆయన తన ఆరాధ్యదైవంగా చెప్పుకుంటారు. సంక్షోభం ఆవరించిన సమాజంలో ఉద్రేకపూరిత ఉపన్యాసాలు జనాన్ని ప్రభావితం చేస్తాయి. బెన్ గవీర్ ఆ పని సమర్థవంతంగా చేయగలిగారు. మధ్యేవాద మితవాద పక్షం యామినా పార్టీ అరబ్పార్టీలున్న కూటమికి నేతృత్వం వహించటం యూదులకు ఆగ్రహం తెప్పించింది. దాంతో మెజారిటీ యూదులు అతి మితవాద పక్షమైన లికుడ్ పార్టీకి, ఛాందసవాద జియోనిస్టు పార్టీకి వలస పోయారు. విభేదాలున్నా కలిసి పనిచేద్దామని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు మెరుగైన పరి ష్కారం చూపుదామని జతకట్టిన ఎనిమిది పక్షాల కూటమి ప్రభుత్వం నడపటంలో, ఆర్థిక సమస్య లను అరికట్టడంలో వైఫల్యాలే చవిచూసింది. అంతర్గత పోరుతో సతమతమైంది. ఇప్పుడు గద్దెనెక్కబోతున్న కూటమిలోని జియోనిస్టు పార్టీ ప్రతిపాదనలు సామాన్యమైనవి కాదు. న్యాయవ్యవస్థను సమూల ప్రక్షాళన చేయాలన్నది దాని ప్రధాన డిమాండ్. పార్లమెంటు చేస్తున్న చట్టాలను సుప్రీంకోర్టు ఇష్టానుసారం కొట్టివేస్తున్నదనీ, ఇది దేశ భద్రతకు చేటు తెస్తున్నదనీ ఆ పార్టీ చాన్నాళ్లుగా ఆరోపిస్తోంది. దీన్ని నిజంగా అమలు చేయటం మొదలుపెడితే న్యాయవ్యవస్థ బలహీనపడుతుందనీ, న్యాయమూర్తుల నియామకంలో రాజకీయ పక్షాలదే పైచేయి అవుతుందనీ చాలామంది కలవరపడుతున్నారు. ఇప్పటికే మూడు అవినీతి ఆరోపణల్లో విచారణను ఎదుర్కో బోతున్న నెతన్యాహూకు ఇది తోడ్పడుతుందని వారి భావన. అన్ని స్థాయుల్లోనూ ఎక్కడికక్కడ వ్యవస్థాగతమైన నిఘా ఉన్నప్పుడే, దిద్దుబాటు చర్యలు తీసుకున్నప్పుడే వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుంది. తిరుగులేని అధికారం చలాయించే నేతకు అది సాగిలపడితే సర్వం అస్తవ్యస్థ మవుతుంది. పరోక్షంగా తనకు లాభదాయకమైన ప్రతిపాదన చేస్తున్నారన్న ఉబలాటంతో బెన్ గవీర్ను రాజకీయంగా అదుపు చేయటంలో నెతన్యాహూ విఫలమైతే... పాలస్తీనాపై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే దీర్ఘకాలంగా అండదండలందిస్తున్న అమెరికా సైతం వర్తమాన అంత ర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇరకాటంలో పడుతుంది. దాన్నుంచి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు లభించవు. అంతిమంగా ఏ దేశ పౌరులైనా సామరస్యతనూ, ప్రశాంతతనూ, ఆర్థిక సుస్థిరతనూ కోరుకుంటారు. ఇవన్నీ సుసాధ్యం చేసినప్పుడే నెతన్యాహూకు యూదుల నిజమైన ఆదరణ దొరకుతుంది. -
మనం నేర్చుకోవలసిన పాఠం
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికవడం, ఆ దేశ నూతన ప్రధాని కావడం గర్వించాల్సిన విషయమే. మరోవైపు, ఇది మన సొంత దేశం గురించి ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. సునాక్ ఎదిగివచ్చిన తీరు అద్భుతమైన పరిణామమే కావచ్చు కానీ, మన దేశం విషయం ఏమిటి? మన జనాభాలో 14.3 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లోక్‌సభలో ముస్లింలకు 74 సీట్లు ఉండాలి. కానీ పార్లమెంటులో 27 మంది ముస్లిం ఎంపీలే ఉన్నారు. ఒక్క ముస్లిం ముఖ్యమంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాల్లో ఒక్కరంటే ఒక్క ముస్లిం మంత్రి లేరు. గుజరాత్లో అయితే 1988 నుంచి లోక్‌సభకు గానీ, శాసన సభకు గానీ ఒక్క ముస్లింని కూడా బీజేపీ నిలబెట్టలేదు. దేశంలో 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు. కానీ వారిని ఎక్కడా కనిపించకుండా చేశాం. ఈరోజు సునాక్ సాధించిన అద్భుతమైన విజయాన్ని చూసి గర్వపడుతున్నప్పుడు, భారత్‌లో ఒక ముస్లిం ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని ఎందుకు ప్రశ్నించుకోకూడదు? చివరకు పట్టాభిషేకం జరిగిపోయింది. అది కూడా దీపావళి రోజు జరగటం 42 సంవత్సరాల హిందూ భక్తుడికి వ్యక్తిగతంగా ఎంతో విలువైన విషయం అయివుంటుంది. అయితే, నేను భిన్న మైన అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి సునాక్ ఏక గ్రీవంగా ఎన్నికవడం, ఆ విధంగా దేశ నూతన ప్రధాని కావడం, అది కూడా 200 సంవత్సరాల చరిత్రలో అతి పిన్నవయస్కుడిగా ప్రధాని కావడం అనేది నా రెండో ప్రీతిపాత్రమైన దేశం గురించి నేను గర్వపడేలా చేస్తోంది. ఇది మన సొంత దేశం గురించి ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. బ్రిటన్ నుంచి భారత్ స్పష్టమైన పాఠం నేర్చు కుంటుందా? బ్రిటన్ ఏం చేసిందో ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఆ దేశంలోని జనాభాలో 6.8 శాతం మంది వివిధ ఆసియన్ జాతులకు చెందిన ప్రజలు న్నారు. వీరిలో 2.3 శాతం జనాభా భారతీయ మూలాలు కలిగి ఉన్నారు. ఇది చాలా చాలా చిన్న మైనారిటీ. అయినప్పటికీ, 1960లలో మాత్రమే దేశానికి పలసవచ్చిన తొలి తరం భారత సంతతి కుటుంబానికి చెందిన ఒక కుమారుడిని బ్రిటన్ 57వ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఎన్నుకున్నారు. మన సొంత దేశంలో ఈ ఘటనపై వచ్చిన స్పందన ఎలా ఉంది అంటే, ఇలా జరి గిందా అనే అపనమ్మకం, అవును ఇలా జరిగిందనే సంతోషం రెండింటికీ అది రుజువుగా నిలుస్తోంది. సునాక్ ఎదిగివచ్చిన తీరు అత్యంత అద్భుత మైన పరిణామమే కావచ్చు కానీ అది మాత్రమే పూర్తి కథ అని చెప్పలేం. బోరిస్ జాన్సన్ తొలి మంత్రివర్గం ఇరవై శాతం వరకు నల్లవారు లేదా ఆసియన్ మూలాలు కలిగివున్న వారితో కూడి ఉండింది. మునుపటి ప్రభుత్వంలోని నలుగురు ఛాన్సలర్లు, గత ప్రభుత్వ మంత్రివర్గాల్లోని ఇద్దరు హోం సెక్రటరీలు, లిజ్ ట్రస్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి – వీరందరూ బ్రిటన్‌కి వలస వచ్చిన కుటుంబాలకు చెందినవారే. ఇవన్నీ కూడా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవులు. బహుశా వీటన్నింటికంటే ముఖ్యమైంది ఏమి టంటే, కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 357 మంది ఎంపీల్లో 200 మందికి పైగా ఎంపీలు సునాక్‌ని బలపర్చడమే. సునాక్‌తో పోలిస్తే ఆయనతో పోటీ పడిన శ్వేత జాతి అభ్యర్థులు ఆయన దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. ఇప్పుడు మనం భారత్ వైపు చూద్దాం. మన జనాభాలో 14.3 శాతం మంది ముస్లింలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లోక్ సభలో ముస్లింలకు 74 సీట్లు ఉండాలి. కానీ పార్ల మెంటులో 27 మంది ముస్లిం ఎంపీలే ఉన్నారు. భారత్‌లోని 28 రాష్ట్రాల్లో ఒక్క ముస్లిం ముఖ్య మంత్రి కూడా లేరు. 15 రాష్ట్రాల్లో ఒక్క రంటే ఒక్క ముస్లిం మంత్రి కూడా లేరు. మరో 10 రాష్ట్రాల్లో ఒకే ఒకే ముస్లిం మంత్రి ఉన్నారు. అది కూడా మైనారిటీ వ్యవహారాల మంత్రిగా మాత్రమే. 2014లో గానీ, 2019లో గానీ లోక్‌సభకు ఒక్క ఎంపీని కూడా బీజేపీ ఎన్నుకోలేదు. ఉత్తరప్రదేశ్‌లో ఇరవై శాతం జనాభా కలిగివున్న ముస్లింలకు ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా లేరు. 2017వ సంవత్స రంలో కూడా ఇదే పరిస్థితి. గుజరాత్లో అయితే 1988 నుంచి లోక్‌సభకు గానీ, శాసనసభకు గానీ ఒక్క ముస్లింని కూడా ఆ పార్టీ నిలబెట్టలేదు. అంటే 9 శాతం జనాభా ఇస్లామిక్ విశ్వాసం పాటిస్తున్న రాష్ట్రంలో 24 సంవత్సరాలుగా ఉద్దేశపూర్వకంగా వారిని దూరం పెట్టారన్న మాట. నేను చెబుతున్న వాస్తవాలన్నీ ఆకార్ పటేల్ రాసిన ‘అవర్ హిందూ రాష్ట్ర’ పుస్తకం నుంచి ఉల్లే ఖించినవే. ఇది మరింత కలవరపెట్టే విషయాలను వెల్లడిస్తోంది. దేశంలో 15 శాతం ముస్లిం జనాభా ఉంటున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 4.9 శాతం మంది మాత్రమే ముస్లింలున్నారు. పారా మిలటరీ బలగాల్లో 4.6 శాతం మంది, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్ సర్వీసుల్లో 3.2 శాతం మంది ముస్లింలు మాత్రమే ఉంటున్నారు. ఇక భారత సైన్యంలో అయితే అత్యంత తక్కువగా 1 శాతం ముస్లింలు మాత్రమే ఉండటం గమనార్హం. ఇది మనలను కలవరపర్చాల్సిన విషయం మరి. దీనికి సంబంధించి బ్రిటన్‌లో మీడియా ఎంత భిన్నంగా ఉంటోందో నన్ను చెప్పనివ్వండి. ‘బీబీసీ’ ఛానల్కేసి చూడండి. అక్కడ పనిచేసేవారిలో ఆసి యన్ ముఖాలు ఎంత ఎక్కువగా ఉంటాయో చూసి మీరు షాక్ తింటారు. వారిలో కొన్ని పేర్లను మీరు చూడాలి మరి. మాథ్యూ అమ్రోలివాలా, గీతా గురుమూర్తి, జేమ్స్ కుమారస్వామి, జార్జ్ అలిగియా, నోమియా ఇక్బాల్, సమీరా హుస్సేన్, అమోల్ రాజన్, రజనీ వైద్యనాథన్, యోగితా లిమాయే, సికిందర్ కిర్మానీ, కమల్ అహ్మద్, ఫైజల్ ఇస్లామ్, దర్శిని డేవిడ్. కాబట్టి, ఇప్పుడు బ్రిటన్ నుంచి భారత్ స్పష్టమైన పాఠాలు నేర్వవలసి ఉందని నేనెందుకు భావిస్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. భారత్‌లో 20 కోట్లమంది ముస్లింలు ఉన్నారు. కానీ వారిని ఎక్కడా కనిపించకుండా చేశాం. వాళ్లను మనం చెదపురుగులు అని పిలుస్తాం. బాబర్ సంతానం అంటాం. అబ్బా జాన్ అని పేర్కొంటూ వారిని ఎగతాళి చేస్తాం. శ్మశాన్ ఘాట్, కబర్స్తాన్ మధ్య పోలికలు తీసుకొస్తూ వారిని కించపరుస్తాం. పైగా పాకిస్తాన్ వెళ్లిపోవాలని వారికి పదేపదే చెబు తుంటాం. కాబట్టి, ఈరోజు సునాక్ సాధించిన అద్భుతమైన విజయానికి గానూ మనం గర్వపడు తున్నప్పుడు, మనకేసి మనం ఎందుకు చూసు కోకూడదు? భారత్‌లో ఒక ముస్లిం ప్రధాని అయ్యే అవకాశం ఉందా అని ఎందుకు ప్రశ్నించు కోకూడదు? పైగా చాలామంది గుర్తించలేని కొత్త విరోధా భాస కూడా ఇక్కడ ఉంది. బ్రిటన్ గురించి ఏమాత్రం అర్థం చేసుకోలేని మనలోని కొందరు బ్రిటిష్ వారు జాత్యహంకారులు అని ప్రకటించ డంలో మాత్రం ముందుంటారు. సునాక్ ప్రధాని కావడానికి చాలా కాలం క్రితమే వారు ఘోరమైన తప్పుడు అవగాహనతో ఉన్నట్టు. ఎందుకంటే, దేశంలో ముస్లింల పట్ల మనం వ్యవహరిస్తున్న తీరును విమర్శించడం అటుండనీ, కనీసం దాన్ని గుర్తించడానికి కూడా ఒప్పుకోరు. దానికి బదు లుగా ముస్లింల బుజ్జగింపు అని మాట్లాడటానికి ఇష్టపడతారు. సునాక్ విజయగాథ మనకు స్ఫూర్తిగా ఉండా లని నేను ప్రార్థిస్తాను. కానీ ఈ విషయంలో కూడా నాది తప్పు అని రుజువవుతుందేమో అని భయ పడుతున్నాను. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
UK PM Election Results 2022: బ్రిటన్ పీఠం ట్రస్‌దే
లండన్/న్యూఢిల్లీ: బ్రిటన్ ప్రధాని పీఠం కోసం జరిగిన పోరులో విదేశాంగ మంత్రి మేరీ ఎలిజబెత్ (లిజ్) ట్రస్ (47)దే పై చేయి అయింది. హోరాహోరి పోరులో భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ (42)పై ఆమె విజయం సాధించి కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికయ్యారు. తద్వారా బోరిస్ జాన్సన్ వారసురాలిగా ప్రధాని పదవి చేపట్టనున్నారు. సోమవారం వెల్లడైన ఫలితాల్లో ట్రస్ 81,326 ఓట్లు సాధించారు. రిషికి 60,399 ఓట్లు పోలయ్యాయి. ఫలితాల అనంతరం ట్రస్ మాట్లాడారు. పార్టీ నేతగా ఎన్నికవడం గొప్ప గౌరవమన్నారు. తనపై నమ్మకముంచినందుకు పార్టీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మేం చేసి చూపిస్తాం’ అంటూ ముమ్మారు ప్రతిజ్ఞ చేశారు. ‘‘పన్నులకు కోత విధించి ప్రజలపై భారం తగ్గించి చూపిస్తాం. ఇంధన సంక్షోభాన్ని అధిగమిస్తాం. ఈ కష్టకాలం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి సాహసోపేతమైన చర్యలు చేపడతా. యునైటెడ్ కింగ్డమ్ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి మరోసారి చూపిద్దాం’’ అంటూ అనంతరం ట్వీట్ చేశారు. రిషి చివరిదాకా తనకు పోటీ ఇచ్చారంటూ అభినందించారు. ప్రధానిగా బోరిస్ ఘన విజయాలు సాధించారంటూ ఆకాశానికెత్తారు. మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ ప్రధాని కానున్న మూడో మహిళ ట్రస్. పన్నుల తగ్గింపు హామీలు, రిషిపై కోపంతో జాన్సన్ లోపాయికారీ మద్దతు తదితరాలు ట్రస్ గెలుపుకు ప్రధానంగా పని చేశాయని చెబుతున్నారు. తాత్కాలిక ప్రధాని జాన్సన్ లాంఛనంగా రాజీనామా సమర్పించిన అనంతరం మంగళవారం ట్రస్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె నిర్ణయాత్మక విజయం సాధించారంటూ జాన్సన్ అభినందించారు. ‘‘నానాటికీ పెరిగిపోతున్న జీవన వ్యయం వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు, పార్టీని, దేశాన్ని ముందుకు నడిపేందుకు ట్రస్ వద్ద సరైన ప్రణాళికలున్నాయి. పార్టీ నేతలంతా ఆమె వెనక నిలవాల్సిన సమయమిది’’ అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్రస్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నాయకత్వంలో ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత పటిష్టమవుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. రిషి సంచలనం పార్టీ గేట్, విశ్వసనీయతకు సంబంధించిన ఆరోపణలతో ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయాల్సి రావడం తెలిసిందే. నైతికత లేని జాన్సన్ సారథ్యంలో పని చేయలేనంటూ ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేయడం ద్వారా రిషి సంచలనం సృష్టించారు. మంత్రులంతా ఆయన బాటే పట్టి వరుసగా రాజీనామా చేయడంతో జాన్సన్ అయిష్టంగానే తప్పుకోవాల్సి వచ్చింది. తద్వారా వచ్చి పడ్డ కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికలో మెజారిటీ ఎంపీల మద్దతు కూడగట్టడం ద్వారా తొలుత రిషియే ముందంజలో ఉన్నారు. తర్వాత ట్రస్ అనూహ్యంగా దూసుకెళ్లారు. 1,72,437 లక్షల కన్జర్వేటివ్ ఓటర్లను ఎక్కువ మందిని ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఆమెకు 57.4 శాతం ఓట్లు పోలవగా రిషికి 42.6 శాతం వచ్చాయి. ఆయన ఓటమి చవిచూసినా బ్రిటన్ ప్రధాని పదవి కోసం తలపడ్డ తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. తనకు ఓటేసిన అందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కన్జర్వేటివ్ సభ్యులమంతా ఒకే కుటుంబం. ఈ కష్టకాలం నుంచి గట్టెక్కించే ప్రయత్నాల్లో మనమంతా కొత్త ప్రధాని ట్రస్‌కు దన్నుగా నిలుద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు. పన్నుల విషయంలో ట్రస్‌తో విధానపరమైన వైరుధ్యం కారణంగా రిషి ఆమె కేబినెట్లో చేరడం అనుమానమేనంటున్నారు. అంచెలంచెలుగా ఎదిగి... బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్ కరడుగట్టిన కమ్యూనిస్టుల కుటుంబం నుంచి వచ్చారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించారు. తండ్రి మ్యాథ్స్ ప్రొఫెసర్ కాగా తల్లి నర్స్ టీచర్. యూకేలో పలు ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగింది. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చారు. 2001, 2005ల్లో ఓటమి పాలైనా 2010లో నార్ఫోక్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2014లో కేమరూన్ కేబినెట్లో పర్యావరణ మంత్రిగా, 2016లో థెరిసా మే ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా చేశారు. 2019లో బోరిస్ జాన్సన్ ప్రధాని అయ్యాక ట్రస్‌కు ప్రాధాన్యం పెరిగింది. తొలుత ఇంటర్నేషనల్ ట్రేడ్ సెక్రెటరీగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో భారత్‌లో పటిష్టమైన ఆర్థిక బంధం కోసం కృషి చేశారు. భారత్–ఇంగ్లండ్ వర్తక భాగస్వామ్యం (ఈటీపీ)లో కీలక పాత్ర పోషించారు. రెండేళ్లకు కీలకమైన విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు జాన్సన్ వారసురాలిగా ఎన్నికయ్యారు. అకౌంటెంట్ హ్యూ ఓ లియరీని ట్రస్ పెళ్లాడారు. వారికి ఇద్దరమ్మాయిలు. పరిస్థితిని బట్టి విధానాలు మార్చుకునే నేతగా కూడా ట్రస్ పేరుబడ్డారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని (బ్రెగ్జిట్) తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ అది అనివార్యమని తేలాక బ్రెగ్జిట్‌కు జైకొట్టారు. కన్జర్వేటివ్ సభ్యుల మద్దతు సాధించే ప్రయత్నాల్లో భాగంగా మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్ వస్త్రధారణను అనుకరించారు. -
భార్య అక్షతా మూర్తిపై రిషి సునాక్ మనసులో మాట
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న రిషి సునాక్ తన భార్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తి గురించి అనేక విషయాలు వెల్లడించారు. వారి తొలి పరిచయం, ఆమె వ్యవహార శైలి, కుటుంబ బాధ్యతలు, పెళ్లి నాటి విషయాలను రిషి సునాక్ మీడియాకు తెలిపారు. ‘వస్తువులను చక్కగా అమర్చే అలవాటు నాది. తానేమో చిందరవందరగా పడేస్తుంది. నేను చాలా క్రమశిక్షణతో ఉంటాను. తనకేమో సమయస్ఫూర్తి ఎక్కువ. ఈ విషయాలు చెప్పడం తనకు ఇష్టముండదు. కానీ, నేను మనస్సులో ఉన్న మాట చెబుతున్నా. ఆమెది పూర్తిగా చక్క బెట్టే తత్వం కాదు. ప్రతి చోటా దుస్తులు, ఎక్కడపడితే అక్కడ షూలు. ఓహ్..గాడ్..!’ అంటూ తన భార్య అక్షత గురించి సునాక్ వివరించారు. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో భారత సంతతికి చెందిన దంపతులుకు రిషి సునాక్ జన్మించారు. రిషి స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతోన్న సమయంలో అక్షతతో పరిచయం ఏర్పడింది. అనంతరం 2006లో వారికి బెంగళూరులో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. కృష్ణ(11), అనౌష్క(9). ‘ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకంటే వాళ్లు పుట్టే సమయానికి నేను సొంత బిజినెస్ నడుపుతున్నా. అందుకే వాళ్లతో గడపటానికి సమ యం దొరికేది. అలా వాళ్లతో ప్రతిక్షణాన్ని ఆస్వాదించా’అని కుటుంబ విషయాలను సునాక్ పంచుకున్నారు. అయితే, రిషి సునాక్ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన భార్య అక్షతా మూర్తి పన్నుల చెల్లింపు వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో అధికార నివాసం డౌనింగ్ స్ట్రీట్‌లోని నంబర్–10 నుంచి ఖాళీ చేసి మరో చోటుకు వెళ్లిపోయారు. అనంతరం అక్షత వివాదం సద్దుమణిగింది. ఇదే సమయంలో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. అనంతరం కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ మొదలు కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. అంతిమ ఫలితం సెప్టెంబర్ 5న తేలనుంది. చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం.. అఖిలేశ్ యాదవ్ ఫైర్ -
సీన్ రివర్స్.. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్‌ను వెనక్కినెట్టిన ట్రస్!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు బ్రిటన్ 'యూగోవ్' సంస్థ సర్వే చెబుతోంది. ఇది బ్రిటన్‌లో ప్రముఖ ఇంటర్నెట్ మార్కెట్ రీసెర్చ్, ఎనలిటిక్స్ సంస్థ. కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) సభ్యులు రిషి, లిజ్ ట్రస్‌లలో ఎవరికి మద్దతుగా ఉన్నారు అనే విషయంపై యూగోవ్ బుధ, గురువారాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 730 మంది టోరీ సభ్యులు పాల్గొనగా.. 62 శాతం మంది లిజ్ ట్రస్‌కే తమ ఓటు అని చెప్పారు. 38 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచారు. సర్వేల్లో గతవారం వరకు రిషి సునాక్‌పై 19 శాతం పాయింట్లు లీడ్ సాధించిన ట్రస్ ఇప్పుడు 24శాతం పాయింట్ల లీడ్‌కు ఎగబాకడం గమనార్హం. దీంతో కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ.. పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక కొద్ది రోజుల్లో సమ్మర్ క్యాంపెయిన్ ప్రారంభవుతుంది. రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు లభించే మద్దతు ఇంకా పెరుగుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు. బ్రిటన్ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. 1.60 లక్ష మందికిపైగా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మహిళలు, పురుషులతో పాటు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసే వారిలో మెజార్టీ ఓటర్లు లిజ్ ట్రస్‌కే జై కొడుతున్నట్లు స్కై న్యూస్ సర్వే తెలిపింది. బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా జరిగిన ఐదో రౌండ్ ఓటింగ్‌లో రిషికి 137 మంది ఎంపీలు ఓటు వేయగా.. ట్రస్‌కు 113 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ టోరీ సభ్యుల విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చదవండి: రష్యాను చావుదెబ్బ కొట్టేందుకు ఉక్రెయిన్‌కు గోల్డెన్ ఛాన్స్! -
శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్ధన
కొలంబో: శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. రణిల్ ప్రదానిగా రాజీనామా చేయడంతో ఆ పదవీ ఇప్పుడూ ఖాళీగా ఉంది. రణిల్ సన్నిహితుడు రాజపక్సల కుటుంబాలతో అత్యంత సాన్నిత్యం ఉన్న వ్యక్తి అయిన దినేష్ గుణవర్ధన ప్రధానిగా నియమితులయ్యారు. ఈ మేరకు గుణవర్ధన శుక్రవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. తదనంతరం మిగిలిన మంత్రి వర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు గోటబయ హాయంలో గుణవర్ధన హోం మంత్రిగా పనిచేశారు. అపార రాజీకీయ అనుభవం ఉన్న గుణవర్థన గతంలో విదేశాంగ మంత్రిగానూ, విద్యామంత్రిగానూ పని చేశారు. జాతీయ ప్రభుత్వం ఆమోదం పొందే వరకు మునపటి మంత్రివర్గం పనిచేస్తుందని నూతన అధ్యక్షుడు రణిల్ అన్నారు. పార్లమెంట్ సమావేశాలు కాగానే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఆందోళనకారులు నిరసనలు ఆగడం లేదు. విక్రమసింఘే రాజపక్సల విధేయుడు కావడంతో పరిపాలనలో పెద్దగా మార్పు సంతరించుకోదన్న భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి. దీంతో ఆందోళనకారులు కొలంబో వీధుల్లో రణిల్ రాజీనామా చేయాలంటే ఆందోళనలు చేపట్టారు. ఈ మేరకు రణిల్ శాంతియుత నిరసనలకు మద్దతు ఇస్తాను గానీ శాంతియుత నిరసన ముసుగులో హింసాత్మక దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అందులో భాగంగానే అధ్యక్ష భవనం సమీపంలోని నిరసనకారుల శిభిరాల పై లంక సైనికులు, పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు అధ్యక్ష భవనం ప్రధాన గేటును బ్లాక్ చేస్తూ నిరసనకారులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడమే కాకుండా ఆందోళనకారులు ఆ ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలంటూ హచ్చరికలు జారీ చేశారు. అంతేగాదు తొమ్మిది మంది ఆందోళనకారులను కూడా అరెస్టు చేశారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉద్రీక్త వాతవరణం చోటు చేసుకుంది. (చదవండి: గోటబయకు ఊరట... గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సింగపూర్!) -
రెడీ ఫర్ రిషి! బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి వ్యక్తి దూకుడు
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునాక్ ముందంజలో దూసుకుపోతున్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకునిగా ఆయన అభ్యర్థిత్వానికి అత్యధికంగా 40 మందికి పైగా ఎంపీలు మద్దతు పలికారు. ఆర్థిక మంత్రిగా సమర్థ పనితీరు ఆయనకు మరింతగా కలిసొస్తోంది. ‘రెడీ ఫర్ రిషి’ పేరుతో రిషి ఇప్పటికే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తికి ఆయన అల్లుడు కావడంతో ఈ ఎన్నికలపై భారత్‌లోనూ ఆసక్తి మరింత పెరిగింది. భారత సంతతికి చెందిన కమలా హారిస్ ఇప్పటికే అగ్ర రాజ్యం అమెరికాకు ఉపాధ్యక్షురాలైన నేపథ్యంలో భారత మూలాలున్న రిషి బ్రిటన్ పగ్గాలు చేపట్టి చరిత్ర సృష్టిస్తారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి భారత సంతతికి చెందిన హోం మంత్రి ప్రీతీ పటేల్‌తో పాటు పాక్ సంతతికి చెందిన మాజీ మంత్రులు సాజిద్ జావిద్, రెహ్మాన్ చిస్తీ తదితరులు తప్పుకున్నారు. దాంతో రిషితో పాటు మరో ఏడుగురు బరిలో మిగిలారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్ సువెల్లా బ్రేవర్మన్ కూడా ఉండటం విశేషం! అంత ఈజీ కాదు బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్‌లో అడుగు పెట్టడం అంత సులభమైన వ్యవహారం కాదు. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంటులో అధికార కన్జర్వేటివ్ పార్టీకి 358 మంది సభ్యుల బలముంది. ప్రధానిగా పగ్గాలు చేపట్టబోయే పార్టీ నాయకుడి ఎన్నిక ప్రక్రియ 8 వారాల పాటు సుదీర్ఘంగా సాగుతుంది. చివరికి అత్యధిక ఎంపీల మద్దతు లభించిన వారే కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నికై ప్రధాని పీఠం అధిరోహిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ఓటింగ్ ప్రక్రియ మొదలవనుంది. బుధవారం తొలి రౌండ్ ఓటింగ్ జరుగుతుంది. కనీసం 30 మంది ఎంపీల మద్దతున్న వాళ్లే గురువారం నాటి రెండో రౌండ్ ఓటింగ్‌కు అర్హత సాధిస్తారు. అక్కడినుంచి ఒక్కో దశలో అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన వారు తప్పుకుంటూ పోతారు. ఇలా జూలై 21 నాటికి ఇద్దరే అభ్యర్థులు పోటీలో మిగలాల్సి ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది టోరీ పార్టీ సభ్యుల మద్దతు కూడగట్టుకునేందుకు వారు దేశవ్యాప్త ప్రచారానికి శ్రీకారం చుడతారు. తుది ఇద్దరు అభ్యర్థుల్లో రిషి కచ్చితంగా నిలిచే అవకాశాలున్నాయి. సమర్థమైన పనితీరు కరోనా కల్లోల సమయంలో బ్రిటన్ ఆర్థిక సంక్షోభం బారిన పడకుండా ఆర్థిక మంత్రిగా రిషి తీసుకున్న చర్యలు అందరి మన్ననలు పొందాయి. ఉద్యోగాలను కాపాడే చర్యలతో మంచి పేరు తెచ్చుకున్నారు. కార్మికులు, చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. యువత, విద్యావంతులు, సంపన్నుల్లోనూ రిషికి మంచి ఫాలోయింగ్ ఉంది. పన్ను రాయితీలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. పన్నులు తగ్గిస్తే ధరలు పెంచాల్సి వస్తుందని, అది ఆర్థిక వ్యవస్థపై చెడు ప్రభావం చూపిస్తుందన్నది ఆయన వాదన. పార్టీగేట్ కుంభకోణంలో జరిమానా కట్టాల్సి రావడం వంటివి రిషికి ప్రతికూలంగా మారాయి. భార్య అక్షత మూర్తి భారత్ పౌరురాలిగా కొనసాగుతూ నాన్ డొమిసైల్ హోదాను అడ్డు పెట్టుకొని తన సంపాదనపై పన్నులు ఎగవేశారన్న ఆరోపణలు కూడా రిషిని ఇరకాటంలో పెట్టాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ పెన్నీతో గట్టి పోటీ! రిషికి ప్రధానంగా వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డంట్ నుంచి గట్టి పోటీ ఉంటుందంటున్నారు. దేశ తొలి మహిళా రక్షణ మంత్రి అయిన ఆమె థెరిసా మే ప్రధానిగా ఉండగా ఒక వెలుగు వెలిగారు. పెట్రో పన్నులను 50 శాతం తగ్గిస్తానని, వ్యాట్ రాయితీలను 2023 ఏప్రిల్ దాకా పొడిగిస్తానని ఆమె ఇస్తున్న హామీలు పార్టీ ఎంపీలను బాగా ఆకర్షిస్తాయంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీ అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో పెన్నీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఆమెకు 19.6% మంది మద్దతు పలికారు. మాజీ మంత్రి కెమీ బడెనోక్ (18.7%) రెండోస్థానంలో ఉన్నారు. 12.1 శాతం ఓట్లతో రిషి మూడో స్థానంలో, సుయెల్లా బ్రేవర్మన్ నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే ఆమెకు ప్రజల్లో అంతగా ఫాలోయింగ్ లేదు. విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ పన్నుల తగ్గింపు హామీలతో రిషికి పూర్తి వ్యతిరేక విధానాలతో దూసుకుపోతున్నారు. టామ్ టుగెన్హాట్, జెరెమీ హంట్, నదీమ్ జహావీ కూడా రేసులో ఉన్నారు. రేసులో నిలిచింది వీరే... రిషి సునాక్ పెన్నీ మోర్డంట్ టామ్ టుగెన్హాట్ లిజ్ ట్రస్ కెమీ బడెనోక్ జెరెమీ హంట్ నదీమ్ జవాహి సుయెల్లా బ్రేవర్మన్ చదవండి: ఊహించని మలుపులు.. ప్రీతి పటేల్ అవుట్ -
ఫ్రాన్స్ ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్
పారిస్: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ నియమితులయ్యారు. దేశప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. 1991–92లో ఎడిత్ క్రేసన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పని చేశారు. బోర్న్గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. త్వరలో అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి బోర్న్ నూతన మంత్రివర్గాన్ని నియమిస్తారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రభుత్వానికి చెందిన ఆర్‌ఏటీపీ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. 2017లో మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ పార్టీలో చేరారు. ఫ్రాన్స్‌లో అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయ్యేలోపు ప్రధానులు మారుతూనే ఉంటారు. కార్మిక మంత్రిగా ఆమె తెచ్చిన సంస్కరణలకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు బోర్న్ సత్తాకు పరీక్షగా నిలవనున్నాయి. -
భారత్‌తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నా
కొలంబో: భారత్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగాలని కోరుకుంటున్నట్లు శ్రీలంక నూతన ప్రధాని రణిల్ విక్రమసింఘే(57) తెలిపారు. దేశం కనీవినీ ఎరుగని కష్టకాలంలో ఉన్న సమయంలో ఆర్థికంగా చేయూత అందిస్తున్న భారత్‌కు, ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని భారత్ పేర్కొంది. శ్రీలంకకు సాయం కొనసాగిస్తామని భరోసా ఇచ్చింది. అధ్యక్షుడు గొటబయా కార్యాలయం ఎదుట నెల రోజులుగా సాగుతున్న నిరసనలను విరమింపజేస్తానని విక్రమసింఘె అన్నారు. అయితే ఆయన మధ్యంతర ప్రభుత్వం కొనసాగాలంటే గొటబయా గద్దె దిగాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ, జేవీపీ డిమాండ్ చేశాయి. కొత్త ప్రభుత్వంలో భాగస్వాములు కాబోమని, బయటి నుంచి మద్దతిస్తామని గొటబయాకు చెందిన ఎస్‌ఎల్‌పీపీలోని ఓ వర్గం, మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు చెందిన ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ, మార్క్సిస్ట్ జనతా విముక్తి పెరుమణ (జేవీపీ) స్పష్టం చేశాయి. 2020 పార్లమెంట్ ఎన్నికల్లో విక్రమసింఘే ఎన్నిక కానందున ఆయన ప్రభుత్వానికి చట్టబద్ధత లేదని ప్రధాన ప్రతిపక్షం ఎస్‌జేబీ వ్యాఖ్యానించింది. 225 మంది సభ్యులున్న శ్రీలంక పార్లమెంట్లో యునైటెడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ)కి చెందిన విక్రమసింఘే ఒక్కరే సభ్యుడు. మరోవైపు, నిట్టంబువ పట్టణంలో ఈ నెల 10వ తేదీన జరిగిన ఘర్షణల సమయంలో ఎస్ఎల్పీపీకి చెందిన ఎంపీ అమరకీర్తి(57)ది ఆత్మహత్య చేసుకున్నారంటూ వచ్చిన వార్తలు నిజం కాదని పోలీసులు తెలిపారు. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ఆయన్ను దారుణంగా కొట్టి చంపినట్లు వెల్లడించారు. -
శ్రీలంక అధ్యక్షుడు గొటబయా కీలక ప్రకటన
కొలంబో/న్యూయార్క్: శ్రీలంకకు ఈ వారంలోనే కొత్త ప్రధాని వస్తారని అధ్యక్షుడు గొటబయా రాజపక్స చెప్పారు. రాజ్యాంగ సంస్కరణలూ తెస్తామన్నారు. రాజపక్సలు లేకుండా యువ మంత్రివర్గాన్ని నియమిస్తామన్నారు. తాజా మాజీ ప్రధాని మహిందా రాజపక్స ట్రింకోమలీలోని నావల్ బేస్‌లోనే తలదాచుకున్నారు. భారత ప్రభుత్వం లంకకు సైన్యాన్ని తరలించనుందన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. చదవండి: లంక కల్లోలం: కొంప ముంచిన మహీంద రాజపక్స మీటింగ్! -
పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్ 23వ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్ (70) సోమవారం ఎన్నికయ్యారు. పాక్ పార్లమెంట్లో ఇమ్రాన్‌పార్టీ వాకౌట్‌తో షరీఫ్ ఎన్నికకు ఎలాంటి వ్యతిరేకతా రాలేదు. షరీఫ్ పదవీ స్వీకారానికి ముందు అధ్యక్షుడు అరీఫ్ అలీ అనారోగ్యకారణాలు చూపుతూ సెలవు పెట్టారు. దీంతో షరీఫ్‌తో సెనేట్ చైర్మన్ సాదిక్ సంజ్రానీ ప్రమాణ స్వీకారం చేయించారు. షరీఫ్ ఎన్నికతో గతనెల 8న ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో మొదలైన పాక్ రాజకీయ డ్రామాకు తెరపడినట్లయిందని నిపుణులు భావిస్తున్నారు. అంతకుముందు పార్లమెంట్లో షరీఫ్‌కు 174 ఓట్లు రావడంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌కు ఆయన్ను ప్రధానిగా ప్రకటిస్తున్నట్లు స్పీకర్ అయాజ్ సిద్ధిఖీ తెలిపారు. డిఫ్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరీ పక్కకు తప్పుకోవడంతో సిద్ధిఖీ సభను నడిపించారు. ప్రధానిగా ఎన్నికయ్యేందుకు పాక్ పార్లమెంట్లో 172 ఓట్లు కావాల్సి ఉంది. అనంతరం పార్లమెంట్‌నుద్దేశించి షరీఫ్ ప్రసంగించారు. పాక్ చరిత్రలో ఒక ప్రధానికి వ్యతిరేకంగా అవిశ్వాసం విజయం సాధించడం ఇదే తొలిసారన్నారు. చెడుపై మంచి గెలిచిందన్నారు. దేశానికి ఇది శుభదినమని, ఒక ఎంచుకున్న ప్రధానిని (ఇమ్రాన్) చట్టబద్ధంగా తొలగించిన రోజని ఆయన అభివర్ణించారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు షహబాజ్ సోదరుడు. తన ఎన్నిక రోజు పాక్ రూపాయి బలపడడం ప్రజల్లో ఆనందానికి చిహ్నమన్నారు. అవిశ్వాసంపై సుప్రీంకోర్టు తీర్పును ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు వచ్చిన రోజు పాక్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అంతా అబద్ధం తమ ప్రభుత్వాన్ని పడదోసేందుకు విదేశీ కుట్ర జరిగిందన్న ఇమ్రాన్ వ్యాఖ్యలు డ్రామాగా షరీఫ్ విమర్శించారు. విదేశీ కుట్ర జరుగుతోందన్న వివాదాస్పద లేఖపై పార్లమెంట్ భద్రతా కమిటీకి వివరణ ఇస్తామన్నారు. సైన్యాధికారులు, ప్రభుత్వాధికారులు, ఐఎస్ఐ చీఫ్, విదేశాంగ కార్యదర్శి, సదరు లేఖ రాసిన రాయబారి సమక్షంలోనే కమిటీ సభ్యులకు వివరిస్తామన్నారు. ఈ వివాదంలో కుట్ర ఉందని తేలితే తాను రాజీనామాకైనా సిద్ధమన్నారు. నిజానికి సదరు ఉత్తరం మార్చి 7న వచ్చిందని, కానీ తాము అవిశ్వాసా న్ని అంతకుముందే నిర్ణయించుకున్నామని చెప్పారు. ప్రపంచ రాజకీయాల్లో తమకు సహకరిస్తున్నందుకు ఆయన చైనాను ప్రశంసించారు. పీటీఐ వాకౌట్: పాక్ కొత్త ప్రధాని ఎన్నిక సమావేశాన్ని మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ బహిష్కరించింది. అంతకుముందు పీటీఐ నేత, మాజీ విదేశాంగ మంత్రి ఖురేషీ మాట్లాడుతూ పాకిస్తాన్ ముందు ఆత్మ గౌరవం, బానిసత్వం అనే రెండు దారులున్నాయని చెప్పారు. తమ పార్టీ ఎన్నికలో పాల్గొనకుండా వాకౌట్ చేస్తోందని ప్రకటించారు. తమ పార్టీ సభ్యులంతా జాతీయ అసెంబ్లీ నుంచి రాజీనామా చేస్తారని, విదేశీ ఎజెండాతో పనిచేసే ఏ ప్రభుత్వంలో భాగస్వాములు కాబోరని మాజీ మంత్రి ఫహాద్ చౌదరీ చెప్పారు. షరీఫ్‌కు మోదీ అభినందనలు న్యూఢిల్లీ: పాకిస్తాన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్‌కు భారత ప్రధాని మోదీ ట్విట్టర్లో అభినందనలు తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతిని, స్థిరత్వాన్ని కోరుతుందన్నారు. ఉపఖండంలో ఉగ్రవాదం ఉండకూడదన్నది భారత్ అభిలాషన్నారు. అప్పుడే అభివృద్ధిపై దృష్టి సారించగలమన్నారు. సవాళ్లు అనేకం రాజీనామా చేసిన ఇమ్రాన్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగుతోంది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ నేల చూపులు చూస్తోంది. ఈ నేపథ్యంలో దేశ శాంతి భద్రతలను, ఆర్థిక వ్యవస్థను గాడినపెట్టాల్సిన పెను సవాళ్లు షరీఫ్ ముందున్నాయి. పార్లమెంట్లో షరీఫ్ పార్టీకి 86 సీట్లే ఉన్నాయి. పలు మిత్రపక్షాల సహకారంతో తాజా ప్రభుత్వం ఏర్పడింది. వీరిలో ఏ ఒక్కరు అలిగినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుంది. వీరందరినీ సంతృప్తి పరచడం, నూతన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అంచనాలను అందుకోవడం కూడా షరీఫ్‌కు సవాలేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశంలో పలు చోట్ల ఉగ్రదాడులు జరుగుతున్నాయి. విదేశాంగ శాఖ పనితీరు మసకబారింది. భారత్‌తో ఉద్రిక్తతలు సరేసరి! వీటన్నింటినీ తట్టుకొని షరీఫ్ మనుగడ సాగించాల్సిఉంది. షహబాజ్‌పై నేరారోపణ విచారణ వాయిదా ఈనెల 27కు వాయిదా వేసిన పాక్ కోర్టు లాహోర్: పాక్ కొత్త ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హంజాపై మనీలాండరింగ్ కేసులో నేరారోపణను పాక్ కోర్టు ఏప్రిల్ 27కు వాయిదా వేసింది. ఆ రోజు వరకు వీరికి ప్రీ అరెస్టు బెయిల్‌ను కూడా మంజూరు చేసింది. దీంతో షరీఫ్ ప్రధాని అయ్యేందుకు అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టులో వ్యక్తిగత విచారణ నుంచి తనను ఒక్కరోజు మినహాయించాలని, తమ బెయిల్‌ను పొడిగించాలని అంతకుముందు షహబాజ్ వేసిన పిటిషన్‌ను ఫెడరల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ(ఎఫ్ఐఏ) కోర్టు అనుమతించిందని కోర్టు అధికారి ఒకరు చెప్పారు. విచారణకు ఎఫ్ఐఏ టీమ్ న్యాయవాది హాజరుకానందున విచారణ వాయిదా పడింది. 2020లో షహబాజ్ ఆయన కుమారులు హంజా, సులేమాన్‌పై ఎఫ్ఐఏ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. సులేమాన్ అప్పట్లో యూకేకు పారిపోయారు. వీరంతా కలిసి 2008–18 కాలంలో 1,400 కోట్ల పాక్ రూపాయల మేర మోసం చేశారని ఆరోపణలున్నాయి. త్వరలో పాక్‌కు నవాజ్ లండన్‌లో ఉంటున్న పాక్ మాజీ ప్రధాని, షహబాజ్ సోదరుడు నవాజ్ షరీఫ్ వచ్చేనెల్లో ఈద్ తర్వాత స్వదేశానికి వచ్చే అవకాశాలున్నాయని పీఎంఎల్ఎన్ పార్టీ నేతలు చెప్పారు. నవాజ్‌పై ఇమ్రాన్ ప్రభుత్వం పలు అవినీతి కేసులు నమోదు చేసింది. దీంతో ఆయన చికిత్స కోసమని కోర్టు అనుమతి తీసుకొని 2019లో దేశం విడిచి లండన్ వెళ్లారు. -
7 గంటల్లో దిగిపోయినా మళ్లీ స్వీడన్ పీఠంపై ఆండర్సన్
కోపెన్‌హాగెన్(డెన్మార్క్): స్వీడన్ ప్రధాని పీఠంపై మహిళా నేత మాగ్డలీనా ఆండర్సన్ వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ఆసీనులయ్యారు. కూటమి ప్రభుత్వంలోని పార్టీ మద్దతు ఉపసంహరిం చడంతో గత వారం పదవికి రాజీనామా చేసిన ఆమె సోమవారం మళ్లీ ప్రధానిగా ఎన్నికయ్యారు. 349 సీట్లు ఉన్న స్వీడన్ పార్లమెంట్లో ప్రధాని పదవికి జరిగిన ఓటింగ్‌లో ఈమెకు మద్దతుగా 101 ఓట్లు పడ్డాయి. 75 మంది గైర్హాజరయ్యారు. స్వీడన్ రాజ్యాంగం ప్రకారం ప్రధానిగా ఎన్నుకోబడే వ్యక్తిని ఓటింగ్‌లో 175కు మించి సభ్యులు వ్యతిరేకించకూడదు. అంటే వ్యతిరేకంగా 175 ఓట్లు పడితే ఆ ప్రభుత్వం కొలువుతీరదు. అదృష్టవశాత్తు ఆండర్సన్‌కు వ్యతిరేకంగా 173 ఓట్లే పడ్డాయి. దీంతో మైనారిటీలో ఉన్నా సరే సోషల్ డెమొక్రటిక్ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. గత వారం గ్రీన్ పార్టీతో సోషల్ డెమొక్రటిక్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్నిఏర్పాటుచేసింది. దేశ తొలి మహిళా ప్రధానిగా ఆండర్సన్ బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. అంతకుముందే ఆర్థికమంత్రిగా ఉన్న ఆమె అదే హోదాలో బడ్జెట్‌ను వెంటనే ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్ ప్రతిపాదనలు విపక్ష స్వీడన్ డెమొక్రాట్స్ పార్టీ విధానాలకు అనుకూలంగా ఉన్నాయంటూ కూటమి ప్రభుత్వం నుంచి గ్రీన్ పార్టీ వైదొలగింది. దీంతో ఆరోజు కేవలం ప్రధాని అయిన ఏడు గంటలకే ఆండర్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
చిరకాల స్వప్నం సాకారం.. జపాన్ కొత్త ప్రధానిగా కిషిడా
టోక్యో: మాజీ విదేశాంగ మంత్రి ఫుమియో కిషిడా జపాన్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించనున్నారు. 64 ఏళ్ల ఫుమియో కిషిడా ఆ దేశ అధికార పార్టీ నేతగా తాజాగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని యోషిడే సుగా స్థానంలో ఫుమియో బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రముఖ టీకా చీఫ్ టారో కోనోను ఓడించి మరీ తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు ఫుమియో. అధికారిక పార్టీ ఓటింగ్‌లో కిషిడాకు 257 ఓట్లురాగా, కోనోకు 170 ఓట్లు పోల్ అయ్యాయి. గత రెండు దశాబ్దాలుగా జపాన్ రాజకీయాలపై ఆధిపత్యం చలాయిస్తున్న నయా-ఉదారవాద ఆర్థిక విధానాలనుంచి వైదొలగాలని, దేశంలో ఆదాయ అసమానతలను అధిగమిస్తామని ఆయన వాగ్దానం చేశారు. అంతేకాదు మహమ్మారినుంచి బయటపడేందుకు భారీ ఉద్దీపన ప్యాకేజీని కూడా కిషిడా హామీ ఇచ్చారు. కిషిడా హిరోషిమా రాజకీయ నాయకుల కుటుంబానికి చెందిన మృదు భాషి. బేస్ బాల్ అంటే ఇష్టం. గతంలో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ పాలసీ చీఫ్‌గా పనిచేశారు. అలాగే 2012-17 మధ్య కాలంలో విదేశాంగ మంత్రిగా ఉన్నారు, ఈ సమయంలో రష్యా ,దక్షిణ కొరియాతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంతేకాదు అణ్వాయుధాలను రద్దు చేయడమే తన జీవితాశయమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో 2016లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమా చారిత్రాత్మక పర్యటనకు దోహదపడ్డారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభంలో పడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేకపోవడం, దేశాన్ని నడిపించలేకపోతున్నట్టు ఇటీవల ప్రస్తుత ప్రధాని సుగా ప్రకటించిన నేపథ్యంలో కొత్త ఎన్నిక అనివార్యమైంది. -
విశ్వాస పరీక్ష నెగ్గిన దేవ్బా
ఖాట్మండు: నేపాల్ నూతన ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఆదివారం జరిగిన విశ్వాస పరీక్షలో గెలుపొందారు. ప్రతినిధుల సభలో 275 ఓట్లుండగా, దేవ్‌బాకు 165 ఓట్లు వచ్చాయని హిమాలయన్ టైమ్స్ తెలిపింది. ఓటింగ్‌లో 249మంది పాల్గొన్నారు. వీరిలో 83 మంది దేవ్‌బాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఒక సభ్యుడు తటస్థంగా ఉన్నారు. పార్లమెంట్ విశ్వాస పరీక్షలో నెగ్గడానికి 136 ఓట్లు కావాల్సిఉంది. కావాల్సిన మెజార్టీ కన్నా అధిక మద్దతునే దేవ్బా పొందారు. పార్లమెంట్‌ను రద్దు చేయవద్దని, దేవ్‌బాను ప్రధానిగా నియమించి విశ్వాస పరీక్షకు అనుమతినివ్వాలని నేపాల్ సుప్రీంకోర్టు అధ్యక్షురాలిని ఆదేశించిన సంగతి తెలిసిందే! దీంతో ఈనెల 13న దేవ్బా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కలిపి ఇప్పటికి ఆయన ఐదుమార్లు నేపాల్ ప్రధాని పదవి స్వీకరించినట్లయింది. మాజీ ప్రధాని కేపీఓలీ సిఫార్సుతో అధ్యక్షురాలు విద్యాదేవీ దిగువ సభను మేలో రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. విచారణ అనంతరం సభ రద్దు నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది. -
ప్రధానిగా మహింద ప్రమాణం
కొలంబో: శ్రీలంక ప్రధానిగా మహింద రాజపక్స(74) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. శతాబ్దాల చరిత్ర ఉన్న బౌద్ధాలయం వద్ద ఆదివారం జరిగిన కార్యక్రమంలో మహింద సోదరుడు, శ్రీలంక అధ్యక్షుడు అయిన గొతబయ రాజపక్స ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ ప్రముఖులు, దౌత్యాధికారులు, సీనియర్ అధికారులు పొల్గొన్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన పార్టీ శ్రీలంక పీపుల్స్ పార్టీ(ఎస్ఎల్పీపీ)ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజా పరిణామంతో శ్రీలంక ఎన్నికల్లో వచ్చే అయిదేళ్లపాటు రాజపక్స కుటుంబం హవా సాగనుంది. కొలంబోకు సమీపంలోని కేలనియాలో ఉన్న 2,500 ఏళ్లనాటి పురాతన బౌద్ధాలయం రాజమహ విహారయలో ఆదివారం ఉదయం 9.28 గంటలకు జరిగిన కార్యక్రమంలో శ్రీలంక 13వ ప్రధానిగా మహింద రాజపక్స ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అధికార ఎస్ఎల్పీపీ కార్యకర్తలు బాణసంచా కాల్చి, పండుగ చేసుకున్నారు. ఎన్నికల్లో రాజపక్స ఘన విజయం ఖాయమన్న సంకేతాలు వెలువడగానే భారత ప్రధాని మోదీ రాజపక్సకు శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. 225కు గాను.. 150 సీట్లు ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్‌లోని 225 సీట్లకు గాను ఒక్క ఎస్‌ఎల్‌పీపీనే 145 సీట్లు సాధించింది. మిత్ర పార్టీలతో కలిసి అధికార పక్షం బలం 150 సీట్లకు చేరింది. ఎస్ఎల్పీపీ వ్యవస్థాపకుడు, పార్టీ జాతీయ నిర్వాహకుడు అయిన బసిల్ రాజపక్స(69) కూడా మహింద సోదరుడే. మహింద కుమారుడు నమల్ రాజపక్స(34) కూడా తమ కుటుంబం కంచుకోటగా ఉన్న హంబన్తొట స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే దేశ రాజకీయాలపై రాజపక్స కుటుంబం మరింత పట్టు సాధించేందుకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించే అవకాశముంది. 24 ఏళ్లకే పార్లమెంట్‌లోకి.. మహింద రాజపక్స దేశ రాజకీయాల్లోకి ప్రవేశించి ఈ ఏడాది జూలైతో 50 ఏళ్లు ముగిశాయి. 24 ఏళ్ల వయస్సులోనే 1970లో ఆయన మొదటి సారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు దేశాధ్యక్ష పదవి చేపట్టారు. 2004–05 సంవత్సరాల్లో, 2018లో 52 రోజులు, తిరిగి 2019–20 సంవత్సరాల్లో ప్రధానిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఆయనకు 5,27,000 ఓట్లు పోలయ్యాయి. -
ఫిన్‌ల్యాండ్ కేబినెట్లో 12 మంది మహిళలు
హెల్సింకి: ప్రపంచ దేశాల్లో అత్యంత పిన్న వయస్కురాలైన ప్రధానమంత్రిగా చరిత్ర సృష్టించిన ఫిన్‌ల్యాండ్ ప్రధాని సన్నా మారిన్ తన కేబినెట్లోనూ మహిళలకే అత్యధికంగా చోటు కల్పించారు. కొత్త కేబినెట్లో 12 మంది మహిళలకి అవకాశం లభించింది. ఈ మంత్రుల్లో ఒక్కరు మినహాయించి మిగిలిన వారంతా 30–35 ఏళ్ల మధ్య వయసున్నవారే. ఆమె కేబినెట్లో ఏడుగురు పురుషులు కూడా ఉన్నారు. ఆర్థికం, విద్య, అంతర్గత వ్యవహారాలు వంటి ముఖ్యశాఖలన్నీ మహిళలకే అప్పగించారు. 34 ఏళ్ల వయసున్న సన్నా మారిన్ మంగళవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులో విశ్వాస పరీక్ష ఎదుర్కొని నెగ్గారు. మారిన్‌కు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 70 ఓట్లు వచ్చాయి. ఫిన్‌ల్యాండ్‌లో అధికారంలో ఉన్న సెంటర్ లెఫ్ట్ సంకీర్ణ సర్కార్‌ను నడపడం ఆమె ముందున్న అతి పెద్ద సవాల్. ‘‘మర్యాద మన్ననల మధ్య ప్రతీ చిన్నారి ఎదుగుదల ఉండాలి. ఎవరైనా ఏదైనా సాధించేలా సమాజాన్ని నిర్మించడమే నా ధ్యేయం‘‘అని మారిన్ ట్వీట్ చేశారు. దేశంలో పోస్టల్ సమ్మెను ఎదుర్కోవడంలో విఫలమైనందుకు గతవారంలో అంటి రిన్నె ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మారిన్ పగ్గాలు తీసుకున్నారు. సెంటర్ పార్టీకి చెందిన కత్రి కులుమణి (32)కి ఆర్థిక శాఖ, గ్రీన్ పార్టీ నాయకురాలు మారియా ఒహిశాలో (34)కు అంతర్గత వ్యవహారాలు, లెఫ్ట్ కూటమి చైర్‌వుమెన్ లీ అండెర్సన్ (32)కు విద్యాశాఖ అప్పగించారు. కార్మికుల అసంతృప్తి జ్వాలలు, ఎటు చూసినా సమ్మెలు నడుస్తున్న వేళ ప్రధానిగా మారిన్ తన ఎదుట ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. -
శ్రీలంక కొత్త ప్రధాని మహిందా రాజపక్స
కొలంబో: శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా మహిందా రాజపక్స నియమితులయ్యారు. నూతన అధ్యక్షుడు గోతబయ రాజపక్స తన సోదరుడు, మాజీ దేశాధ్యక్షుడు అయిన మహిందా రాజపక్సను దేశ నూతన ప్రధానిగా బుధవారం ఎంపిక చేశారు. ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే గురువారం బాధ్యతల నుంచి తప్పుకోగానే, మహిందా రాజపక్స ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గోతబయ రాజపక్స చేతిలో విక్రమసింఘే నేతృత్వంలోని యునైటెడ్ నేషనల్ పార్టీ (యూఎన్‌పీ) తరఫున పోటీ చేసిన సాజిత్ ప్రేమదాస ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే బుధవారం ప్రకటించారు. పార్లమెంట్లో తన ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పటికీ.. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను గౌరవించి రాజీనామా చేస్తున్నట్లు విక్రమసింఘే తెలిపారు. మహిందా రాజపక్స 2005 నుంచి 2015 వరకు దేశాధ్యక్షుడిగా ఉన్నారు. 2018లో అప్పటి అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన వివాదాస్పద రీతిలో ప్రధానిగా విక్రమసింఘేని తొలగించి మహిందా రాజపక్సను ఆ పదవిలో కూర్చోబెట్టి రాజ్యాంగ సంక్షోభానికి తెరతీశారు. ఆ తరువాత డిసెంబర్లో ప్రధాని పదవికి రాజపక్స రాజీనామా చేశారు. 1970లో తన 24 ఏళ్ల వయసులోనే తొలిసారి శ్రీలంక పార్లమెంటుకు ఎన్నికై మహిందా రాజపక్స రికార్డు సృష్టించారు. విక్రమసింఘే 1994 నుంచి యూఎన్‌పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయనపై సొంత పార్టీలో అసమ్మతి ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవిని ప్రేమదాసకు అప్పగించాలని పార్టీలోని యువతరం డిమాండ్ చేస్తోంది. -
బ్రిటన్ హోం మంత్రిగా ప్రీతీ పటేల్
లండన్: బ్రిటన్‌లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ముగ్గురు భారత సంతతి ఎంపీలకు కీలక మంత్రి పదవులు దక్కాయి. బ్రెగ్జిట్‌పై వివాదం కారణంగా ఆ దేశ ప్రధాని బాధ్యతల నుంచి థెరెసా మే దిగిపోవడంతో కొత్త ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఎన్నిక కావడం తెలిసిందే. రాణి ఎలిజబెత్ బుధవారం సాయంత్రమే జాన్సన్‌ను కొత్త ప్రధానిగా నియమించారు. ఆ వెంటనే మంత్రివర్గంలో జాన్సన్ మార్పులు చేశారు. మొత్తం ముగ్గురు భారత సంతతికి చెందిన ఎంపీలకు జాన్సన్ తన టీమ్‌లో స్థానం కల్పించారు. ప్రీతీ పటేల్, రిషి సునక్, అలోక్ శర్మ అనే భారత సంతతి ఎంపీలు కొత్త కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. వీరిలో రిషి సునక్, ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడైన ఎన్.ఆర్.నారాయణ మూర్తికి స్వయానా అల్లుడు. వీరంతా గతంలో జాన్సన్ వెన్నంటే ఉండి ప్రచారాన్ని ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించారు. వీరు ముగ్గురూ గురువారం కొత్త కేబినెట్ తొలి సమావేశానికి హాజరయ్యారు. అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను పూర్తి చేయడమే తమ లక్ష్యమని జాన్సన్ స్పష్టం చేశారు. బ్రెగ్జిట్‌పై యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఎలాంటి ఒప్పందమూ లేకుండానైనా సరే, అక్టోబర్ 31లోపు బ్రెగ్జిట్ ప్రక్రియను ప్రారంభిస్తామన్న హామీతో జాన్సన్‌కు ప్రధాని పదవి లభించింది. మొత్తం 31 మంది సభ్యులతో మంత్రివర్గాన్ని ప్రకటించారు. వారంతా బ్రెగ్జిట్ ప్రక్రియలో తనకు సహకరిస్తారని జాన్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. హోంమంత్రిగా ప్రీతీ పటేల్ బోరిస్ జాన్సన్ కేబినెట్లో కీలక పదవి దక్కిన భారత సంతతి వ్యక్తి ప్రీతీ పటేలేనని చెప్పుకోవాలి. గుజరాత్‌కు చెందిన తల్లిదండ్రులకు బ్రిటన్‌లోనే జన్మించిన ప్రీతీ పటేల్ (47) హోం మంత్రిగా నియమితులయ్యారు. బ్రెగ్జిట్‌పై థెరెసా మే విధానాలను ప్రీతి తూర్పారపట్టేవారు. బ్రిటన్‌లో భారతీయ కుటుంబాలు నిర్వహించే కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉంటారు. భారత ప్రధాని మోదీకి ప్రీతి బ్రిటన్‌లో కీలకమద్దతుదారు. బ్రిటన్ ప్రధాని ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె పేర్కొన్నారు. ఇక అలోక్ శర్మకు ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ శాఖ బా«ధ్యతలిచ్చారు. 2010 నుంచి అలోక్శర్మ ఎంపీగా ఉన్నారు. బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. రీడింగ్ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో అలోక్ శర్మ జన్మించారు. అలోక్‌కు అయిదేళ్లప్పుడే ఆ కుటుంబం బ్రిటన్‌కు వెళ్లింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి రిషి రిషి సునక్ (39) ట్రెజరీ విభాగానికి చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. రిషి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీగా రిచ్మాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిషి తండ్రి భారత్‌లోని పంజాబ్‌కు చెందినవారు. రిషి సునక్ బ్రిటన్‌లోనే పుట్టారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ వైద్య రంగానికి చెందినవారు. కాలిఫోర్నియాలో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతుండగా ఇన్ఫోసిస్ మాజీ చీఫ్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతామూర్తితో పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భారత్‌తో జాన్సన్కీ అనుబంధం ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్‌కు కూడా భారత్‌తో ఒకప్పుడు అందమైన అనుబంధమే ఉంది. ఆయన మొదటి భార్య మరీనా వీలర్ భారత సంతతికి చెందిన మహిళ. ఆమె తండ్రి చార్లెస్ వీలర్ బీబీసీ ఢిల్లీ కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆయన రెండో భార్య దీప్ సింగ్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సరొగోధకు చెందినవారు. దేశ విభజన తర్వాత వారి కుటుంబం భారత్‌కు వచ్చి స్థిరపడింది. దీప్ సింగ్ మొదటి భర్త ప్రముఖ బాక్సర్ సర్ శోభాసింగ్ కుమారుల్లో ఒకరైన దల్జీత్. దల్జీత్ ప్రముఖ రచయిత కుష్వంత్ సింగ్ సోదరుడు. బోరిస్ జాన్సన్, మరీనా దంపతులు భారత్‌కు చాలా సార్లు వచ్చారు. దల్జీత్‌సింగ్ కుటుంబంతో కూడా జాన్సన్ సంబంధాలు కొనసాగించారు. 2017 ఎన్నికల సమయంలో బ్రిస్టల్‌లో గురుద్వారాలో మాట్లాడుతూ భారత్‌కు వెళ్లినప్పుడల్లా తమ బంధువులకి స్కాచ్ విస్కీ తీసుకువెళుతుండేవాడినని చెప్పి వివాదాల్లో కూడా ఇరుక్కున్నారు. -
తుది దశకు బ్రిటన్ ప్రధాని రేసు
లండన్: బ్రిటన్ ప్రధానిగా థెరిసా మే స్థానంలో కొత్త కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే ప్రక్రియ గురువారం తుది దశకు చేరుకుంది. పాకిస్తాన్ సంతతికి చెందిన హోం మంత్రి సాజిద్ జావిద్ పోటీ నుంచి నిష్క్రమించగా ఈ పదవికి రేసులో ఉన్న మాజీ విదేశాంగ శాఖ మంత్రి బోరిస్ జాన్సన్ తిరుగులేని మెజారిటీతో ముందంజలో కొనసాగుతున్నారు. రహస్య బ్యాలెట్ల తుది రౌండ్లో బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి జెరెమై హంట్‌ను పర్యావరణ శాఖ మంత్రి మైఖేల్ గోవ్ వెనక్కినెట్టడంతో ఈ రేసులో రెండో స్థానం కోసం జరుగుతున్న యుద్ధం మలుపు తిరిగింది. తాజా సమాచారం ప్రకారం జాన్సన్ 157 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా గోవ్ (61) హంట్ (59) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బ్రిటన్ సీనియర్ మోస్ట్ మంత్రి అయిన జావిద్‌కు మూడవ దశలో కేవలం 34 ఓట్లే వచ్చాయి. ఈ నేపథ్యంలో జాన్సన్, గోవ్ ప్రధాని పదవికి పోటీ పడనున్నారు. తుది ప్రక్రియలో భాగంగా వారు పలు సమావేశాల్లో ఓటర్లనుద్దేశించి ప్రసంగించాల్సి ఉంటుంది. రెండు టీవీ చర్చల్లో కూడా పాల్గొనాల్సి ఉంటుంది. జూలై 22న విజేతను ప్రకటించే అవకాశం ఉంది. -
ఆస్ట్రేలియా ప్రధానిగా స్కాట్
మెల్బోర్న్: లిబరల్ పార్టీకి చెందిన స్కాట్ మోరిసన్ (50) ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా శుక్రవారం ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రధాని మాల్కం టర్న్‌బుల్‌కు వ్యతిరేకంగా రాజకీయ తిరుగుబాటు రావడంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. మాజీ హోం మంత్రి పీటర్ డ్యుటన్పై రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్న మోరిసన్ 45–40 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆస్ట్రేలియా ప్రధానిగా మోరిసన్‌తో గవర్నర్ జనరల్ కాస్గ్రోవ్ ప్రమాణం చేయించారు. తనను ప్రధాని పదవి నుంచి దించేందుకు చాలా కాలం నుంచి కుట్రలు జరుగుతూ వచ్చాయని పదవీచ్యుత ప్రధాని టర్న్‌బుల్ అన్నారు. ప్రధాని పదవి నుంచి తప్పుకొని కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా లిబరల్ పార్టీ చట్టసభ సభ్యులు డిమాండ్ చేయడంతో టర్న్‌బుల్ పదవి నుంచి తప్పుకొన్నారు. ఆ బిల్లుతో బయటపడ్డ విభేదాలు.. విద్యుత్ బిల్లుల తగ్గింపు, ఉద్గారాల తగ్గింపు ప్రతిపాదనల్ని ప్రధాని టర్న్‌బుల్ ప్రకటించడంతో పార్టీలోని విభేదాలు గతవారం ఒక్కసారిగా బయటపడ్డాయి. టర్న్‌బుల్ 2015లో అధికారంలోకి వచ్చారు. ఎన్నికలు 2019 మేలో జరగాల్సి ఉండగా ప్రభుత్వంలో ఆయనపై వ్యతిరేకత కారణంగా టర్న్‌బుల్ తప్పుకున్నారు. ఆస్ట్రేలియాలో పదేళ్లలో ఆరుగురు ప్రధాన మంత్రులు మారడం విశేషం. గత దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా రాజకీయాల్లో ప్రత్యర్థుల తిరుబాట్లతో ప్రధానమంత్రులు మారుతూ వస్తున్నారు. ఏ ప్రధాని కూడా వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేయలేదు. -
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా బిల్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ కొత్త ప్రధాన మంత్రిగా బిల్ ఇంగ్లిష్(54) ప్రమాణం చేశారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న జాన్ కీ గతవారమే రాజీనామా చేయడం తెలిసిందే. సోమవారం జరిగిన సమావేశంలో నేషనల్ పార్టీ సభ్యులు ఇంగ్లిష్‌ను ఏకగ్రీవంగా ప్రధానిగా ఎన్నుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఇంగ్లిష్ వెల్లింగ్టన్లోని ‘గవర్నమెంట్ హౌస్’కు చేరుకుని ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఒకప్పుడు వ్యవసాయం చేసిన ఇంగ్లిష్ 1990 నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉంటున్నారు. -
మోడీ ప్రధాని అయితే ఆటోమేటిగ్గా అమెరికా వీసా!
ప్రధానమంత్రిగా ఎన్నికైతే నరేంద్ర మోడీకి ఆటోమేటిగ్గా అమెరికా వీసా వచ్చేస్తుందా? దాదాపుగా అవుననే అంటున్నాయి అమెరికా వర్గాలు. భారతీయులు ఎవరిని ప్రధానిగా ఎంచుకున్నా వాళ్లతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ తెలిపారు. కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) ఇటీవల విడుదల చేసిన ఓ మెమోలో మోడీకి ఆటోమేటిగ్గా వీసా వస్తుందన్న విషయం ఉంది. అయితే ఆ మెమో గురించి మాత్రం తనకు ఇంకా తెలియదని, కానీ ప్రధాని ఎవరైనా కూడా భారతదేశంతో సత్సంబంధాలు కొనసాగించాలన్నదే తమ ఉద్దేశమని మేరీ హార్ఫ్ అన్నారు. దేశాన్ని ఎవరు నడిపించాలో భారతీయులే నిర్ణయించుకుంటారని, వాళ్లు ఎవరిని నిర్ణయించినా ఆ నాయకుడితో కలిసి తాము ముందుకెళ్తామని ఆమె చెప్పారు. ఒకవేళ మోడీ ప్రధాని అయితే, ఆయనకు ఎ-1 (దౌత్యపరమైన) వీసా దానంతట అదే వచ్చేస్తుందని, ఆయన ఏ ఉద్దేశంతో పర్యటన చేసినా వీసా అదే వచ్చేస్తుందని సీఆర్ఎస్ ఇమ్మిగ్రేషన్ విధాన నిపుణుడు రూత్ ఎలెన్ వసీం తెలిపారు. నరేంద్రమోడీపై ఇంతకుముందున్న అభియోగాలేవీ ఎ-1 వీసాకు అడ్డం కాబోవని ఆయన అన్నారు. భారతదేశంలో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ రాజీనామాతో భారత అమెరికా సంబంధాలకు ఎలాంటి లింకు అవసరం లేదని మార్ఫ్ స్పష్టం చేశారు. పావెల్ ఇప్పటికే 37 ఏళ్ల పాటు సేవలు అందించారని, ఇక పదవీ విరమణ చేయాలనుకోవడం సహజమేనని చెప్పారు.