ప్యారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇ మ్మానుయేల్ మాక్రాన్ శుక్ర వారం అధికార కూటమికి చెందిన నేత ఫ్రాంకోయిస్ బైరూ పేరు(73)ను ప్రధానమంత్రి పదవికి ప్రతిపాదించారు. గత వారం నేషనల్ అసెంబ్లీ పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో ఓడిపోవడంతో మైకేల్ బెర్నియర్ ప్రభుత్వం గద్దె దిగడం తెలిసిందే.
ఫ్రాన్సు రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న బైరూ అందరికీ తెలిసిన వ్యక్తి. పార్లమెంట్‌లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో తలెత్తిన అస్థిర పరిస్థితులను చక్కదిద్దే సత్తా బైరూకు ఉందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment