
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రిగా షహబాజ్ షరీఫ్(72) రెండోసారి ప్రమాణం చేశారు. అధ్యక్షభవనంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ ఆయనతో ప్రమాణం చేయించారు.
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, పంజాబ్ సీఎం మరియం నవాజ్, సింధ్ సీఎం మురాద్ అలీ షాతోపాటు ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. గతంలో, 2022 ఏప్రిల్–2023 ఆగస్ట్ వరకు పార్లమెంట్ రద్దు కాకముందు షహబాజ్ దేశ ప్రధానిగా పనిచేశారు. ఆదివారం పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో షహబాజ్ సునాయాసంగా మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే.