బ్యాంకాక్: థాయిలాండ్ నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తమ అభ్యర్థిగా నాయకురాలు పేటోంగ్‌టార్న్ షినవత్ర పేరును నామినేట్ చేసింది. కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పత్రికా సమావేశంలో ఫ్యూ థాయ్ ప్రకటించింది.
శుక్రవారం జరగబోయే పార్లమెంటరీ ఓటింగ్‌లో ఆమె గెలిస్తే షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్‌టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో పేటోంగ్‌టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర దేశ ప్రధాన మంత్రులుగా చేశారు. పేటోంగ్‌టార్న్‌ను ఏకగ్రీవంగా నామినేట్ చేశామని ప్యూ పార్టీ ప్రధాన కార్యదర్శి సొరవాంగ్ థియేన్‌థాంగ్ చెప్పారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి థాయిలాండ్ రాజ్యాంగ ధర్మాసనం తప్పించడం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment