Parliamentary
-
విజయనగరం: నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్
Updatesవిజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయిందిఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామన్న కలెక్టర్మా దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదు. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించిన బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య.ఈసీ,జిల్లా అధికారుల తీరుపై మరింత బలపడిన అనుమానాలు.ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను తప్పు దారి పట్టిస్తున్న జిల్లా యంత్రాంగం.కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుండి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్మాక్ పోలింగ్‌కు అంగీకరించని వైఎస్సార్సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టుజిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చిన ఆర్డీవో సూర్యకళవెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రారంభం అయింది. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ వెరిఫికేషన్ ప్రారంభించారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ హాజరయ్యారు.నెల్లిమర్ల నియోజకవర్గం కొండ గుంపాం, బొబ్బిలి నియోజక వర్గం కోమటపల్లి ఈవీఎంలు అభ్యర్థుల సమక్షంలో వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బాటరీ స్టేటస్‌పై వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రీ వెరిఫికేషన్‌ను చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.ఈవీఎం బ్యాటరీల్లో గోల్ మాల్ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయింది. గజపతినగరం బూత్ నంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. పోలింగ్ నాడు 50 శాతం.. కౌంటింగ్ నాడు 99 శాతం ఛార్జింగ్ కనిపించింది. 84 రోజుల తరువాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99 శాతం చార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించలేదు.దత్తిరాజేరు మండలంలోని పెదకాడ ఈవీఎంని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ చేశారు. వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 80 శాతానికి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీ ప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరచిన తాళాలను అధికారులు పోగొట్టారు. మూడు గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజీని అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం. చదవండి: ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ? -
థాయ్‌లాండ్ ప్రధానిగా పేటోంగ్టార్న్ ఖరారు!
బ్యాంకాక్: థాయిలాండ్ నూతన ప్రధాని ఎన్నిక కోసం పార్లమెంటరీ ఓటింగ్‌లో అధికార ఫ్యూ థాయ్ పార్టీ తమ అభ్యర్థిగా నాయకురాలు పేటోంగ్టార్న్ షినవత్ర పేరును నామినేట్ చేసింది. కూటమి పార్టీలతో కలిసి ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం పత్రికా సమావేశంలో ఫ్యూ థాయ్ ప్రకటించింది. శుక్రవారం జరగబోయే పార్లమెంటరీ ఓటింగ్‌లో ఆమె గెలిస్తే షినవత్ర కుటుంబం నుంచి ప్రధానమంత్రి అవుతున్న మూడో వ్యక్తిగా పేటోంగ్టార్న్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో పేటోంగ్టార్న్ తండ్రి తక్షిన్ షినవత్ర, మేనత్త ఇంగ్లక్ షినవత్ర దేశ ప్రధాన మంత్రులుగా చేశారు. పేటోంగ్టార్న్ను ఏకగ్రీవంగా నామినేట్ చేశామని ప్యూ పార్టీ ప్రధాన కార్యదర్శి సొరవాంగ్ థియేన్థాంగ్ చెప్పారు. నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రధాని స్రెట్టా థావిసిన్‌ను ఆ పదవి నుంచి థాయిలాండ్ రాజ్యాంగ ధర్మాసనం తప్పించడం విదితమే. -
కొనసాగుతున్న భేటీ ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
-
రేపు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్వహించనున్నారు.ఈ మేరకు పార్టీ ఎంపీలకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం సమాచారం అందించింది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు -
కల్లోలాలు మంచివి కావు
న్యూఢిల్లీ: ఘర్షణలు, కల్లోలాలు ఏ పక్షానికీ మంచి చేయబోవని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలకు విచి్ఛన్న ప్రపంచం పరిష్కారాలు చూపజాలదన్నారు. ఇది శాంతి, సౌభ్రాతృత్వాలు నెలకొనాల్సిన సమయమని అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు నానాటికీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శుక్రవారం ఇక్కడ మొదలైన జీ20 పార్లమెంటరీ స్పీకర్ల 9వ సదస్సు ప్రారంభ సెషన్‌ను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రపంచంలో పలు చోట్ల ప్రస్తుతం ఏం జరుగుతోందో మనందరికీ తెలుసు. కలసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయమిది’’ అని పిలుపునిచ్చారు. ఇజ్రాయెల్, హమాస్ పోరుకు తక్షణం తెరపడాల్సిన అవసరం చాలా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసంతో మానవ విలువలకు పెద్ద పీట వేయడమే ఇందుకు మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదమే మార్గం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఉగ్రవాద భూతంపై అంతర్జాతీయ సమాజం ఉక్కుపాదం మోపడమే ఏకైక మార్గమని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘భారత్ దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. మా దేశంలో వేలాదిగా అమాయకులను బలి తీసుకుంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే మానవత్వానికి మాయని మచ్చ‘ అని పునరుద్ఘాటించారు. ఇంత జరిగినా ఉగ్రవాదాన్ని నిర్వచించే అంశం మీద కూడా ఇప్పటికీ అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయానికి రాలేకపోవడం శోచనీయమన్నారు. మహిళా భాగస్వామ్యానికి ప్రోత్సాహం భారత్‌లో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం కల్పిస్తున్నట్టు మోదీ తెలిపారు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో సగం మేరకు వాళ్లే ఉన్నట్టు పార్లమెంటుల స్పీకర్లకు వివరించారు. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ ఇటీవలే పార్లమెంటులో చట్టం కూడా చేసినట్టు చెప్పారు. ‘నేడు భారత్ ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యంతో కళకళలాడుతోంది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మహిళల చురుకైన పాత్ర దేశ ప్రగతికి చాలా కీలకం‘ అని అన్నారు. భారత్‌లో 28 భాషల్లో ఏకంగా 900కు పైగా టీవీ చానళ్లు, దాదాపు 200 భాషల్లో 33 వేలకు పైగా వార్తా పత్రికలు ఉన్నాయని వారికి వివరించారు. ప్రపంచమంతటా దేశాల నాయకత్వ స్థానంలో మహిళలు ఎక్కువగా ఉంటే బహుశా ఇన్ని యుద్ధాలు జరిగేవి కాదని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ప్రెసిడెంట్ దుతర్తే పచెకో అభిప్రాయపడ్డారు. -
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ..
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుతో సహా 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కచ్చితంగా ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు నేడు(శుక్రవారం) ప్రగతి భవన్లో సమావేశమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ (ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా పార్టీ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి వున్నదని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ, లోక్ సభల్లో ఎంపీలు లేవనెత్తాలని అధినేత సీఎం కేసీఆర్ సూచించారు. ప్రధానికి, సీఎం కేసీఆర్ లేఖ : బీసీ (ఓబీసీ) కులాలను సామాజిక విద్య ఆర్థిక రంగాల్లో దేశవ్యాప్తంగా మరింత ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం మీద ఉన్నదని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని సమావేశం విశ్లేషించింది. ముఖ్యంగా రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వారి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బీసీ (ఓబీసీ)లకు పార్లమెంటు అసెంబ్లీ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ దిశగా ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. మహిళా రిజర్వేషన్‌పై ఏకగ్రీవ తీర్మానం సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పునరుద్ఘాటించింది. మహిళల భాగస్వామ్యాన్ని రాజకీయ అధికారంలో కూడా మరింతగా పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోదీకి మహిళా రిజర్వేషన్లపై లేఖ రాశారు. చదవండి: ‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’ -
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్ష కాంగ్రెస్ దృష్టి పెట్టింది. కాంంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 18 నుంచి ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ భేటీలో చర్చిస్తారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ సోమవారం డిశ్చార్జి అయ్యారు. ఇంటికి చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సమాచారం. విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరలో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కూటమి తరఫున అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. -
పార్లమెంట్ విశ్వాసం పొందిన పాక్ పీఎం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పార్లమెంట్‌లోని దిగువసభ నేషనల్ అసెంబ్లీ విశ్వాసం పొందారు. మొత్తం 342 మంది సభ్యులకుగాను 180 మంది షరీఫ్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. షరీఫ్ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్‌కు 174 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం. పంజాబ్, ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ)కి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లును నేషనల్ అసెంబ్లీ ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమయింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరపాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది. -
అస్సాం సరే.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడు? విభజన చట్టంలో ఏం చెప్పారు?
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల పునర్విభజన షురూ అయ్యింది. కేంద్ర న్యాయశాఖ వినతి మేరకు ఎన్నికల సంఘం పునర్విభజన కసరత్తు ప్రారంభించింది. 2001 జనాభా లెక్కల ప్రకారం చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పునర్విభజన పూర్తి అయ్యేంతవరకు నూతన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లపై నిషేధం విధించింది. తన సొంత విధానాల ప్రకారం పునర్విభజన ప్రక్రియను ఈసీ చేపట్టనుంది. ఆర్టికల్ 170 కింద నియోజకవర్గాల పునర్విభజన చేయనుంది. అస్సాంలో 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. అస్సాంలో 14 లోక్‌సభ, ఏడు రాజ్యసభ, 126 అసెంబ్లీ సీట్లున్నాయి. అస్సాం సరే.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడు? విభజన చట్టంలో ఏం చెప్పారు?. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పుర్విభజనను కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పక్కనపెట్టింది? వంటి అంశాలపై ఈ క్రమంలో చర్చ నడుస్తోంది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఏపీలోని అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి, తెలంగాణ సీట్లను 119 నుంచి 153కి పెంచాలని ఉంది. ఈ ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 కింద పొందుపరిచిన నిబంధనలను లోబడి చేపట్టాలని స్పష్టం చేశారు. సెక్షన్ 26: నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కు లోబడి నూతనంగా ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఈ విధంగా ఉంటుంది ♦ఆంధ్రప్రదేశ్: 175 నుంచి 225కు ♦తెలంగాణ: 119 నుంచి 153కు ♦నోట్: 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన (సీట్ల పెంపు) ఉండదని ఇటీవలే కేంద్రం స్పష్టం చేసింది. ♦సెక్షన్ 27: నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులను ఎప్పటికప్పుడు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి గల అధికారాలు ♦సెక్షన్ 28: షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు - 1950కు సవరణ (చట్టంలోని 5వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా) ♦సెక్షన్ 29: షెడ్యూల్డ్ తెగల ఉత్తర్వు - 1950కు సవరణ(చట్టంలోని 6వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా) ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండటంపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా తన వాణిని వినిపించిన సంగతి తెలసిందే. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై త్వరగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఏపీ ప్రభుత్వం కోరింది. చదవండి: కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. -
కమలానికి ‘ఉక్కు’ భయం!
కేంద్రంలో ఏకఛత్రాధిపత్యంగా చెలాయిస్తున్న భారతీయ జనతాపార్టీకి ‘ఉక్కు’ భయం పట్టుకుంది. అధికార దాహం కోసం ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు కాకపోగా ఉన్నవాటిని కూలదోసే కుట్రలపై ఆ పార్టీ కేడర్‌ను డైలమాలో పడేసింది. తిరుపతి ఉపఎన్నికల నేపథ్యంలో పోటీకి దూరమవ్వాలని యోచిస్తోంది. ఓటమి తప్పని సీటుకు పోటీపడడం ఎందుకుని భావిస్తోంది. పోటీకి ఉత్సాహం చూపుతున్న జనసేన నెత్తిన చెయ్యి పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది. పైపై నాటకాన్ని రక్తికట్టించి తిరుపతి ప్రజల సానుభూతి పొందాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాభవం పొందే కంటే తప్పుకుని పరువు నిలుపుకోవడం ఉత్తమమని బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు చూపడం భారతీయ జనతాపార్టీ పట్ల వ్యతిరేకతకు దారితీసింది. అసలే ఏపీలో అంతంత మాత్రమే ఉన్న ఆ పార్టీకి ఉక్కు ప్రైవేటీకరణ పర్యవసానాలు మరింత నష్టాన్ని కలిగించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెల్లడైన నేపథ్యంలో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు కూడా ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పోటీ చేసేందుకు బీజేపీ ముందు చూపినంత ఆసక్తి ఇప్పుడు చూపడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆంధ్రుల హక్కు– విశాఖ ఉక్కు నినాదంతో సాధించిన ఆ పరిశ్రమ ప్రయివేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపడంపై రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. ఈ వాస్తవాన్ని పసిగట్టిన రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇప్పటి పరిస్థితుల్లో మిత్రపక్షమైన జనసేనకు తిరుపతి సీటు అప్పగించడం శ్రేయస్కరమని బీజేపీ శ్రేణులు వివరించినట్లు తెలుస్తోంది. పైగా ఐదు బలిజ సంఘాలు చంద్రగిరిలో సమావేశమై, తిరుపతి ఎంపీ సీటును జనసేనకు కేటాయించాలని, ఒకవేళ ఇవ్వకపోతే తమ సామాజికవర్గం నోటాకు ఓట్లు వేస్తామని హెచ్చరికలు జారీ చేశాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ తప్పుకుని జనసేనానికి కేటాయిస్తే ‘స్వామి కార్యం, స్వకార్యం’ రెండూ నెరవేరినట్లు ఉంటాయని అధిష్టానం వద్ద క్రియాశీలక నేతగా వ్యవహరిస్తున్న నాయకుడు వెల్లడించినట్లు సమాచారం. ఎటూ ఓటమి తప్పని సీటును పట్టుకొని వేలాడడంకంటే ఆ సీటు వదులుకొని జనసేనకు అప్పగిస్తే అన్ని విధాలుగా ఉపయోగమని పలువురు బీజేపీ నేతలు వివరిస్తున్నారు. ‘పవన్’ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది, భవిష్యత్‌లో తమ పోటీ మరోలా ఉండేదని చెప్పుకునే అవకాశం ఉంటుందని బీజేపీ జిల్లా నాయకత్వం కూడా వివరించినట్లు తెలుస్తోంది. తిరుపతి సీటు విషయమై గతంకంటే కాస్త్త భిన్నంగా బీజేపీ నుంచి సానుకూల పవనాలు వీస్తున్నట్లు జనసేన నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ అంశంగా వారు వివరిస్తున్నారు. తప్పించుకోవడమే ఉత్తమం టీడీపీకి కరుడుగట్టిన కుప్పం లాంటి ప్రాంతంలోనే నాటి ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్సీపీ గణనీయమైన మెజారిటీ సాధించింది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలన, ప్రజల ముంగిటకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన నేపథ్యంలో ప్రజలు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. తిరుపతి కేంద్రంగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ నీరుగారిపోయింది. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ వ్యవహారం తెరపైకి వచ్చింది. పైగా తిరుపతి పార్లమెంటు పరిధిలో అన్ని అసెంబ్లీలు వైఎస్సార్సీపీ ఖాతాలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పోటీ చేసి ఘోర పరాభవం పొందేకంటే తప్పుకొని పరువు నిలుపుకోవడం ఉత్తమమని ఆపార్టీలోని క్రియాశీలక నేత ఒకరు వెల్లడించారు. చదవండి: చేతులెత్తేసిన టీడీపీ: పోటీ పడలేం బాబూ..! ఒక ఒరలో ఇమడని 'కొడవళ్లు' -
నేడు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
-
సంయుక్త పార్లమెంటరీ కమిటీకి విజయసాయిరెడ్డి ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ: లాభదాయక పదవులఅంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రాజ్యసభ నుంచి ఐదుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, బీజేపీ ఎంపీ మహేష్ పోద్దార్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డోలా సేన్, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ఎన్నికైన వారిలో ఉన్నారు. కాగా, ఈ కమిటీకి ఇప్పటికే లోక్‌సభ నుంచి 10 మంది సభ్యులు ఎన్నికయ్యారు. -
పార్లమెంట్ ప్రాంఘణంలో విపక్షల ఆందోళన
-
ఆప్‌ను బలిపశువు చేస్తున్నారు
న్యూఢిల్లీ: పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం అంశంలో తమను బలిపశువును చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఒకవేళ తమ ఎమ్మెల్యేల్ని అనర్హుల్ని చేసినా ఎన్నికలకు భయపడేది లేదని స్పష్టం చేసింది. ఆప్‌కు చెందిన 20 మంది ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని శుక్రవారం రాష్ట్రపతికి ఎన్నికల కమిషన్ (ఈసీ) సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 13, 2015 నుంచి సెప్టెంబర్ 8, 2016 వరకూ ఆ ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవుల్లో ఉన్నారని ఈసీ తన నివేదికలో పేర్కొంది. దీనిపై ఆప్ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు గోపాల్ రాయ్ స్పందిస్తూ.. రాష్ట్రపతికి సిఫార్సుల్ని పంపేముందు ఈసీ తమను సంప్రదించలేదని తప్పుపట్టారు. ‘ఇది అప్రజాస్వామిక చర్య. ఢిల్లీ ప్రజలు, ప్రభుత్వం, ఢిల్లీ ముఖ్యమంత్రిపై వారు కక్ష తీర్చుకుంటున్నారు’ అని విమర్శించారు. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, రాజస్తాన్ రాష్ట్రాల్లో కూడా పార్లమెంటరీ కార్యదర్శుల్ని నియమించారని, మరి ఆప్నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ప్రశ్నించారు. ‘ద్వంద్వ ప్రమాణాల్ని పాటిస్తున్నారు. అందరికీ రాజ్యాంగ నిబంధనలు వర్తించవా? మమ్మల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. బ్రిటిష్ పాలన కంటే ఇది దారుణంగా ఉంది’ అని అన్నారు. న్యాయం కోసం అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థల్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ‘వారు లాభదాయక పదవుల గురించి మాట్లాడుతున్నారు. అయితే ఏ పార్లమెంటరీ కార్యదర్శికి ఢిల్లీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు’ అని వివరణ ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికలకు భయపడదని, తమ తలరాతను ఢిల్లీ ప్రజలు నిర్ణయిస్తారని రాయ్ పేర్కొన్నారు. ఈ అంశం కేవలం పార్లమెంటరీ కార్యదర్శులకు సంబంధించిందే కాదని.. ప్రజాస్వామ్య సంస్థల విశ్వసనీయతకు కూడా సంబంధించినదని, అవి రాజీపడుతున్నాయని ఆరోపించారు. 20 మంది ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాల్ని చెప్పేందుకు రాష్ట్రపతిని సమయం కోరారని ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు. అనర్హత వెనుక యువ న్యాయవాది చొరవ.. ఒక్కోసారి చిన్న విషయాలే ఆ తర్వాత పెను ప్రభావాన్ని చూపుతాయి. ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత సిఫార్సుల వెనుక కూడా అలాంటి కారణమే దాగుంది. అప్పుడే న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన ప్రశాంత్ పటేల్(30) 2015 జూలైలో ఆప్ నిర్ణయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. యూపీలోని ఫతేపూర్ జిల్లాకు చెందిన అతను ఎంబీఏ పూర్తి చేశాక సామాజిక సేవపై ఆసక్తితో న్యాయ విద్యను అభ్యసించారు. ఆప్ ఎమ్మెల్యేలపై ఫిర్యాదు వెనుక ఢిల్లీ అసెంబ్లీ మాజీ కార్యదర్శి ఎస్కే శర్మ రాసిన పుçస్తకం ప్రోత్సాహం ఉందని ప్రశాంత్ వెల్లడించారు. -
రేపు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
-
‘ఎగ్జిట్ పోల్’ అంటే?...
విశ్వాస తీర్మానం: రాజ్యాంగంలో, పార్లమెంటరీ నియమ నిబంధనల్లో ఎక్కడా దీని గురించి ప్రస్తావించలేదు. కొన్ని కారణాల వల్ల అధికార పార్టీ మెజారిటీ కోల్పోతే.. మెజారిటీని నిరూపించుకో వాల్సిందిగా ప్రధానమంత్రిని రాష్ట్రపతి కోరతారు. అప్పుడు మంత్రిమండలిపై విశ్వాసం ప్రకటించాల్సిందిగా ప్రధాని సభను కోరతారు. మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది విశ్వాసం ప్రకటిస్తే ప్రభుత్వం నిలబడుతుంది. మొదటిసారి లోక్‌సభలో విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్న ప్రధాని చౌదరి చరణ్‌సింగ్. అయితే తీర్మానం ఓటింగ్‌కి రాకముందే ఆయన రాజీనామా చేశారు. 16వ లోక్‌సభ వరకు విశ్వాస తీర్మానాలను 12 సార్లు ప్రవేశపెట్టారు. అందులో మూడు మాత్రమే నెగ్గాయి. విశ్వాస తీర్మానం ద్వారా అధికారం కోల్పోయిన మొదటి ప్రధాని వి.పి.సింగ్ (1990) కాగా, రెండో ప్రధాని దేవెగౌడ (1997), మూడో ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. అభిశంసన తీర్మానం: ఈ తీర్మానాన్ని ఉభయ సభల్లో ఎందులోనైనా ప్రవేశపెట్టవచ్చు. దీన్ని కేవలం ఒక మంత్రి లేదా మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టవచ్చు. నిర్దిష్ట అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. మంత్రులపై తీవ్ర అభియోగాలు వచ్చినçప్పుడు, బాధ్యతల పట్ల ఉదాసీనంగా వ్యవహరించినప్పుడు వారిని హెచ్చరించేందుకు ఈ తీర్మానాన్ని ఉపయోగిస్తారు. దీనికి సంబంధించి ప్రత్యేక నియమావళి లేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్: ఇది ఒక అసాధారణ పద్ధతి. స్పీకర్ దీన్ని అనుమతించిన పక్షంలో అప్పటి వరకు జరుగుతున్న సభా కార్యక్రమాలన్నింటినీ పక్కనపెట్టి సంబంధిత అంశాన్ని చర్చిస్తారు. ఇంకా పేర్కొన ని తీర్మానం: సభాధ్యక్షుడి అనుమతి పొందిన తీర్మాన ప్రవేశానికి ఒక నిర్దిష్ట సమయం కేటాయించకుంటే.. దాన్ని ‘ఇంకా పేర్కొనని తీర్మానం’ అంటారు. రూల్ 377 కింద ప్రస్తావన (లేదా) ప్రత్యేక ప్రస్తావన: ఏవైనా అంశాలను మిగిలిన ప్రక్రియల ద్వారా సభలో ప్రస్తావించేందుకు వీలు కానప్పుడు వాటిని రూల్ 377 కింద సభ దృష్టికి తీసుకురావచ్చు. రాజ్యసభలో ఈ విధానాన్ని స్పెషల్ మెన్షన్ అంటారు. దీని కోసం సభ సెక్రటరీ జనరల్‌ను లిఖితపూర్వకంగా అభ్యర్థించాలి. లేమ్ డక్ సెషన్: లోక్‌సభకు ఎన్నికలు జరిగిన తర్వాత, రద్దయిన లోక్‌సభలో సభ్యులుగా ఉండి.. ప్రస్తుత లోక్‌సభకు ఎన్నికకాని సభ్యులు, కొత్తగా ఎన్నికైన సభ్యులతో కలిపి చిట్టచివర ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. దీన్నే లేమ్ డక్ సెషన్ అంటారు. ఇది భారతదేశంలో అమల్లో లేదు. ఫిలిబస్టరింగ్: శాసనసభ కార్యక్రమాలు జరగకుండా, అలాగే ఒక బిల్లు ఆమోదం పొందకుండా చేసేందుకు సభ్యులు ఉద్దేశపూర్వకంగా దీర్ఘకాలిక ఉపన్యాసం, ఇతరత్రా చర్యలకు దిగి నిర్ణీత గడువు ముగిసేలా చేస్తుంటారు. దీన్నే ఫిలిబస్టరింగ్ అంటారు. గెర్రిమాండరిం : ఒక అభ్యర్థి తన విజయావకాశాలను మెరుగుపర్చుకునేలా నియోజకవర్గ సరిహద్దులను మార్చే పద్ధతిని గెర్రిమాండరింగ్ అంటారు. గ్యాలప్ పోల్ : అమెరికాకు చెందిన హెన్రీ గ్యాలప్ అనే ఎన్నికల విశ్లేషకుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. అందువల్ల దీన్ని గ్యాలప్పోల్ అంటారు. ఇది ఎన్నికలకుæ ముందు నిర్వహించే సర్వే లాంటిది. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే అంశాలను, రాబోయే ఎన్నికల ఫలితాలను గ్యాలప్పోల్ ద్వారా అంచనా వేయొచ్చు. ఎగ్జిట్‌పోల్: ఎన్నికల సమయంలో ఓటు వేసినవారి అభిప్రాయాన్ని తెలుసుకునే పద్ధతిని ఎగ్జిట్‌పోల్ అంటారు. తద్వారా ఎన్నికల ఫలితాలను అంచనా వేయొచ్చు. ఫ్లోర్ క్రాసింగ్: ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడాన్ని ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. కార్పెట్ క్రాసింగ్: అధికార పక్షానికి చెందిన సభ్యులు ప్రతిపక్ష పార్టీలోకి మారడాన్ని కార్పెట్ క్రాసింగ్ అంటారు. ప్రతిపాదనలు: సభ దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చేందుకు ఎంచుకునే ప్రక్రియనే ప్రతిపాదన అంటారు. సభ అభిప్రాయం కోరడం దీని ముఖ్య ఉద్దేశం.భారతదేశంలో మూడు రకాల ప్రతిపాదనలున్నాయి. నిర్దిష్ట ప్రతిపాదనలు: ఇదొక నిర్దిష్ట, స్వచ్ఛంద ప్రతిపాదన. సభ నిర్ణయం తీసుకోవడానికి అనుకూలంగా దీన్ని ప్రతిపాదిస్తారు. ఇందులో మరొక ప్రతిపాదన ఉండదు. ఉదా: వాయిదా, అవిశ్వాస తీర్మానాలు. ప్రత్యామ్నాయ ప్రతిపాదన: మార్పు చెందిన విధానాలు, పరిస్థితులకు సంబంధించి అసలు ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా చేసే ప్రతిపాదన. ఇది ఆమోదం పొందితే దీన్ని అసలు ప్రతిపాదనగానే పరిగణిస్తారు. సహాయ ప్రతిపాదన: ఇంతకు ముందు ప్రవేశపెట్టిన ప్రతిపాదన స్థితిగతులను విచారించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అసలు ప్రతిపాదనతోపాటు సహాయ ప్రతిపాదనపై కూడా చర్చ జరుగుతుంది. కానీ, ఓటింగ్ మాత్రం సహాయక ప్రతిపాదనపైనే ఉంటుంది. దీన్ని మూడు ఉప ప్రతిపాదనలుగా విభజించవచ్చు. ఆనుషంగిక ప్రతిపాదన: వివిధ రకాల సభా వ్యవహారాలను కొనసాగించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. ఉదా: బిల్లులను నిర్దేశిత కమిటీ లేదా సంయుక్త కమిటీ పరిశీలనకు పంపడం. అధిక్రమణ ప్రతిపాదన: ఏదైనా ఒక విషయాన్ని అక్కడితో వదిలివేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. సంబంధిత అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు దీన్ని ప్రతిపాదిస్తారు. స్పాయిల్ సిస్టం: ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా మార్చుకునే పద్ధతి. ఇది అమెరికాలో పాక్షికంగా అమల్లో ఉంది. అమెరికా నూతన అధ్యక్షుడు తన అధికార నివాసమైన వైట్‌హౌస్‌లో పని చేసే ఉద్యోగులను తన విచక్షణ మేరకు నియమించుకోవచ్చు. సాధారణంగా గత ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులను తొలగిస్తారు. తీర్మానాలు: సభ దృష్టిని ్రçపజాసంబంధ వ్యవహారాలవైపు మళ్లించేందుకు ఉన్న అనేక విధానాల్లో ఇదొకటి. నిజానికి ఇది ఒక నిర్ధారిత ప్రతిపాదన. కానీ, తీర్మానం ఒక అభిప్రాయం లేదా సూచన రూపంలో ఉంటుంది. వీటిని వ్యక్తిగత, ప్రభుత్వ, రాజ్యాంగ తీర్మానాలుగా వర్గీకరించవచ్చు. హంగ్ పార్లమెంట్: లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని పరిస్థితిని హంగ్ పార్లమెంట్ అంటారు. ఇప్పటి వరకు 7 హంగ్ పార్లమెంట్లు ఏర్పడ్డాయి. (1989, 1991, 1996, 1998, 1999, 2004, 2009) ఆపద్ధర్మ ప్రభుత్వం: అధికారంలో ఉన్న ప్రభుత్వం వైదొలిగినప్పుడు.. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడే వరకు పాలనా బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా ఆ ప్రభుత్వమే అధికారంలో కొనసాగాల్సిందిగా రాష్ట్రపతి లేదా గవర్నర్ కోరతారు. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎలాంటి ఏర్పాటు లేదు. అయితే ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు: పార్లమెంట్లో వివిధ అంశాలపై చక్కగా మాట్లాడినవారికి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నియోజకవర్గ ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన వారికి, గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన సభ్యులకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందిస్తారు. 1993 నుంచి ఏటా ఒక పార్లమెంట్ సభ్యుడికి ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు. దీన్ని ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ఏర్పాటు చేసింది. ఈ పురస్కారాల కమిటీకి చైర్మన్‌గా స్పీకర్ వ్యవహరిస్తారు. మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును 1993లో ఇంద్రజిత్ గుప్తాకు ఇచ్చారు. యూత్ పార్లమెంట్: ప్రజాస్వామ్య పద్ధతులు, పార్లమెంట్ విధానాలను కొత్త తరాలకు తెలియజేసేం దుకు ఈ కార్యక్రమాన్ని నాలుగో అఖిల భారత విప్ సమావేశ సూచన మేరకు ప్రారంభించారు. సంకీర్ణ ప్రభుత్వం: రెండు లేదా అంతకంటే ఎక్కువ రాజకీయ పార్టీలు కలిసి కేంద్ర లేదా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసే ప్రభుత్వాన్ని సంకీర్ణ ప్రభుత్వం అంటారు. భారతదేశంలో మొదటిసారి కేరళలో 1967లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. విప్: అంటే ఆదేశం లేదా అధిపతి అని అర్థం. దీని గురించి రాజ్యాంగం, పార్లమెంటరీ నియమ నిబంధనల్లో ఎక్కడా పేర్కొనలేదు. రాజకీయ పార్టీలు తమ శాసనసభ్యులను నియంత్రించేందుకు, అలాగే సభలో పార్టీ సభా నాయకుడికి సహాయపడేందుకు వీరిని నియమిస్తాయి. పార్టీ విప్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా సంబంధిత పార్టీకి చెందిన శాసన సభ్యులు ప్రవర్తించాలి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలో దీని గురించి ప్రస్తావించారు. పార్టీ విప్‌నకు వ్యతిరేకంగా ఓటు వేసినవారు తమ శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. బి. కృష్ణారెడ్డి, డైరెక్టర్, క్లాస్–వన్ స్టడీ సర్కిల్ -
నిర్బంధ ఓటింగ్ ఆచరణలో అసాధ్యం
న్యూఢిల్లీ: నిర్బంధ ఓటింగ్ ఆలోచన ఆచరణలో అసాధ్యమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ స్పష్టం చేశారు. బుధవారమిక్కడ ఓ సదస్సులో నసీం జైదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొన్ని దేశాల్లో అమలవుతున్న తప్పనిసరి ఓటింగ్ విధానం చర్చకు తావిస్తోందని, కానీ ఇది ఆచరణలో అసాధ్యమని గుర్తించినట్లు తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విషయంపై ప్రశ్నించగా, జైదీ స్పందిస్తూ.. దీనికి సంబంధించి చట్ట సవరణకు అన్ని రాజకీయపార్టీలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తేనే ఇది సాధ్యమవుతుందని పార్లమెంటరీ కమిటీతో పాటు న్యాయ మంత్రిత్వ శాఖకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇదిలాఉండగా ఈ ప్రతిపాదనను సమర్థిస్తామని, ఇందుకు రూ.9 వేల కోట్ల వ్యయమవుతుందని మే నెలలో న్యాయ మంత్రిత్వ శాఖకు ఎన్నికల కమిషన్ సమాధానమిచ్చింది. అలాగే పెద్ద సంఖ్యలో ఈవీఎంలు కొనాల్సి ఉంటుందని పేర్కొంది. -
ఎంపీ ఎస్పీవై రెడ్డి అనర్హతపై విచారణ
-
రాజీనామా చేయాల్సిందే.. వాళ్లు చేయరు!
న్యూఢిల్లీ: అధికార, విపక్షాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం రసాభాసగానే ముగిసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రతిష్టంభన నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఇరుపక్షాలు ఎవరి ధోరణిని వారు కొనసాగించడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. మంత్రులు రాజీనామా చేయాలని విపక్షం, చేస ప్రసక్తే లేదని కేంద్రం ఎవరి పట్టు మీద వాళ్లున్నారు. దీంతో ఎలాంటి దిశా నిర్దేశం లేకుండానే సమావేశం ముగిసింది. కేంద్రమంత్రులు, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామాలపై విపక్షాలు పట్టుబట్టాయి. సుష్మ, రాజే, చౌహాన్ రాజీనామా చేయాల్సిందేనని, అప్పటి వరకు చర్చలు జరిగేది లేదని విపక్షం గట్టిగా వాదించింది. విపక్షాలు డిమాండ్లను తోచ్చిపుచ్చిన కేంద్రం.. వాళ్లెవరూ రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో వివాదం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు మరింత సన్నగిల్లాయి. అయితే ప్రధాని సభలో సమాధానం చెబుతారని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి విపక్షాలు ససేమిరా అన్నాయి. వ్యాపం, లలిత్ గేట్ వివాదాలతో గత వారం రోజులుగా పార్లమెంటు అట్టుడుకుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధరా రాజె రాజీనామా చేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నాయి. నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో హోరెత్తిస్తున్నాయి. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని కోరుతున్నాయి. మరోవైపు లలిత్ మోదీ వీసా విషయంలో బ్రిటిష్ గవర్నమెంటుకు తానెప్పుడూ సిఫారసు చేయలేదని సుష్మాస్వరాజ్ ఈ రోజు రాజ్యసభలో ప్రకటించారు. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. సుష్మా ప్రకటనను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సభలో మంత్రి ప్రకటన చేయడాన్ని ఆమె తప్పుబట్టారు. దీంతో అటు రాజ్యసభ, ఇటు లోక్‌సభ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. అఖిలపక్షం ముగిసిన తర్వాత పార్లమెంటు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇరు సభల్లోనూ విపక్ష సభ్యుల నిరసనల హోరు కొనసాగుతోంది. -
టీ-సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
-
పేదలకే సబ్సిడీలు చేరేలా కొత్త వ్యవస్థ
న్యూఢిల్లీ: అర్హులైన పేదలకు మాత్రమే చేరేలా సబ్సిడీల పంపిణీకి కొత్త వ్యవస్థను ఏర్పాటుచేయాలని ఆర్థిక వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సబ్సిడీలను ఎక్కువగా ధనిక, సంపన్నవర్గాలే వినియోగించుకుంటున్నాయని, అర్హులైన పేదలకు అవి అందడంలేదని సోమవారం పార్లమెంటుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. కాలం చెల్లిన సినిమాటోగ్రాఫ్ చట్టం స్థానంలో కొత్త చట్టం అవసరమని సమాచార శాఖ స్థాయీ సంఘం సూచించింది. వైమానిక దళ సామర్థ్యం 42 యుద్ధవిమాన విభాగాలనుంచి 25 విభాగాలకు తగ్గడం సమంజసం కాదని, యుద్ధవిమానాల విభాగాలు 45కు పెరగవలసిన అవసరం ఉందని రక్షణ శాఖపై స్థాయీ సంఘం అభిప్రాయపడింది. వరద బాధిత జమ్మూ కశ్మీర్ పునర్నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను, పథకాన్ని కేంద్రం, కశ్మీర్ ప్రభుత్వం తయారు చేయాలని హోం మంత్రిత్వ వ్యవహారాలపై స్థాయీ సంఘం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. -
పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయ మంత్రి హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా నియమించనున్న పార్లమెంటరీ కార్యదర్శులకు సహాయ మంత్రి హోదా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చే సింది. చట్టసభల్లోని సభ్యులు మాత్రమే పార్లమెంటరీ కార్యదర్శులుగా నియామకానికి అర్హులని స్పష్టంచేసింది. అవసరమైనపుడు సీఎం వీరికి ఏ బాధ్యతనైనా అప్పగించవచ్చని తెలిపింది. పార్లమెంటరీ కార్యదర్శుల వేతన, భత్యాలతోపాటు వివిధ నిబంధనలను వివరిస్తూ ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. పార్లమెంటరీ కార్యదర్శులుగా నలుగురు ఎమ్మెల్యేల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి విదితమే. ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, జలగం వెంకట్రావు, దాస్యం వినయ్‌భాస్కర్, కోవ లక్ష్మిని ఈ పదవులకు ఎంపికచేశారు. వీరితోపాటు ఇద్దరు ఎమ్మెల్సీలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. నోటిఫికేషన్‌లోని వివరాలివీ.. పార్లమెంటరీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించే వారు విధిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. వీరికి తెలంగాణ వేతనాలు, పింఛను చెల్లింపులు, అనర్హతల తొలగింపు చట్టం-1953 ప్రకారం రాష్ట్ర మంత్రికి వర్తించే వేతన, భత్యాలు చెల్లించవచ్చు. పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన వ్యక్తి చట్టసభల్లో సభ్యుడై అక్కడ వేతన, భత్యాలు స్వీకరించినా.. కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక వచ్చే ప్రయోజనాలు కూడా పొందడానికి అర్హులు. -
బదిలీ ఫీవర్
సాక్షి, అనంతపురం : జిల్లా అధికార యంత్రాంగానికి బదిలీ ఫీవర్ పట్టుకుంది. ఈ నెలాఖరుకు బదిలీ ప్రక్రియ పూర్తి కానున్న నేపథ్యంలో ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల కోసం వాళ్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గెజిటెడ్ హోదా కలిగి కార్యాలయాల్లో తమకు తిరుగులేకుండా ఉన్న వారు కూడా బదిలీల నేపథ్యంలో బంట్రోతుల కంటే అధ్వానంగా మారిపోతున్నారు. సిఫారసు లేఖల కోసం అష్టకష్టాలు పడుతూ చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు వారి పీఏలు, వ్యక్తిగత సిబ్బంది చీదరింపులతో తల్లడిల్లిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం కలగనుంది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో పనిచేసిన అధికారులను టీడీపీ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లను భారీ స్థాయిలో బదిలీ చేసింది. కీలక పదవుల్లో ఉన్న అధికారులను కూడా కచ్చితంగా బదిలీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో బదిలీలు జరుగుతాయని భావిస్తున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బదిలీ ఈ రోజు..రేపు అంటూ ఊరిస్తుండడంతో వారికి పనిలో నిబద్ధత కూడా కరువైపోయింది. మంచి స్థానం కోసం జిల్లా అధికారులు ప్రయత్నాల్లో ఉన్నారు. రాజధానికి పరుగులు పెడుతున్నారు. ఏడాది కింద, ఎన్నికల ముందు జిల్లాకు వచ్చిన శాఖాధిపతులకు స్థాన చలనం తప్పక పోవచ్చని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇక్కడికి బదిలీపై వచ్చిన అదనపు జేసీ రామస్వామి నాయక్‌ను ఇప్పటికే బదిలీ చేసి ఆయన స్థానంలో హైదరాబాద్ సెర్ప్‌లో ల్యాండ్ అసెస్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఖాజామొహిద్దీన్‌ను అనంతపురం బదిలీ చేశారు. ఇక రవాణాశాఖ డిప్యూటీ కమినర్ ప్రసాద్‌కు స్థానం చలనం తప్పదని తెలుస్తోంది. ఇదే కోవలో మరికొంత మంది అధికారులు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లా స్థాయి పోస్టులు మినహా మిగిలిన వాటికి కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహించున్నారు. ఈ నెలాఖరుకు బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది. బదిలీపై వెళ్లనున్న జేసీ జాయింట్ కలెక్టర్(జేసీ)గా పనిచేస్తున్న సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెళ్లనున్నట్లు కలెక్టరేట్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈయన్ను తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేయించుకునేందుకు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు వద్ద సత్యనారాయణ బదిలీ ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈయన బదిలీ అయిన సమక్షంలో కర్నూలు జిల్లాలో జేసీగా పనిచేస్తన్న కన్నబాబును ఇక్కడికి తీసుకురావడానికి మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసు శాఖలో భారీ బదిలీలు : జిల్లాలో ఎనిమిది పోలీసు సబ్డివిజన్లు ఉన్నాయి. అన్ని సబ్డివిజన్ల అధికారులకూ స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం డీఎస్పీ నాగరాజ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి శైలజానాథ్ ఆశీస్సులతో పోస్టింగ్ తెచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ ద్వారా మంత్రి పరిటాల సునీతపై ఒత్తిడి తెచ్చి ఇక్కడే కొనసాగాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే సివిల్ పంచాయితీల్లో ఈయన విపరీతమైన జోక్యం చేసుకుంటున్నారని టీడీపీ శ్రేణులే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆయనను బదిలీ చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. గుంతకల్లు డీఎస్పీ రవికుమార్ అక్కడే ఉండాలని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ సిఫారసు చేసినప్పటికీ.. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాత్రం బదిలీ చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఖాసీంసాబ్ను నియమించాలని ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, కాలవ శ్రీనివాసులు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లూప్లైన్లో ఉన్న ఖాసీం సాబ్ రాజంపేటలో పనిచేసిన సమయంలో ఎర్రచందనం తరలింపు కేసులో ఇరుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆ కేసు ఇంకా పెండింగ్ ఉందని ఆయన బదిలీ వ్యవహారానికి తాత్కాలికంగా తెరపడినట్లు తెలిసింది. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు మాజీ మంత్రి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ గడిచిన ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను అక్కడే కొనసాగించాలని భావిస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈయన అనంతపురం పోస్టింగ్ కావాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం మంత్రులు పల్లె, పరిటాల సునీత, ఎమ్మెల్యే బాలక్రిష్ణ ద్వారా సిఫారసు చేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. పుట్టపర్తి డీఎస్పీ శ్రీనివాసులు స్థానంలో విశాఖలో పనిచేస్తున్న రారాజుప్రసాద్ను తీసుకురావాలని మంత్రి పల్లె ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పల్లెను ఆయన కలసి ఆశీస్సులు పొందినట్లు సమాచారం. ధర్మవరం అడిషనల్ ఎస్పీ అభిషేక్ మహంతి స్థానంలో కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న బోయ మల్లికార్జునను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కదిరి డీఎస్పీ దేవదానం స్థానంలో పీటీసీలో పనిచేస్తున్న ఏ.శ్రీనివాసులు రానున్నట్లు తెలిసింది. దీనికి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా మద్దతుపలికినట్లు తెలుస్తోంది. తాడిపత్రి డీఎస్పీ నాగరాజును అక్కడే కొనసాగించేందుకు జేసీ సోదరులు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అయితే రెడ్డి సామాజికవర్గానికి చెందిన తాడిపత్రి సీఐ సుధాకర్‌రెడ్డికి త్వరలో డీఎస్పీగా పదోన్నతి రానుండడంతో ఆయనకు తాడిపత్రిలోనే పోస్టింగ్ ఇప్పించుకోవాలని, అంత వరకు నాగరాజునే కొనసాగించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సీఐల విషయానికి వస్తే అనంతపురం టూటౌన్‌కు ప్రస్తుతం పీటీసీలో పనిచేస్తున్న కమ్మ సామాజికవర్గానికి చెందిన సాయినాథ్, త్రీటౌన్‌కు మన్సూరుద్దీన్‌కు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రూరల్ సీఐ శుభకుమార్ కూడా టూటౌన్‌ను ఆశిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ అక్కడే కొనసాగే విధంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సిఫారసు చేసినట్లు తెలిసింది. అనంతపురం త్రీటౌన్‌లో ఉన్న దేవానంద్ ఆత్మకూరుకు సర్కిల్‌కు మారనున్నట్లు తెలిసింది. అక్కడున్న విజయ్‌కుమార్‌కు త్వరలో డీఎస్పీ పదోన్నతి రానుంది. అనంతపురం రూరల్ సర్కిల్‌కు చిత్తూరు జిల్లాలో ఉన్న ఈదుర్‌బాషా వస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూలో... రెవిన్యూ బదిలీల విషయానికి వస్తే కళ్యాణదుర్గం ఆర్డీఓ మలోలా కర్నూలుకు బదిలీ కానుండగా, ఆయన స్థానంలో గతంలో ఇక్కడ ఆర్వీఎం పీఓగా పనిచేసిన రామారావుకు ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చారు. పెనుకొండ ఆర్డీఓగా రామ్మూర్తి పేరు ఖరారైనప్పటికీ వెంకటేష్ అక్కడే కొనసాగాలని ఎమ్మెల్యే బీకే పార్థసారథి ద్వారా ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. కదిరి ఆర్డీఓగా రాజశేఖర్‌నే కొనసాగించాలని మంత్రి పల్లె లేఖ ఇచ్చారు. అయితే మరికొందరు ఆయన బదిలీకి పట్టుబడుతున్నారు. ఇక మునిసిపల్ రిజినల్ డిప్యూటీ డెరైక్టర్ మురళీకృష్ణ గౌడ్‌తో సహా ఆయా మునిసిపాలిటీలలో పనిచేస్తున్న మునిసిపల్ కమిషనర్లు, ఏఈలు, డీఈలు, ఎంఈలకు స్థానం చలనం తప్పేలా ఉంది. -
ఉత్కంఠ
చావో రేవో అన్నట్లుగా ఎన్నికల్లో తలపడిన రాజకీయపార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు సభ్యునిగా గెలవడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుదామని కలలుకంటున్న నేతల తలరాతలు నేడు తేలిపోనున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ శుక్రవారం జరగనుంది. ఫలితాలపై పార్టీలతోపాటూ ప్రజల్లో సైతం ఉత్కంఠ నెలకొంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: రెండేళ్ల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయినందున రాష్ట్రంలో కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే నిర్వహిం చారు. మొత్తం 39 లోక్‌సభ, పుదుచ్చేరిలోని ఒకటి కలుపుకుని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అన్నాడీ ఎంకే, డీఎంకే, బీజేపీ కూటమి, కాంగ్రెస్, వామపక్షాలు బరిలోకి దిగాయి. అయితే ప్రధానంగా అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ కూటముల మధ్య గట్టిపోటీ నెలకొంది. వామపక్షాలతో పొత్తుకు సిద్దమైన అన్నాడీఎంకే ఆతరువాత మనసు మార్చుకుని 40 స్థానాల్లోనూ ఒంటరిగా తలపడింది. చిన్నాచితకా ప్రాంతీయ పార్టీలతో పొత్తుపెట్టుకున్న డీఎంకే మిత్రపక్షాలకు 5 సీట్లిచ్చి 35 స్థానాల్లో పోటీకి దిగింది. ఈసారి అన్నాడీఎంకే, డీఎంకేలకు స్థానంలేని బలమైన కూటమిని బీజేపీ కూడగట్టగలిగింది. రాజకీయాల్లో ఘనచరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను అన్ని పార్టీలు కాలదన్నడంతో గత్యంతరం లేక ఒంటరిపోరుకు సిద్ధపడింది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత వైఖరితో భంగపడిన వామపక్షాలు స్వల్పస్థానాల్లో పోటీపడ్డాయి. కోటలు దాటుతున్న ఆశలు అత్యధిక స్థానాలను దక్కించుకోవడం ద్వారా ప్రధాని పీఠాన్ని అధిరోహించాలని జయలలిత ఆశపడుతున్నారు. ఇతర పార్టీల కంటే ఎక్కువ స్థానాలు రావడం వరకు ఖాయమని తెలుస్తోంది. ఒకవైపు మోడీ హవా, మరోవైపు రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలతో బలమైన కూటమి తమకు అధిక స్థానాలు కట్టబెడుతుందని బీజేపీ ఆశిస్తోంది. వారి ఆశలు అడియాశలు కావడం ఖాయమని, తమదే ఆధిపత్యమని డీఎంకే చాటుకుంటోంది. ఒంటరిపోరు తమకు నూతనోత్తేజాన్ని ఇచ్చిందని, గణనీయమైన స్థానాలు ఖాయమని కాంగ్రెస్ బీరాలకు పోతోంది. ఎగ్జిట్‌పోల్స్‌కు విరుద్ధంగా ఫలితాలు ఉంటాయని వామపక్షాలు ఎదురుచూస్తున్నాయి. ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం రాష్ట్రంలోని 39 లోక్‌సభ నియోజకవర్గాలకు, ఆలందూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికపై శుక్రవారం జరగనున్న ఓట్ల లెక్కింపునకు 42 కేంద్రాలను సిద్ధం చేశారు. పుదుచ్చేరిలోని ఒక స్థానాన్ని అక్కడే లెక్కిస్తారు. లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్ వద్ద 323 నుంచి 420 మంది సాయుధ పోలీసులను బందోబస్తులో పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 62 మంది ఉన్నతాధికారులు పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్‌తో లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)ల ద్వారా సాధారణ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. తొలి రౌండ్ ఫలితాలను 10 గంటలకు ప్రకటించే అవకాశం ఉంది. లెక్కింపు కేంద్రాల్లో సెల్‌ఫోన్ నిషేధించారు. ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి పొందిన లెక్కింపు సూపర్వైజర్లు, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు, ఇతర సిబ్బంది మాత్రమే ప్రవేశానికి అర్హులని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రవీణ్‌కుమార్ గురువారం మీడియాకు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు లెక్కింపు కేంద్రాలకు వందమీటర్ల దూరంలోనే నిలిచిపోవాలని, లోనికి రాకూడదని ఆయన తెలిపారు. లెక్కింపు ప్రక్రియను మొత్తం వీడియోలో చిత్రీకరించి భద్రపరుస్తున్నట్లు ఆయన చెప్పారు. విజేతలకు ధృవీకరణ పత్రాన్ని లెక్కింపు కేంద్రంలోనే అందజేస్తామని, విజేత వెంట కేవలం నలుగురిని మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమై నిర్విరామంగా సాగుతుందని, సాయంత్రం 6 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెలువడుతాయని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆరునెలల పాటూ ఈవీఎంలలో ఓట్ల వివరాలు భద్ర పరుస్తామని తెలిపారు. లెక్కింపు దృష్ట్యా శుక్రవారం పూర్తిగా టాస్మాక్ దుకాణాలు, బార్లలో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు చెప్పారు. -
పార్టీలు ప్రజాసంస్థలు కాదు
కేంద్రం వాదనకు పార్లమెంటరీ కమిటీ సమర్థన న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు ప్రజాసంస్థలు కావని, సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం పరిధిలోకి రావని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదనలను పార్లమెంటరీ కమిటీ సమర్థించింది. ఆర్టీఐ చట్టం పరిధి నుంచి రాజకీయ పార్టీలను తప్పించడానికి, అలాగే పారదర్శకత నిబంధనల కిందకు వస్తాయన్న కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) ఆదేశాలను తిరస్కరించడానికి ఉద్దేశించిన సవరణ బిల్లుకు మద్దతు తెలిపింది. ఈ మేరకు కమిటీ నివేదికను న్యాయం, సిబ్బంది విభాగ స్థాయీసంఘం మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ‘‘పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం ద్వారా కానీ లేదా రాజ్యాంగం చేత లేదా రాజ్యాంగం నిబంధనల కింద కానీ ఏర్పాటుకాని రాజకీయ పార్టీలు ప్రజాసంస్థల కిందకు రావన్న ప్రభుత్వ వాదనతో కమిటీ ఏకీభవిస్తుంద’’ని కమిటీ చైర్మన్ శాంతారామ్ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద రిజిస్ట్రేషన్ లేదా గుర్తింపు పొందినవని మాత్రమేనని వెల్లడించారు. అలాగే ఆదాయపన్ను చట్టం-1961 కింద రాజకీయ పార్టీలు, వాటి అభ్యర్థుల ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలన్న నిబంధనపై ఆయన స్పందిస్తూ, ‘‘రాజకీయ పార్టీలను ఆర్టీఐ చట్టం కింద ప్రజాసంస్థలుగా ప్రకటిస్తే వాటి సున్నితమైన అంతర్గత పనివిధానానికి ఆటంకం కలుగుతుంది. రాజకీయ పార్టీల విధులకు భంగం కలిగించేందుకు వాటి ప్రత్యర్థులు దుర్బుద్ధితో ఆర్టీఐ చట్టంలోని నిబంధనలను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ ఈ ఆరు రాజకీయ పార్టీలను ఆర్టీఐ చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన సీఐసీ... అవి ప్రజా సమాచార అధికారులను ఆరు వారాల్లోగా నియమించుకోవాలని ఈ ఏడాది జూన్ 3న ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఏదైనా సంఘం లేదా వ్యక్తుల సంస్థ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 కింద నమోదైనా లేదా గుర్తింపు పొందినా దాన్ని ప్రజాసంస్థగా పరిగణించకూడదంటూ ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 2(హెచ్)లో వివరణను చేర్చుతూ ప్రభుత్వం సవరణ బిల్లును ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై నియమితులైన ఎంపీల కమిటీ... కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ నివేదిక ఇచ్చింది.