Updates
- విజయనగరం ఎంపీ నియోజకవర్గంలోని ఈవీఎంల రీ వెరిఫికేషన్ ప్రక్రియ
నిలిచిపోయింది - ఈవీఎం బ్యాటరీ అంశంపై డిక్లరేషన్ ఇవ్వలేమన్న జిల్లా కలెక్టర్
- ఈసీ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ చేస్తామన్న కలెక్టర్
- మా దరఖాస్తులో మాక్ పోలింగ్ కోరలేదు. కోరకుండా మాక్ పోలింగ్ చేయడం ఏమిటని ప్రశ్నించిన బెల్లాన చంద్రశేఖర్, బొత్స అప్పలనర్సయ్య.
- ఈసీ,జిల్లా అధికారుల తీరుపై మరింత బలపడిన అనుమానాలు.
- ఎన్నికల ఈవీఎంల అక్రమాలు బయటపడకుండా కుంటిసాకులు చెప్పి దరఖాస్తు చేసిన అభ్యర్ధులను తప్పు దారి పట్టిస్తున్న జిల్లా యంత్రాంగం.
- కోర్టు లేదా ఈసీ వద్ద తేల్చుకోండని వెరిఫికేషన్ కేంద్రం నుండి వెళ్లిపోయిన జిల్లా కలెక్టర్
- విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో నిలిచిపోయిన ఈవీఎంల రీ-వెరిఫికేషన్
- మాక్ పోలింగ్‌కు అంగీకరించని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్
- బ్యాటరీ స్టేటస్ మాత్రమే వెరిఫై చేయాలని చంద్రశేఖర్ పట్టు
- జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చిన ఆర్డీవో సూర్యకళ
- వెరిఫికేషన్ కేంద్రానికి చేరుకున్న జిల్లా కలెక్టర్
విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రారంభం అయింది. నెల్లిమర్ల ఈవీఎం గోడౌన్‌లో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి చెందిన 2 ఈవీఎంలను ఎన్నికల అధికారులు రీ వెరిఫికేషన్ ప్రారంభించారు. వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ హాజరయ్యారు.
నెల్లిమర్ల నియోజకవర్గం కొండ గుంపాం, బొబ్బిలి నియోజక వర్గం కోమటపల్లి ఈవీఎంలు అభ్యర్థుల సమక్షంలో వెరిఫికేషన్ చేస్తారు. ఈవీఎం బాటరీ స్టేటస్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్ర శేఖర్ అనుమానం వ్యక్తం చేశారు. బెల్లాన చంద్రశేఖర్ అభ్యర్థనతో ఈవీఎంల రీ వెరిఫికేషన్‌ను చేస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈవీఎం బ్యాటరీల్లో గోల్ మాల్
ఈవీఎం తనిఖీల్లో అడ్డంగా ఈసీ దొరికిపోయింది. గజపతినగరం బూత్ నంబర్ 20 ఈవీఎం తనిఖీల్లో లోగుట్టు బయటపడింది. పోలింగ్ నాడు 50 శాతం.. కౌంటింగ్ నాడు 99 శాతం ఛార్జింగ్ కనిపించింది. 84 రోజుల తరువాత తనిఖీ నాడు కూడా ఈవీఎం బ్యాటరీ 99 శాతం చార్జింగ్ చూపించింది. ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ ఎందుకు పెరిగిందో ఈవీఎం తయారీ ఇంజనీర్లు, ఎన్నికల అధికారులు వెల్లడించలేదు.దత్తిరాజేరు మండలంలోని పెదకాడ ఈవీఎంని అధికారులు తనిఖీ చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్య ఫిర్యాదుతో ఈవీఎం వెరిఫికేషన్ చేశారు.
వెరిఫికేషన్ కోసం ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించారు. మాక్ పోలింగ్ 9 గంటల పాటు నిర్వహిస్తే ఈవీఎం బ్యాటరీ ఛార్జింగ్ 80 శాతానికి తగ్గింది. మరి పోలింగ్ జరిగిన ఈవీఎంలో 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఎలా ఉందో అధికారులు చెప్పలేదు. ఈవీఎంలో డేటాను అధికారులు తొలగించారు. ఈవీఎం వీవీ ప్యాట్లను అధికారులు మాయం చేశారు. ఈవీఎంలో ఫ్యాన్, సైకిల్ గుర్తులు లేకుండా అధికారులు మాక్ పోలింగ్ చేపట్టారు. ఈవీఎం భద్రపరచిన తాళాలను అధికారులు పోగొట్టారు. మూడు గంటల తర్వాత స్పేర్ తాళం తెచ్చి తెరిచారు. ఈవీఎం కౌంటింగ్ హాల్ టేబుల్ సీసీ కెమెరా ఫుటేజీని అధికారులు ఇవ్వకపోవటం గమనార్హం.
చదవండి: ఈవీఎంలు ఇక్కడ.. తాళాలు ఎక్కడ?
Comments
Please login to add a commentAdd a comment