
సాక్షి, న్యూఢిల్లీ: లాభదాయక పదవులఅంశంపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రాజ్యసభ నుంచి ఐదుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, బీజేపీ ఎంపీ మహేష్ పోద్దార్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డోలా సేన్, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర ఎన్నికైన వారిలో ఉన్నారు. కాగా, ఈ కమిటీకి ఇప్పటికే లోక్‌సభ నుంచి 10 మంది సభ్యులు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment