ఫ్రాన్స్ నూతన ప్రధాని ఎలిజబెత్ బోర్న్
పారిస్: ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఎలిజబెత్ బోర్న్ నియమితులయ్యారు. దేశప్రధాని పగ్గాలు చేపట్టిన రెండో మహిళగా నిలిచారు. 1991–92లో ఎడిత్ క్రేసన్ ఫ్రాన్స్ తొలి మహిళా ప్రధానిగా పని చేశారు. బోర్న్‌గత ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా పనిచేశారు. త్వరలో అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి బోర్న్ నూతన మంత్రివర్గాన్ని నియమిస్తారు.
రాజకీయాల్లోకి రాకముందు ఆమె ప్రభుత్వానికి చెందిన ఆర్‌ఏటీపీ కంపెనీకి సీఈఓగా పనిచేశారు. 2017లో మాక్రాన్‌కు చెందిన సెంట్రిస్ట్ పార్టీలో చేరారు. ఫ్రాన్స్‌లో అధ్యక్షుడి పదవీ కాలం పూర్తయ్యేలోపు ప్రధానులు మారుతూనే ఉంటారు. కార్మిక మంత్రిగా ఆమె తెచ్చిన సంస్కరణలకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు బోర్న్ సత్తాకు పరీక్షగా నిలవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment