నాలుగోసారి ప్రధాని పీఠంపై సీపీఎన్‌యూఎంఎల్ చీఫ్
కఠ్మాండు: నెలల వ్యవధిలో ప్రభుత్వాలు కూలి కొత్త ప్రభుత్వాలు కొలువుతీరే హిమాలయాల దేశం నేపాల్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్–యూనిఫైడ్ మార్కిస్ట్ లెనినిస్ట్ (సీపీఎన్–యూఎంఎల్) అధినేత కేపీ శర్మ ఓలీ ప్రధానిగా సోమవారం ప్రమాణం చేశారు. ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్‌పార్టీ ఆఫ్ నేపాల్ ప్రభుత్వానికి ఓలీ, షేర్ బహదూర్ దేవ్‌బా నేతృత్వంలోని నేపాలీ కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించడంతో ఆయన విశ్వాసపరీక్షలో ఓడిపోవడం, ప్రధానిగా రాజీనామా చేయడం తెల్సిందే. దీంతో ఓలీ, దేవ్‌బా ఏడు అంశాలపై ఏకాభిప్రాయంతో కూటమిగా ఏర్పడి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు.
నేపాలీ రాజ్యాంగంలోని ఆరి్టకల్76–2 ప్రకారం ఓలీని నూతన ప్రధానిగా దేశాధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్ ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం ఓలీ ప్రధానిగా ప్రమాణంచేశారు. ఓలీ ప్రధాని పదవి చేపట్టడం ఇది నాలుగోసారి కావడం విశేషం. సోమవారం కాఠ్మాండూలోని రాష్ట్రపతిభవన్(శీతల్ నివాస్)లో దేశాధ్యక్షుడు పౌడెల్ ఈయన చేత ప్రధానిగా ప్రమాణంచేయించారు. సుస్థిర సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని నెలకొల్పాలని ఆశించారు.
కూటమిలోని నేపాలీ కాంగ్రెస్ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోని తీసుకోవాలన్న విషయంలో భేదాభిప్రాయాలు పొడచూపడంతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో నూతన ప్రభుత్వంలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయని ప్రపంచ పార్టీ విమర్శలు సంధించింది. కూటమిలో కీలక పార్టీ అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ భార్య అర్జో రాణా దేవ్‌బాకు విదేశాంగ మంత్రి పదవి కట్టబెట్టారు. ప్రధానిగా పగ్గాలు చేపట్టిన 30 రోజుల్లోపు ఓలీ పార్లమెంట్‌లో బలపరీక్షలో నెగ్గాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment