త్వరలో ప్రధానిని నియమిస్తానన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
పారిస్: పదవీకాలం ముగిసేదాకా కొనసాగుతానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ స్పష్టం చేశారు. కొత్త ప్రధానిని మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రధాని మైకేల్ బార్నియర్ రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాక్రాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఫ్రెంచ్ ఫార్ రైట్, హార్డ్ లెఫ్ట్ పార్టీలు రిపబ్లికన్ వ్యతిరేక ఫ్రంట్‌కు సహకరిస్తున్నాయని ఆరోపించారు.
‘‘నా నిర్ణయాలపై వ్యతిరేకతతో రాజకీయ ప్రత్యర్థులు గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వారి దృష్టి ప్రజల సమస్యలపై కాదు. కేవలం అధ్యక్ష ఎన్నికలపైనే ఉంది’’ ని విమర్శించారు. తదుపరి ప్రధాని ఎవరనే దానిపై మాక్రాన్ సంకేతాలివ్వలేదు. రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకోర్, అంతర్గత మంత్రి బ్రూనో రిటైల్లీయు, ఫ్రాంకోయిస్ బేరూ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment