ఫ్రాన్స్ పార్లమెంట్ రద్దు
పారిస్: యూరోపియన్ యూనియన్ (ఈయూ) పార్లమెంటరీ ఎన్నికలు పరోక్షంగా ఫ్రాన్స్ పార్లమెంట్ ముందస్తు ఎన్నికలను మోసుకొచ్చాయి. యూరోపియన్ యూనియన్‌లో మొత్తం 720 సీట్లు ఉండగా 81 సభ్యులను ఫ్రాన్స్ ఎన్నుకోనుంది. ఇందుకోసం జరిగిన ఎన్నికల్లో ఫ్రాన్స్ విపక్ష నేషనల్ర్యాలీ పార్టీకి 32 శాతం ఓట్లు పడొచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు చెందిన రనీసాన్స్ పారీ్టకి కేవలం 15 శాతం ఓట్లు పడతాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. నిజంగానే ఈ ధోరణి ఇలాగే కొనసాగితే మూడేళ్ల తర్వాత అంటే 2027లో జరగబోయే ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విపక్ష పార్టీ విజయం సాధించే ప్రమాదముందని దేశాధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ భావించారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన పార్లమెంట్‌ను రద్దుచేస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. దీంతో వచ్చే 20 రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 30న తొలి దశ, జూలై ఏడో తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. మూడేళ్ల తర్వాత నిర్వహిస్తే ఓడిపోతామని, ప్రజాదరణ తగ్గేలోపు ఇప్పుడే నిర్వహిస్తే తమ రనీసాన్స్ పారీ్టయే గెలుస్తుందన్న అంచనాతో ఆయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారని వార్తలొచ్చాయి. సరైన నిర్ణయం తీసుకున్నా: మేక్రాన్ పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని మేక్రాన్ సమరి్థంచుకున్నారు. ‘‘ దేశం కోసం సరైన నిర్ణయం తీసుకున్నా. ఈయూ ఎన్నికల ద్వారా ప్రజలు మా ప్రభుత్వానికి ఏం చెప్పదల్చుకున్నారో అర్థమైంది. ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా వదిలేయలేను’ అని చెప్పారు.