ఫ్రాన్స్ పార్లమెంటు ఎన్నికల్లో మేక్రాన్ హవా!
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్‌కు ఆదివారం జరిగిన తొలి రౌండ్ ఎన్నికల్లో అధ్యక్షుడు మేక్రాన్‌కు చెందిన ఆర్‌ఈఎం పార్టీ భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మేక్రాన్ పార్టీకి 30 శాతం ఓట్లు పడే అవకాశం ఉందనీ, కొందరు ఎంపీలు తొలిదశలోనే విజయం సాధించొచ్చని ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడైంది. 577 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మేక్రాన్‌కు చెందిన ఆర్‌ఈఎం పార్టీ 400 వరకు సీట్లను గెలుచుకోవచ్చని అంచనా.