
జపాన్ కాబోయే ప్రధాని షిగెరు ఇషిబా ప్రకటన
టోక్యో: అధికార పగ్గాలు చేపట్టేలోపే జపాన్ కాబోయే ప్రధాని షిగెరు ఇషిబా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిచ్చారు. నేడు ప్రధానిగా ప్రమాణం చేయనున్న ఇషిబా సోమవారం మాట్లాడారు. ‘‘ నేను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తా’’ అని అన్నారు.
శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఇషిబా విజయం సాధించడం తెల్సిందే. దీంతో ఫుమియో కిషిద వారసుడిగా ఇషిబా ఎంపికయ్యారు. మంగళవారం ప్రమాణస్వీకారం కోసం ఎల్‌డీపీ ముఖ్యనేతలంతా సిద్దమవుతున్న వేళ ఇషిబా తదుపరి ఎన్నికలపై ముందే ఒక ప్రకటనచేయడం గమనార్హం.