![Pawan Kalyan Not Respond To Chandrababu Phone Call](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Pawan-Kalyan.jpg.webp?itok=aADJWQNn)
అమరావతి, సాక్షి: కూటమిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయితీ నడుస్తోంది. అనారోగ్యంతో ఇంతకాలం కీలక సమావేశాలకు దూరంగా ఉన్న పవన్.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందించకుండానే తీర్థయాత్రలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో చంద్రబాబు ఫోన్‌కు సైతం ఆయన స్పందించడం లేదని సమాచారం.
ఈ 6వ తేదీన కేబినెట్ సమావేశానికి పవన్ కల్యాణ్(Pawan kalyan) హాజరు కాలేదు. ఆ వెంటనే మంత్రులు, సెక్రటరీలతో జరిపిన కీలక సమావేశానికి పవన్ డుమ్మా కొట్టారు. దీంతో పవన్ ఎక్కడా? అనే చర్చ మొదలైంది. ఈలోపు ఆయన అనారోగ్యం బారిన పడ్డారని తెలియడంతో.. అందుకే రాలేదేమోననే చర్చ నడిచింది. అయితే.. ఆ వెంటనే ఆయన మూడు రాష్ట్రాల పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లడం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.
పవన్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఈ విషయమై ఆయన జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్‌ను చంద్రబాబు సంప్రదించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫోన్‌లో పవన్ అందుబాటులోకి రావట్లేదని చంద్రబాబు చెప్పగా.. పవన్ నడుం నొప్పితో బాధపడుతున్నారని చెప్పారు. ఈ లోపు.. ఇవాళ పవన్ కేరళ కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగి భేషుగ్గా నడుచుకుంటూ వెళ్తున్న చిత్రాలు వైరల్ అయ్యాయి. దీంతో పవన్ మ్యాటర్ కవర్ చేసేందుకు మనోహర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది.
![ఫోన్ కట్ చేసిన పవన్! నేను మాట్లాడను](https://www.sakshi.com/s3fs-public/inline-images/ok.jpg)
లోకేష్ డిప్యూటీ సీఎం విషయంలో.. పవన్ తీవ్ర మనస్థాపం చెందారనే ఆ మధ్య చర్చ నడిచింది. అయితే ఆ విబేధాలు తారాస్థాయికి చేరాయనే చర్చ ఇప్పుడు కూటమి పార్టీల మధ్య నడుస్తొంది. దీనిపై ఇరు పార్టీలు ఏమైనా స్పష్టత ఇస్తాయో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment