ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు లెక్కలేనంతమంది నాగ సాధువులు తరలివచ్చారు. వీరు చేసే కఠోర సాధన వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా ప్రయాగ్‌రాజ్‌లో 1500 మంది నాగ సాధువులుగా మారారు. వీరు జునా అఖాడా నుంచి దీక్ష తీసుకున్నారు.
నాగ సాధువుగా మారడానికి అనేక రకాల పరీక్షలు ఎదుర్కోవాలి. ఈ ప్రక్రియకు ఆరు నెలల నుండి ఒక ఏడాది వరకూ పడుతుంది. ఈ కఠిన పరీక్షల్లో విజయం సాధించాలంటే, సాధకుడు ఐదుగురు గురువుల నుండి దీక్ష పొందాలి. ఈ దీక్ష ఇచ్చేవారిని పంచ దేవ్ అని అంటారు.
నాగ సాధువుగా మారాలంటే, ఆ వ్యక్తి ప్రాపంచిక జీవితాన్ని పూర్తిగా త్యజించాలి. తనకు తాను పిండప్రదానాన్ని చేసుకోవాలి. భిక్షాటన ద్వారా లభించే ఆహారాన్ని మాత్రమే తినాల్సి ఉంటుంది. ఏ రోజైనా ఆహారం లభించకపోతే, ఆకలితోనే ఉండాలి.
తాజాగా జునా అఖాడాలో నాగ సాధువులుగా చేరిన 1,500 మంది, వారి తల్లిదండ్రులతో సహా ఏడు తరాల వారికి పిండప్రదానాన్ని చేశారు. దీంతో అతనికి ఇకపై తన కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉండదు. ఈ నాగ సాధువులు తమ జీవితాంతం సనాతన ధర్మ పరిరక్షణకు, వేద సంప్రదాయ పరిరక్షణకు, ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉండాలి.
ఇది కూడా చదవండి: సంధ్యావేళ.. మహా కుంభమేళా
Comments
Please login to add a commentAdd a comment