pinda pradanam
-
కుందూలో భూమాకు పిండ ప్రదానం
ఉయ్యాలవాడ : దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పెద్దకర్మ సందర్భంగా కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి గురువారం ఉయ్యాలవాడ సమీప కుందూనదిలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య తండ్రికి పిండ ప్రదానం చేశారు. ఆళ్లగడ్డ పట్టణ పరిసర ప్రాంతాల్లోని నదులు, వాగుల్లో నీటి పారకం లేకపోవడంతో ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చి ఉయ్యాలవాడ, రూపనగుడి మధ్య కుందూనదిలో పిండప్రదానం చేశారు. భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా కిశోర్‌రెడ్డి, భూమా మహేష్‌రెడ్డి, భూమా జగన్నాథరెడ్డితో పాటు స్థానిక నాయకులు బుడ్డా రామిరెడ్డి, కూడాల నారాయణరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. -
తల్లిదండ్రులు, అత్తమామలకు చంద్రబాబు పిండప్రదానం
సాక్షి, అమరావతి: కృష్ణా పుష్కరాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ తల్లిదండ్రులు, అత్తమామలకు శనివారం పిండ ప్రదానాలు చేశారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు తన తల్లిదండ్రులు అమ్మణ్ణమ్మ, ఖర్జూర నాయుడులకు పిండప్రదానాల కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా తన అత్త, మామ బసవతారకం, ఎన్టీ రామారావులకు కూడా పిండ ప్రదానాలు చేశారు. -
ప్రొఫెసర్ జయశంకర్‌కు పిండ ప్రదానం
నిర్మల్(ఆదిలాబాద్): ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం సోన్ వద్ద గోదావరిలో బుధవారం దివంగత ప్రొఫెసర్ జయశంకర్‌కు పిండప్రదానం చేశారు. తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ కోసం పోరాడిన ఆయన ఆత్మ శాంతించాలని కోరుకున్నట్టు వారు తెలిపారు. -
భద్రాచలంలో పురోహితుల ఆందోళన
ఖమ్మం : ఖమ్మం జిల్లా భద్రాచలం పుష్కర ఘాట్ వద్ద పురోహితులు గురువారం ఆందోళనకు దిగారు. ఘాట్ల వద్ద తమను పోలీసులు పిండప్రదానం చేయనీయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సుమారు రెండు గంటల నుంచి పిండ ప్రదానం కార్యక్రమం ఆగిపోవటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా భద్రతా కారణాల వల్ల పురోహితులు.. వేరేప్రాంతంలో పిండప్రదానం చేయాలని పోలీసులు సూచించటంతో ...వివాదం నెలకొంది. దాంతో తమను పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పురోహితులు ...పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద నిరసనకు దిగారు. తమకు ప్రత్యేకంగా ఏదైనా ప్రాంతం చూపిస్తే, అక్కడకు వెళ్లడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇప్పటికిప్పుడు తమను అడ్డుకోవటం సరికాదన్నారు. దీంతో పోలీసులకు, పురోహితులకు మధ్య సమన్వయం కొరవడటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ సునీతా మోహన్ ...పురోహితులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు దేవాదాయ శాఖ అధికారులు మాత్రం ఇప్పటి వరకూ ఈ వ్యహారంపై జోక్యం చేసుకోలేదు. -
ఇందిర, రాజీవ్‌కు పిండ ప్రదానం
వరంగల్ : వరంగల్ జిల్లాలోని మంగపేట పుష్కరఘాట్‌లో మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు, శాప్ మాజీ డెరైక్టర్ రాజనాల శ్రీహరి పిండ ప్రదానాలు చేశారు. మంగళవారం పుష్కర స్నానానికి మంగపేట వెళ్లిన ఆయన పుష్కర ఘాట్‌లో ఇందిర, రాజీవ్ ఆత్మలకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేసినట్లు తెలిపారు.