యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. ఇక్కడికి వచ్చే సామాన్యులను మహామండలేశ్వరులు, నాగ సాధువులు అమితంగా ఆకర్షిస్తున్నారు. అయితే మహామండలేశ్వరులు, నాగసాధువులుగా మారడం అంత సులభం కాదు.
మహామండలేశ్వరులు, నాగ సాధువులుగా మారేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. జీవితంలో సత్యనిరతి, సనాతనధరంపై అంకితభావం కలిగివుండాలి. ఈ విలువలకు అఖాడాలు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. మహామండలేశ్వరులు, నాగ సాధువులకు అఖాడాలు దీక్షనిస్తారు. జీవితంలో ఏమాత్రం విలువలు పాటించకుండా సాధకులమని చెప్పుకునేవారికి దీక్షలు ఇచ్చేందుకు అఖాడాలు ఆసక్తి చూపరు. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళాలో మహామండలేశ్వరులు, నాగసాధుకులుగా మారాలనుకున్న పలువురికి నిరాశ ఎదురయ్యింది.
మహామండలేశ్వరులుగా మారాలనుకున్న 12 మంది సాధకులు, సాగ సన్యాసం స్వీకరించాలనుకున్న 92 మంది సాధకుల దరఖాస్తులను అఖాడాలు తిరిస్కరించారు. జునా అఖాడా, ఆవాహన్ అఖాడా, నిరంజని అఖాడా, బడా నిరంజని అఖాడాలు మొత్తం 104 అభ్యర్థనలను తిరస్కరించారు. ఈ అభ్యర్థుల తీరుతెన్నులు సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా లేవని తేలండంతో అఖాడాలు వీరి దరఖాస్తులను తిరస్కరించారు.
మకర సంక్రాంతి నుండి ఇప్పటివరకు వివిధ అఖాడాలలో కొత్తగా 30 మందికి మహామండలేశ్వరులుగా, 3,500మందికి నాగ సాధువులుగా దీక్ష ఇచ్చారు. వసంత పంచమి నాడు జరిగే మూడవ అమృత స్నానం వరకు, మహామండలేశ్వరులకు, నాగ సన్యాసులకు దీక్షనిచ్చే కార్యక్రమం కొనసాగుతుంది.
మహామండలేశ్వరులు, లేదా నాగ సాధువుగా మారేందుకు ముందుగా అఖాడాలలో దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం వారు ఆ దరఖాస్తులో తల్లిదండ్రులు, విద్యార్హతతో సహా పలు వ్యక్తిగత వివరాలు తెలియజేయాలి. వీటిని అఖాడాలు సమగ్రంగా పరిశీలిస్తారు. ఈ విధంగా వచ్చిన దరఖాస్తులలో నిరంజని అఖాడా ఆరు దరఖాస్తులను, జునా అఖాడా నాలుగు దరఖాస్తులను, ఆవాహన్ అఖాడా మహామండలేశ్వర్‌గా మారేందుకు వచ్చిన రెండు దరఖాస్తులను రద్దు చేసింది. నాగ సాధువులుగా మారేందుకు వచ్చిన దరఖాస్తులలో 92 దరఖాస్తులను రద్దు చేశారు.
ఇది కూడా చదవండి: Los Angeles Fire: మళ్లీ కార్చిచ్చు.. రెండు గంటల్లో 5,000 ఎకరాలు ఆహుతి
Comments
Please login to add a commentAdd a comment