Aghori
-
అఘోరీ హల్చల్
మంగళగిరి : మంగళగిరి – తాడేపల్లి జాతీయ రహదారిపై ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన మహిళా అఘోరీ సోమవారం హల్చల్ చేసింది. పుర్రెలు మెడలో ధరించి, దిగంబరంగా ఆటో నగర్‌లోని తన కారు సర్వీస్ సెంటర్‌కు వెళ్లింది. కారు సర్వీస్ చేస్తుండగా ఓ జర్నలిస్టు అఘోరీని ఫొటో తీశారు. దీంతో ఆగ్రహించిన అఘోరీ జర్నలిస్టుపై దాడి చేసి, గాయపరచింది. అతడు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంతలో మరికొంత మంది జర్నలిస్టులు చేరుకుని ఫొటోలు, వీడియోలు తీయడంతో పాటు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు చేరుకుని అఘోరిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. -
శ్రీకాళహస్తి ఆలయం వద్ద అఘోరీ హల్ చల్
-
నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరుపతి : తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద అఘోరీ హల్చల్ చేశారు. ఆలయ అధికారులు శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శనానికి అఘోరీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికురాలైన అఘోరీ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో ఆత్మార్పణం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అప్రమత్తమైన పోలీసులు ప్రమాదం నుంచి తప్పించారు. నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఎన్ కండ్రిగ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
వేంపాడు టోల్‌ప్లాజా వద్ద అఘోరీ హల్చల్
నక్కపల్లి: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అఘోరీ సోమవారం అనకాపల్లి జిల్లా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద కొద్దిసేపు హల్చల్ చేశారు. రాజమండ్రి నుంచి విశాఖవైపు వెళ్తున్న అఘోరీ తన కారులో వేంపాడు టోల్‌ప్లాజా వద్దకు వచ్చారు. టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది కోరడంతో తన వద్ద ఫీజు తీసుకోడానికి వీల్లేదని, తాను చెల్లించనంటూ వాగ్వాదానికి దిగారు. ఘర్షణ ఎందుకని ఫీజు తీసుకోకుండానే సిబ్బంది ఆమె కారును విడిచిపెట్టారు . టోల్‌ప్లాజా దాటి కొద్దిదూరం వెళ్లిన అఘోరీ తిరిగి టోల్‌ప్లాజా వద్దకు వచ్చి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. కార్యాలయాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. టోల్ సిబ్బంది తనపై అనుచితంగా ప్రవర్తించారని, తన ప్రైవేట్ భాగాలను ముట్టుకున్నారంటూ ఆందోళనకు దిగారు. ఈ ప్రభుత్వంలో తనలాంటి నాగసాధు మహిళా అఘోరీకే రక్షణ లేకపోతే.. సాధారణ మహిళలకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. శరీరాన్ని తాకి సారీ చెబుతున్నారని, వీళ్లు అత్యాచారాలు, హత్యలు చేసి కూడా సారీ చెబుతారని ఆక్షేపించారు. తనపట్ల అనుచితంగా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అప్పటి వరకు కదిలేది లేదని భీష్మించారు. ఇంతలో నక్కపల్లి, పాయకరావుపేట పోలీసులు వచ్చి అఘోరీతో మాట్లాడారు. సీసీ టీవీ ఫుటేజీలు కావాలని ఆమె డిమాండ్ చేయడంతో పోలీసులు టోల్‌ప్లాజా వద్ద అఘోరీకు సిబ్బందికి మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన ఫుటేజీల్లో కొన్నింటిని చూపించారు. ఇటీవల తెలంగాణ ప్రాంతంలో వార్తల్లోకెక్కిన ఈ అఘోరీని చూసేందుకు టోల్గేట్ పరిసర ప్రాంతాల వారు, జాతీయరహదారిపై రాకపోకలు సాగించేవారు తమ వాహనాలను రోడ్లపైనే నిలిపేశారు. అఘోరీ అక్కడ ఉన్నంత సేపు వారు కూడా కదలకపోవడం గమనార్హం. -
దుష్ప్రచారాలపై అఘోరీ ఫిర్యాదు
సిద్దిపేటఅర్బన్: తనను అరెస్టు చేశారంటూ దుష్ప్రచారం చేస్తున్న చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కృష్ణపల్లికి చెందిన మహిళా అఘోరీ శివవిష్ణు బ్రహ్మ సిద్దిపేట త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. అనంతరం అఘోరీ మాట్లాడుతూ.. తన గురువును కలిసేందుకు హైదరాబాద్ నుంచి బద్రీనాథ్ వెళ్తుండగా దుద్దెడ టోల్గేట్ సమీపంలోకి వచ్చేసరికి తనపై చానెళ్లలో దుష్ప్రచారం జరుగుతోందని తెలిసిందని, వెంటనే సమీపంలోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.తాను నిజమైన అఘోరీ కాదని, ఫేమస్ అయ్యేందుకు అఘోరీలా వేషం వేసుకొని ప్రజలను మోసం చేస్తోందని పలు యూట్యూబ్ చానెళ్లు, న్యూస్ చానెళ్లు దుష్ప్రచారం చేస్తున్నా యని ఆరోపించారు. వ ాటిని అరికట్టి తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవా లని కోరారు. ఈ విషయంపై సిద్దిపేట త్రీటౌన్ సీఐ విద్యాసాగర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనని, ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
ఆఘోర వేషధారణలో హల్చల్.. నగ్నంగా చిందులేస్తూ..
నర్సీపట్నం(విశాఖ జిల్లా): ఆఘోరాల వేషధారణలో మరోసారి సన్యాసులు(సాధువులు) హాల్చల్ చేశారు. గంజాయి మత్తులో ఇటీవల కాలంలో సన్యాసులు పట్టణంలో వీరంగం సృష్టిస్తున్నారు. బుధవారం ఏకంగా టౌన్ స్టేషన్ ముందు హాల్చల్ చేశారు. చదవండి: సుబ్బలక్ష్మికి ఫోన్‌కాల్స్.. భర్త విగ్గురాజు ఏం చేశాడంటే..? చూసుకుందాం రండిరా అంటూ నగ్నంగా చిందులు వేశారు. పోలీసులు ఏమీ అనకపోవడంతో కొంత సేపు హాల్చల్ చేసి అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ విధంగా చేయడం ఇది మూడోసారి. 20 రోజుల క్రితం నగ్నంగా రోడ్డుపై నిలబడి వాహనాలను ఆపి బలవంతంగా డబ్బులు వసూలు చేశారు. రెండోసారి అదే విధంగా చేస్తే ప్రజలు దేహశుద్ధి చేశారు. ఇపుడు మరలా పోలీసు స్టేషన్ ముందు వీరంగం చేశారు. -
తల్లి శవంపై కూర్చుని అఘోర పూజలు
చెన్నై: తన తల్లి శవంపై కూర్చుని ఓ అఘోరా అంత్యక్రియలు నిర్వహించడం తమిళనాడులో కలకలం సృష్టించింది. తిరుచ్చి జిల్లా, తిరువెరుంబూర్ సమీపంలోని అరియమంగళంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ ప్రాంత వాసులను భయబ్రాంతులకు గురిచేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అరియమంగళంకు చెందిన మేరీ అనే మహిళ మృతిచెందింది. దీంతో ఆమె అంత్యక్రియలు కుమారుడైన మణికంఠన్ నిర్వహించాడు. అయితే మణికంఠన్ వారణాసిలో అఘోరాగా శిక్షణ తీసుకుని అరియమంగళంలోని జయ్ అఘోరా ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. మణికంఠన్ అఘోరా కావటంతో వారణాసిలోని తన మిత్రులను రప్పించి తన తల్లి అంత్యక్రియలు తమ శైలిలో నిర్వహించాడు. ఇందులో భాగంగా మణికంఠన్ తన తల్లి మేరి శవంపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం అఘోరాలే సమాధి చేశారు. ఈ అంత్యక్రియల్లో పాల్గొన్న గ్రామస్తులంతా భయాందోళన చెందారు. క్షుద్రపూజల తరహాలో అఘోరాలు శవంపై కూర్చుని అంత్యక్రియలు నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. -
శవంపై కూర్చుని అఘోర పూజలు..వైరల్!
-
అఘోరి మోషన్ పోస్టర్ ఆవిష్కరణ
తమిళసినిమా: అఘోరి చిత్ర మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం ఆవిష్కరించారు. ఆర్పీ ఫిలింస్ పతా కంపై ఆర్పీ బాలా నిర్మిస్తున్న చిత్రం అఘోరి. ఆర్డీ.రాజ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మైమ్‌గోపీ, సిద్దు, వెట్ట్రి, మదన్‌కుమార్, శరత్ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. అఘోరి చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కే వైవిధ్యభరిత కథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారన్నది చాలామార్లు రుజువైందన్నారు. అలాంటి విభిన్న కథా చిత్రంగా అఘోరి ఉంటుందన్నారు. ఆత్మల ఇతివృత్తంతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్ కథా చిత్రంగా అఘోరి చిత్రం ఉంటుందన్నారు. ఈ తరహా చిత్రాలు అరుదుగానే వస్తుంటాయని అన్నారు. అఘోరి చిత్ర కథా కథనాలు సరికొత్తగా ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని కలిగిస్తాయని అన్నారు. నిర్మాణ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను శుక్రవారం చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మైమ్‌గోపీ ఆవిష్కరించారని, ఈ పోస్టర్‌కు పరిశ్రమ వర్గాల నుంచి మంచి స్పందన వస్తోందని దర్శకుడు ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
అఘోరికి శ్రీకారం!
తమిళసినిమా: అఘోరి చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ ఫైట్‌మాస్టర్ జాగ్వుర్‌తంగం, సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మలయాళంలో మోహన్‌లాల్ కథానాయకుడుగా నటించిన సూపర్‌హిట్ చిత్రం పులిమురుగన్ను తమిళంలోకి అనువదించి మంచి విజయాన్ని సాధించిన ఆర్పీ.ఫిలింస్ అధినేత ఆర్పి.బాలా నిర్మిస్తున్న చిత్రం అఘోరి. ఈయన కథ, ఛాయాగ్రహణం నెరపుతున్న ఈ చిత్రానికి టీఎస్.రాజ్‌కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ అఘోరి కథ, కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. చిత్ర నిర్మాత ఆర్పీ.బాలా ఈ చిత్రానికి నిపుణులైన సాంకేతిక వర్గాన్ని ఇచ్చారని చెప్పారు. నిర్మాత ఆర్పీ.బాలా తెలుపుతూ అఘోరి చిత్రం తమిళ సినిమాలోనే కాకుండా భారతీయ సినిమాలోనే సరి కొత్త ముద్రవేసుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కారణం కథ, కథనాలు చాలా కొత్తకోణంలో సాగుతాయని అన్నారు. ఇందులో సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్నారని, ఆదవ్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారని తెలిపారు. దీనికి సరవణకుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
హిందూ అమెరికన్ల ఆగ్రహం
అఘోరాలపై అసత్య కథనాన్ని ప్రచారం చేశారని సీఎన్ఎన్పై మండిపాటు వాషింగ్టన్: ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్పై అమెరికాలోని హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎన్ఎన్ చానెల్లో ఆదివారం ప్రసారమైన ‘బిలీవర్ విత్ రెజా అస్లాన్’ అనే ఆరు ఎపిసోడ్ల కార్యక్రమంలో అఘోరాల గురించి అసత్యాలు ప్రసారం చేశారని.. అది హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు. ప్రముఖ భారత అమెరికన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు శలభ్ కుమార్ ఈ కథనంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘హిందూయిజంపై జరుగుతున్న దాడి ఇది. అమెరికాలోని మెజారిటీ భారతీయులు, హిందువులు గత ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతు తెలిపినందుకు ప్రతీకారంగానే ఉద్దేశపూర్వకంగానే హిందూత్వంపై దాడిచేస్తున్నారు’ అని ట్విటర్ వేదికగా విమర్శించారు. అమెరికాలోని పలు హిందూ సంస్థలు, వ్యక్తులు కుమార్ వ్యాఖ్యలకు మద్దతు తెలపాయి. ‘ఇటీవల అమెరికాలోని మైనారిటీల (భారతీయులు)పై దాడులు జరగుతున్న సమయంలో ఇలాంటి విద్వేషపూరిత, అసత్య కథనాలను ప్రసారం చేయటం మరింత ఘర్షణకు దారితీస్తాయి’ అని కాలిఫోర్నియా హిందూ సమాజం నేత ఖండేరావ్ కాంద్ ఆవేదన వ్యక్తం చేశారు. యూఎస్ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ చైర్మన్ సంజయ్ పురీ కూడా ఓ ప్రకటనలో ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమ ప్రసారాన్ని వెంటనే నిలిపేయాలని ఆయన సీఎన్ఎన్ను కోరారు.