అఘోరికి శ్రీకారం! | Aghori film opening ceremony was held in Chennai on Friday. | Sakshi
Sakshi News home page

అఘోరికి శ్రీకారం!

Published Sun, Jul 16 2017 1:48 AM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

అఘోరికి శ్రీకారం!

అఘోరికి శ్రీకారం!

తమిళసినిమా: అఘోరి చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం చెన్నైలో జరిగింది. స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్‌ ఫైట్‌మాస్టర్‌ జాగ్వుర్‌తంగం, సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. మలయాళంలో మోహన్‌లాల్‌ కథానాయకుడుగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం పులిమురుగన్‌ను తమిళంలోకి అనువదించి మంచి విజయాన్ని సాధించిన ఆర్‌పీ.ఫిలింస్‌ అధినేత ఆర్‌పి.బాలా నిర్మిస్తున్న చిత్రం అఘోరి.


ఈయన కథ, ఛాయాగ్రహణం నెరపుతున్న ఈ చిత్రానికి టీఎస్‌.రాజ్‌కుమార్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ అఘోరి కథ, కథనాలు చాలా వైవిధ్యంగా ఉంటాయని చెప్పారు. చిత్ర నిర్మాత ఆర్‌పీ.బాలా ఈ చిత్రానికి నిపుణులైన సాంకేతిక వర్గాన్ని ఇచ్చారని చెప్పారు. నిర్మాత ఆర్‌పీ.బాలా తెలుపుతూ అఘోరి చిత్రం తమిళ సినిమాలోనే కాకుండా భారతీయ సినిమాలోనే సరి కొత్త ముద్రవేసుకుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కారణం కథ, కథనాలు చాలా కొత్తకోణంలో సాగుతాయని అన్నారు. ఇందులో సిద్ధు కథానాయకుడిగా నటిస్తున్నారని, ఆదవ్‌తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారని తెలిపారు. దీనికి సరవణకుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement