mellacheruvu
-
Ugadi 2024: ఆరు రుచులను కలపగా.. విరిసిన 'ఉగాది'
జీవితమనే చెట్టు గొప్ప గొప్ప లక్ష్యాల చిగుర్లు వేసింది ప్రయత్నాల పూత పూసింది విరివిగా కానీ చేదుగా; అభిమానం అడ్డొచ్చి పడింది పిందెలుగా అయితే గుత్తులు గుత్తులుగా, అంతలో.. చింత చిరాకుపడి, పులుపుని రేపడం మొదలుపెట్టింది ఊరుకోని పట్టుదల పచ్చపచ్చగా వ్యాపించి ఎదగడం మొదలుపెట్టింది; కటువుగా కారం చల్లినట్లు.. నిర్ణయాలు వాటి వాటి స్థానం తీసుకున్నాయి; ధైర్యం విషయ గుజ్జుని గ్రహించింది.. లోపాలకు వగరు మందేసింది.. పరిశ్రమ కఠోరంగా అన్నిటినీ కలిపంది.. విజయం తియ్యగా వరించింది కృతజ్ఞత ఎక్కువ మోతాదులో కాకుండా.. తగిన మోతాదులో ఉపయోగించాలని ఉప్పు ఉపదేశించింది.. మొత్తానికి కచ్ఛాపచ్ఛాగా పచ్చడవుతున్న జీవితం.. మాంఛి.. పసందైన షడ్రుచులతో నడుస్తున్నది! :::మాధవి మేళ్ళచెర్వు, గుంటూరు క్రోధి నామ సంవత్సర రాశిఫలాల కోసం క్లిక్ చేయండి -
సూర్యపేటలో తెలుగు టైటాన్స్ ప్లేయర్ల సందడి
సూర్యపేట జిల్లాలోని మేళ్లచెరువులో తెలుగు టైటాన్స్ కబడ్డీ క్రీడాకారులు సందడి చేశారు. మండల కేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం (జాతర) సందర్భంగా మంగళవారం రాత్రి స్థానిక ఫ్రెండ్స్ యూత్ «ఆధ్వర్యంలో మేళ్లచెరువులో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. కాగా ఈ పోటీల్లో ప్రో కబడ్డీ జట్టు సభ్యులు తెలుగు టైటన్స్ కెప్టెన్ సిద్ధార్ద్ దేశ్రాయ్, మోనుగోయత్, మల్లికార్జున్, ఆశీష్సింగ్ పాల్గొని సందడి చేశారు. ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..?
సాక్షి, మేళ్లచెరువు : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ దారుణానికి తెగబడింది. మద్యం సేవించి నిద్రమత్తులో ఉన్న భర్త తలను గోడకు బలంగా మోది కడతేర్చింది. ఈ దారుణ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల పరిధిలోని కప్పలకుంట తండాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సీఐ శివరాంరెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కప్పలకుంటతండాకు చెందిన భూక్యా బాలాజీ (40)కి కోదాడ మండలం బాలజీనగర్ తండాకు చెందిన బుజ్జీతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు సంతానం. బాలాజీ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భర్త దుబాయ్ బాట.. భార్య అడ్డదారి బాలాజీకి స్థానికంగా కూలి పనులు దొరక్కపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో తెలిసిన వారి సహకారంతో నాలుగేళ్ల క్రితం దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడినుంచి ప్రతి నెలా డబ్బులు పంపిస్తుండడంతో బుజ్జి పిల్లలను పోషించుకుంటోంది. అయితే ఇదే సమయంలో బుజ్జి గ్రామానికి చెందిన రాముడుతో వివాహేతర సంబంధం పెట్టుకుని అడ్డదారులు తొక్కింది. బాలాజీ అక్కడి నుంచి బాగా డబ్బులు సంపాందించి రెండేళ్ల క్రితం తన ఇద్దరు కూతుళ్ల వివాహాలు జరిపించాడు. కుమారుడు ప్రస్తుతం స్థానిక ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. చదవండి: (తల్లితో సహజీవనం.. కుమార్తెపై ఘాతుకం) నాలుగు నెలల క్రితం తిరిగి రాగా.. బాలాజీ నాలుగు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతడికి భార్య ప్రవర్తనపై అనుమానం కలిగింది. పలుమార్లు ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయినా బుజ్జి తగ్గకుండా ప్రతిసారి ఇబ్బందులకు గురిచేయడంతో పాటు చిత్రహింసలు పెట్టింది. భార్య ప్రవర్తనకు విసిగి వేసారిన బాలాజీ తాగుడుకు బానిసగా మారాడు. ఒక్కతే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? ఎప్పటిలాగే శనివారం రాత్రి కూడా బాలాజీ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. రోజూ మాదిరిగానే దంపతులు గొడవపడుతుండగా కుమారుడు పక్క గదిలో నిద్రపోయాడు. తెల్లారేసరికి బాలాజీ విగత జీవిగా మారడంతో ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ శివరాంరెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. అయితే బుజ్జి మాత్రం తానే భర్త తలను గోడకు బలంగా మోది హత్య చేశానని తెలిపిందని సీఐ తెలిపారు. కాగా, బుజ్జి ఒక్కతే ఘాతుకానికి తెగబడిందా లేక ఇందులో ప్రియుడి హస్తం కూడా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాగా, పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని సీఐ ధ్రువీకరించలేదు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం బాలాజీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు నెహ్రూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. చదవండి: (సీమంతానికి ఏర్పాట్లు చేస్తుండగానే గర్భిణి ఆత్మహత్య) -
మేళ్లచెరువు ఆలయం వద్ద ఉద్రిక్తత
మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువు స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మైహోమ్ సిమెంట్స్ మైనింగ్ లీజు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ విషయంలో కొన్ని రోజులుగా వివాదం ఏర్పడింది. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. మైహోమ్ సంస్థకు ‘మీరంటే - మీరు అమ్ముడుపోయారు’ అంటూ ఇరు పార్టీల నాయకులు సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి తెర తీశారు. ఈ వివాదం నేపథ్యంలో బీజేపీ నాయకులు ప్రమాణానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా తన నిజాయతీని నిరూపించుకునేందుకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి శివాలయంలో ప్రమాణం చేసేందుకు బుధవారం ఆలయానికి వచ్చారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వేపలమాధారం, మేళ్లచెరువు గ్రామాల పరిధిలోని 631 ఎకరాల్లో మైనింగ్ విస్తరణను మై హోం సంస్థ చేపట్టాలని భావించింది. దీనిపై ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ కొనసాగుతోంది. దీనిపై దాదాపు 15 రోజులుగా వివాదం ఏర్పడిన విషయం తెలిసిందే. మైనింగ్ విస్తరణతో కాలుష్యం పెరుగుతుందని, పొలాల్లో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు. మై హోం సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మేళ్ళచెర్వు ఎస్ఐపై గ్రామస్తుల దాడి!
-
మంత్రి పదవి రాగానే మాటెత్తని ‘ఉత్తమ్’
మేళ్లచెర్వు : మంత్రి పదవి రాగానే మూతికి గుడ్డ కట్టుకున్న మాజీమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కనీసం పులిచింతల పునరావాస పనులను కూడా పూర్తి చేయలేకపోయారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో వివిధ పార్టీల నుండి టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ ప్రజల కోసం పనిచేయని కాంగ్రెస్ నాయకులు తమకు అనుభవం లేదనడం విడ్డూరమన్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఇతర పార్టీలు తెలంగాణద్రోహుల పార్టీల న్నారు. తెంలంగాణ ప్రభుత్వం సాగర్‌లో డెడ్ స్టోరేజ్‌లో నీరున్నా ఎడమ కాలవకు నీటిని విడుదల చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సఖేందర్‌రెడ్డి తమకు అనుభవంలేదనడాన్ని ఆయన మరొకమారు తప్పుబట్టారు. తమ ప్రభుత్వం దళితులకు సేవలు చేసేందుకు దళితులకు మూడు ఎకరాల భూమి పంచుతుందన్నారు. ఇటీవల జరిగిన సాధారణ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లెందుకు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దేశంలోనే తెంలంగాణ అన్నిరంగాలలో అభివృద్ధి చెందనుందన్నారు. టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసి అన్ని గ్రామాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కోరారు. అనంతరంఎంపీపీ భూక్యా ఝూమా చోక్లానాయక్, మాజీ ఎంపీపీ పాలేటి రామారావు, రామాపురం మాజీ సర్పంచ్ భసవయ్య, వేపలమాధవరం సర్పంచ్ శ్రీనివాస్, కోటయ్యల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాయకులు పల్లా రాజేశ్వరరెడ్డి, ప్రవీణారెడ్డి, శంకరమ్మ, శివారెడ్డి తదితరలు పాల్గొన్నారు. -
గోడ కూలి ఐదుగురు మృతి
-
ఒకే చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
నల్గొండ : నల్గొండ జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మేళ్లచెరువు శివారులోని ప్రేమికులిద్దరూ ఒకే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేళ్లచెరువుకు చెందిన మౌనిక, మునగాల మండలం బాడునాయికి చెందిన వీరస్వామి గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరస్వామి మేళ్లచెరువులోని కీర్తి సిమెంట్స్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. అదే సిమెంట్ కంపెనీ ముందు కూరగాయలు అమ్మే మౌనికతో పరిచయమేర్పడింది. అది ప్రేమ వరకు వెళ్లింది. ఏమైందో ఏమో ఉన్నట్టుండి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. కాగా మృతుడు వీరస్వామికి ఇదివరకే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమజంట ఆత్మహత్యతో ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. కాగా నెల్లూరు జిల్లా కావలిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేశారు. నాగులమ్మ, రవి పురుగుల మందు తాగి ఈ ఘటనకు పాల్పడ్డారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు ముత్తుకూరుకు చెందిన వారిగా గుర్తించారు.