truck overturns
-
Viral Video: చూస్తుండగానే ఘోరం.. ఒక్కసారిగా మలుపు తీసుకున్న భారీ ట్రక్
చండీగఢ్: ఓ భారీ ట్రక్ అదుపుతప్పి బోల్తా పడటంతో కారు దారుణంగా ధ్యంసంమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదం పంజాబ్‌లోని బెహ్రామ్ వద్ద జరిగింది. ఈ మేరకు 18 చక్రాల భారీ ట్రక్ మితిమీరిన వేగంతో రహదారిపై వస్తూ.. అకస్మాత్తుగా మలుపు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి బోల్తా పడింది. అదే సమయంలో ఆ రహదారిపై రెండు వాహనాలు వస్తున్నాయి. ఐతే ఒక కారు కొద్దిలో తప్పించుకుంటే మరో వాహానం ఈ ట్రక్ కింద పడి నుజ్జునుజ్జు అయిపోయిది. ఈ ప్రమాదంలో ఒక జంట వారి కొడుకు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే వారిని రక్షించేందుకు ఒక్కరు కూడా రాకపోవడం బాధాకరం. పోలీసులు తన ర్యాష్ డ్రైవింగ్‌తో ఈ ప్రమాదానికి కారకుడైన ట్రక్ డ్రైవర్ మేజర్‌సింగ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. #Punjab - Three people were killed in a road accident near Behram on #Phagwara-Banga road. 🥺 #Punjab #accident pic.twitter.com/UreDU2ou9W — Harish Deshmukh (@DeshmukhHarish9) September 13, 2022 (చదవండి: 77 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసి హతమార్చిన కంగారు) -
ఫోన్ల లోడుతో వెళ్తున్న ట్రక్ బోల్తా.. ఎగబడ్డ జనం, మొత్తం స్వాహా!
సాక్షి, ముంబై: మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ట్రక్కులో ఉన్న వస్తువులను స్థానికులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై చోటుచేసుకుంది. ట్రక్కు నుంచి సుమారు రూ.70 లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోతీచంద్ రాథోడ్ పేర్కొన్నారు. పోలీసుల విజ్ఞప్తితో కొందరు తిరిగి అప్పగించారు. కాగా ఇప్పటివరకు 40 శాతం వరకు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చదవండి: మాజీ డీఎస్పీ ఇంట్లో చోరీ.. బంగారం, డబ్బు మాయం -
ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది మృతి
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు సమాచారం. జల్గావ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొప్పాయిలతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు జల్గావ్ జిల్లాలోని కింగ్వాన్ వద్ద బోల్తా పడింది. దాంతో ట్రక్కులో ఉన్న కూలీల్లో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయానికి ట్రక్కులో మొత్తం 21 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ట్రక్కు బొప్పాయిల లోడుతో ధులే నుంచి చోప్డా మీదుగా రావేర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తోన్న ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలిసింది. ప్రమాదంలో మృతి చెందిన వారంతా రావేర్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని జల్గావ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో సమాచారం ఆలస్యంగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: కావాలనే యాక్సిడెంట్ చేశాడు.. బొటన వేలిని పరీక్షగా చూసి షాక్! -
ట్రక్ బోల్తా: 9 మంది కబడ్డీ ఆటగాళ్ల మృతి
రూర్కెలా: ఒడిశాలో సుందర్‌గఢ్ జిల్లా లాహునిపరా - బహర్పోసి రహదారిపై ఆదివారం విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆటగాళ్లలో వెళ్తున్న మినీ ట్రక్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 9 మంది ఆటగాళ్లు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయప్డడారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా... మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారి ఆదివారం వెల్లడించారు. దుడిగాంలో వీరంతా టోర్నమెంట్లో పాల్గొని వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. అయితే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... ఈ నేపథ్యంలో వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం రూర్కెలా తరలిస్తున్నట్లు చెప్పారు. మరణించిన వారిని గుర్తించినట్లు చెప్పారు. మరో రెండు మృతదేహాలను గుర్తించవలసి ఉందన్నారు. ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. -
అనుకోకుండా వచ్చిన భారీ బీరు పార్టీ!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ వాసులకు అనుకోని పార్టీ దక్కింది. బరేలి సమీపంలోని బడా బైపాస్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులు పండగ చేసుకున్నారు. ప్రముఖ లిక్కర్ కంపెనీకి చెందిన 'స్ట్రాంగ్' బీరు తీసుకెళ్తున్న లారీ తిరగబడటంతో మొత్తం అందులో ఉన్న బీరు కార్టన్లన్నీ పడిపోయాయి. ఈనోటా, ఆ నోటా ఆ విషయం గ్రామస్తులందరికీ తెలిసింది. వెంటనే అందరూ జెర్రీ క్యాన్లు, గ్లాసులు, మగ్గులు, జార్లు, చివరకు పాలిథిన్ కవర్లు కూడా పట్టుకుని చేతనైనంత బీరును ఇళ్లకు తీసుకెళ్లిపోయారు. మరికొందరు ఔత్సాహికులు అక్కడికక్కడే పొట్టలో పట్టినంత ఎక్కించేశారు. విషయం చుట్టుపక్కల గ్రామస్థులకు కూడా తెలిసిపోవడంతో వాళ్లు కూడా గిన్నెలు, చెంబులు పట్టుకుని వచ్చేశారు. దాంతో చివరకు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. లక్నో నుంచి ఢిల్లీకి వెళ్లే బైపాస్ రోడ్డు మీద ఈ ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్‌కు, అతడి సోదరుడికి స్వల్ప గాయాలయ్యాయి. వాళ్లిద్దరినీ ముందు కాపాడి.. ఆ తర్వాత లారీలో ఉన్న మొత్తం సరుకంతటినీ ఖాళీ చేసేశారు. ఇళ్లలో ఉన్న సామాన్లన్నింటినీ తీసుకొచ్చి, వాటిలో నింపేసుకుని వెళ్లారు. కొంతమంది అయితే, బాగున్న సీసాల కార్టన్లను కార్లలో వేసుకుని కూడా వెళ్లిపోయారు. దారిలో వెళ్లేవాళ్లు కూడా ఆగి.. ఏంటా అని చూసి.. తాము కూడా ఓ చెయ్యేసి బీర్లు తెగ లాగించేశారు. లారీ వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఓ సైకిల్ అడ్డం రావడంతో అదుపుతప్పి లారీ బోల్తాపడిందని ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి చెప్పాడు. చివరకు సీబీగంజ్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
ట్రక్ బోల్తా: 14 మంది గాయాలు
కడప- చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళ్తున్న మిని ట్రక్ బోల్తా పడిన ఘటనలో 14 మంది గాయపడ్డారని రాయచోటి గ్రామీణ సీఐ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. జిల్లెలమందలో జరిగిన వివాహా వేడుకలకు హాజరై వారంతా స్వస్థలమైన నందలూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కడప-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో రోడ్డు బాగా వాలుగా ఉంటుందని, అందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నామని సీఐ వివరించారు. -
ట్రక్ బోల్తా: 14 మంది గాయాలు
కడప- చిత్తూరు జిల్లా సరిహద్దుల్లో ఈ రోజు ఉదయం పెళ్లి బృందంతో వెళ్తున్న మిని ట్రక్ బోల్తా పడిన ఘటనలో 14 మంది గాయపడ్డారని రాయచోటి గ్రామీణ సీఐ ఆదివారం ఇక్కడ వెల్లడించారు. క్షతగాత్రులను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. జిల్లెలమందలో జరిగిన వివాహా వేడుకలకు హాజరై వారంతా స్వస్థలమైన నందలూరుకు తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. కడప-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో రోడ్డు బాగా వాలుగా ఉంటుందని, అందువల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నామని సీఐ వివరించారు.