Viral Video: చూస్తుండగానే ఘోరం.. ఒక్కసారిగా మలుపు తీసుకున్న భారీ ట్రక్‌ | 3 Members Killed Loaded Trailer Lost Balance And Fell Crushes Car | Sakshi
Sakshi News home page

Viral Video: భారీ ట్రక్‌ అదుపుతప్పడంతో నుజ్జునుజ్జు అయిన కారు... ముగ్గురు మృతి

Published Tue, Sep 13 2022 1:41 PM | Last Updated on Tue, Sep 13 2022 4:05 PM

3 Members Killed Loaded Trailer Lost Balance And Fell Crushes Car - Sakshi

చండీగఢ్‌: ఓ భారీ ట్రక్‌ అదుపుతప్పి బోల్తా పడటంతో కారు దారుణంగా ధ్యంసంమైంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదం పంజాబ్‌లోని బెహ్రామ్‌ వద్ద జరిగింది. ఈ మేరకు 18 చక్రాల భారీ ట్రక్‌ మితిమీరిన వేగంతో రహదారిపై వస్తూ.. అకస్మాత్తుగా మలుపు తీసుకోవడంతో ఒక్కసారిగా బ్యాలెన్స్‌ కోల్పోయి బోల్తా పడింది. అదే సమయంలో ఆ రహదారిపై రెండు వాహనాలు వస్తున్నాయి.

ఐతే ఒక కారు కొద్దిలో తప్పించుకుంటే మరో వాహానం ఈ ట్రక్‌ కింద పడి నుజ్జునుజ్జు అయిపోయిది. ఈ ప్రమాదంలో ఒక జంట వారి కొడుకు అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న​ సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగు చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే వారిని రక్షించేందుకు ఒక్కరు కూడా రాకపోవడం బాధాకరం. పోలీసులు తన ర్యాష్‌ డ్రైవింగ్‌తో ఈ ప్రమాదానికి కారకుడైన ట్రక్‌ డ్రైవర్‌ మేజర్‌సింగ్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

(చదవండి: 77 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసి హతమార్చిన కంగారు)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement