![Truck Overturns People Loot Phones TV Worth Rs 70 Lakhs In Maharashtra - Sakshi](/styles/webp/s3/article_images/2021/06/16/truck-overturns.jpg.webp?itok=QpW44pG7)
సాక్షి, ముంబై: మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ట్రక్కులో ఉన్న వస్తువులను స్థానికులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై చోటుచేసుకుంది. ట్రక్కు నుంచి సుమారు రూ.70 లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోతీచంద్ రాథోడ్ పేర్కొన్నారు. పోలీసుల విజ్ఞప్తితో కొందరు తిరిగి అప్పగించారు. కాగా ఇప్పటివరకు 40 శాతం వరకు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment