electronic items
-
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
రైస్ దగ్గర నుంచి సూప్స్, న్యూడిల్స్ వరకు అన్నీ ఈ కుకర్‌లోనే..!
పర్ఫెక్ట్ కుకింగ్‌ను అందించగల మేకర్స్.. మార్కెట్లో కోకొల్లలు. అందులో ఈ మల్టీఫంక్షనల్ స్టీమింగ్ కుకర్.. చాలా రుచులను అందిస్తోంది. ఈ డివైస్‌తో మొత్తం ఐదు సిరామిక్ పాత్రలు లభిస్తాయి. అందులో ఒకటి పెద్దగా, నాలుగు చిన్నవిగా ఉంటాయి. ఈ అన్నిటినీ చక్కగా వినియోగించుకోవచ్చు. ఒక్కోదానిలో ఒక్కోరకం వంటకాన్ని తయారు చేసుకునేందుకు.. బేస్ మెషిన్లో ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. యాంటీ డ్రై బర్నింగ్‌తో పాటు పవర్ బ్రేక్ ప్రొటెక్షన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ కుకర్.. సుమారుగా తొమ్మిది గంటలకు పైనే రిజర్వేషన్ ఫంక్షన్ మోడ్‌లో ఉంటుంది. హై క్వాలిటీ డబుల్ లేయర్‌తో రూపొందిన ఈ డివైస్‌లో.. అభిరుచికి తగ్గట్టుగా చాలా రకాల వంటకాలను సిద్ధం చేసుకోవచ్చు. ఇందులో అడుగుభాగంలో నీళ్లు పోసుకుంటే.. పోషకాలు పోకుండా ఆవిరి మీద కుక్ చేసుకోవచ్చు. సూప్స్, కర్రీస్, రకరకాల రైస్ ఐటమ్స్, నూడుల్స్ వంటివెన్నో రెడీ చేసుకోవచ్చు. (చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్!) -
ఎలక్ట్రానిక్ వ్యర్థం ఏదైనా..అతడి చేతిలో శిల్పంగా మారాల్సిందే!
కవితకేదీ కాదు అనర్హం అన్న చందాన మెటల్, ప్లాస్టిక్, పాత గాడ్జెట్స్ ఏదైనా ఆయన చేతిలో పెట్టారంటే అందమైన శిల్పంగా మారాల్సిందే. అరవైఏళ్ల వయసులో చిన్నప్పటి హాబీని కెరీర్‌గా మలుచుకున్నాడు విశ్వనాథ్ మల్లాబ్డి దావంగిరె. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్‌గా మార్చి అబ్బురపరుస్తున్నాడు ఈ పెద్దాయన. బెంగళూరుకు చెందిన విశ్వనాథ్ తండ్రి డీఎమ్ శంభు ప్రముఖ శిల్పి ఇంకా పెయింటర్ కూడా. విశ్వనాథ్ మెడిసిన్ చదివి మంచి డాక్టర్ కావాలని శంభు కలలు కనేవారు. చిన్నప్పటి నుంచి సెకండ్ హ్యాండ్ వస్తువులను సరికొత్తగా మార్చడమంటే విశ్వనాథ్‌కు ఆసక్తి ఎక్కువ. ఫైన్ ఆర్ట్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేయాలని నిర్ణయించుకున్నాడు. చదువు పూరై్తన తరువాత తరువాత మీడియాలోకంప్యూటర్ వీడియో గ్రాఫిక్ ఆర్టిస్ట్‌గా చేరాడు. అలా కెరీర్ ప్రారంభించిన విశ్వనాథ్ ఒక్కోమెట్టు ఎదుగుతూ విప్రోలో చేరాడు. ఇక్కడ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూనే ఖాళీ సమయం, వారాంతాలలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకోఆర్ట్గా ఎలా మార్చాలని పరిశోధిస్తుండేవాడు. రకరకాల ప్రయోగాల తరువాత.. గాడ్జెట్స్ వ్యర్థాలను ఉపయోగించి చిన్నచిన్న జంతువులు తయారు చేశాడు. అవి ముద్దుగా ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో తన ఇకో ఆర్ట్‌ను పెంచుకుంటూ పోయాడు. ఫ్యాషన్ జ్యూవెలరీ నుంచి అందమైన శిల్పాలు, రోబోలదాకా అన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేస్తున్నాడు. ఏరికోరి ఎంచుకుని... ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పర్యావరణానికి ప్రాణాంతకంగా మారాయని తెలుసుకుని ఇకో ఆర్ట్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు విశ్వనాథ్. ఈ క్రమంలోనే ఈ వ్యర్థాలను కొనుక్కునేవాడు. అన్నింటిని గంపగుత్తగా కొనకుండా కంప్యూటర్ విడిభాగాలు, ల్యాప్టాప్స్, డేటా కార్డులు, డీవీడీ, వీసీఆర్, ఫ్లాపీ డ్రైవ్స్, సెట్–టాప్బాక్స్లు, ల్యాండ్‌లైన్, కార్డ్‌లెస్ ఫోన్లు, గ్లూకో మీటర్లను ఏరికోరి ఎంచుకుని తీసుకునేవాడు. వీటిలో కూడా రాగి, బంగారం, రంగురంగుల వైర్లు, కీబోర్డులను ప్రత్యేకంగా సేకరించి రకరకాల బొమ్మల రూపకల్పనకు ఉపయోగిస్తున్నాడు. ఆరు అడుగుల అమ్మాయి రూపంతో విగ్రహం, ప్రముఖ వ్యాపారవేత్త అజీం ప్రేమ్‌జీ ఫోటో, ఇకో జ్యూవెలరీ, కీబోర్డు కామధేనువు వంటి బొమ్మలు ఐదు వందలకు పైగానే తయారు చేశాడు. హాబీని కెరీర్‌గా... విశ్వనాథ్ తయారు చేసిన బొమ్మలు ఆకర్షణీయంగా అందంగా ఆకట్టుకుంటుండడంతో విక్రయించడం మొదలు పెట్టాడు. రెండేళ్ల క్రితం రిటైర్ అయిన విశ్వనాథ్.. తొలినాళ్లల్లో హాబీగా ఉన్న ఇకోఆర్ట్ను పూర్తి సమయం కేటాయిస్తూ ఇకోఆర్ట్ వస్తువులు విక్రయిస్తూ సరికొత్త కెరీర్‌ను సృష్టించుకున్నాడు. ఇకోఆర్ట్ వస్తువులు కొనే కస్టమర్లు ఢిల్లీలోనేగాక, యూరప్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో ఇకో ఆర్ట్ కోసం కస్టమర్లు ఎగబడుతున్నారు. దేశంలోనేగాక విదేశాల్లో తన ఇకో ఆర్ట్‌ను ప్రదర్శిస్తూ మంచి ఆదరణ పొందుతున్నాడు. వందల కేజీలపైనే... కీబోర్డు కీల నుంచి గోడగడియారంలో భాగాల వరకు అన్నీ సేకరించి ఇకో ఆర్ట్ రూపొందిస్తోన్న విశ్వనాథ్ ఇప్పటిదాకా రెండువందల కేజీల ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఇకో ఆర్ట్స్‌గా మార్చాడు. అయితే ఈ ఇకో ఆర్ట్ అంత సులభం కాదని విశ్వనాథ్ చెబుతున్నాడు. ‘‘ఈ – వ్యర్థాల నుంచి ఆర్ట్ కావాల్సిన భాగాలను సేకరించి వాటికి ఆకారం, రంగు వేసి తుదిమెరుగులు దిద్దడానికి చాలా సమయం పడుతుంది. జ్యూవెలరీ తయారు చేయడానికి రెండు మూడు నిమిషాలు పడితే, శిల్పాలు తయారు చేయడానికి వారాలు, నెలలు పడుతుంది. అయినప్పటికీ ప్రస్తుతం రీసైక్లింగ్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. ఇటు కస్టమర్ల మనసు దోచుకోవడంతోపాటూ, పర్యావరణానికి హానీ కలగకుండా ఈ ఇకోఆర్ట్ ఎంతో సంతృప్తినిస్తుంది. ముందు ముందు మరిన్ని కళారూపాలు తీసుకురానున్నాను’’అని విశ్వనాథ్ చెబుతున్నాడు. (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
అవుట్డోర్ కుక్వేర్..ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు!
అలా సరదాగా పిక్నిక్ కు వెళ్లి.. ఆరుబయట ప్రకృతిని ఆస్వాదిస్తూ.. వేడివేడిగా భోజనం తింటే ఎంత ఆనందంగా ఉంటుంది? చిన్నప్పుడు ఊళ్లలో వంటలకని వెళ్లేవాళ్లు. అక్కడే దొరికే కర్రముక్కలతో వంట పొయ్యి చేసి కుండల మీద వండి భోజనాన్ని సిద్ధం చేసుకునేవారు. ఇప్పుడు అంతా టెక్నాలజీ మయం. మరేం చేయాలి? ఇదిగో మా దగ్గర జవాబు ఉందంటున్నాయి కంపెనీలు. క్యాంపింగ్స్, పిక్నిక్స్, లాంగ్ డ్రైవ్స్ లాంటివి మెమొరీస్‌గా నిలిచిపోవాలంటే.. అక్కడ పరిసరాలతో పాటు చక్కటి ఆహారం దొరకాలి. లేదంటే ఆరోగ్యం చెడి.. ట్రిప్‌కి వెళ్లొచ్చిన ఆనందాన్ని మిస్ అవుతాం. అందుకే చాలా మంది.. మంచి కుక్వేర్ని వెంట తీసుకెళ్తుంటారు. చిత్రంలోని కుక్వేర్ అలాంటిదే. ఈ పరికరాన్ని చేత్తో సులభంగా పట్టుకెళ్లొచ్చు. దీని హ్యాండిల్స్ డివైస్‌కి ఇరువైపులా బల్ల మాదిరిగా ఉండి.. స్టోరేజ్‌కి ఉపయోగపడతాయి. outdoor cooking - something healthy & fresh ... my daughters volunteered to cook 👌 mahimahi slices, baigani tavu & roasted corn 🤙 pic.twitter.com/3yLBwMMTnr— Moira Vilsoni-Raduva (@mvilsoni_fj) July 8, 2023 గ్స్ కూడా ఫోల్డ్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. కిందవైపు సొరుగుల్లో చెక్కముక్కలు లేదా బొగ్గులు వేసుకుని నిప్పు రాజేసుకోవాలి. దానికి ప్రత్యేకమైన డోర్ ఉంటుంది. పొగవాసన బయటికి పోవడానికి వెనుకవైపు ప్రత్యేమైన గొట్టాన్ని అమర్చుకోవచ్చు. దీన్ని వేరుచేసి డివైస్ లోపల సొరుగులో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పరికరంపై అన్ని రకాల వంటకాలను తయారు చేసుకోవచ్చు. అందుకు తగ్గ పాత్రలను మార్చుకోవచ్చు. లాంగ్‌డ్రైవ్‌లో చక్కగా ఉండటమేగాక హాయిగా ఇంటి భోజనం చేశామన్నా సంతృప్తి దొరకుతుంది కదా!. ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మరీ. (చదవండి: ఆ నగరంలో ఎక్కడపడితే అక్కడ కొత్త నాణేలు..ఎందుకంటే..) ఔట్ డోర్ లో సులభంగా వండే 30 వంటలు 30 Picnic Recipes (and 6 Complete Menus) for a Perfect Outdoor Feast. Picnic as single person with my walker??? Not really, I cook/eat at home only.https://t.co/cTcHwkzWif pic.twitter.com/CAyMhdHqBE— Marion Friedl #ForUkraine #Boostered #PostVac (@marillion13) July 15, 2023 -
మనిషి నడవగలుగుతున్నాడు..అద్భుతం చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ!
సరిగ్గా 12 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంతో మంచానికి పరిమితమైన తాను తిరిగి ఇక నడవలేనని అనుకున్నాడు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. ఎలా అంటారా? నెదర్లాండ్‌లోని లైడెన్‌లో నివాసం ఉంటున్న గెర్ట్ జన్ ఓస్కామ్ (Klara Sesemann) 2011లో సైక్లింగ్ చేసే సమయంలో ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మెడ విరగడంతో శరీరంలోని ఇతర భాగాలకు సంబంధాలు తెగిపోవడంతో అతని శరీరం చచ్చుబడిపోయింది. దీంతో అతను నడవలేడు, కూర్చోలేడని చికిత్స చేసిన డాక్టర్లు తేల్చి చెప్పారు. డాక్టర్లు చెప్పినట్లుగా ఓస్కామ్ కొన్ని సంవత్సరాలు అలాగే మంచానికే పరిమితమయ్యాడు. కానీ అనూహ్యంగా సైన్స్, టెక్నాలజీ అద్భుతం చేయడంతో ఇప్పుడు సాధారణ మనిషిలా నడుస్తున్నాడు. ఓస్కామ్ బ్రెయిన్, వెన్నుముక, పాదాలలో ఎలక్ట్రానిక్ ఇంప్లాంట్స్‌ను అమర్చండంతో సాధ్యమైందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి👉 ఇంట్లో ఇల్లాలు, ఇంటింటికీ తిరిగి సబ్బులమ్మి.. 200 కోట్లు సంపాదించింది! సైన్స్ టెక్నాలజీ ఓస్కాముకు ఎలా ప్రాణం పోసింది నివేదిక ప్రకారం.. స్విట్జర్లాండ్‌కు చెందిన లాసాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జోసిలిన్ బ్లాచ్ బ్రెయిన్ ( న్యూరోసర్జన్) పై పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్ సమస్య తలెత్తిన వారికి మళ్లీ పునర్జన్మనిచ్చేలా టెక్నాలజీ సాయంతో బ్రెయిన్ ఇంప్లాంట్ చేయనున్నారు. ఇందుకోసం డిజిటల్ బ్రిడ్జ్ పేరుతో పరికరాన్ని సైతం తయారు చేశారు. అయితే జూలై 2021లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓస్కామ్పై లౌసాన్‌లోని ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్లు టెక్నాలజీకల్ డివైజ్ (Brain implants)ను అమర్చారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ జోసెలిన్ బ్లాచ్ మాట్లాడుతూ ఈ బ్రెయిన్ ఇంప్లాంట్ పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నాయని, ఓస్కామ్ తరహా బ్రెయిన్ సమస్యలు, పక్షవాతం ఉన్న రోగులకు చికిత్స అందించే ఈ ప్రక్రియ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని అన్నారు. చదవండి👉 హైదరాబాద్‌లో ఆ ఏరియా ఇళ్లే కావాలి.. కొనుక్కునేందుకు ఎగబడుతున్న జనం? బ్రెయిన్ ఇంప్లాంట్ ఆపరేషన్ ఎలా జరిగింది ముందుగా ప్రొఫెసర్ బ్లోచ్...ప్యారలైజ్తో బాధపడుతున్న జాన్ పుర్రెలో 5సెంటీమీటర్ల వ్యాసార్ధంలో రెండు గుండ్రటి రంద్రాలు పెట్టి.. ఆ రంద్రాల సాయంతో ప్రమాదాలతో బ్రెయిన్లోని కదలికల్ని నియంత్రించే బాగాన్ని కత్తిరించారు. అనంతరం వైర్లెస్ రెండు డిస్క్ ఆకారపు ఇంప్లాంట్లను (డిజిటల్ బ్రిడ్జ్) బ్రెయిన్లో అమర్చారు. అవి జాన్ ఏం చేయాలని అనుకుంటున్నాడో తెలుసుకొని అతను తన తలకు పెట్టకున్న హెల్మెట్‌లో ఉన్న రెండు సెన్సార్లకు సిగ్నల్స్ అందిస్తాయి. దీంతో ముందుగా ప్రోగ్రామ్ చేయబడి బ్రెయిన్ ఇంప్లాంట్ సాయంతో జాన్ కదిలేలా చేస్తోంది. ఇలా బ్రెయిన్‌తో పాటు వెన్నుపూస,పాదలలో ఇంప్లాంట్ చేయడంతో నడిచేందుకు సాధ్యమైంది. కొన్ని వారాల శిక్షణ తర్వాత అతను వాకర్ సహాయంతో నిలబడి నడవగలడని సైంటిస్ట్‌లు గుర్తించారు. ప్రాజెక్ట్‌కి నాయకత్వం వహించిన లౌసాన్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్ ఫెడరేల్ (EPFL)కి చెందిన ప్రొఫెసర్ గ్రెగోయిర్ కోర్టిన్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో అతని కదలికలు వేగవంతం అవుతాయని చెప్పారు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను ఓస్కామ్ మాట్లాడుతూ 40 ఏళ్ల వయస్సులో నడుస్తున్నందుకు ఆనందంగా ఉన్నాను. ‘ నన్ను నేను పసిబిడ్డగా భావిస్తున్నారు. మళ్లీ నడవడం నేర్చుకుంటున్నాను.ఇది సుదీర్ఘ ప్రయాణం. ఇప్పుడు నేను నిలబడి నా స్నేహితుడితో కలిసి టీ తాగ గలుగుతున్నాను. ఆ ఆనందం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేను అని సంతోషం వ్యక్తం చేశారు. చదవండి👉 రూ.2000 నోట్లను వదిలించుకోవడానికి వీళ్లంతా ఏం చేశారో చూడండి! -
భారత్‌లోనూ ‘ఈ–సిమ్’ సేవలు.. స్పెషల్ ఏంటో తెలుసా?
సాక్షి, అమరావతి: సెల్ఫోన్లలో ఉపయోగించే సిమ్(సబ్స్రై్కబర్ ఐడెంటిటీ మాడ్యూల్) కార్డు మాయమైపోతోంది. పెద్ద సైజు నుంచి క్రమంగా నానో సైజుకు వచ్చేసిన సిమ్ కార్డు.. ఇప్పుడు కంటికి కనిపించకుండా డిజిటల్ రూపంలోకి మారిపోయింది. అందుబాటులోకి వస్తోన్న అత్యాధునిక సెల్ఫోన్లు, వాచ్‌లతో పాటే ‘ఈ–సిమ్’లూ విస్తృతంగా వినియోగంలోకి వచ్చేస్తున్నాయి. కొన్నేళ్ల కిందటే ఇది మార్కెట్లోకి వచ్చినా.. అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ప్రస్తుతం సైబర్ మోసాలు భారీగా పెరుగుతుండటంతో అత్యధిక మంది ‘ఈ–సిమ్’పై ఆసక్తి చూపిస్తున్నారు. పైగా మొబైల్ స్టోర్‌కు వెళ్లకుండానే ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా యాక్టివేట్ చేసుకునే అవకాశం ఉండడం ఇందులో ప్రత్యేకత. సిమ్ కార్డులతో పెరిగిన మోసాలు కొన్నేళ్లుగా ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. టెలికాం సంస్థలు, బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలు పుట్టుకొస్తున్నాయి. వాటిలో చాలా కేసులు సిమ్ స్వాప్ మోసాలకు సంబంధించినవే. ఇందులో నేరగాళ్లు మొదట ఫోన్ నంబర్లు, ఈ–మెయిల్ ఐడీల వంటివి సేకరిస్తారు. వివిధ ఆకర్షణీయ ఈ–మెయిల్స్, మెసేజ్‌లు పంపించి, ఫోన్ కాల్స్ చేసి అవతలి వ్యక్తుల వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత.. ఫోన్ పోగొట్టుకున్నామని, లేదా పాత సిమ్ పాడైపోయిందని చెప్పి నెట్వర్క్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకుంటారు. టెలికాం ఆపరేటర్ కంపెనీకి సమర్పించిన వివరాలు సరైనవే అయితే.. మోసగాడు సులువుగా బాధితుడి నంబర్‌తో కొత్త సిమ్ తీసుకుంటాడు. సిమ్ యాక్టివేట్ అయిన తర్వాత పూర్తి కంట్రోల్ హ్యాకర్ చేతికి వెళ్లిపోతుంది. ఇక సులువుగా మన బ్యాంక్ అకౌంట్లోని డబ్బుతో పాటు ఫోన్లోని రహస్య సమాచారమంతా లాగేస్తాడు. ఈ–సిమ్‌తో అడ్డుకట్ట.. ఈ–సిమ్ అనేది ప్రస్తుతం మనం ఫోన్లలో వినియోగిస్తున్న ఫిజికల్ సిమ్‌కు డిజిటల్ రూపం. దీన్ని యాక్టివేట్ చేయాలంటే వ్యక్తిగత వివరాలతో పాటు పర్సనల్ ఐడెంటిఫియబుల్ ఇన్ఫర్మేషన్తో రిజిస్టర్ చేసుకోవాలి. ఈ–సిమ్ అకౌంట్‌ను సెక్యూర్‌గా ఉంచుకోవడానికి ఫేస్ ఐడీ లేదా బయోమెట్రిక్ విధానంలో పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఒకరు ఈ–సిమ్ వాడుతున్నప్పుడు మరొకరు సిమ్ పోయిందని లేదా పాడైపోయిందని నెట్వర్క్ ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయడానికి కుదరదు. అదే నంబర్‌తో మరో సిమ్‌ను తీసుకునే అవకాశం కూడా ఉండదు. ఎవరైనా అలా చేస్తే.. వారు సైబర్ నేరగాళ్లుగా గుర్తించి పట్టుకునేందుకు వీలుంటుంది. ప్రస్తుతం అమెరికాలో వినియోగిస్తున్న ఐఫోన్–14 మోడల్స్‌కు సిమ్ స్లాట్స్ లేవు. ఇవి ఈ–సిమ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సులభంగా యాక్టివేషన్.. డీ–యాక్టివేషన్ వీటిని సులభంగా యాక్టివేట్ చేయడంతో పాటు డి–యాక్టివేట్ కూడా చేయవచ్చు. మలి్టపుల్ ఫోన్ నంబర్లు, ప్లాన్లను ఒకే డివైజ్‌లో వినియోగించుకోవచ్చు. అంటే సింగిల్ సిమ్ మాత్రమే సపోర్టు చేసే లేటెస్ట్ ఫోన్లలో అదనంగా ఈ–సిమ్ కూడా వినియోగించుకోవచ్చన్నమాట. వీటిని పోగొట్టుకోవడం, పాడవడం లేదా దొంగిలించడం వంటివి సాధ్యం కాదు. వివిధ నెట్‌వర్క్‌లకు, ప్లాన్లకు సులువుగా మారవచ్చు. పైగా నెట్వర్క్ ప్రొవైడర్ స్టోర్‌కు వెళ్లే అవసరం కూడా ఉండదు. అన్నీ రిమోట్ విధానంలోనే ఎస్ఎమ్ఎస్, ఈ–మెయిల్ ద్వారానే యాక్టివేట్ చేయవచ్చు. అయితే, మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఈ–సిమ్‌ను సపోర్ట్ చేస్తుందా.. టెలికాం ఆపరేటర్ ఈ తరహా సదుపాయాలు అందిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలి. మనదేశంలో ఐఫోన్, శామ్సంగ్, హానర్, గూగుల్ ఫ్లిక్స్, సోనీ, షావోమీ, నోకియా, మొటొరోలా తదితర కంపెనీలకు చెందిన కొన్ని స్మార్ట్ఫోన్లకు మాత్రమే ఈ–సిమ్‌ను సపోర్టు చేస్తున్నాయి. మొదటిసారిగా శామ్సంగ్లో.. ప్రపంచంలో మొట్టమొదట ఈ–సిమ్‌ను 2016లో శామ్సంగ్ గేర్ ఎస్2 3జీ స్మార్ట్‌వాచ్ కోసం అందుబాటులోకి తెచ్చారు. అనంతరం 2017లో యాపిల్ స్మార్ట్ వాచ్‌లో కూడా దీన్ని ప్రవేశపెట్టారు. అతి తక్కువ కాలంలోనే పలు స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థలు తమ ఫోన్లలో ఈ–సిమ్ సపోర్టును ఏర్పాటు చేయగా.. పలు టెలికాం సంస్థలు ఈ–సిమ్ సేవలను అందుబాటులోకి తెచ్చాయి. మన దేశంలో భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్–ఐడియా ఈ–సిమ్ సేవలను అందిస్తున్నాయి. -
డిజిటల్ టీవీ రిసీవర్లకు నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు (డిజిటల్ టీవీ రిసీవర్లు, యూఎస్బీ టైప్–సీ చార్జర్లు, వీడియో నిఘా వ్యవస్థలు –వీఎస్ఎస్) సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది. బిల్ట్ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఉన్న డిజిటల్ టీవీ రిసీవర్ల కోసం ఐ 18112:2022 స్పెసిఫికేషన్‌ను కేటాయించింది. ఈ ప్రమాణాలతో తయారైన టెలివిజన్లు .. కేవలం డిష్ యాంటెనాను కనెక్ట్ చేయడం ద్వారా ఉచిత టీవీ, రేడియో చానల్స్‌ను అందుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుతం టీవీ వీక్షకులు వివిధ పెయిడ్, ఉచిత చానల్స్‌ను (ఆఖరికి దూరదర్శన్ ఛానళ్లు) చూడాలంటే సెట్–టాప్ బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటోంది. అటు సీ–టైప్ యూఎస్బీలు, కేబుల్స్ మొదలైన వాటికి (IS/IEC62680&1&3:2022) స్పెసిఫికేషన్ కేటాయించారు. -
అధీకృత సంస్థగా ఎంఈడీఈపీసీ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, మానిటర్స్, మొబైల్స్ విడిభాగాల ఎగుమతికై ఎగుమతి కంపెనీలకు కావాల్సిన రిజిస్ట్రేషన్/మెంబర్షిప్ సర్టిఫికేట్ జారీ చేయడానికి.. మొబైల్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌కు (ఎంఈడీఈపీసీ) ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ప్రొజెక్టర్లు, టీవీలు, ప్రింటర్లు, ఫోటోకాపీయింగ్ మెషీన్స్ వంటి ఇతర ఉత్పత్తులకూ ఎంఈడీఈపీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఎగుమతి కంపెనీలు ఫారెన్ ట్రేడ్ పాలసీ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. -
ఫోన్ ఏదైనా ఛార్జర్ ఒక్కటే, అధ్యయనంలో కేంద్ర నిపుణుల బృందం!
న్యూఢిల్లీ: వివిధ రకాల మొబైల్స్, పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటికీ ఒకే తరహా చార్జర్లను వినియోగంలోకి తెచ్చే అంశాన్ని అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఇవి రెండు నెలల వ్యవధిలో సవివర నివేదికను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమ, యూజర్లు, తయారీదారులు, పర్యావరణం వంటి అంశాలన్నింటినీ పరిగణించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సింగ్ వివరించారు. పరిశ్రమ వర్గాలతో బుధవారం భేటీ అయిన తర్వాత ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రతి వర్గం ఆలోచనలు భిన్నంగా ఉంటాయి కాబట్టి ఆయా అంశాలను అధ్యయనం చేసేందుకు వేర్వేరుగా నిపుణుల బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు సింగ్ పేర్కొన్నారు. నెల రోజుల్లోగా బృందాలను నోటిఫై చేస్తామని వివరించారు. -
‘యంత్ర’ ముగ్ధులౌతారు
ఆ మధ్య హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రోబోలను పనికిపెట్టారు. వచ్చే వాళ్లకు స్వాగతం చెప్పడం, వాళ్లతో మాటలు కలపడం, భోజనం తీసుకురావడం, వడ్డించడం.. అబ్బో ఇలా రకరకాల పనులను అవే చేయడం చూసి జనం ఆశ్చర్యపోయారు. సింగపూర్ శాస్త్రవేత్తలు ఓ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేసే పోలీస్ రోబోలను సృష్టించారు. రోడ్ల మీద ఎవరైనా రూల్స్‌ను అతిక్రమిస్తే చాలు.. ‘ఏయ్.. సెట్ రైట్’ అని హెచ్చరిస్తున్నాయి ఇవి. ఇదే సింగపూర్‌లో ఇంటింటికీ వెళ్లి వస్తువులను డెలివరీ చేసే రోబోలూ అందుబాటులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలేమో సరిహద్దుల్లో గస్తీ కాస్తూ చొరబాటుదారులను గుర్తించి కాల్పులు జరిపే రోబోలను ఆవిష్కరించారు. వీటన్నింటినీ చూస్తుంటే మున్ముందు ప్రపంచమంతా రోబోలదేనేమో అనిపిస్తోంది కదా. ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ కూడా ఇదే చెప్తోంది. 2030 నాటి కల్లా ప్రపంచంలో 2 కోట్ల ఉద్యోగాల్లో రోబోలే ఉంటాయని అంచనా వేస్తోంది. రోబోల వాడకం పెరుగుతోందా? గత పదేళ్లలో రోబోల వాడకం పరిశ్రమల్లో బాగా పెరిగింది. 2010లో దాదాపు 10.59 లక్షల రోబోలను ఇండస్ట్రీల్లో వాడితే అది 2020 కల్లా మూడు రెట్లు పెరిగి 30.15 లక్షలకు చేరిందని వరల్డ్ రోబోటిక్స్ 2021 రిపోర్టు వెల్లడించింది. ఏయే రంగాల్లో వాడుతున్నారు? రోబోలను ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో ఆటోమోటివ్ రంగం ఉంది. 2020 నాటికి ప్రపంచ లెక్కలను పరిశీలిస్తే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ రంగాల్లో 1.09 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత ఆటోమోటివ్ రంగంలో 80 వేలు.. లోహ పరిశ్రమల్లో 41 వేల రోబోలను వినియోగిస్తున్నారని వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు 2021 వివరించింది. వాడకం ఏ దేశాల్లో ఎక్కువ? రోబోలను అత్యధికంగా చైనాలో వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్, అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా దేశాలున్నాయి. వరల్డ్ రోబోటిక్స్ రిపోర్టు లెక్కల ప్రకారం 2020 నాటికే చైనాలో 1.68 లక్షల రోబోలను వాడుతున్నారు. ఆ తర్వాత జపాన్‌లో 38 వేలు, అమెరికాలో 30,800, రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో 30,500 వాడుతున్నారు. ఈ లిస్టులో ఇండియా 15వ స్థానంలో ఉంది. మన దేశంలో 3,200 రోబోలను వాడుతున్నారు. కరోనా సమయంలో.. రోబోలకు వైరస్ సోకే అవకాశం లేదు కాబట్టి కరోనా సమయంలో వీటి వాడకం పెరిగింది. మున్ముందు మహమ్మారుల సమయంలో రోబోల వాడకం పెరగవచ్చని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అభిప్రాయపడింది. ఇళ్లల్లో వాడుతున్నారా? రోబోల వాడకం ఇళ్లల్లో కూడా పెరుగుతోంది. 2018తో పోలిస్తే 2019–2020లో ఒకేసారి 5 రెట్లు మర బొమ్మల వాడకం ఎక్కువైంది. ఈ లెక్కలను ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రోబోటిక్స్ (ఐఎఫ్ఆర్) వెల్లడించింది. ఈ కొనుగోళ్లతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం రూ. 82 వేల కోట్లకు చేరింది. ఇళ్లల్లో వాడే రోబోల అమ్మకాలు మున్ముందు ఊపందుకుంటాయని, ఏటా 46 శాతం వరకు పెరుగుదల ఉంటుందని ఐఎఫ్ఆర్ వివరించింది. 2022లో దాదాపు 5.5 కోట్ల రోబో యూనిట్ల కొనుగోళ్లు జరుగుతాయని అంచనా వేసింది. స్పేస్‌లోకి కూడా.. వివిధ రకాల పరిశోధనలకోసమని రోబోలను స్పేస్‌లోకి కూడా పంపారు. ఎందుకంటే.. తక్కువ డబ్బుతోనే రకరకాల నైపుణ్యాలతో వీటిని తయారు చేయొచ్చు. పైగా రోదసీలో ఆస్ట్రొనాట్లు చేయలేని ప్రమాదకరమైన పనులను రోబోలతో చేయించవచ్చు. ‘చిట్టి’ లాంటి రోబోలు .. ఈ ఏడాది కొత్త రకం రోబోలు ముందుకొచ్చాయి. అచ్చం మనుషుల్లా ఉండే హ్యూమనాయిడ్ రోబోలు, ఓషన్ రోబోలను వార్తల్లో కనిపించాయి. స్వరాన్ని గుర్తు పట్టడం, వైద్య చికిత్సల్లో పాలు పంచుకోవడం లాంటి అదనపు నైపుణ్యాలను వీటికి జోడించారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్ బార్బెక్యూ స్టైల్లో వండిపెడుతుంది..
ఉద్ధేశ్యపూర్వకంగా ఆహారాన్ని వృద్ధా చేయడం ఎవరికీ మనస్కరించదు. కాని కొన్ని సార్లు ప్యాకెట్లు కట్ చేశాక తిరిగి ఉపయోగించుకోలేం. ఈ ఎలక్ట్రిక్ పరికరాలు అవసరాన్ని బట్టి ప్యాకెట్‌ని కట్ చేస్తాయి. బార్బెక్యూ స్టైల్లో వండి వార్చెస్తాయి. ఇంకా ఎన్నో.. సరసమైన ధరల్లోనే.. కట్టర్ – సీలర్ ఈ రోజుల్లో పప్పు, ఉప్పు దగ్గర నుంచి స్నాక్స్, మసాలా పౌడర్స్ వరకూ అన్నీ ప్యాకెట్స్‌లోనే లభిస్తున్నాయి. వాటిని ఒక్కసారి కట్ చేస్తే.. ఏదో ఒక మూత ఉన్న బాక్స్‌లో దాచి పెట్టాల్సిందే. లేదంటే పురుగుపట్టడమో, మెత్తపడిపోవడమో, పాడైపోవడమో.. ఇలా ఏదొక సమస్యతో చెత్తబుట్టలో వెయ్యాల్సిన పరిస్థితి. అలాంటి సమస్యని దూరం చేస్తుంది ఈ కట్టర్ – సీలర్. కట్ చేసిన ప్లాస్టిక్ కవర్ని తిరిగి అతికిస్తుంది. లోపలున్నది బయటికి రాకుండా.. బయట గాలి లోపలికి వెళ్లకుండా చేస్తుంది. అవసరాన్ని బట్టి ప్యాకెట్‌ని కట్ చేస్తుంది. దీన్ని పిన్నుల మెషిన్ వాడినట్లుగా ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ 2 ఇన్ 1 డివైజ్‌కి చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది.పైన ఉన్న రెగ్యులేటర్‌ని అటు ఇటు తిప్పుతూ సరైన రీతిలో అమర్చుకోవడంతో, కట్టర్‌గా లేదా సీలర్గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని అందుబాటులో ఉంచుకోవడానికి వెనుక మ్యాగ్నెట్‌తో పాటు ఒకవైపు చిన్న హ్యాంగర్ బెల్ట్ ఉంటుంది. దాంతో ఇనుప వస్తువుకు అటాచ్ చేసుకోవచ్చు లేదా హ్యాంగర్‌కి తగిలించుకోవచ్చు. ఇవే మోడల్స్‌లో బ్యాటరీతో నడిచేవి కూడా అందుబాటులో ఉన్నాయి. అవి చాలా తక్కువ ధరలోనే దొరుకుతున్నాయి. అయితే చార్జింగ్‌తో నడిచే ఇలాంటి డివైజ్‌కి మన్నిక ఎక్కువగా ఉంటుంది. ధర 28 డాలర్లు (రూ.2,111) ర్యాపిడ్ ఎగ్ కుకర్ కూరల నుంచి కేక్స్ వరకూ వంటకాల్లో గుడ్డు మస్ట్ అంటారు కొందరు. ది బెస్ట్ అంటుంటారు ఇంకొందరు. అలాంటి వారి కోసమే ఈ ర్యాపిడ్ ఎగ్ కుకర్. ఇందులో సుమారు తొమ్మిది గుడ్లను ఒకేసారి ఉడికించుకోవడానికి కుకింగ్ ర్యాక్ ఉంటుంది. అడుగున నీళ్లు పోసుకుని, పైన ఆ ర్యాక్ పెట్టుకుని గుడ్లు ఉడికించుకోవచ్చు. లేదంటే ఐదు గుంతలతో కూడిన ఎగ్ పౌచింగ్ ట్రేలో టేస్టీ ఎగ్ పౌచ్‌లు తయారు చేసుకోవచ్చు. అంతే కాకుండా ఆమ్లెట్స్ వేసుకోవడానికి ఆమ్లెట్ ట్రే అదన ంగా లభిస్తాయి. ఈ డివైజ్ మొత్తం నాణ్యమైన స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందింది. పౌచింగ్ ట్రే ఒక్కటే నాన్ స్టిక్ మెటీరియల్‌తో తయారైంది. ఇక దీనిపైన మూత కూడా చాలా ప్రత్యేకంగా చూడటానికి క్లాస్ లుక్‌తో ఉంటుంది. ఇందులో 5 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకూ టైమర్ స్విచ్ ఉంటుంది. కుకింగ్ పూర్తి అయిన వెంటనే ఇండికేషన్ లైట్ వెలుగుతుంది. ధర 44 డాలర్లు (రూ.3,302) గ్యాస్ ఓవెన్ గ్రిల్ స్నేహితులతో, బంధువులతో దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు.. స్వయం పాకాలే బెటర్ అంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఈ గ్యాస్ ఓవెన్ గ్రిల్. దీన్ని ఎక్కడికైనా సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీనిపై చికెన్, మటన్, ఫిష్ వంటి నాన్‌వెజ్ ఐటమ్స్‌తో పాటు వెజ్ ఐటమ్స్‌ని కూడా.. బార్బెక్యూ స్టైల్లో రెడీ చేసుకోవచ్చు. దీన్ని ఆన్ చేసిన కొన్ని నిమిషాలకే 400 డిగ్రీల సెన్సియస్ టెంపరేచర్‌కు చేరుకుంటుంది. దీని రేడియేషన్ టెక్నాలజీ చాలా వేగంగా ఎముకులను సైతం మెత్తగా ఉడికించేస్తుంది. దీనిపైన కబాబ్స్, కట్లెట్స్ వంటి వెరైటీలతో పాటు.. పెద్ద పిజ్జాని తయారుచేసుకోవచ్చు. గాడ్జెట్‌కి ముందువైపు టెంపరేచర్ సెట్ చేసుకునే రెగ్యులేటర్ ఉంటుంది. పైన ఏ టెంపరేచర్లో నడుస్తుందో సూచించే ఇండికేటర్ కనిపిస్తుంది. దీని అటాచ్డ్ లిడ్(మూత).. కదలకుండా ఉండేందుకు కుడివైపు లాక్ చేసుకునే వీలుంటుంది. వెనుక వైపు మినీ గ్యాస్ సిలెండర్ పెట్టుకుని కుక్ చేసుకోవచ్చు. ధర 178 డాలర్లు (రూ.13,356) చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా
కరోనా కారణంగా ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సి వస్తుంది. కొన్ని సార్లు మనం మాట్లాడే మాటల్ని ఎదుటి వారికి స్పష్టం చెప్పేందుకు మాస్క్‌లు తీస్తుంటాం. అదే సమయంలో నోట్లో నుంచి బయటకు వెళ్లే గాలి కళ్లద్దాల్లోకి వెళ్లి మసక ఏర్పడుతుంది. మాస్క్ ధరించి గాలి పీల్చడం సమస్యగా మారింది. అందుకే మాస్క్ ధరించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్లు ఎలక్ట్రానిక్ సంస్థలు గాడ్జెట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ఎల్జీ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఫేస్ మాస్క్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాట్లాడే సమయంలో మాస్క్ తీయాల్సి ఉంటుంది. కానీ, ఎల్జీ అందుబాటులోకి తెచ్చిన ఈ ఫేస్ మాస్క్ తీసే పనిలేకుండా ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్లతో ఓ మాస్క్‌ను తయారు చేసింది. మన మాటలు ఎదుటి వారికి అర్ధమయ్యేలా చేస్తుంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీ, 94 గ్రాముల బరువు ఉండే ఈ మాస్క్ ధరిస్తే తీసే అవసరం ఉండదు. దీన్ని రెండు గంటల పాటు ఛార్జ్ చేస్తే 8గంటల పాటు పనిచేస్తుంది. పీల్చే గాలిని ఫ్యూరిఫైర్ చేయడమే కాదు,కళ్లదాల్లోకి గాలివెళ్లకుండా చూసుకుంటుంది. నోటితోపాటు చెంపల్ని కవర్ చేస్తోందని ఎల్జీ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు కొన్ని గంటల పాటు ధరించిన అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది. ఇక, ఈ పరికరం ఆగస్ట్ నెలలో థాయ్‌లాండ్ మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధం కాగా.. ఇతర దేశాల్లో విడుదల చేసేందకు రెగ్యులేటర్ల ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఇండియా మార్ట్‌లో దీని ధర రూ.32.200గా ఉంది. -
ఫోన్ల లోడుతో వెళ్తున్న ట్రక్ బోల్తా.. ఎగబడ్డ జనం, మొత్తం స్వాహా!
సాక్షి, ముంబై: మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకెళ్తున్న ఓ ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ట్రక్కులో ఉన్న వస్తువులను స్థానికులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మహరాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో షోలాపూర్-ఔరంగాబాద్ హైవేపై చోటుచేసుకుంది. ట్రక్కు నుంచి సుమారు రూ.70 లక్షల విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికులు ఎత్తుకెళ్లిన వస్తువులను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోతీచంద్ రాథోడ్ పేర్కొన్నారు. పోలీసుల విజ్ఞప్తితో కొందరు తిరిగి అప్పగించారు. కాగా ఇప్పటివరకు 40 శాతం వరకు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చదవండి: మాజీ డీఎస్పీ ఇంట్లో చోరీ.. బంగారం, డబ్బు మాయం -
గృహోపకరణాలకు పెద్దపీట
సాక్షి, అమరావతి: కోవిడ్ దెబ్బతో కొనుగోళ్ల విషయంలో ప్రజల ఆలోచనా విధానం సమూలంగా మారిపోయింది. గృహోపకరణాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రధానంగా సినిమా హాళ్లు మూత పడటంతో వినోదం కోసం ప్రజలు ఇంటినే ఒక సినిమా హాలుగా మార్చుకుంటున్నారు. డబ్బున్న వారు హోమ్ థియేటర్ సమకూర్చుకుంటుంటే.. మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు పెద్ద స్క్రీన్లు ఉన్న టీవీలను కొని తెచ్చుకుంటున్నారు. కోవిడ్ వల్ల పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ విధానంలో రిలీజ్ చేస్తుండటంతో వాటిని ఇంటి వద్ద నుంచే చూడటానికి అనువుగా పెద్ద స్క్రీన్ల టీవీలపై మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎల్ఈడీ టీవీ అమ్మకాల్లో 32 అంగుళాలవి ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు 43 అంగుళాలు, అంత కంటే ఎక్కువ సైజు ఉన్న టీవీలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని విజయ్ సేల్స్ (పాత టీఎంసీ) ప్రతినిధి అశోక్ కుమార్ తెలిపారు. గతంతో పోలిస్తే హోమ్ థియేటర్ల అమ్మకాలు 50 శాతం పెరగ్గా, పెద్ద ఎల్ఈడీ టీవీల అమ్మకాల్లో 30 శాతం వృద్ధి కనిపిస్తోందని డీలర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో పిల్లలకు ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగడంతో ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్ల అమ్మకాలు సైతం భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి దేశంలో రికార్డు స్థాయిలో 5.43 కోట్ల మొబైల్ ఫోన్లు దిగుమతి అయ్యాయంటే డిమాండ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోవిడ్ దెబ్బతో రాష్ట్రంలో అనేక రంగాల్లో పారిశ్రామిక ఉత్పత్తి క్షీణిస్తే, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ల తయారీలో మాత్రం భారీ వృద్ధి నమోదైంది. ఏప్రిల్–ఆగస్టు మధ్య కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 71.18 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పని మనిషికి బైబై.. ► కరోనా మహమ్మారి భయంతో చాలా మంది పని మనుషులకు టాటా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా డిష్ వాషర్లకు డిమాండ్ పెరిగింది. గతంలో నెలకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి రెండు డిష్ వాషర్లు అమ్మడం గగనంగా ఉండేదని, అలాంటిది ఇప్పుడు నెలకు 600 వరకు అమ్ముతున్నట్లు సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ పి.భాస్కర మూర్తి తెలిపారు. ► ఒక్కసారిగా డిష్ వాషర్లకు డిమాండ్ పెరగడంతో దానికి తగ్గట్టుగా సరఫరా ఉండటం లేదని, దీంతో బుకింగ్ చేసుకున్న 15 రోజులకు గానీ సరఫరా చేయలేకపోతున్నామని విజయ్ సేల్స్ ప్రతినిధి అశోక్ తెలిపారు. ► వాషింగ్ మెషీన్లకూ డిమాండ్ పెరిగినా, ఇప్పుడు గతేడాది స్థాయిలోనే అమ్మకాలు జరుగుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో దసరా అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 15 శాతం వరకు వృద్ధి నమోదైంది. దీంతో దీపావళి పండగ అమ్మకాలపై డీలర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇందుకోసం క్యాష్ బ్యాక్ ఆఫర్లు, స్క్రాచ్ కార్డులతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. -
మన ఆట మొదలైంది
గోరో మజిమా తెలుసా? ఎందుకు తెలియదు, జపాన్ డిజిటల్ గేమ్ ‘యకుజ’లో ఒక క్యారెక్టర్. ‘క్రొటాస్’ ఎవరో చెప్పుచూద్దాం? ‘గాడ్ ఆఫ్ వార్’ గేమ్‌లో వారియర్. అమెరికా నుంచి జపాన్ వరకు ఏ ‘డిజిటల్ గేమ్’ గురించి అడిగినా చెప్పగలిగే మన ‘జ్ఞానం’ ఇప్పుడు సృజనాత్మకత వైపు పరుగులు +తీస్తోంది. ‘గేమ్’ను ఆస్వాదించడమే కాదు మనవైన దేశియ గేమ్స్‌ను రూపొందించడానికి యువత సై అంటోంది.... కోవిడ్ చాస్తున్న కోరలకు చిన్నా,పెద్దా పరిశ్రమలు తుఫాను ముందు చిగురుటాకులా వణికిపోయాయి. గేమింగ్ కంపెనీలు మాత్రం తడబడకుండా అరేబియన్ గుర్రంలా దూసుకెళ్లాయి. లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న ప్రజలకు వినోదాన్ని కలిగించడానికి వీలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లాంటి సంస్థలు ప్రముఖ గేమింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం, సినిమాలు, టీవీ షోల కంటే రాబోయేకాలం ‘గేమింగ్’ పరిశ్రమదే అని రిలయన్స్ అధినేత అనడం....వాటి శక్తి ఏమిటో ఊహించుకోవచ్చు. గూగుల్–కెపీఎంజీ రిపోర్ట్ ప్రకారం 2021 నాటికి మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ ఏడు వేల కోట్లు, 2023 నాటికి పదకొండువేల కోట్లు దాటుతుందట. అమెరికన్, జపాన్ కంపెనీల స్ఫూర్తితో డిజిటల్ గేమ్ రంగంలోకి దిగిన ధృవ, నజర, గేమ్స్ 2 విన్...మొదలైన సంస్థలు ‘లోకల్ కంటెంట్’ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. అయితే అప్పట్లో స్మార్ట్ఫోన్ల హవా లేకపోవడం, వేరే దేశాల్లోలాగా గేమింగ్ యాప్స్‌ను కొనడం లేదా చందాల రూపంలో డబ్బు వెచ్చించడానికి సుముఖంగా ఉండకపోవడం, గేమింగ్ అనేది పనిపాటలేని వ్యవహారం అనుకోవడంలాంటి పరిమితులు ఉండేది. స్మార్ట్ఫోన్ల ప్రభంజనంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. మరోవైపు గేమింగ్ అనేది మరీ అంత తీసిపారేయతగినది కాదని, మల్టీటాస్కింగ్ నైపుణ్యం పెరుగుతుందనే స్పృహ వచ్చింది. ఒకప్పుడు పిల్లల పత్రిక ‘చందమామ’ను పెద్దలు కూడా పిల్లలై చదివినట్లే, ఇప్పుడు పిల్లలు, యువతే కాకుండా పెద్దలు కూడా గేమింగ్ పట్ల ఆసక్తి చూపడం మరో సానుకూల అంశంగా మారింది. గేమింగ్ రంగంలో ఉజ్వల భవిష్యత్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించడానికి ద్వారాలు తెరిచింది గేమింగ్ ఇండస్ట్రీ. బార్డర్స్ల్యాండ్, సూపర్ మారియో, రాకెట్ లీగ్, లీగ్ ఆఫ్ లెజెండ్స్,లెజెండ్ ఆఫ్ జెల్డా....ఇంకా ఎంత కాలం మనవి కాని ఆటలు! మన ఆట మొదలుపెట్టడానికి ఇదే సరిౖయెన టైమ్. ‘డిజిటల్ గేమింగ్ సెక్టర్లో అద్భుత అవకాశాలు ఉన్నాయి.మన సంస్కృతి,జానపదకథల్లో నుంచి సబ్జెక్ట్‌లను డెవలప్ చేయండి’ అని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. గేమింగ్ అంటే ఇష్టం ఉందా? కొత్తగా ఆలోచించే సృజనాత్మకత మీ సొంతమా? ...ఇక మీరు గేమింగ్ ప్రియులుగా మాత్రమే ఉండనక్కర్లేదు. మీకు ఇష్టమైన రంగంలోనే కాలరెత్తుకోదగ్గ ఉద్యోగాలతో పదిమంది మెప్పు పొందవచ్చు. అటు చూడండి...గేమ్ప్రొగ్రామర్, గేమ్ డిజైనర్, నెరెటీవ్ డిజైనర్, టెక్చర్ ఆర్టిస్ట్, గేమ్ రైటర్, ఆర్ట్ డిజైనర్,టూల్ డెవలపర్...ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ,పీజీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదండి...మీ ఇష్టాన్నే పెట్టుబడిగా పెట్టి గేమింగ్ స్టార్‌గా ఎదగడానికి. గేమింగ్ స్టార్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టర్లో వుమెన్ ఎంటర్ప్రెన్యూర్లు పెరుగుతున్నారు.వీరిలో కొందరు: కీర్తిసింగ్– హిట్ వికెట్(క్రికెట్ స్ట్రాటజీ గేమ్), హర్ష సచ్దేవ–ఫనీయరన్(మనీ గేమింగ్ ప్లాట్‌ఫాం),అర్పిత కపూర్–మెక్ మోకా(మల్టీ ప్లేయర్ సోషల్ గేమింగ్ ప్లాట్‌ఫాం), నేహా పాండే–లీగ్స్ఎక్స్ (ఫాంటసీ ఫుట్‌బాల్ గేమింగ్ ప్లాట్‌ఫాం) సరిలేరు మీకెవ్వరు కథల గురించి ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన పురాణాల నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ఆ పనే చేసింది ఓగ్రి హెడ్ స్టూడియో. ఓగ్రి వారి ‘అసుర’ బంపర్‌హిట్ అయింది. తాజాగా ఇండియన్ గేమ్ డెవలపింగ్ కంపెనీ ఎన్కోర్, ఫౌజీ(ఫీయర్లెస్ అండ్ యునైటెడ్) అనే యాక్షన్ గేమ్‌ను ప్రకటించింది.మన సైనికుల సత్తా చాటే షూటింగ్ గేమ్ ఇది. ► టెక్...టాక్ apple ipad air 4 టస్క్రీన్ సైజ్: 10.9 అంగుళాలు టరెజల్యూషన్: 2360x1640 పిక్సెల్స్ టస్టోరేజ్: 64జీబి, 256జీబి కలర్స్: సిల్వర్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్, గ్రీన్, స్కై బ్లూ టచ్ ఐడీ సెన్సర్ స్టీరియో స్పీకర్స్ యాపిల్ పెన్సిల్ 2 సపోర్ట్ మ్యాజిక్ కీ బోర్డ్ సపోర్ట్ రిలీజ్: అక్టోబర్ jebjuke bar జెబ్రోనిక్స్ jeb-juke సౌండ్‌బార్ ఇండియాలో లాంచ్ అయింది. మల్టీపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్, సింపుల్ సెటప్‌తో వస్తున్న ఈ సౌండ్‌బార్ శబ్దసౌందర్యాన్ని మరింత దగ్గర చేస్తుంది, 2.1 స్పీకర్ సెటప్ 5.0 బ్లూటూత్, రిమోట్ సౌకర్యం ధర: రూ:17,999 ► గ్యాడ్జెట్ బజార్ పే–పవర్డ్ వాచ్ ప్రముఖ వాచ్ కంపెనీ టైటాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా ‘టైటాన్ పే’ పేరుతో పే–పవర్డ్ వాచ్‌ని లాంచ్ చేసింది. డెబిట్ కార్డు ఉపయోగించాల్సిన పనిలేకుండానే ‘టైటాన్ పే’ను టాప్ చేసి పాయింట్–ఆఫ్–సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. వాచ్ ‘స్ట్రాప్’లో ఉండే ఎన్ఎఫ్సి (నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్) సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లకు పరిమితం. పురుషులు(రూ.2,995), స్త్రీలకు(రూ.3,895) వేరు వేరు ధరల్లో ఈ వాచ్‌లను తయారుచేశారు. ► రైడర్ యువర్ హైనెస్... ఇటీవల హార్నెట్ 2.0 లాంచ్ చేసిన హోండా మోటర్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) ఈ నెలాఖరులో తమ బ్రాండ్ న్యూ మోటర్ సైకిల్‌ను లాంచ్ చేయనుంది. ‘యువర్ హైనెస్...గెట్ రెడీ ఫర్ మెజెస్టిక్ లాంచ్’ అంటూ టీజర్ కూడా రిలీజ్ చేసింది. సరికొత్త అప్డెట్స్తో ఇండియన్ మార్కెట్‌కు అనుగుణంగా క్రూయిజర్ స్టైల్లో రాబోతున్న ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ అంటున్నారు. కొత్త బైక్‌కు సంబంధించి అధికారికంగా మాత్రం ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. ► సోషల్ మీడియా ఫేస్బుక్ క్యాంపస్ ఫేస్బుక్ అనేది క్యాంపస్‌లోనే పుట్టిన ఆలోచన. ఎఫ్బీ తన మూలాలను వెదుక్కుంటూ క్యాంపస్‌లోకి వెళుతుంది. ‘ఫేస్బుక్ క్యాంపస్’ పేరుతో తాజాగా కొత్త ఫీచర్‌ను ప్రకటించింది కంపెనీ. క్లాస్మెట్లతో కనెక్ట్ కావడానికి, గ్రూపులలో చేరడానికి, క్యాంపస్ ఈవెంట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, క్యాంపస్ డైరెక్టరీ ద్వారా క్లాస్మెట్లతోనే కాకుండా తమ విద్యాసంస్థలోని ఇతర విద్యార్థులు, మాజీ విద్యార్థులతో స్నేహం చేయడానికి ప్రైవేట్ స్పేస్‌గా ఎఫ్బీ క్యాంపస్ ఉపయోగపడుతుంది. ‘కరోనా ప్రభావంతో చాలామంది విద్యార్థులు క్యాంపస్‌కు రావడం లేదు. ఇప్పుడు క్యాంపస్‌ను కళ్ల ముందుంచడానికి మా ఫీచర్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఫేస్బుక్ క్యాంపస్ ప్రొడక్ట్ మెనేజర్ ఛార్మిన్ హంగ్. యంగ్ జెనరేషన్పై ఎఫ్బీ పట్టుకొల్పోతుందని కొన్ని ‘స్టడీ’లు చెబుతున్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకోవడానికే ‘ఫేస్బుక్ క్యాంపస్’ ఫీచర్‌తో ముందుకు వస్తుందనేది కొందరి అంచనా. అమెరికాలో ప్రస్తుతం 30 విశ్వవిద్యాలయాల్లో ‘పైలట్‌ప్రాజెక్ట్’గా పరీక్షించబడుతున్న ‘ఫేస్బుక్ క్యాంపస్’లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. -
మరోసారి దిగుమతి సుంకం పెంపు : ఇక ఆ వస్తువులు కాస్ట్లీ!
న్యూఢిల్లీ : గత నెలలో దాదాపు 19 వస్తువులపై దిగుమతి సుంకాన్ని పెంచిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎలక్ట్రానిక్ వస్తువులు, టెలికాం పరికరాలపై కూడా దిగుమతి సుంకాలను పెంచుతున్నట్టు ప్రకటించింది. చారిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోతున్న రూపాయిని కాపాడేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీంతో కరెంట్ అకౌంట్ లోటును పూడ్చాలని ప్రభుత్వం భావిస్తోంది. నేటి నుంచి పెరిగిన ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. గతనెలలోనే హై-ఎండ్ కన్జ్యూమర్ వస్తువులు అంటే వాషింగ్ మిషన్లు, ఎయిర్ కండీషర్, ఫుట్‌వేర్, డైమాండ్స్, జెట్ ఫ్యూయల్‌పై దిగుమతి సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెంచిన దిగుమతి సుంకాలతో మరికొన్ని వస్తువులపై కూడా ధరలు పెరగనున్నాయి. ఇక నుంచి ఏయే వస్తువుల ఖరీదైనవిగా మారబోతున్నాయో ఓసారి చూద్దాం... మొబైల్ ఫోన్లు : బేస్ స్టేషన్లు, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ ఇక్విప్మెంట్, ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ ప్రొడక్ట్‌లు, ఐపీ రేడియోలు వంటి టెలికాం ఉత్పత్తులపై దిగుమతి సుంకం ప్రస్తుతమున్న 10 శాతం నుంచి 20 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై కూడా లెవీని పెంచింది. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు మరింత పెరగనున్నాయి. ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు : ఈ రెండు వస్తువులపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి పెరిగింది. వేసవికాలం అయిపోవడంతో, ఈ డ్యూటీ పెంపుతో ఎయిర్ కండీషనర్లపై అంత పెద్ద ప్రభావేమీ పడదని తెలుస్తోంది. వాషింగ్ మిషన్లు : 10 కేజీల సామర్థ్యం కంటే తక్కువ బరువున్న వాషింగ్ మిషన్లపై దిగుమతి సుంకం 10 శాతం నుంచి 20 శాతానికి ఎగిసింది. దాదాపు వాషింగ్ మిషన్ల ధరలు పెరగనున్నాయి. విమానాలు : సెప్టెంబర్27న ప్రభుత్వం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై 5 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. ఈ సుంకం విధింపుతో, విమాన టిక్కెట్ల ధరలు ఖరీదైనవిగా మారబోతున్నాయి. మరోవైపు జెట్ ఫ్యూయల్‌పై ఎక్సైజ్ డ్యూటీని 14 శాతం నుంచి 11 శాతానికి తగ్గింది. ఇది ఏవియేషన్ ఇండస్ట్రీకి కాస్త ఊరట. జువెల్లరీ : జువెల్లరీ ఆర్టికల్స్‌పై కూడా దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచింది. దీంతో ఇవి కూడా ధరలు పెరగనున్నాయి. శానిటరీ వేర్ : ప్లాస్టిక్‌తో రూపొందే బాత్, షవర్ బాత్, సింక్, వాషింగ్ బేసిన్లపై కూడా దిగుమతి సుంకాలను 10 శాతం నుంచి 15 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచింది. ట్రావెల్ గేర్ : ట్రంకులు, సూట్‌కేసులు, ఎగ్జిక్యూటివ్ కేసులు, బ్రీఫ్‌కేసులు, ట్రావెల్ బ్యాగులపై కూడా దిగుమతి సుంకం 10 శాతం నుంచి 15 శాతం పెరిగింది. ప్లాస్టిక్ మెటీరియల్: బాక్సులు, కేసు, కంటైనర్లు, బాటిళ్ల డ్యూటీ 10 శాతం నుంచి 15 శాతం పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇదే విధమైన పెంపును టేబుల్‌వేర్, కిచెన్వేర్, ఇతర గృహోపకర ప్లాస్టిక్ వస్తువులపై కూడా పెంచింది. ఆఫీసు స్టేషనరీ, ఫర్నీచర్ ఫిట్టింగ్, డెకోరేటివ్ షీట్లు, బ్యాంగిల్స్ వంటి వాటిపై కూడా సుంకాలను కేంద్రం పెంచేసింది. -
డీవీడీలలో బంగారం
వైజాగ్: విశాఖ విమానాశ్రయంలో భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. ఎలక్ట్రానిక్ వస్తువుల్లో దాచి ఉంచి అక్రమంగా తరలిస్తుండగా పోలీసుల కంటపడింది. దాదాపు వందమంది ప్రయాణికులు అనుమానాస్పదంగా సంచరిస్తూ ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు వీరిని ప్రశ్నించినపుడు ఈ విషయం బయటపడింది. డీవీడీ ప్లేయర్లు, మైక్రోవేవ్ అవెన్లలో దాచి ఉంచిన 55 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం కౌలాలంపూర్, సింగపూర్ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వీరంతా తమిళనాడుకు చెందిన వారుగా తెలుస్తోంది. మొత్తం 18 మంది వద్ద బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ నెలలో బంగారం పట్టుబడటం ఇది మూడోసారి. ఇంతకుముందు ఒకసారి 12 కిలోల బంగారం పట్టుబడింది. ఇప్పుడు మరింత ఎక్కువగా.. ఏకంగా 55 కిలోలు పట్టుబడింది. ఇటీవలి కాలంలో శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో పట్టుబడుతుండటంతో స్మగ్లర్లు విశాఖవైపు దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. ఎయిర్ కనెక్టివిటీ పెరగడంతో మలేషియా, దుబాయ్ వైపు వెళ్లే విమానాల ద్వారానే ఈ అక్రమ రవాణా సాగుతోందని సమాచారం.