కరోనా కారణంగా ప్రతిఒక‍్కరూ మాస్క్‌లు ధరించాల్సి వస‍్తుంది. కొన్ని సార్లు మనం మాట్లాడే మాటల్ని ఎదుటి వారికి స్పష్టం చెప్పేందుకు మాస్క్‌లు తీస్తుంటాం. అదే సమయంలో నోట్లో నుంచి బయటకు వెళ్లే గాలి కళ్లద్దాల్లోకి వెళ్లి మసక ఏర్పడుతుంది. మాస్క్ ధరించి గాలి పీల్చడం సమస్యగా మారింది. అందుకే మాస్క్ ధరించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్లు ఎలక్ట్రానిక్ సంస్థలు గాడ్జెట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి.
తాజాగా ఎల్జీ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఫేస్ మాస్క్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాట్లాడే సమయంలో మాస్క్ తీయాల్సి ఉంటుంది. కానీ, ఎల్జీ అందుబాటులోకి తెచ్చిన ఈ ఫేస్ మాస్క్ తీసే పనిలేకుండా ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్లతో ఓ మాస్క్‌ను తయారు చేసింది. మన మాటలు ఎదుటి వారికి అర్ధమయ్యేలా చేస్తుంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీ, 94 గ్రాముల బరువు ఉండే ఈ మాస్క్ ధరిస్తే తీసే అవసరం ఉండదు. దీన్ని రెండు గంటల పాటు ఛార్జ్ చేస‍్తే 8గంటల పాటు పనిచేస‍్తుంది.
పీల్చే గాలిని ఫ్యూరిఫైర్ చేయడమే కాదు,కళ్లదాల్లోకి గాలివెళ్లకుండా చూసుకుంటుంది. నోటితోపాటు చెంపల్ని కవర్ చేస్తోందని ఎల్జీ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు కొన్ని గంటల పాటు ధరించిన అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది. ఇక, ఈ పరికరం ఆగస్ట్ నెలలో థాయ్‌లాండ్ మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధం కాగా.. ఇతర దేశాల్లో విడుదల చేసేందకు రెగ్యులేటర్ల ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఇండియా మార్ట్‌లో దీని ధర రూ.32.200గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment