speakers
-
హిందీపై డీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
చెన్నై: డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష మాట్లాడే ఉత్తరప్రదేశ్, బిహార్‌కు చెందిన వ్యక్తులు తమిళనాడులో టాయిలెట్లు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని అన్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ జాతీయ ప్రతినిధి షెహబాద్ పూనావాలా స్పందించారు. దేశాన్ని ఉత్తర, దక్షిణ, భాష, కులం, మతం ఆధారంగా విభజించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందని షెహబాద్ పూనావాలా విమర్శించారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ వాడిన భాష దురదృష్టకరమని అన్నారు. మారన్ వ్యాఖ్యలపై యూపీ, బిహార్ నేతలు మౌనం వహించడాన్ని ఆయన తప్పుబట్టారు. డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ఓ సభలో మాట్లాడుతూ హిందీ ప్రముఖ్యతను తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్, హిందీ, భాషలను పోల్చారు. ఇంగ్లీష్ నేర్చుకున్నవారు ఐటీ ఉద్యోగాల్లో చేరితే హిందీ నేర్చుకున్నవారు చిన్న కొలువుల్లో చేరుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే హిందీ మాట్లాడే యూపీ, బిహార్ ప్రజలు తమిళనాడులో నిర్మాణ రంగంలో, రోడ్లు, టాయిలెట్లు క్లీనింగ్ చేస్తున్నారని అన్నారు. ఇదీ చదవండి: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ -
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం
బన్సీలాల్‌పేట్: రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులను, అధికారాలను హరిస్తోందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో మంగళవారం సహకార సమాఖ్యవాదం –ప్రస్తుత సవాళ్లు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తిని కాలరాసే విధంగా రాజకీయ నిర్ణయాలతో రాష్ట్రాలను ఇబ్బందులు పెడుతోందన్నారు. ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో అనేక సమస్యలను సృష్టిస్తూ గందరగోళం చేస్తోందని నిందించారు. ప్రముఖ విద్యావేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పీఎల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కె. కేశవరావు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, సీపీఐ కార్యదర్శి కె. సాంబశివరావు, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ఆమ్ఆద్మీ పార్టీ నేత డాక్టర్ సుధాకర్ మాట్లాడారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ.. ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రాల సాధికారతపై దాడి చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్రాల హక్కులను హరిస్తోందని విమర్శించారు. సెస్‌ల పేరిట రాష్ట్రాల ఆర్థికవనరులను దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాష్ట్ర జాబితాలోని అంశాలను కేంద్రం తీసుకొని పార్లమెంట్లో చట్టా లు చేయడమంటే రాష్ట్రాల అధికారాలను నిర్వీర్యం చేయడమేనన్నారు. సీపీఐ రాష్ట్రకార్యదర్శి సాంబశివరావు మాట్లాడుతూ అక్రమాస్తులు పోగు చేసుకొనేవారిని వదిలేసి సమాజహితం కోసం పనిచేస్తున్న వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాలను కేంద్రం జైల్లో పెట్టిందన్నారు. -
అదిరిపోయే ఫీచర్లు, మాస్కులోనే మైక్, స్పీకర్లు ఇంకా
కరోనా కారణంగా ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సి వస్తుంది. కొన్ని సార్లు మనం మాట్లాడే మాటల్ని ఎదుటి వారికి స్పష్టం చెప్పేందుకు మాస్క్‌లు తీస్తుంటాం. అదే సమయంలో నోట్లో నుంచి బయటకు వెళ్లే గాలి కళ్లద్దాల్లోకి వెళ్లి మసక ఏర్పడుతుంది. మాస్క్ ధరించి గాలి పీల్చడం సమస్యగా మారింది. అందుకే మాస్క్ ధరించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్లు ఎలక్ట్రానిక్ సంస్థలు గాడ్జెట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. తాజాగా ఎల్జీ సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఫేస్ మాస్క్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. మాట్లాడే సమయంలో మాస్క్ తీయాల్సి ఉంటుంది. కానీ, ఎల్జీ అందుబాటులోకి తెచ్చిన ఈ ఫేస్ మాస్క్ తీసే పనిలేకుండా ఇన్ బిల్ట్ మైక్, స్పీకర్లతో ఓ మాస్క్‌ను తయారు చేసింది. మన మాటలు ఎదుటి వారికి అర్ధమయ్యేలా చేస్తుంది. 1000 ఎంఏ బ్యాటరీ కెపాసిటీ, 94 గ్రాముల బరువు ఉండే ఈ మాస్క్ ధరిస్తే తీసే అవసరం ఉండదు. దీన్ని రెండు గంటల పాటు ఛార్జ్ చేస్తే 8గంటల పాటు పనిచేస్తుంది. పీల్చే గాలిని ఫ్యూరిఫైర్ చేయడమే కాదు,కళ్లదాల్లోకి గాలివెళ్లకుండా చూసుకుంటుంది. నోటితోపాటు చెంపల్ని కవర్ చేస్తోందని ఎల్జీ అధికారికంగా ప్రకటించింది. దీంతో పాటు కొన్ని గంటల పాటు ధరించిన అసౌకర్యం కలగకుండా చూసుకుంటుంది. ఇక, ఈ పరికరం ఆగస్ట్ నెలలో థాయ్‌లాండ్ మార్కెట్ లో విడుదల చేసేందుకు సిద్ధం కాగా.. ఇతర దేశాల్లో విడుదల చేసేందకు రెగ్యులేటర్ల ఆమోదం కోసం ఎదురు చూస్తుంది. ధర ఇంకా ప్రకటించలేదు. ఇండియా మార్ట్‌లో దీని ధర రూ.32.200గా ఉంది. -
ఫిరాయింపులపై జాప్యం వద్దు
డెహ్రాడూన్: చట్టసభల్ని నడిపించే స్పీకర్లు తటస్థంగా వ్యవహరించాలని, ఫిరాయింపుదార్ల ఆటకట్టించేలా నిర్ణీత కాలవ్యవధిలో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో బిర్లా మాట్లాడారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని సమీక్షించడానికి కొన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో ఒక కమిటీ ఏర్పడిందని, త్వరలోనే అది తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు. ఫిరాయింపులపైనే సదస్సులో చర్చ అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో చివరిరోజైన గురువారం ఫిరాయింపులపైనే ఎక్కువగా చర్చ జరిగిందని ఓం బిర్లా వెల్లడించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లోని ఫిరాయింపు నిరోధక చట్టంపైనే విస్తృతంగా చర్చించామని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగబద్ధంగా తటస్థులుగా ఉండాల్సిన స్పీకర్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే స్పీకర్ల సదస్సులో ఫిరాయింపుల అంశంపై విస్తృతంగా చర్చించారు. ముగింపోత్సవంలో మాట్లాడిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్టీ ఫిరాయింపులు అత్యంత ఆందోళనకరమైనవని అన్నారు. -
దేశీ మార్కెట్లోకి గూగుల్ ’హోమ్’ స్పీకర్స్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా ’హోమ్’ బ్రాండ్ కింద వాయిస్ యాక్టివేటెడ్ స్పీకర్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ–కామర్స్ సంస్థ అమెజాన్‌కి చెందిన ‘ఎకో’ స్మార్ట్ స్పీకర్స్‌తో ఇది పోటీపడనుంది. ’హోమ్’ ధర రూ. 9,999 కాగా ’హోమ్ మినీ’ ధర రూ. 4,499గా ఉంటుంది. ఇవి ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్కార్ట్లోనూ, ఆఫ్‌లైన్‌లో రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ సహా 750 పైచిలుకు రిటైల్ స్టోర్స్‌లో లభిస్తాయి. భారత వినియోగదారుల అవసరాలు, పదాల ఉచ్ఛారణ మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హోమ్ స్పీకర్స్‌ను తీర్చిదిద్దినట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ మేనేజ్మెంట్) రిషి చంద్ర తెలిపారు. స్పీకర్స్ ద్వారా పాటలు, వార్తలు మొదలైన కంటెంట్ ప్రసారాల కోసం సావన్, గానా, ఇండియా టుడే, ఆజ్ తక్ తదితర సంస్థలతో గూగుల్ చేతులు కలిపినట్లు ఆయన వివరించారు. త్వరలోనే హిందీ భాషనూ సపోర్ట్ చేసే విధంగా ’హోమ్’ స్పీకర్స్‌ను మెరుగుపర్చనున్నామన్నారు. -
శాసనసభ ఉద్యోగుల విభజనపై త్వరలో సీఎస్‌లతో భేటీ
► ఉభయ రాష్ట్రాల స్పీకర్ల నిర్ణయం.. మే 10 తర్వాత సమావేశం జరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ, మండళ్లలో పనిచేసే ఉద్యోగుల విభజన అంశంపై త్వరలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహించాలని ఏపీ, తెలంగాణ సభాపతులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎస్.మధుసూదనాచారి నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు దాటుతున్నా ఇంత వరకూ ఉద్యోగుల విభజన పూర్తవలేదు. దీంతో ఉద్యోగుల విభజనతో పాటు పదోన్నతుల అంశాన్నీ పరిశీలించాల్సిందిగా చాలా రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల సభాపతులు శనివారం సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు ఏ.చక్రపాణి, స్వామిగౌడ్, శాసనసభ కార్యదర్శులు రాజా సదారాం. కె.సత్యనారాయణ పాల్గొన్నారు. ఉద్యోగుల విభజన అంశం క్లిష్టతరమైంది కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను భాగస్వాములను చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మే 10 తర్వాత రెండు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇకపై ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరిపేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగుల్లో మెజారిటీ భాగం తమను తెలంగాణ అసెంబ్లీకి కేటాయించాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగుల విభజన సమయంలో ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ తన వాదనగా సమావేశంలో వినిపించింది. -
మైక్రోఫోన్లు, స్పీకర్లు పనిచేసేదిలా...
చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది... కాల్ వస్తే మాట్లాడేస్తాం... లేదంటే ఇయర్ఫోన్లు చెవిలో పెట్టేసుకుని సంగీతం వినేస్తూంటాం. ఇది చాలా కామన్. కానీ ఎప్పుడైనా... మనం మాట్లాడే మాటలు మైక్రోఫోన్ల ద్వారా ఎక్కడో దూరంగా ఉన్న వ్యక్తికి ఎలా చేరుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? రకరకలా సంగీత పరికరాల నుంచి వెలువడే శబ్దాలు ఏకకాలంలో ఇయర్ఫోన్ల ద్వారా అంత స్పష్టంగా ఎలా వినపడుతున్నాయో మీకు తెలుసా? మన గొంతుల్లోంచి, పరికరాల్లోంచి వెలువడే శబ్దాలు కంపనాల రూపంలో గాల్లో అలలు అలలుగా ప్రయాణిస్తాయని మీకు తెలుసుగా... ఆ కంపనాలను విద్యుత్ సంకేతాలుగా మార్చడం ద్వారా మైక్రోఫోన్లు... విద్యుత్ సంకేతాలను తిరిగి కంపనాలుగా మార్చడం ద్వారా స్పీకర్లు పనిచేస్తాయి.... -
నేడు తెలంగాణ, ఏపీ స్పీకర్ల భేటీ
-
నేడు తెలంగాణ, ఏపీ స్పీకర్ల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఒకే రోజు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల స్పీకర్లు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. బుధవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగే వీలుందని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, ఇరు రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు ఒకే రోజు (ఈ నెల 7 నుంచి) మొదలు కావడం ఇదే ప్రథమం కావడంతో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో సమావేశాలను ముగించేందుకు తెలంగాణ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కలసి చర్చించాలని నిర్ణయించారు. వీరితో పాటు రెండు శాసన మండళ్ల చైర్మన్లు భేటీకి హాజరు కానున్నారు. -
సౌండే కాదు.. స్పీకరూ కనిపించదు..
ధ్వని వినిపిస్తుంది.. కనిపించదు.. ఈ విషయం మనకు తెలిసిందే. అయితే, ఇక్కడ స్పీకర్ కూడా కనిపించదు. అయితే, ఇక్కడ పారదర్శక అద్దంలా కనిపిస్తోందే.. అదే స్పీకర్. ఈ అదృశ్య స్పీకర్‌ను అమెరికాకు చెందిన క్లియర్ వ్యూ ఆడియో సంస్థ తయారుచేసింది. ఈ వైర్లెస్ స్పీకర్‌ను ఏదైనా ట్యాబ్లెట్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు. సాధారణ స్పీకర్ల మాదిరిగా కాకుండా ఇది ప్రత్యేకమైన ఎడ్జ్ మోషన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. మామూలు కోన్ స్పీకర్లలో వెనక నుంచి ముందుకు కదలికలు సృష్టించడం ద్వారా ధ్వని ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ మాత్రం పీజోఎలక్ట్రిక్ యాక్టువేటర్స్ పారదర్శకంగా ఉండే ఆక్రలిక్ గ్లాస్ స్టీరియో ట్రాన్స్డ్యూసర్స్ను పక్క నుంచి ప్రేరేపిస్తాయి. ఈ ట్రాన్స్డ్యూసర్లు చాలా పలుచగా, కనిపించకుండా ఉన్నా.. ధ్వనిని మాత్రం బాగా ఉత్పత్తి చేస్తాయి. వచ్చే నెలలో ఇది మార్కెట్లోకి రానుంది. ధర రూ.22 వేలు.