స్పీకర్లు తటస్థం, లోక్‌సభ స్పీకర్, ఓం బిర్లా, అసెంబ్లీ స్పీకర్ల సదస్సు, ఫిరాయింపుల నిరోధక చట్టం
డెహ్రాడూన్: చట్టసభల్ని నడిపించే స్పీకర్లు తటస్థంగా వ్యవహరించాలని, ఫిరాయింపుదార్ల ఆటకట్టించేలా నిర్ణీత కాలవ్యవధిలో నిష్పక్షపాతంగా నిర్ణయాలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్ల సదస్సు ముగింపు కార్యక్రమంలో బిర్లా మాట్లాడారు. ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగుల్ని సమీక్షించడానికి కొన్ని రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో ఒక కమిటీ ఏర్పడిందని, త్వరలోనే అది తన నివేదికను సమర్పిస్తుందని చెప్పారు.
ఫిరాయింపులపైనే సదస్సులో చర్చ
అసెంబ్లీ స్పీకర్ల సమావేశంలో చివరిరోజైన గురువారం ఫిరాయింపులపైనే ఎక్కువగా చర్చ జరిగిందని ఓం బిర్లా వెల్లడించారు. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌లోని ఫిరాయింపు నిరోధక చట్టంపైనే విస్తృతంగా చర్చించామని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీలో 17 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాజ్యాంగబద్ధంగా తటస్థులుగా ఉండాల్సిన స్పీకర్లు దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే స్పీకర్ల సదస్సులో ఫిరాయింపుల అంశంపై విస్తృతంగా చర్చించారు. ముగింపోత్సవంలో మాట్లాడిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పార్టీ ఫిరాయింపులు అత్యంత ఆందోళనకరమైనవని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment