న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా ’హోమ్’ బ్రాండ్ కింద వాయిస్ యాక్టివేటెడ్ స్పీకర్స్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ–కామర్స్ సంస్థ అమెజాన్‌కి చెందిన ‘ఎకో’ స్మార్ట్ స్పీకర్స్‌తో ఇది పోటీపడనుంది. ’హోమ్’ ధర రూ. 9,999 కాగా ’హోమ్ మినీ’ ధర రూ. 4,499గా ఉంటుంది. ఇవి ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్‌లోనూ, ఆఫ్‌లైన్‌లో రిలయన్స్ డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్ సహా 750 పైచిలుకు రిటైల్ స్టోర్స్‌లో లభిస్తాయి.
భారత వినియోగదారుల అవసరాలు, పదాల ఉచ్ఛారణ మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హోమ్ స్పీకర్స్‌ను తీర్చిదిద్దినట్లు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్) రిషి చంద్ర తెలిపారు. స్పీకర్స్ ద్వారా పాటలు, వార్తలు మొదలైన కంటెంట్ ప్రసారాల కోసం సావన్, గానా, ఇండియా టుడే, ఆజ్ తక్ తదితర సంస్థలతో గూగుల్ చేతులు కలిపినట్లు ఆయన వివరించారు. త్వరలోనే హిందీ భాషనూ సపోర్ట్ చేసే విధంగా ’హోమ్’ స్పీకర్స్‌ను మెరుగుపర్చనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment