న్యూఢిల్లీ: మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు (డిజిటల్ టీవీ రిసీవర్లు, యూఎస్‌బీ టైప్–సీ చార్జర్లు, వీడియో నిఘా వ్యవస్థలు –వీఎస్‌ఎస్) సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది. బిల్ట్‌ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఉన్న డిజిటల్ టీవీ రిసీవర్ల కోసం ఐ 18112:2022 స్పెసిఫికేషన్‌ను కేటాయించింది.
ఈ ప్రమాణాలతో తయారైన టెలివిజన్లు .. కేవలం డిష్ యాంటెనాను కనెక్ట్ చేయడం ద్వారా ఉచిత టీవీ, రేడియో చానల్స్‌ను అందుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుతం టీవీ వీక్షకులు వివిధ పెయిడ్, ఉచిత చానల్స్‌ను (ఆఖరికి దూరదర్శన్ ఛానళ్లు) చూడాలంటే సెట్–టాప్ బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటోంది. అటు సీ–టైప్ యూఎస్‌బీలు, కేబుల్స్ మొదలైన వాటికి (IS/IEC62680&1&3:2022) స్పెసిఫికేషన్ కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment