Receivers
-
డిజిటల్ టీవీ రిసీవర్లకు నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు (డిజిటల్ టీవీ రిసీవర్లు, యూఎస్బీ టైప్–సీ చార్జర్లు, వీడియో నిఘా వ్యవస్థలు –వీఎస్ఎస్) సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది. బిల్ట్ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఉన్న డిజిటల్ టీవీ రిసీవర్ల కోసం ఐ 18112:2022 స్పెసిఫికేషన్‌ను కేటాయించింది. ఈ ప్రమాణాలతో తయారైన టెలివిజన్లు .. కేవలం డిష్ యాంటెనాను కనెక్ట్ చేయడం ద్వారా ఉచిత టీవీ, రేడియో చానల్స్‌ను అందుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుతం టీవీ వీక్షకులు వివిధ పెయిడ్, ఉచిత చానల్స్‌ను (ఆఖరికి దూరదర్శన్ ఛానళ్లు) చూడాలంటే సెట్–టాప్ బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటోంది. అటు సీ–టైప్ యూఎస్బీలు, కేబుల్స్ మొదలైన వాటికి (IS/IEC62680&1&3:2022) స్పెసిఫికేషన్ కేటాయించారు. -
తుపాకీతో బెదిరించి.. కాళ్లు, చేతులు కట్టి!
సాక్షి, హైదరాబాద్: నగర శివారులో నిర్మాణమవుతున్న గేటెడ్ కమ్యూనిటీల్లో చొరబడతారు.. సెక్యూరిటీ గార్డులను తుపాకీతో బెదిరిస్తారు.. వారి కాళ్లు, చేతులు తాడుతో కట్టేస్తారు.. ఆపై సీసీ కెమెరా డీవీఆర్లు ధ్వంసం చేసి స్టోర్ రూమ్‌ల్లోని ఎలక్ట్రిక్ సామగ్రి (వైర్ బండిల్స్, ఎంసీబీలు, ప్యానెల్ బోర్డులు)ని దొంగిలిస్తున్న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లకు చెందిన 9 మందితో పాటు ఇద్దరు రిసీవర్లను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్‌లోని పబ్లిక్ సేఫ్టీ– ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ అండ్ డాటా సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో నిందితుల బొలెరో వాహన నంబర్‌ను క్యాప్చర్ చేసి పోలీసులకు మార్గదర్శనం చేయడంతో దుండిగల్ టోల్గేట్ వద్ద కాపుకాసి మరీ పట్టుకున్నారు. రూ.55,10,000 విలువైన వైర్ బండిల్స్, ఎలక్ట్రిక్ వైర్ బండిల్స్, కాపర్ పైప్స్ అండ్ కేబుల్స్, ఎంసీబీ బాక్స్‌లు, బొలెరో వాహనం, ఒక పిస్టల్, 11 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సైబరాబాద్ క్రైమ్స్ ఇన్చార్జి డీసీపీ విజయ్‌కుమార్, శంషాబాద్, బాలానగర్ డీసీపీలు ప్రకాష్‌రెడ్డి, పద్మజారెడ్డి, ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ గోనె సందీప్‌లతో కలిసి గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో సీపీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. చదవండి: మొదటి రాత్రే ఉరివేసుకున్న వరుడు ఢిల్లీలో పరిచయం.. నగరంలో దోపిడీలు రాజస్థాన్ దౌలాపూర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుషావహ, కుల్దీప్, మాధవ్ సింగ్, ధర్మేందర్ సింగ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిహల్ సింగ్, శైలేందర్ సింగ్, సంజయ్, ధర్మేంద్ర కుమార్, సత్యబాన్ సింగ్‌లు వృత్తిరీత్యా ఎలక్ట్రిషియన్లు. ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో వీరు స్నేహితులయ్యారు. స్థిరాస్తి రంగం బాగుందని 2019లో హైదరాబాద్‌కు వచ్చారు. ముప్పా కంపెనీలో ఆరు నెలల పాటు రోజువారీ కూలీలుగా పనికి కుదిరారు. ప్రదీప్ కుషావాన్ మినహా మిగతావారంతా సొంతూళ్లకు వెళ్లిపోయారు. ప్రదీప్ తాను పనిచేసే కంపెనీ నుంచి సెక్యూరిటీ కళ్లుగప్పి రోజుకో వైర్ బండిల్ తీసుకొచ్చి తక్కువ ధరకు విక్రయించేవాడు. అప్పటికే జల్సాలకు అలవాటుపడిన అతను తన గ్యాంగ్‌ను గతేడాది జూన్‌లో రప్పించాడు. వీరు పనిచేసిన డీఈ కంపెనీలోనే వైర్ బండిల్స్ చోరీ చేసి కొండాపూర్‌లో ఎలక్ట్రిక్ షాప్ నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన మనీశ్ కుమార్, స్క్రాప్ షాప్ నడుపుతున్న మహబూబ్‌నగర్‌కు చెందిన గోవుల విజయ్‌కుమార్‌కు విక్రయించారు. వేలాది రూపాయల విలువచేసే వైర్ బండిల్‌ను కేవలం రూ.400కే అమ్మేవారు. ఈ సొమ్మును సమానంగా పంచుకుని సొంతూళ్లకు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ వీరిని ప్రదీప్ ఈ ఏడాది జనవరి 6న పిలిపించాడు. పక్కాగా రెక్కీ.. భవన నిర్మాణ పనులు జరుగుతున్న శంకర్పల్లి, మోకిల్లా, కొండకల్, నార్సింగి, మల్లంపేట, ఆర్సీపురం ప్రాంతాలకు ఉద్యోగం కావాలంటూ బొలేరో వాహనంలో వెళ్లేవారు. స్టోర్ రూమ్, వైర్ బండిల్స్ పరిశీలించేవారు. ఆ తర్వాత రాత్రి 11.30 నుంచి 3 గంటల మధ్యలో ఆయా సైట్లకు వెళ్లి వైర్ల బండిళ్లను దొంగిలించేవారు. వారం వ్యవధిలోనే శంకర్పల్లి, ఆర్సీపురం, దుండిగల్ వరుసగా చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. జనవరి 9న అర్ధరాత్రి దాటాక మల్లంపేటలోని ప్రణీత్ ప్రణవ్ లీప్ విల్లాస్‌లో జరిగిన చోరీపై దుండిగల్‌లో కేసు ఫిర్యాదు రావడంతో బాలానగర్, శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు రమణారెడ్డి, వెంకట్‌రెడ్డి, దుండిగల్, మేడ్చల్ ఇన్స్పెక్టర్లు వెంకటేశం, ప్రవీణ్‌రెడ్డి నేతృత్వంలో బృందాలు రంగంలోకి దిగాయి. చోరీ జరిగిన తీరును తెలుసుకున్న పోలీసులకు నిందితులు వినియోగించిన బొలెరో వాహన కదలికలు సీసీ కెమెరాలకు చిక్కాయి. వాహన నంబర్ ఆధారంగా నిఘా ముమ్మరం చేశారు. దుండిగల్ టోల్గేట్ ప్లాజా వద్ద బుధవారం ఉదయం వాహన తనిఖీలు చేస్తున్న ప్రత్యేక బృందాలకు బొలెరోలోని తుపాకీ, వైర్ బండిల్స్ దొరికాయి. ప్రదీప్ కుషావాహ, కుల్దీప్, శైలేంద్రసింగ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగిలిన నిందితులను నార్సింగ్ ఠాణాలో ఇందిరానగర్‌లో పట్టుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు కృషి చేసిన డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఇతర సిబ్బందిని సీపీ సజ్జనార్ నగదు రివార్డులను అందజేశారు. -
సాహూరే..
సీసీఎస్ బృందానికి చెమటలు పట్టిస్తున్న గజదొంగ రకరకాల రిసీవర్ల పేర్లు చెప్పి ఏమార్చే యత్నం ముంబయి, పూణె చుట్టూ తిరుగుతున్న పోలీసులు విజయవాడ సిటీ : గజదొంగ ప్రకాష్‌కుమార్ సాహూ సీసీఎస్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. చోరీ సొత్తు రికవరీ కోసం సాహూను వెంటపెట్టుకుని వెళ్లిన సీసీఎస్ పోలీసులు ముంబయి, పూణె మధ్య చక్కర్లు కొడుతున్నారు. రోజుకో రిసీవర్ పేరు చెబుతుండటంతో సొత్తు రికవరీ కోసం వెళ్లిన సీసీఎస్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నట్టు తెలిసింది. గతంలోనూ ఇదే పంథా మార్చి 25వ తేదీన ప్రసాదంపాడులోని సాయిబాబా మందిరంలో 40 కిలోల వెండి, ఇతర సామగ్రిని సాహూ చోరీ చేశాడు. ఇది గుర్తించిన పోలీసులు కొద్దిరోజుల కిందట అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సాహూ పట్టివేత విషయం రిసీవర్లకు తెలియడంతో కొందరు అప్రమత్తమయ్యారు. చోరీ సొత్తు ముంబయి, పూణెలో విక్రయించినట్లు సీసీఎస్ అధికారుల విచారణలో సాహూ అంగీకరించడంతో రికవరీ కోసం ప్రత్యేక బృందం సాహూను వెంటబెట్టుకుని ముంబయి వెళ్లింది. అక్కడ అతను చెప్పినట్టుగా రిసీవర్లు లేకపోవడం, పదేపదే పేర్లు మార్చడంతో పోలీసులకు రికవరీ కష్టంగా మారింది. ముంబయి, పూణెలోని పలువురు ఉత్తరాది వ్యాపారుల పేర్లు చెబుతున్న సాహూ వారిని చూపించకుండా ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. గతంలో దుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ కేసులో కూడా సీఐడీ పోలీసులను సాహూ ఇలాగే బోల్తా కొట్టించాడు. 1998లోనే శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య దేవాలయం, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయాల్లో చోరీ జరిగింది. రోజుల వ్యవధిలో జరిగిన రెండు చోరీల్లోనూ గ్యాస్ కట్టర్లే ప్రధాన ఆధారం. భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసులు కావడంతో దర్యాప్తు బాధ్యతను సీఐడీ పోలీసులకు అప్పగించగా సాహూను అరెస్టు చేశారు. అప్పట్లో కూడా పూటకో సమాచారం ఇస్తూ సాహూ సీఐడీ పోలీసులను ఇబ్బందులకు గురిచేశాడు. సాయి మందిరాలే టార్గెట్టా..? మొదటి నుంచి దేవాలయాలనే చోరీలకు ఎంచుకునే సాహూ ఎక్కువగా సాయిబాబా మందిరాల్లోనే ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని సీసీఎస్ వర్గాల సమాచారం. మన రాష్ట్రంతో పాటు కేరళలోని కొన్ని దేవాలయాలను మినహాయిస్తే ఇప్పటివరకు చేసిన 40కిపైగా నేరాల్లో సాయిబాబా మందిరాలే అధికంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాబా మందిరాల్లో అపారమైన సంపద, నామమాత్ర భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు చేసిన అన్ని చోరీల్లోనూ గ్యాస్‌కట్టర్‌తో తలుపులు, గేట్లు తొలగించుకుని లోపలికి ప్రవేశించాడు. పైగా సాహూకు స్థానిక నేరస్తుల సహకారం ఉంటోందని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసినా ఫలితం లేకుండాపోయింది. ఉత్తరాది వ్యాపారులకే విక్రయం సాహూ చోరీ చేసిన దేవుళ్ల కిరీటాలు, ఇతర నగలు గంటల వ్యవధిలోనే ముక్కలుగా చేస్తాడు. గుర్తించేందుకు వీల్లేకుండా చేసి తర్వాత ముంబయి, పూణెలోని ఉత్తరాది వ్యాపారులకు అమ్ముతాడు. కొన్నింటిని కరిగించి అమ్ముతుంటాడు. దేవతల నగలుగా ఆనవాళ్లు లేకుండా చేసి వ్యాపారులకు అనుమానం రాకుండా విక్రయించడంలో సాహూ సిద్ధహస్తుడు. కొందరు వ్యాపారులకు అతను విక్రయించేది దొంగసొత్తు అని తెలిసి కూడా తక్కువ ధరకు వస్తుండటంతో కొంటున్నట్లు సమాచారం.