Digital TV broadcasts
-
డిజిటల్ టీవీ రిసీవర్లకు నాణ్యతా ప్రమాణాలు
న్యూఢిల్లీ: మూడు రకాల ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు (డిజిటల్ టీవీ రిసీవర్లు, యూఎస్బీ టైప్–సీ చార్జర్లు, వీడియో నిఘా వ్యవస్థలు –వీఎస్ఎస్) సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నాణ్యతా ప్రమాణాలను రూపొందించింది. బిల్ట్ఇన్ శాటిలైట్ ట్యూనర్లు ఉన్న డిజిటల్ టీవీ రిసీవర్ల కోసం ఐ 18112:2022 స్పెసిఫికేషన్‌ను కేటాయించింది. ఈ ప్రమాణాలతో తయారైన టెలివిజన్లు .. కేవలం డిష్ యాంటెనాను కనెక్ట్ చేయడం ద్వారా ఉచిత టీవీ, రేడియో చానల్స్‌ను అందుకోవచ్చని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. ప్రస్తుతం టీవీ వీక్షకులు వివిధ పెయిడ్, ఉచిత చానల్స్‌ను (ఆఖరికి దూరదర్శన్ ఛానళ్లు) చూడాలంటే సెట్–టాప్ బాక్సులను కొనుగోలు చేయాల్సి ఉంటోంది. అటు సీ–టైప్ యూఎస్బీలు, కేబుల్స్ మొదలైన వాటికి (IS/IEC62680&1&3:2022) స్పెసిఫికేషన్ కేటాయించారు. -
డిజిటల్ ‘సచివాలయాలు’
సాక్షి, అమరావతి: ఇప్పటికే సచివాలయాల ద్వారా గ్రామాల స్వరూపం మార్చిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి గ్రామాలకు డిజిటల్ విప్లవం తీసుకురాబోతోంది. ప్రస్తుతం మండలాలకే పరిమితమైన వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని గ్రామ సచివాలయాల స్థాయికి తీసుకెళ్లాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ సచివాలయంలో డిజిటల్ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు అధికారులు నేరుగా గ్రామ సచివాలయాల ఉద్యోగులు లేదా లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఈ టీవీలను ఉపయోగిస్తారు. అలాగే పథకాలతో పాటు లబ్ధిదారుల జాబితాలను కూడా డిజిటల్ డిస్ప్లే ద్వారా ప్రదర్శిస్తారు. సెంట్రల్ సర్వర్ ద్వారా విజయవాడ నుంచే లబ్ధిదారుల పేర్లు, సంఖ్య మార్చే అవకాశముంటుంది. ఏ పథకం.. ఏ నెలలో ఎప్పుడు అమలవుతుందనే వివరాలను కూడా డిజిటల్ డిస్ప్లే ద్వారా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కూడా వీటి ద్వారా తెలియజేస్తారు. దీని వల్ల పోస్టర్ల వ్యయం తగ్గుతుంది. ఆన్లైన్.. క్షణాల్లో సమస్యలు పరిష్కారం ఇప్పటికే ప్రజలకు మెరుగైన సేవలను సకాలంలో అందించేందుకు సచివాలయాన్నింటినీ కంప్యూటరీకరించారు. అలాగే ప్రత్యేకంగా డిజిటల్ అసిస్టెంట్లను కూడా నియమించారు. 30,008 కంప్యూటర్లు, 15,004 ప్రింటర్లు, 27,646 బయోమెట్రిక్ మెషిన్లు, 15,004 స్కానర్లు, 14,492 ఇంటర్నెట్, 301 బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలతో పాటు 2,67,224 సెల్ఫోన్లను ప్రభుత్వం సచివాలయాలకు ఇచ్చింది. వీటి ద్వారా ప్రభుత్వం అందించే ఏ పథకమైనా క్షణాల్లో ప్రజలకు చేరువ అవుతోంది. సమస్యలు కూడా ఇట్టే పరిష్కారమవుతున్నాయి. శాశ్వత భవనాలతో ఆస్తి.. గ్రామ సచివాయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 10,954 గ్రామ సచివాయాలకు భవనాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా రూ.3,833 కోట్ల విలువైన శాశ్వత భవనాల ద్వారా గ్రామాలకు ఆస్తి చేకూరనుంది. ఇప్పటికే 10,929 భవనాలకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు. ఇందులో 1,848 భవనాల నిర్మాణం కూడా పూర్తయ్యింది. ఒక్కో భవనాన్ని 1,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో 35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఉద్యోగుల కార్యాలయంతో పాటు సమావేశ మందిరం, సందర్శకుల హాలు, గ్రామ సర్పంచ్, పంచాయతీరాజ్ కార్యదర్శి కార్యాలయాలను ఇందులో ఏర్పాటు చేస్తున్నారు. మార్చి నెలాఖరుకల్లా నిర్మాణాలు పూర్తి సచివాలయాల కోసం శాశ్వత భవనాలు నిర్మిస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి అన్ని నిర్మాణాలు పూర్తవుతాయి. అలాగే సీఎం ఆదేశాల మేరకు గ్రామ సచివాలయాల్లోనే వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాం. ఇందుకోసం డిజిటల్ టీవీల కొనుగోలుకు టెండర్లను కూడా ఆహ్వానించాం. – అజయ్ జైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ముఖ్యకార్యదర్శి -
జనవరి నుంచి డిజిటల్ టీవీ ప్రసారాలు
సాక్షి, హైదరాబాద్: జనవరి 1 నుంచి గ్రేటర్ హైదరాబాద్‌లో కేబుల్ టీవీ ప్రసారాలు పూర్తిస్థాయి డిజిటల్ రూపంలోకి మారనున్నాయి. దీంతో ఇక ప్రతి కేబుల్ టీవీకీ సెట్‌టాప్ బాక్స్ లేదా డీటీహెచ్ ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఇందుకు టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్) డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఇప్పటికే కేబుల్ టీవీలకు సెట్‌టాప్ బాక్స్‌ల ఏర్పాటు కోసం రెండు విడతలుగా గడువు విధించి.. అనలాగ్, డిజిటల్ రెండు రకాల ప్రసారాలకూ వెసులుబాటు కల్పించింది. తాజాగా మూడో విడత గడువు విధించి పూర్తిస్థాయి డిజిటలైజేషన్ అమలుకు మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల (ఎమ్ఎస్ఓ)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనలాగ్ ప్రసారాలను జనవరి నుంచి పూర్తిగా నిలిపేస్తూ కేవలం డిజిటల్ ప్రసారాలు మాత్రమే అందించేందుకు ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 25 లక్షల టీవీ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో ఎమ్‌ఎస్‌వోగా ఉన్న సిటీ కేబుల్, హాత్వే, డీజీ కేబుల్, ఆర్వీఆర్, భాగ్యనగర్, ఇన్ డిజిటల్ సంస్థలు కేబుల్ ప్రసారాలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఈ సంస్థలు తమ కేబుల్ ఆపరేటర్ల ద్వారా సుమారు 13 లక్షల వరకు సెట్‌టాప్ బాక్స్‌లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇవికాక సుమారు నాలుగు లక్షల వరకు డీటీహెచ్లు ఉన్నాయి. దీంతో ఇప్పటివరకు నగరంలో 68 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు తెలుస్తోంది. సెట్‌టాప్ బాక్స్‌లను దాని శ్రేణిని మట్టి రూ.1,100 నుంచి 1,600 వరకు విక్రయిస్తున్నారు. -
డీటీహెచ్‌కు పెరుగుతున్న ఆదరణ
⇒ టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ మలయ్ దీక్షిత్ ⇒ మార్కెట్లోకి టాటాస్కై ‘నా 99’ స్కీం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ టీవీ ప్రసారాలు వేగంగా విస్తరిస్తున్నాయని, మూడేళ్లలో టీవీ ఉన్న కుంటుంబాల సంఖ్య 20 కోట్లకు దాటుతుందని టాటా స్కై అంచనా వేస్తోంది. ప్రస్తుతం దేశంలో టీవీ కలిగిన కుటుంబాల సంఖ్య 14 కోట్లుగా ఉందని టాటా స్కై చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ మలయ్ దీక్షిత్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సగటు చందాదారుని ఆదాయంలో ఏటా 20 శాతం వృద్ధి నమోదవుతోందన్నారు. రెండేళ్ళ క్రితం చందాదారుడు నెలకు చెల్లిస్తున్న సగటు అద్దె రూ. 200 ఉండగా ఇప్పుడిది రూ.250కి చేరిందన్నారు. ప్రపంచదేశాల సగటుతో పోలిస్తే భారతీయులు చెల్లిస్తున్న అద్దె చాలా తక్కువని అన్నారు. 2018 నాటికి సగటు చందాదారుడు చెల్లించే నెల అద్దె రూ. 320 నుంచి రూ. 350కి చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఆయన ‘నా 99’ స్కీంను మార్కెట్లోకి లాంఛనంగా విడుదల చేశారు. ఇది బేసిక్ స్కీమ్. దీనికింద చందాదారుడు నెలకు రూ.99తో తెలుగు, ఇతర భాషలు, ఇంగ్లీష్ న్యూస్, స్పోర్ట్స్, సినిమాలు ఇలా కావల్సిన చానల్స్‌ను ప్యాకేజీల రూపంలో తీసుకోవచ్చు.