
పర్ఫెక్ట్ కుకింగ్‌ను అందించగల మేకర్స్.. మార్కెట్‌లో కోకొల్లలు. అందులో ఈ మల్టీఫంక్షనల్ స్టీమింగ్ కుకర్.. చాలా రుచులను అందిస్తోంది. ఈ డివైస్‌తో మొత్తం ఐదు సిరామిక్ పాత్రలు లభిస్తాయి. అందులో ఒకటి పెద్దగా, నాలుగు చిన్నవిగా ఉంటాయి. ఈ అన్నిటినీ చక్కగా వినియోగించుకోవచ్చు. ఒక్కోదానిలో ఒక్కోరకం వంటకాన్ని తయారు చేసుకునేందుకు.. బేస్ మెషిన్‌లో ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు.
యాంటీ డ్రై బర్నింగ్‌తో పాటు పవర్ బ్రేక్ ప్రొటెక్షన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ కుకర్.. సుమారుగా తొమ్మిది గంటలకు పైనే రిజర్వేషన్ ఫంక్షన్ మోడ్‌లో ఉంటుంది. హై క్వాలిటీ డబుల్ లేయర్‌తో రూపొందిన ఈ డివైస్‌లో.. అభిరుచికి తగ్గట్టుగా చాలా రకాల వంటకాలను సిద్ధం చేసుకోవచ్చు. ఇందులో అడుగుభాగంలో నీళ్లు పోసుకుంటే.. పోషకాలు పోకుండా ఆవిరి మీద కుక్ చేసుకోవచ్చు. సూప్స్, కర్రీస్, రకరకాల రైస్ ఐటమ్స్, నూడుల్స్ వంటివెన్నో రెడీ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment