Cooker
-
ఈ మినీ ఎలక్ట్రిక్ మేకర్ వెరైటీల గురించి మీకు తెలుసా..!
హైక్వాలిటీతో రూపొందిన ఈ మినీ మేకర్.. చాలా వెరైటీలను నిమిషాల్లో రెడీ చేస్తుంది. నూడుల్స్, పాస్తా, రైస్ ఐటమ్స్, పాన్ కేక్స్, కుకీస్, కట్లెట్స్, కేక్స్, బ్రెడ్ ఆమ్లెట్ వంటివెన్నో వండుకోవచ్చు. ఇందులో ఉడికించుకోవడం, గ్రిల్ చేసుకోవడం రెండూ సులభమే. అవసరాన్ని బట్టి ఈ డివైస్‌ని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. పైనున్న హ్యాండిల్ పాన్‌తో పాటు.. అడుగున ఉన్న నాన్‌స్టిక్ అటాచ్డ్ బౌల్లో కూడా ఫుడ్‌ను సిద్ధం చేసుకోవచ్చు. ఇంట్లో సరే.. క్యాంపింగ్లకూ చక్కగా యూజ్ అవుతుంది. దీనికి ప్రీహీట్ ఇండికేటర్ లైట్ ఉండటంతో ఏ వంటకాన్నయినా ఇట్టే చేసేయొచ్చు. ఈ మినీ పర్సనల్ ఎలక్ట్రిక్ మేకర్ ధర 14 డాలర్లు (రూ.1,161). ఇవి చదవండి: ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా.. -
ఒకేసారి రెండు రకాల వంటలు చేసుకోవచ్చు, ధర కూడా తక్కువే
ఒకేసారి రెండు వెరైటీలను తయారు చేసుకునేందుకు వీలుగా ఉన్న ఈ మల్టీ కుకర్‌ను.. యూజర్ ఫ్రెండ్లీ మెషిన్‌గా చెప్పుకోవచ్చు. చిన్నచిన్న అపార్ట్‌మెంట్స్‌లో, ఓపెన్ కిచెన్స్‌లో ఇలాంటి మినీ మేకర్ అందుబాటులో ఉంటే అలుపుసొలుపు లేకుండా ఇట్టే వంట చేసేసుకోవచ్చు. ఇందులో రకరకాల రైస్ ఐటమ్స్‌తో పాటు కుడుములు, వాయికుడుములు వంటివెన్నో వండుకోవచ్చు. 3.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్‌లో.. గుడ్లు, జొన్న కండెలు, దుంపలు, కేక్స్ వంటివీ ఉడికించుకోవచ్చు. మెయిన్ బేస్ మెషిన్ మీద.. స్టీల్ ట్రేలో మరో వెరైటీని కుక్ చేసుకునే వీలుంటుంది. దీనికి సరిపడా ట్రాన్స్పరెంట్ లిడ్ (మూత) ఉంటుంది. డివైస్ ముందున్న రెగ్యులేటర్ సాయంతో దీన్ని సులభంగా వాడుకోవచ్చు. దీని ధర 80 డాలర్లు(రూ.6,672). -
ఈ మల్టీ స్పెషాలిటీ కుక్కర్ గురించి విన్నరా..
మల్టీ – ఫంక్షనల్ మేకర్స్ ఇప్పుడు సర్వసాధారణం. వినియోగించడమూ తేలికే! అలాంటి ఈ పరికరం కుకర్లానే కాదు.. స్టీమర్గానూ పని చేస్తుంది. పైగా ఎక్కువ మోతాదులో వండిపెట్టగలదు. ఇందులో రకరకాల రైస్ ఐటమ్స్‌తో పాటు.. సూప్స్, చికెన్ కర్రీస్, మటన్ కుర్మా ఇలా చాలానే చేసుకోవచ్చు. గుడ్లు, కూరగాయలు, కండెలు, దుంపలు వంటివీ ఉడికించుకోవచ్చు. ఇది సుమారుగా మూడులీటర్ల సామర్థ్యంతో దాదాపు 5 కేజీలపైనే బియ్యాన్ని ఉడికించగలదు. ఈ కుకర్ ఆపరేటింగ్ ప్యానెల్లో లేటెస్ట్ మైక్రో స్విచ్ అమర్చి ఉండటంతో కుకింగ్ చాలా ఈజీ. వంట పూర్తయిన తర్వాత 6 గంటల పాటు వేడిగా ఉంచే.. ఆటోమేటిక్ వార్నింగ్ ఆప్షన్ ఉంటుంది. (చదవండి: రైస్ దగ్గర నుంచి సూప్స్, న్యూడిల్స్ వరకు అన్నీ ఈ కుకర్‌లోనే..!) -
రైస్ దగ్గర నుంచి సూప్స్, న్యూడిల్స్ వరకు అన్నీ ఈ కుకర్‌లోనే..!
పర్ఫెక్ట్ కుకింగ్‌ను అందించగల మేకర్స్.. మార్కెట్లో కోకొల్లలు. అందులో ఈ మల్టీఫంక్షనల్ స్టీమింగ్ కుకర్.. చాలా రుచులను అందిస్తోంది. ఈ డివైస్‌తో మొత్తం ఐదు సిరామిక్ పాత్రలు లభిస్తాయి. అందులో ఒకటి పెద్దగా, నాలుగు చిన్నవిగా ఉంటాయి. ఈ అన్నిటినీ చక్కగా వినియోగించుకోవచ్చు. ఒక్కోదానిలో ఒక్కోరకం వంటకాన్ని తయారు చేసుకునేందుకు.. బేస్ మెషిన్లో ఒకేసారి యూజ్ చేసుకోవచ్చు. యాంటీ డ్రై బర్నింగ్‌తో పాటు పవర్ బ్రేక్ ప్రొటెక్షన్ వంటి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ కుకర్.. సుమారుగా తొమ్మిది గంటలకు పైనే రిజర్వేషన్ ఫంక్షన్ మోడ్‌లో ఉంటుంది. హై క్వాలిటీ డబుల్ లేయర్‌తో రూపొందిన ఈ డివైస్‌లో.. అభిరుచికి తగ్గట్టుగా చాలా రకాల వంటకాలను సిద్ధం చేసుకోవచ్చు. ఇందులో అడుగుభాగంలో నీళ్లు పోసుకుంటే.. పోషకాలు పోకుండా ఆవిరి మీద కుక్ చేసుకోవచ్చు. సూప్స్, కర్రీస్, రకరకాల రైస్ ఐటమ్స్, నూడుల్స్ వంటివెన్నో రెడీ చేసుకోవచ్చు. (చదవండి: నిద్ర సమస్యల్ని ఈజీగా పట్టేస్తుంది ఈ వాచ్!) -
ఈ కొత్త రకం కుక్కర్ లో వంటలు చాలా సులభం
ఈ ఆటోమేటిక్ ప్రెజర్ కుకర్.. ఆహారంలో పోషకాలు పోకుండా హెల్దీ ఫుడ్‌ని అందిస్తుంది. ఇందులో చాలా ప్రీసెట్ ఆప్షన్స్ ఉంటాయి. కర్రీ, సూప్, దాల్, గ్రేవీ, బిర్యానీ, పులావ్.. ఇలా గాడ్జెట్ ముందువైపు ప్రత్యేకమైన సెట్టింగ్స్ ఉంటాయి. మల్టీపర్పస్ కోసం తయారైన ఈ గాడ్జెట్.. చూడటానికి అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. పైనున్న ప్రెజర్ మూతతో పాటు.. అదనంగా లభించే ట్రాన్స్పరెంట్ మూత.. చాలా రకాల వంటకాలకు అనువుగా ఉంటుంది. ప్రత్యేకమైన గ్లాస్, గరిటె, సేఫ్టీ గాడ్స్.. వంటివి డివైస్‌తో పాటు లభిస్తాయి. అవసరాన్ని బట్టి 3 స్థాయిల్లో టెంపరేచర్ పెంచుకోవచ్చు. లేదా తగ్గించుకోవచ్చు. దీనిలోని మన్నికైన నాన్–స్టిక్ 3 లీటర్స్ పాట్.. నలుగురికి లేదా ఐదుగురికి సరిపోతుంది. యాంటీ–స్కిడ్ బేస్‌తో పెద్ద ఇన్సులేట్ హ్యాండిల్ భద్రతను కలిగిస్తుంది. దీన్ని వంటరాని వారు కూడా వినియోగించడం చాలా సులభం. (చదవండి: సాయంత్రం స్నాక్స్ లో నాన్ వెజ్ రెసిపీ ) -
మల్టీ ఫంక్షనల్ పాట్.. వెరైటీ వంటలన్నీ వండేయొచ్చు
క్వాలిటీ ప్లస్ కంఫర్టబుల్ ఫీచర్స్‌తో రూపొందిన ఈ మల్టీఫంక్షనల్ పాట్.. చాలా వంటకాలను రెడీ చేస్తుంది. ఇందులో అన్ని రకాల రైస్ ఐటమ్స్, కర్రీస్, నూడుల్స్, సూప్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. సుమారుగా రెండు లీటర్ల సామర్థ్యం గల ఒక ప్రత్యేకమైన పాట్తో పాటు.. నాన్ స్టిక్ ప్లేట్, పాన్ కేక్ ప్లేట్, గ్రిల్ పాన్ వంటివి అదనంగా లభిస్తాయి. అవసరాన్ని బట్టి వాటిని మార్చుకోవచ్చు. వాటితో ఆహారాన్ని గ్రిల్, ఫ్రైలతో పాటు స్టీమ్ కూడా చేసుకోవచ్చు. స్లో కుకర్‌లా మార్చి చాలా వెరైటీలను వండుకోవచ్చు. ఆన్ లేదా ఆఫ్ బటన్ తో పాటు టెంపరేచర్ కంట్రోలర్ కూడా డివైస్ ముందువైపు ఉంటుంది. -
ఒకే కుకర్‌లో రెండు రకాల వంటలు వండేయొచ్చు
మంచి భోజన ప్రియులకు పసందైన వంటకాలను అందించడంలో ఈ కుకర్కి సాటి లేదు. 3 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్‌లో అవసరాన్ని బట్టి ఒకేసారి రెండు ఐటమ్స్‌ని రెడీ చేసుకోవచ్చు. గ్రిల్, బేక్, స్లో కుకింగ్ వంటి ఆప్షన్స్‌తో.. ఫిష్ ఫ్రై, చికెన్ గ్రిల్లతో పాటు పాన్ కేక్స్, బ్రెడ్ ఆమ్లెట్, సూప్స్ వంటివెన్నో వండుకోవచ్చు. మేకర్ ముందు స్మాల్, మీడియం, బిగ్ అనే ఆప్షన్స్‌తో టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు డివైస్‌లోని బౌల్స్ రెండు రకాలు ఉంటాయి. బేస్ కుకర్కి సరిపడా పెద్ద బౌల్‌తో పాటు.. రెండుభాగాలుగా ఉన్న పెద్ద పాత్ర కూడా డివైస్‌తో పాటు లభిస్తుంది. ఆ పాత్రలను మార్చుకుంటూ దీనిలో చాలా వంటకాలను వండివార్చుకోవచ్చు. అదనపు సౌకర్యాలను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ధర 43 డాలర్లు (రూ.3,572) -
దారుణం: భాగస్వామిని ప్రెషర్ కుక్కర్‌తో బాది..
బెంగళూరు:కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒక్కటిగా బతకాలనుకున్నారు. ఉద్యోగం కూడా ఒకే దగ్గర చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటున్నందున సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్యలో అనుమానం పెనుభూతంలా మారింది. తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భాగస్వామే ప్రెషర్ కుక్కర్‌తో బాది హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. ఇదీ జరిగింది.. దేవా(24), వైష్ణవ్(29) ఇద్దరూ కేరళకు చెందినవారు. ఇద్దరు కాలేజీ రోజుల్లోంచి ఒకరికొకరు తెలుసు. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరులోని ఓ రెంట్ హౌజ్‌లో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దేవా తనను మోసం చేస్తోందని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ వ్యవహారంపై తరచూ గొడవ పడుతుండేవారు. శనివారం సాయంత్రం కూడా గొడవకు దిగారు. నిగ్రహం కోల్పోయిన వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో దేవా అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. అనంతరం ఘటనాస్థలం నుంచి వైష్ణవ్ పరారయ్యాడు. అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై దేవా చెల్లి పొరుగువారిని సంప్రదించింది. విషయం తెలుసుకున్నవారు.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇద్దరి మధ్య గొడవ గురించి తమకు తెలుసని దేవా తల్లిదండ్రులు తెలిపారు. ఈ అంశంలో కలగజేసుకుని సర్దిచెప్పామని పోలీసులకు తెలిపారు. పరారీలో ఉన్న వైష్ణవ్‌ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
నడిరోడ్డుపై పేలిపోయిన ఆటో.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
మంగళూరు: కర్ణాటకలో ఆటో రిక్షా పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆ ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు మరోక వ్యక్తి ఆధార్ కార్డుని వినియోగిస్తున్నట్లు తేలిందన్నారు. ఆ ప్రయాణికుడు తమకూరు డివిజన్‌కి చెందిన రైల్వేలో పనిచేస్తున్న ప్రేమరాజ్ హుటాగి అనే వ్యక్తి ఆధార్ కార్డుని ఉపయోగిస్తున్నాడుని చెప్పారు. సదరు వ్యక్తి గతేడాది రెండుసార్లు తన ఆధార్‌కార్డుని పోగొట్టుకున్నాడుని చెప్పారు. కానీ అతను కచ్చితంగా ఎక్కడో పోగొట్టుకున్నది చెప్పలేదని అన్నారు. ఈ మేరకు సదరు రైల్వే ఉద్యోగి మాట్లాడుతూ..." తనకి సుమారు రాత్రి 7.30 గంటలకి పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ నుంచి ఫోన్ వచ్చించి. మీరు ఎక్కడ ఆధార్ కార్డుని పోగొట్టుకున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత తన తల్లిదండ్రుల గురించి తన గురించి ఆరా తీశారు. అన్ని విషయాలు వివరంగా చెప్పిన తర్వాత ఆ ఆటో రిక్షా పేలుడు ఘటన గురించి చెప్పారు. తనకు పోలీసులు చెప్పేంత వరకు కూడా ఈ ఘటన గురించి తనకు తెలియదని చెబుతున్నాడు. ఐతే తన ఆధార్ కార్డు పోయిందనేది వాస్తవమే గానీ మంగళూరులో తాను పోగొట్టుకోలేదని చెబుతున్నాడు. తన ఆధార్ కార్డు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, మరో ఆధార్ కార్డుని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఇలా తన ఆధార్‌కార్డు మిస్యూజ్ అవుతుందని తనకసలు తెలియదని" చెబుతున్నాడు. ఇదిలా ఉండగా. ...ఈ ఆటో రిక్షా బ్లాస్ట్‌కి కారణం ఆ ప్రయాణికుడేనని, అతనే నిందితుడని కర్ణాటక డైరెక్టర్ జనరల్ పోలీస్ ప్రవీణ్ సూద్ తేల్చి చెప్పారు. ఆ ఆటోలో ప్రయాణికుడు బ్యాటరీలు అమర్చిన కుక్కర్‌ని వెంట తీసుకువెళ్లాడని చెప్పారు. అందువల్ల ఈ పేలుడు సంభవించి, ఆ డ్రైవరు ప్రయాణికుడు తీవ్రంగా గాయపడ్డారని అన్నారు. అలాగా ఆ ప్రయాణికుడు నకిలీ ఆధార్ కార్డుతో, నకిలీ అడ్రస్, నకిలీ పేరుతో చెలామణి అవుతున్నాడని చెప్పారు. ఇది అనుకోని ప్రమాదం కాదని పెద్ద ఎత్తున నష్ట కలిగించేలా ప్లాన్ చేసిన ఉగ్రవాద చర్యేనని చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ చీఫ్ ఈ ఘటనసై రాష్ట్ర పోలీసుల తోపాటు కేంద్ర సంస్థలు కూడా ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయని చెప్పారు. అలాగే ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు కేంద్ర నిఘా సంస్థలు సహకరిస్తున్నాయని కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సదరు నిందితుడు కోయంబత్తూర్‌లో తప్పుడు పేరుతో సిమ్ తీసుకున్నట్లు చెప్పారు. అతని కాల్ డేటా ఆధారంగా తమిళనాడు అంతటా పర్యటించాడని చెప్పారు. తమిళనాడులో అతను ఎవరెవర్నీ కలుసుకున్నాడు, వారి ఆచూకి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: రోడ్డుపై పేలిన ఆటో రిక్షా.. భయంతో జనం పరుగులు) -
1 Pot Multi Cooker: నాన్‌స్టిక్ మినీ ఓవెన్.. ధర రూ.12,034..!
అడ్జస్టబుల్ టెంపరేచర్‌తో రూపొందిన ఈ నాన్‌స్టిక్ మినీ ఓవెన్.. స్టూడియో అపార్ట్‌మెంట్స్‌లో.. క్యాపింగ్ సమయంలో చక్కగా ఉపయోగపడుతుంది. ఒకే బౌల్లో బహురకాల రుచులను నిమిషాల్లో రెడీ చేసుకునే వీలును కలిపిస్తుంది ఈ ఎలక్ట్రిక్ కుకర్. వేయించడం దగ్గర నుంచి ఉడకబెట్టడం వరకు అన్ని రకాలనూ ఇందులో తయారు చేసుకోవచ్చు. 90 డిగ్రీల సెల్సియస్ నుంచి 180 డిగ్రీల సెల్సియస్ వరకు ఐదు స్థాయిల హీట్ సెట్టింగ్స్ ఉంటాయి. ఆ రెగ్యులేటర్ పవర్ కనెక్టర్‌కు.. ఆ కనెక్టర్ మూతకు అమర్చి ఉంటాయి. దాంతో నాన్‌స్టిక్ కోటింగ్‌తో డిష్వాషర్ సేఫ్ పాట్‌ను క్లీన్ చేయడం చాలా సులభం. డివైజ్ మొత్తం నిలబడేందుకు ప్రత్యేకమైన స్టాండ్ కూడా ఉంటుంది. పాట్కి ఇరువైపులా హ్యాండిల్స్ ఉండటంతో సర్వ్ చేసుకోవడం కూడా తేలికే. ►ధర - 154 డాలర్లు (రూ.12,034) చదవండి: కోల్డ్ కాఫీ కోసం కేఫ్‌ల చుట్టూ తిరగకుండా.. ఈ డివైజ్‌తో ఇంట్లోనే.. ధర ఎంతంటే! -
All In One: ఫిష్, మటన్.. పాస్తా, కేక్.. చిలగడ దుంపలు.. అన్నింటికీ ఒకటే!
ఒకప్పుడు రకరకాల రుచులను తయారు చేసుకోవడానికి బోలెడన్ని పాత్రలు అవసరం అయ్యేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ‘ఆల్ ఇన్ వన్’ అనే పద్ధతిలో ఒకే డివైజ్‌తో బోలెడన్ని రుచులు అందిస్తున్నాయి ఆధునిక వంట పాత్రలు. అలాంటిదే ఈ కుకర్ కూడా. అవసరాన్ని బట్టి పాత్రలను జోడించుకోవచ్చు. లేదంటే వాటిని తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఈ కుకర్‌లో చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు, పీతలు ఇలా చాలానే వండుకోవచ్చు. కేక్స్, పాస్తా, నూడూల్స్, రైస్ ఐటమ్స్ వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. అందుకు వీలుగా ఈ డివైజ్‌కి అదనంగా మూడు పెద్దపెద్ద స్టీమ్ బౌల్స్ లభిస్తాయి. వాటిలో వేరువేరు వెరైటీలను తయారు చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్‌లో గుడ్లు, జొన్న కండెలు, చిలగడ దుంపలు వంటివి ఉడికించుకోవచ్చు. సూప్, స్టీమ్ ఇలా అన్ని ఆప్షన్స్ డివైజ్ ముందు వైపు ఉంటాయి. వాటిని సెట్ చేసుకుని ఈ కుకర్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. దీని ట్రాన్స్పరెంట్ మూత అన్ని పాత్రలకు, మెయిన్ బాడీకి చక్కగా సరిపోతుంది. ధర : 252 డాలర్లు (రూ.19,313) చదవండి👉🏾Ice Cream Maker: ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే! చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990 -
కొత్తకొత్తగా బార్బెక్యూ ఇండోర్/అవుట్డోర్ గ్రిల్
డబుల్ డెక్కర్ టెక్నాలజీ.. ఈ తరానికి ఓ అదనపు సౌకర్యం. ప్రస్తుతం కుక్ వేర్లో కూడా అదే టెక్నాలజీని ఉపయోగించి.. శ్రమను, సమయాన్ని ఆదా చేస్తున్నాయి కంపెనీలు. భోజన ప్రియులకు రుచులను పండగ చేసుకోమంటున్నాయి. చిత్రంలోని ఇండోర్/అవుట్డోర్ గ్రిల్‌పై చికెన్, మటన్, ఫిష్, రొయ్యలు వంటివెన్నో గ్రిల్ చేసుకోవడం, ఆమ్లెట్స్, పాన్‌కేక్స్ వంటివెన్నో కుక్ చేసుకోవడం తేలిక. టు ఇన్ వన్ నాన్‌స్టిక్ గ్రిల్ ప్లేట్ (రిమూవబుల్ డబుల్ జోన్ నాన్‌స్టిక్ బేక్ వేర్) ఉన్న ఈ మేకర్ పైభాగంలో చాలా రుచికరంగా క్రిస్పీగా సిద్ధం చేసుకోవచ్చు. ఇక కింద భాగంలో అటు నాలుగు, ఇటు నాలుగు మినీ పాన్ప్లేట్స్ పెట్టుకుని ఎనిమిది రకాల వెరైటీలను తయారుచేసుకోవచ్చు. 1500ఠీ సామర్థ్యం గల ఇంటెలిజెంట్ థర్మోస్టాట్ టెక్నాలజీ కలిగిన ఈ మేకర్‌కు వెనుకవైపు ఉన్న రెగ్యులేటర్‌లో టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. గాడ్జెట్ నుంచి గ్రిల్ ప్లేట్స్‌ను చాలా సులభంగా వేరు చేసుకోవచ్చు. దాంతో శుభ్రం చేసుకోవడం ఈజీ అవుతుంది. ధర 89 డాలర్లు (రూ.6,529) డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ ఓవెన్ చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్స్‌కి చాలా చక్కగా, అనువుగా ఉండే ఈ ఫ్యామిలీ సైజ్ ఓవెన్.. ఎయిర్ ఫ్రైయర్లా కూడా పనిచేస్తుంది. డిజిటల్ టచ్స్క్రీ¯Œ తో ఆయిల్‌లెస్ రుచులని అందిస్తుంది. చికెన్, ఫిష్, పిజ్జా, కేక్, స్టిక్స్, వింగ్స్, కుకీస్, ఫ్రెంచ్‌ఫ్రైస్ ఇలా చాలానే చేసుకోవచ్చు. 1700గి సామర్థ్యం కలిగిన ఈ మేకర్‌కి ముందు భాగంలో దానికి ఆనుకునే గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని పైనుంచి కిందకు ఓపెన్ చేసుకోవచ్చు. లోపల ట్రాన్స్పరెంట్ బౌల్ పెట్టుకుని.. మూడు సొరుగులుగా గ్రిల్ ప్లేట్స్ అమర్చి, వాటిపై ఆహారాన్ని బేక్ చేసుకోవచ్చు. ఇందులో 3600ఊ వద్ద పిజ్జా 10 నిమిషాలు, కూరగాయలు 12 నిమిషాలు, ఫిష్ 15 నిమిషాలు, కేక్ 30 నిమిషాలు సమయం పడుతుంది. 4300ఊ వద్ద.. పాప్‌కార్న్ 8 నిమిషాలు, చికెన్ వింగ్స్ 10 నిమిషాలు, ఫ్రెంచ్‌ఫ్రైస్ 20 నిమిషాలు, హోల్ చికెన్ 30 నిమిషాలు సమయం తీసుకుంటాయి. అధిక–నాణ్యత గల మెటీరియల్‌తో రూపొందిన చికెన్ ఫోర్క్, డిప్ ట్రే, రొటేటింగ్ బాస్కెట్, ఎయిర్ ఫ్లో రాక్స్, మెస్ బాస్కెట్ వంటివన్నీ మేకర్‌తో పాటు లభిస్తాయి. ఈ గాడ్జెట్ 80 శాతం నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. ఆప్షన్స్ అన్నీ మేకర్ ముందువైపు డిస్ప్లేలో బొమ్మలతో సహా వివరంగా కనిపిస్తుంటాయి. దాంతో దీన్ని ఆపరేట్ చెయ్యడం ఎవరికైనా సులభమే. ధర 119 డాలర్లు (రూ. 8,729) మ్యాజికల్ స్మార్ట్ కుకర్ ఎలక్ట్రిక్ మేకర్స్ ఎప్పటికప్పుడు కొత్త హంగులతో వినియోగ దారులని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గృహిణుల శ్రమను తగ్గించే ఇలాంటి మేకర్స్‌కి మార్కెట్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ మ్యాజికల్ స్మార్ట్ మేకర్.. ఎయిర్ ఫ్రైయర్లా, ప్రెషర్ కుకర్‌లా పని చేస్తుంది. అందుకు చెయ్యాల్సింది కేవలం మూతలు మార్చడమే. స్టీమర్ బాస్కెట్, రోస్ట్ రాక్, రెసిపీ బుక్, గ్లాసులు, గరిటెలు, మిట్స్ (చేతులు కాలకుండా ఉపయోగ పడేవి) వంటివన్నీ మేకర్‌తో లభిస్తాయి. దాంతో ఇందులో సూప్స్, నూడూల్స్, కేక్స్, హోల్ చికెన్‌తో పాటు అన్నిరకాల రైస్ ఐటమ్స్ రెడీ చేసుకోవచ్చు. గాడ్జెట్ ముందు వైపు ఉన్న ఆప్షన్స్ ప్రెషర్ కుకర్‌కు, ఎయిర్ ఫ్రైయర్ లిడ్ మీద ఉన్న ఆప్షన్స్ ఫ్రైయర్ కోసం కేటాయించినవి. వాటిని సెట్ చేసుకుని టైమింగ్, టెంపరేచర్ ఫిక్స్ చేసుకుని, అవసరాన్ని బట్టి మూత మార్చుకుంటే సరిపోతుంది. -
కుకర్ని మడచి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోండి!
హైక్వాలిటీ టెక్నాలజీతో 3 ఇన్ 1 రిమూవబుల్ నాన్–స్టిక్ లార్జ్ ప్లేట్స్ ఉన్న ఈ గ్రిల్.. సరికొత్త లగ్జరీ లుక్‌తో వినియోగదారులని ఇట్టే ఆకర్షిస్తోంది. ‘హై, మీడియం, లో’ అనే త్రీ లెవల్స్ టెంపరేచర్ ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టమ్ కలిగిన ఈ గాడ్జెట్‌పై.. శాండ్విచ్, వాఫిల్స్, బార్బెక్యూ స్టిక్స్.. వంటివెన్నో సిద్ధం చేసుకోవచ్చు. మన్నికైన నాన్–స్టిక్ పూత పూసిన ఈ ప్లేట్స్ తక్కువ నూనెతో కరకరలాడే రుచులని అందిస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ మేకర్‌కు ఆహారం అతుక్కోదు. దాంతో మృదువైన తడి గుడ్డతో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఈ మేకర్ చిన్నపాటి సూట్‌కేస్‌లా ఉంటుంది. వాఫిల్స్, శాండ్విచ్లకు 2 జతల ప్లేట్స్, గ్రిల్ చేసుకోవడానికి ఒక పొడవాటి ప్లేట్.. మొత్తంగా 5 ప్లేట్స్ విడివిడిగా లభిస్తాయి. చిత్రంలో చూపించిన విధంగా 180 డిగ్రీల దగ్గర టెంపరేచర్ సెట్ చేసుకొని దానిపైన గ్రిల్ ప్లేట్ పెట్టుకుని.. ఆహారాన్ని గ్రిల్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ అన్నీ ముందువైపు వివరంగా ఉండటంతో దీన్ని ఉపయోగించడం చాలా తేలిక. ఫ్రిక్సెన్ ఐస్‌క్రీమ్ రోలర్ ప్లేట్ మెనూలోని డెజర్ట్స్ సెక్షన్లో సాధారంగా అందరూ ఆత్రంగా వెదికేది.. తప్పకుండా కనిపించేది ఐస్‌క్రీమ్. బయటకొంటే.. కరిగేలోపు తినెయ్యాలి. కష్టపడి ఇంట్లో చేసుకుంటే.. గడ్డకట్టే దాకా ఎదురుచూడాలి. అందుకే ఐస్‌క్రీమ్ ప్రియుల కోరిక మేరకు.. నచ్చినప్పుడు, నచ్చిన విధంగా నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రోల్స్ తయారుచేసుకుని, ఆనందంగా ఆస్వాదించే అవకాశాన్ని కలిపిస్తోంది ఫ్రిక్సెన్ ఐస్‌క్రీమ్ రోలర్ ప్లేట్. దీనికి పవర్‌తో పనిలేదు. ఇది 24 గంటలు ఫ్రిజ్‌లో ఉంటే.. కావాల్సినప్పుడు ఐస్‌క్రీమ్ చేతిలో ఉన్నట్టే. అదెలా అనేగా మీ డౌట్? ఏం లేదు.. రెసిపీ ముందే రెడీ చేసి పక్కనపెట్టుకుని.. ఫ్రిజ్‌లోంచి ఈ మేకర్ బయటికి తీసి.. దాని ప్లేట్లో ఆ మిశ్రమాన్ని పోసి.. పలచగా అంతా పరచాలి. 6 నుంచి 8 నిమిషాల పాటు.. అలానే ఉంచి రోల్స్‌లా తీసి సర్వ్ చేసుకోవాలి. లేదంటే అప్పటికప్పుడు మేకర్‌పైనే రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు. గాడ్జెట్‌తో పాటు.. రెండు గరిటెలు లభిస్తాయి. వాటితోనే మేకర్ మీద అరటిపండ్లు, చాక్లెట్స్లు ఇలా వేటినైనా మెత్తగా గుజ్జులా చేసుకుని, కస్టర్డ్‌మిల్క్, ఎసెన్స్ వంటివి జోడించి టేస్టీగా ఐస్‌క్రీమ్ రోల్స్‌లా చేసుకోవచ్చు. పిల్లలు సైతం సులభంగా తయారు చేసుకోవచ్చు. పైగా పూరై్తన తర్వాత ప్లేట్ కడిగినట్లు కడిగి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అల్యూమినియం ప్లేట్‌తో రూపొందిన ఈ మేకర్ ఎర్గోనామిక్ డిజైన్, హై–క్వాలిటీ మెటీరియల్‌తో మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతోంది. మరో విషయం దీన్ని 24 గంటలూ ఫ్రిజ్‌లో ఉంచడం కుదరకుంటే.. కనీసం 12 గంటలు ఫ్రిజ్‌లో పెట్టుకుంటే సరిపోతుంది. ఈ మేకర్స్ దీర్ఘచతురస్రాకారం లో లేదా గుండ్రంగా చాలా రంగుల్లో లభిస్తున్నాయి. క్వాలిటీని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఫోర్టబుల్–ఫోల్డబుల్ ‘ప్రయాణాల్లో హోటల్ ఫుడ్ కంటే.. స్వయం పాకాలే బెస్ట్..’ అని ఎవరైన సలహా ఇస్తే.. ‘భలే చెప్పొచ్చారు.. కుకర్ని మడచి హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకోమంటారా..?’ అని వెటకారమాడకండి. ఎందుకంటే దాన్ని నిజం చేసేసింది టెక్నాలజీ. చిత్రంలోని కుకర్ని చక్కగా చిన్న పాటి బాక్స్లా మడచి వెంటతీసుకుని వెళ్లొచ్చు. 600ఎమ్ఎల్ సామర్థ్యం కలిగిన హై–క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిన మినీ ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ హాట్ పాట్.. చాలా రుచులని నిమిషాల్లో రెడీ చేయగలదు. ఫుడ్–గ్రేడ్ ఆర్గానిక్ సిలికాన్‌తో తయారైన ఫ్లెక్సిబిలిటీ మేకర్లో.. వాసన లేకుండా అధిక ఉష్ణోగ్రతపై వంట చేసుకోవచ్చు. దీని 304 స్టెయిన్లెస్ స్టీల్ బేస్ తుప్పు పట్టదు. గాడ్జెట్ ముందు భాగంలో సున్నితమైన టచ్ కంట్రోల్ ప్యానెల్‌పై అన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాంతో రైస్, నూడూల్స్, సూప్స్, ఎగ్స్, సీఫుడ్.. ఇలా చాలానే సిద్ధం చేసుకోవచ్చు. చదవండి: Attractive Mini Charpoy Trays: నులక మంచం ట్రే, తోపుడి బండి ట్రే.. ఇంకా.. -
దొంగ తెలివి.. కుక్కర్లో 8 కిలోల బంగారం
తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ సిబ్బంది ఎన్ని తనిఖీలు చేస్తున్నా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో కుక్కర్, మిక్సీలో 8.17 కిలోల బంగారాన్ని తీసుకొచ్చి దొరికిపోయారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో 104 మంది ప్రయాణికులు వచ్చారు. కస్టమ్స్ సిబ్బంది వారిని తనిఖీ చేశారు. చెన్నై, రామనాథపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం రావడంతో ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వారి లగేజీలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాల్లో 8.17 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు. వాటి విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
అమేజింగ్ బేబీ మల్టీ ఫంక్షన్ కుకర్
అన్నం తినడం మొదలుపెట్టిన పిల్లలకు మెత్తటి, రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టడం పెద్ద టాస్కే మోడర్న్ మదర్స్‌కి. ఆకలితో బిడ్డ కేర్‌మనే క్షణానికల్లా వేడివేడిగా వండిచ్చే గాడ్జెట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బేబీ ఫుడ్ ప్రాసెసర్ మల్టీ ఫంక్షన్ కుకర్ అలాంటిదే. ఈ మేకర్ పైభాగంలో డిజిటల్ డిస్ప్లే టచ్ ప్యానెల్ పైన డీఫ్రాస్ట్, స్టీమ్, ఆన్/ఆఫ్, మాన్యువల్ బ్లెండర్, ఆటోమేటిక్ బ్లెండర్, స్టెరిలైజ్ వంటి ఆప్షన్ తో టెంపరేచర్ కంట్రోల్ కోసం ప్లస్ మైనెస్లూ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి. పళ్లు, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏ ఫుడ్ కావాలన్నా నిమిషాల్లో ఉడికించి పేస్ట్‌లా చేస్తుంది పిల్లలు తినగలిగేలా. ఇది జ్యూసర్, బ్లెండర్, మీట్ గ్రైండర్, కౌంటర్ టాప్ బ్లెండర్ ఇలా చాలా రకాలుగానూ పని చేస్తుంది. ముందుగా కుకర్ ఎడమవైపునున్న వాటర్ ట్యాంక్‌లో వాటర్ పోసుకొని మూత(డిస్ ప్లేకి పక్కనే ఉంటుంది) పెట్టుకోవాలి. తర్వాత ఎడమవైపు పెట్టుకుని.. ఉడికించి మెత్తగా చెయ్యడానికి ఆప్షన్ లు ఇస్తే సరిపోతుంది. స్టీమింగ్ బౌల్, మిక్సీ బౌల్ వేరు వేరుగా ఉంటాయి. ధర 99 డాలర్లు (రూ.7,182). చదవండి: పూచీకత్తు లేకుండానే రూ.5 లక్షల పర్సనల్ లోన్ -
కొత్తకొత్తగా: ఇంటెలిజెంట్ ఫుడ్ మేకర్.. స్మాల్ స్మార్ట్ కుక్కర్
చకచకా పనులయిపోవడానికి ఎలక్ట్రానిక్ యంత్రాలే సరైన సాధనాలు. వంటా దీనికి మినహాయింపేమీ కాదు. వంటింట్లో ఆ యంత్ర పరికరమే ఈ ఆయిల్ ఫ్రీ ఎయిర్ ఫ్రయింగ్ మేకర్. హై-స్పీడ్ ఎయిర్ సర్క్యులేషన్ సూత్రాన్ని అనుసరించి, అతి తక్కువ నూనెతో మహారుచికరమైన ఆహారాన్ని వండిపెడుతుంది నిమిషాల్లో. హై టెక్నాలజీతో రూపొందిన ఈ హై టెంపరేచర్ హాట్ ఎయిర్ ఫ్రయర్.. 80 శాతం నూనె వాడకాన్ని తగ్గిస్తుంది. వేపుడు కూరలే కాదు ఆవిరి మీద ఉడికే వంటకాలనూ వండుకోవచ్చు. మేకర్ కింద ట్రాన్స్పరెంట్గా కనిపిస్తున్న భాగంలో నీళ్లు నింపుకునే వీలుంటుంది. ఆ భాగాన్ని సొరుగు మాదిరిగా ముందుకు లాగాల్సి ఉంటుంది. దీని కెపాసిటీ 2 లీటర్లు. ఇందులోని స్టీమ్ గ్రిల్లింగ్ మోడ్.. లోపలి భాగంలో తేమని లాక్ చేసి పై లేయర్‌లోని ఆహారాన్ని బేక్ చేస్తుంది. దాంతో ఈ వంటకం యమ్మీ యమ్మీగా చవులూరిస్తుంది. దీనిలోని వార్మ్ హీటింగ్ డిజైన్.. హోల్ చికెన్ వంటి పెద్ద పెద్ద వంటకాలనూ ఇట్టే సిద్ధం చేస్తుంది. ఆప్షన్ లు అన్నీ మూతపై భాగంలో డిస్ ప్లే అవుతుంటాయి. దేనికి ఎంత ఉష్ణోగ్రత అవసరమో కూడా తెలియజేస్తుంది ఈ మేకర్. ఇక దీనిలోని పాన్ బౌల్ 5 లీటర్ల కెపాసిటీతో.. కుకింగ్‌కి, క్లీనింగ్‌కి సులభంగా ఉంటుంది. దీని ధర 129 డాలర్లు(రూ.9,471). స్మాల్ స్మార్ట్ కుక్కర్ వంటింటి గాడ్జెట్స్కున్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఈ మేకర్ కూడా అలాంటిదే. ఇందులో ఒకే సమయంలో ఒకరికి లేదా ఇద్దరికి సరిపడా రెండు రకాల వెరైటీలను సిద్ధం చేసుకోవచ్చు. నాన్-స్టిక్ కోటింగ్ కలిగిన ఇన్నర్ పాట్లో కూరలు, సూప్స్ ఇలా.. నిమిషాల్లో చాలానే తయారు చేసుకోవచ్చు. మెకానికల్ టైమర్ కంట్రోల్ కలిగిన ఈ మేకర్లో చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ వంటకాలతో పాటు తక్కువ పరిమాణంలో ఎన్నో రైస్ ఐటమ్స్‌నూ వండుకోవచ్చు. మేకర్ నుంచి మూతను ఈజీగా వేరు చేసుకోవచ్చు. బాగా ఉడకవలసిన ఆహారం కోసం మూతను లాక్ చేసుకోవడానికి మేకర్‌కి ఇరువైపులా ప్రత్యేకమైన లింక్స్ ఉంటాయి. వాటిని ప్రెస్ చేసుకుంటే మూత లాక్ అవుతుంది. దీనిలో స్టెయిన్ లెస్ స్టీల్‌తో రూపొందిన ఒక మినీ స్టీమింగ్ బాస్కెట్(ట్రే) కూడా ఉంటుంది. అందులో కూరగాయలు, గుడ్లు, జొన్నకండెలు.. ఇలా చాలానే ఉడికించుకోవచ్చు. ఇదే మోడల్లో చాలా రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర 23 డాలర్లు(రూ.1,688). ఎలక్ట్రిక్ బేకింగ్ పాన్ వర్క్ మేడ్ ఈజీయే టెక్నాలజీ సూత్రం. అలాంటి సౌకర్యమే ఈ గాడ్జెట్. ఇందులో ఒకవైపు గ్రిల్ చేసుకోవచ్చు. మరోవైపు పాన్‌లా వాడుకోవచ్చు. దీనిపై సిద్ధం చేసుకునే వెరైటీల కోసం మేకర్ ముందు భాగంలో ఒక్కోదానికి ఒక్కో బటన్ అమర్చి ఉంటుంది. దాంతో పిజ్జా, పాన్ కేక్స్, కబాబ్స్, ఆమ్లెట్స్.. వంటివెన్నో తయారు చేసుకోవచ్చు. గ్రిల్ అండ్ పాన్ లను ఒకేసారి ఉపయోగించుకోవచ్చు లేదా అవసరాన్ని బట్టి ఒకటి ఆన్ చేసుకుని మరొకటి ఆఫ్ చేసుకునే వీలూ ఉంటుంది. ఒకవైపు చేస్తున్న వంటకం త్వరగా అయిపోవాలనుకుంటే మరోవైపు భాగాన్ని మూతలా ఉపయోగించుకునే సౌకర్యం ఉంది. పైగా దీంట్లోని గ్రిల్, పాన్ రెండూ సులభంగా వేరు చేసుకుని క్లీన్ చేసుకోవచ్చు. చెక్క గరిటె, ఆయిల్ బ్రష్, మెను బుక్ వంటివన్నీ గాడ్జెట్‌తో పాటు లభిస్తాయి. దీని ధర 73 డాలర్లు(రూ.5,322). -
టీవీ యాంకర్ ఇంట్లో పేలిన కుక్కర్
సాక్షి, అన్నానగర్: చెన్నైలో టీవీ యాంకర్ ఇంట్లో కుక్కర్ పేలింది. ఆ సమయంలో పక్కన ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టెలివిజన్‌లో సూపర్ హిట్స్ అనే కార్యక్రమానికి యాంకర్ చేసి ప్రసిద్ధి గాంచిన మణిమేఘలై 2017 నటన మాస్టర్ హుసైన్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత ఒంటరిగానే నివసిస్తూ వస్తోంది. ఈ స్థితిలో మణిమేఘలై ఇంట్లో వంట చేసేతను రాకపోవడం వల్ల కుక్కర్లో మణిమేఘలై వంట చేసింది. కుక్కర్ విజిల్ రాకుండా కొద్ది సేపటికే పేలిపోయింది. చెల్లాచెదురుకావడంతో వంట గది నాశనమైంది. దీనిని మణిమేఘలై ఫొటో తీసి తన ఇన్‌స్ట్రాగామ్‌లో విడుదల చేశారు. కుక్కర్ సమీపంలో ఎవరూ లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. చదవండి: ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీల వెనుక ఆంతర్యమేమిటి? View this post on Instagram Ellam correcta panniyum indha cooker edhuku vedichuthu nu enaku ipo therinjaaganum ☝️ Enna paatha indha cooker ku epdi therithu 🤷♀️ namaku varadha oru vishayatha ini try eh panna kudathu 😕 Kitta nindrundha enna ayirukum 🤯 Athum ivlo kashtathula help pannama video edukara indha Hussain maari aala vachutu onnum panna mudiyathu 🚶♀️ Atleast 1 year ku cooking pakkam pogavey kudathu 🐒 Veedu fulla clean panra kashtam kuda paravaala 🙃 without makeup la indha hussain paiya video record pannadhudhan manavaruthama iruku 😛 @mehussain_7 A post shared by Mani Megalai (@iammanimegalai) on Feb 18, 2020 at 3:57am PST -
ఎంతవరకు పాత్ర ఉంటే.. అంతవరకే వేడి!
హౌ ఇట్ వర్క్స్? / ఇండక్షన్ స్టవ్ ఇండక్షన్ స్టవ్‌ల గురించి మీరు విన్నారా? వినే ఉంటారులెండి. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అయిపోయాయి ఇవి. గ్యాస్కంటే తక్కువ ఖర్చుతో వంట చేసుకోవచ్చునని, పిల్లలు ముట్టుకున్నా అపాయం లేదని రకరకాల ప్రచారం జరుగుతోంది వీటిపై. ఈ విషయాలను కాసేపు పక్కనపెడితే ఇవి ఎలా పనిచేస్తాయన్నది మాత్రం చాలా ఆసక్తికరం. ఏదైనా మెటల్ తీగచుట్టలోకి కరెంటు ప్రవహిస్తే ఏమవుతుంది? ఆ తీగచుట్ట కాస్తా అయస్కాంతంగా మారుతుంది. ఫలితంగా దీని చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఇండక్షన్ కుక్కర్లో జరిగే తంతూ ఇదే. నిజానికి ఇండక్షన్ అంటేనే అయస్కాంతం సాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేయడమని అర్థం. ఇంకోలా చెప్పాలంటే విద్యుదయస్కాంత తత్వం తాలూకూ రెండు రూపాలు విద్యుత్తు, అయస్కాంత శక్తి అన్నమాట. ఇండక్షన్ స్టవ్లోనూ ఓ తీగచుట్ట ఉంటుంది. స్విచ్ ఆచ్ చేయగానే దాంట్లోకి కరెంటు ప్రవహిస్తుంది. విద్యుదయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. స్టవ్‌పై ఏదైనా పాత్రను ఉంచినప్పుడు అయస్కాంత క్షేత్రం పాత్రపై కూడా ప్రభావం చూపుతుంది. పాత్రలోని ఎలక్ట్రాన్లు క్షేత్రానికి తగ్గట్టుగా ప్రవహిస్తాయి. ఈ కదలికలు అడ్డదిడ్డంగా ఉండటం వల్ల విపరీతమైన శక్తి పుడుతుంది. ఉష్ణం రూపంలో వెలువడుతూంటుంది. దీని ద్వారా పాత్ర లోపల ఉన్న పదార్థాలూ వేడెక్కుతాయన్నమాట. అంతే! స్టవ్‌పై పాత్ర ఉన్న ప్రాంతంలో మాత్రమే అయస్కాంత క్షేత్రాల్లో తేడాలు రావడం, ఉష్ణం పుడుతుంది కాబట్టి మిగిలిన చోట్ల అంతా మామూలుగానే ఉంటుంది. ఇంకో విషయం. ఇండక్షన్ స్టవ్ ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలంటే వీలైనంత వరకూ ఇరన్ పాత్రలు లేదా అడుగున ఐరన్ పూత ఉన్న పాత్రలు వాడటం మేలు. -
కాస్త స్లో... కానీ బోలెడు ఉపయోగం!
ఇంట్లోనే ఉండేవాళ్లకు రెండు పూటలా వంట చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఉద్యోగాలు చేసుకునేవాళ్లకు రెండో పూట వంట చేసుకోవడం కాస్త కష్టమైన పనే. అలసిపోవడం వల్ల బద్దకంగా అనిపించవచ్చు. కొన్నిసార్లు ఆలస్యంగా రావలసి రావొచ్చు. అలాంటప్పుడు వంట చేయడం ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటివారికి ఈ కుక్కర్ బాగా ఉపయోగపడుతుంది. దీనిని ‘క్రాక్పాట్ స్లో కుక్కర్’ అంటారు. వెల ఐదు వేల వరకూ ఉంది. అయితే కొన్ని ఆన్లైన్ షాపింగ్ స్టోర్స్‌లో 3 వేల నుంచీ కూడా అందుబాటులో ఉంటున్నాయి. క్రాక్పాట్ కుక్కర్ కరెంటుతో పని చేస్తుంది. ఇందులో ఫుడ్ మామూలుగా కంటే కాస్త మెల్లగా ఉడుకుతుంది. ఎక్కువ వేడిమీద వేగంగా ఉడికిపోవడం వల్ల ఆహార పదార్థాల్లోని కొన్ని విటమిన్లు ఆవిరైపోతూ ఉంటాయి. కొన్నిసార్లు మాడిపోతుంటాయి కూడా. అలా కాకుండా ఉండేందుకే ఈ స్లో కుక్కర్ రూపకల్పన జరిగింది. మెల్లగా ఉడుకుతుంది కాబట్టి, కుకర్ ఆన్‌చేసి బయట ఏదైనా పనివుంటే చేసుకుని రావొచ్చు. ఒకేసారి అన్నం, కూర వండుకునే సౌలభ్యం ఉంది కాబట్టి... సాయంత్రం వంట కోసం అవసరమైనవన్నీ కుక్కర్లో పెట్టి, ఏ టైముకి ఆన్ అవ్వాలో టైమ్ సెట్ చేసి పెడితే, ఆ టైముకి కుక్కర్ ఆన్ అవుతుంది. కరెంటు పోయినా, మళ్లీ రాగానే దానంతటదే ఆన్ అవుతుంది. ఉడి కాక ఆటోమేటిగ్గా ఆఫ్ అయిపోతుంది. ఒక్క మైనస్ ఏంటంటే... త్వరగా వండాలనుకున్నప్పుడు మాత్రం ఇది ఉపయోగపడదు!