అన్నం తినడం మొదలుపెట్టిన పిల్లలకు మెత్తటి, రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టడం పెద్ద టాస్కే మోడర్న్ మదర్స్‌కి. ఆకలితో బిడ్డ కేర్‌మనే క్షణానికల్లా వేడివేడిగా వండిచ్చే గాడ్జెట్స్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తున్నారు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బేబీ ఫుడ్ ప్రాసెసర్ మల్టీ ఫంక్షన్ కుకర్ అలాంటిదే. ఈ మేకర్ పైభాగంలో డిజిటల్ డిస్‌ప్లే టచ్ ప్యానెల్ పైన డీఫ్రాస్ట్, స్టీమ్, ఆన్/ఆఫ్, మాన్యువల్ బ్లెండర్, ఆటోమేటిక్ బ్లెండర్, స్టెరిలైజ్ వంటి ఆప్షన్ తో టెంపరేచర్ కంట్రోల్ కోసం ప్లస్ మైనెస్‌లూ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి.
పళ్లు, కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్ ఇలా ఏ ఫుడ్ కావాలన్నా నిమిషాల్లో ఉడికించి పేస్ట్‌లా చేస్తుంది పిల్లలు తినగలిగేలా. ఇది జ్యూసర్, బ్లెండర్, మీట్ గ్రైండర్, కౌంటర్ టాప్ బ్లెండర్ ఇలా చాలా రకాలుగానూ పని చేస్తుంది. ముందుగా కుకర్ ఎడమవైపునున్న వాటర్ ట్యాంక్‌లో వాటర్ పోసుకొని మూత(డిస్ ప్లేకి పక్కనే ఉంటుంది) పెట్టుకోవాలి. తర్వాత ఎడమవైపు పెట్టుకుని.. ఉడికించి మెత్తగా చెయ్యడానికి ఆప్షన్ లు ఇస్తే సరిపోతుంది. స్టీమింగ్ బౌల్, మిక్సీ బౌల్ వేరు వేరుగా ఉంటాయి. ధర 99 డాలర్లు (రూ.7,182).
Comments
Please login to add a commentAdd a comment