
బెంగళూరు : ప్రసవించిన 14రోజులకే అనివార్య కారణాలతో రూ.60వేలకు విక్రయమైన ఏడాది వయస్సున్న పసిబిడ్డ ప్రస్తుతం తల్లితో పాటు జైలు చేరిన విషాదం ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బళ్లారి గౌతం నగర్ నివాసి యల్లమ్మ గతేడాది ఫిబ్రవరిలో బీఎంసీఆర్‌సీలో పసిబిడ్డకు జన్మనించింది. ఈమె భర్త చనిపోయాడు. తనకు ఆ బిడ్డ వద్దని రూపనగుడి రోడ్డు నివాసి నవీన్ కుమార్‌కు రూ.60వేలకు విక్రయించింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న బాలలరక్షణ శాఖ సహాయ వాణికి గత ఆగస్ట్ 5న సమాచారం రావడంతో వారు బళ్లారి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి పసిబిడ్డను ఆంధ్రప్రదేశ్‌లోని ఆలూరు నుంచి తీసుకొచ్చారు. బిడ్డను కొనుగోలు చేసిన నవీన్ కుమార్, విక్రయించిన బిడ్డ తల్లి యల్లమ్మను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బిడ్డను బళ్లారి జైల్లో ఉన్న సొంత తల్లి వద్దకే చేర్చారు.
ఈ కేసులో విక్రయించిన,కొనుగోలు చేసిన వారికి 10ఏళ్ల శిక్ష ఉంటుంది. కోర్టులో నేరం రుజువైతే తల్లితో పాటు బిడ్డ కూడా శిక్ష అనుభవించాలా? లేక బాలల రక్షణ శాఖలోని అమ్మఒడి ఆశ్రమంలో ఉంటుందా? అనే సందేహం తలెత్తుతోంది. కాగా, తల్లి వద్దు అనుకున్న బిడ్డను సంతానం లేని దంపతులు గత ఏడాది నుంచి పెంచి పోషించి తల్లి ప్రేమకు నోచుకునేలా చేసిన ఆ తల్లిదండడ్రులకే దత్తత ఇస్తే బాగుంటుందని సమాజ శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment