
ఒకేసారి రెండు వెరైటీలను తయారు చేసుకునేందుకు వీలుగా ఉన్న ఈ మల్టీ కుకర్‌ను.. యూజర్ ఫ్రెండ్లీ మెషిన్‌గా చెప్పుకోవచ్చు. చిన్నచిన్న అపార్ట్‌మెంట్స్‌లో, ఓపెన్ కిచెన్స్‌లో ఇలాంటి మినీ మేకర్ అందుబాటులో ఉంటే అలుపుసొలుపు లేకుండా ఇట్టే వంట చేసేసుకోవచ్చు. ఇందులో రకరకాల రైస్ ఐటమ్స్‌తో పాటు కుడుములు, వాయికుడుములు వంటివెన్నో వండుకోవచ్చు.
3.5 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ కుకర్‌లో.. గుడ్లు, జొన్న కండెలు, దుంపలు, కేక్స్ వంటివీ ఉడికించుకోవచ్చు. మెయిన్ బేస్ మెషిన్ మీద.. స్టీల్ ట్రేలో మరో వెరైటీని కుక్ చేసుకునే వీలుంటుంది. దీనికి సరిపడా ట్రాన్స్‌పరెంట్ లిడ్ (మూత) ఉంటుంది. డివైస్ ముందున్న రెగ్యులేటర్ సాయంతో దీన్ని సులభంగా వాడుకోవచ్చు. దీని ధర 80 డాలర్లు(రూ.6,672).
Comments
Please login to add a commentAdd a comment