
బెంగళూరు:కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒక్కటిగా బతకాలనుకున్నారు. ఉద్యోగం కూడా ఒకే దగ్గర చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటున్నందున సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్యలో అనుమానం పెనుభూతంలా మారింది. తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భాగస్వామే ప్రెషర్ కుక్కర్‌తో బాది హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది.
ఇదీ జరిగింది..
దేవా(24), వైష్ణవ్(29) ఇద్దరూ కేరళకు చెందినవారు. ఇద్దరు కాలేజీ రోజుల్లోంచి ఒకరికొకరు తెలుసు. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరులోని ఓ రెంట్ హౌజ్‌లో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దేవా తనను మోసం చేస్తోందని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ వ్యవహారంపై తరచూ గొడవ పడుతుండేవారు. శనివారం సాయంత్రం కూడా గొడవకు దిగారు. నిగ్రహం కోల్పోయిన వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో దేవా అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. అనంతరం ఘటనాస్థలం నుంచి వైష్ణవ్ పరారయ్యాడు.
అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై దేవా చెల్లి పొరుగువారిని సంప్రదించింది. విషయం తెలుసుకున్నవారు.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇద్దరి మధ్య గొడవ గురించి తమకు తెలుసని దేవా తల్లిదండ్రులు తెలిపారు. ఈ అంశంలో కలగజేసుకుని సర్దిచెప్పామని పోలీసులకు తెలిపారు. పరారీలో ఉన్న వైష్ణవ్‌ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్..
Comments
Please login to add a commentAdd a comment