బెంగళూరు: బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు నేడు రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. భేటీలో కీలక అంశాలు ఇవే..
► 'ఎన్డీయే, బీజేపీ.. మా 'ఇండియా' కూటమిని ఛాలెంజ్ చేస్తారా..?' అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 'మాతృభూమిని ప్రేమిస్తాం.. దేశాన్ని ప్రేమిస్తున్న నిజమైన దేశభక్తులం మేము. హిందువులు, దళితులు, మైనారిటీలు, రైతులు, బెంగాల్, మణిపూర్‌కు బీజేపీతో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వాలను కొనడం.. అమ్మడమే వారి పని' అని బీజేపీని మమతా బెనర్జీ విమర్శించారు.
► విపక్షాల భేటీ మరో సమావేశం ముంబయిలో నిర్వహించనున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
► కూటమికి నాయకుడు ఎవరనే అంశంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తెల్చుతారని చెప్పారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్షాల భేటీ అనంతరం ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు.
► బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ఐఎన్‌డిఐఏ ఉద్దేశం ఐక్యంగా పోరాడటమే అని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు.
► ప్రతిపక్ష భేటీలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకూటమి విజయం సాధించాక పీఎం పదవికి తమకు ఆసక్తి లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.
► బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిపక్షాల భేటీలో మొదటి రోజు నిన్న ముగిసింది. అయితే.. ఈ మహాకూటమి తరపున ప్రధాన మంత్రి పేరును యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ, కన్వినర్ నితీష్ కుమార్ సూచించనున్నట్లు సమాచారం.
► భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా నేడు సమావేశంలో పాల్గొననున్నారు.
► నిన్న సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ పక్క పక్కనే కూర్చున్నారు. దేశ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించుకున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు.
► ప్రతిపక్షాల రెండో సమావేశాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించాక, అదే స్థలంలో దేశ రాజకీయాల్లోనూ విజయాన్ని కాంక్షిస్తూ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: ప్రతిపక్ష భేటీ: బీజేపీకి పోటీగా మహాకూటమి పేరు ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment