live
-
LIVE:వంశీ అరెస్ట్ పై వైఎస్ జగన్ ప్రెస్ మీట్
-
హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా
టెల్అవీవ్: హమాస్ అధినేత యహ్యా సిన్వార్ బతికే ఉన్నట్లు ఖతర్‌కు చెందిన సీనియర్ దౌత్యవేత్త సోషల్‌మీడియాలో పోస్ట్ చేసినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు ప్రచురించింది.సిన్వార్ తన చుట్టూ ఇజ్రాయెల్ బందీలను రక్షణ కవచంగా ఏర్పరుచుకున్నారని ఖతర్ అధికారులు చెప్పినట్లు కథనాల సారాంశం.సెప్టెంబర్ 21న గాజాలోని ఓ స్కూల్లో ఉన్న హమాస్ కమాండ్ సెంటర్ టార్గెట్‌గా పెద్దఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి.ఈ దాడుల్లో సిన్వార్ మృతిచెంది ఉంటారని ఇజ్రాయెల్ దళాలు భావించాయి.ఈ విషయంలో సిన్వార్ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు.దీంతో అతడు మృతి చెంది ఉంటాడన్న వాదనకు బలం చేకూరింది. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన మెరుపు దాడులకు సూత్రధారి సిన్వార్. హమాస్ చీఫ్‌గా ఉన్న హనియే మృతి తర్వాత ఈ ఏడాది ఆగస్టులో సిన్వార్ ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఇదీ చదవండి: ఇరాన్ భూగర్భ అణు పరీక్షలు -
115 ఏళ్ల బామ్మ..! ఆమె సుదీర్ఘకాల జీవిత రహస్యం ఇదే..!
ఇటీవల మనుషులు మహా అయితే 60 లేదా 70కి మించి బతకడం కష్టంగా ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో చామంది 30 లేదా 40కే టపా కట్టేస్తున్నారు. కానీ కొందరు మాత్రం సుదీర్థకాలం జీవించి ఔరా అనిపించుకుంటున్నారు. అలాంటి కోవకు చెందిందే ఈ వృద్ధ మహిళ కూడా. వయసు పరంగా సెంచరీ కొట్టిన ఈ వృద్ధ మహిళ తన సుదీర్ఘకాల జీవిత రహస్యాన్ని షేర్ చేసుకుంది. ఆ వృద్ధురాలి ప్రకారం..సుదీర్థకాలం జీవించడం ఎలా అనే దాని గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అమెరికాలో అత్యంత వృద్ధురాలు ఎలిజబెత్ ఫ్రాన్సిస్ ఇటీవల తన 115వ పుట్టిన రోజును జరుపుకుంది. ఆమె ముఖంతో సంతృప్తికరంగా జీవిస్తున్నానే ఉత్సాహం ఉరకలేస్తున్నట్లు కనిపిస్తుంది. యూఎస్‌లో జీవించి ఉన్న అత్యంత వృద్ధురాలు కూడా ఆమెనే. ఈ నేపథ్యంలో ఎలిజబెత్ తన సుదీర్ఘ ఆరోగ్య రహస్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. ఆమె సుదీర్ఘ ఆరోగ్య రహస్యం ఏంటంటే..ఎలిజబెత్ చిన్న వయసులోనే తన తోడబుట్టిన వాళ్ల నుంచి విడిపోయి అత్త వద్ద పెరిగింది. చిన్నతనంలో కొద్దిపాటి సవాలును ఎదుర్కొన్న ఎలిజబెత్ పెద్ద కుటుంబాన్ని నిర్మించుకుని ఆనందకరంగా జీవించింది. ప్రస్తుతం ఆమె ముగ్గురు మనవళ్లు, ఐదుగురు మనవరాళ్లు, నలుగురు మునిమనవళ్లతో సంతోషంగా ఉంది. ఆమె సుదీర్ఘ జీవిత రహస్యానికి కారణం తన కుటుంబమే అంటోంది. తన కుటుంబ సభ్యుల పట్ల ఉన్న బలమైన బంధం, ప్రేమానురాగాలే ఇంత కాలం బతికేలా చేశాయని చెబుతోంది. ఇక ఆమె దీర్ఘాయువుకి దోహదపడిన జీవనశైలి వద్దకు వస్తే..ఎలిజబెత్ డ్రైవింగ్ నేర్చుకోకపోవడంతో ఎక్కడికి వెళ్లిన నడుచుకునే వెళ్లేది. ఈ శారీరక శ్రమ దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని నివారించి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచింది. పైగా ఆమె ఆయుర్దాయాన్ని పెంచింది. ఇక రోజులో కాసేపే ఏకాంతంగా గడిపే అలవాటు మానసిక భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా చేసి మానసికంగా స్థైరంగా ఉండేలా చేసింది. ఒత్తిడిని ఎదుర్కొనే సామార్థ్యాన్ని పెంపొందడమే కాకుండా మెరుగైన సంబంధాలను ఏర్పరుచుకునేలా చేసింది. అలాగే ఎలిజబెత్‌కు ఉన్న ఆశావాహ దృక్పథం ఆరోగ్యకరమైన జీవితానికి దోహదం చేసింది. అలా అని ఆమె జీవితం ఏమీ పూలబాట కాదు. చిన్నతనంలో తల్లిని కోల్పోయి మరోకరి వద్ద పెరగడం దగ్గర నుంచి ఒంటరి తల్లిగా తన పిల్లలను పెంచాల్సిన కష్టాలను కూడా ఫేస్ చేసింది. అయితే ఆమె కష్ట సమయంలో ధైర్యంగా ప్రతికూల పరిస్థితులతో పోరాడి తన కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చేలా కృషి చేసింది. ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఎదురు దెబ్బలు, సవాళ్లు బలంగా ఎదిగేందుకు, సుదీర్ఘకాలం జీవించేందుకు ఉపకరించింది. ఇక్కడ ఎలిజబెత్ జీవితం కాలానుగుణంగా వచ్చే కష్టాలు, కన్నీళ్లతో పోరాడుతూ.. మంచి ఆరోగ్యపు అలావాట్లతో సుదీర్ఘకాలం జీవించొచ్చని చాటి చెప్పింది. గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన వాళ్ల కంటే కష్టాల కడలిని ఎదుర్కొని వచ్చే విజేతలకే ఎక్కువ ఆత్మబలం ఉంటుందని ఎలిజబెత్ గాథ చెబుతోంది.(చదవండి: నాన్‌స్టిక్ పాన్‌తో పెరుగుతున్న టెఫ్లాన్ ఫ్లూ కేసులు!) -
Lavanya Namoju: ఆలయచిత్రం
గుడిని గుడికి కానుకగా ఇస్తే ఎంత బాగుంటుంది? తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నామోజు లావణ్య దేశంలోని ఆలయాలకు వెళ్లి అక్కడి ఆధ్యాత్మికతను, గుడి ప్రాంగణాన్ని, ఆలయ గోపురాలను లైవ్ పెయింటింగ్ చేసి ఆ చిత్రాలను గుడికే బహుమానంగా ఇస్తోంది. దీని వల్ల గుడి రూపం చిత్రకళలో నిలుస్తోంది. అలాగే గుడికి వచ్చే భక్తులకు ఆలయ సౌందర్యాన్ని తెలియచేస్తుంది.‘ప్రతి ముఖ్యమైన గుడిలో నా చిత్రం ఉండాలి. అలాగే మరుగున పడిన గుడి నా చిత్రకళ ద్వారా కాస్తయినా ప్రచారం పొందాలని ఆలయ చిత్రాలను లైవ్ పెయింటింగ్ ద్వారా నిక్షిప్తం చేస్తున్నాను. ఇందుకు వస్తున్న ఆదరణ ఆనందం కలిగిస్తోంది’ అంది పాతికేళ్ల నామోజు లావణ్య. ‘ఇందుకు నా పెయింటింగ్స్ అమ్మకాల వల్ల వచ్చే డబ్బునే ఉపయోగిస్తున్నాను ఇటీవల భద్రాచల ఆలయంలోని సీతారాముల వారి మూర్తులు, ఆలయం లైవ్ పెయింటింగ్ చేసి దేవస్థానానికి అందజేశాను’ అందామె. ఒకరకంగా ఇది ఆధ్యాత్మిక చిత్రకళా సాధన అని కూడా అనుకోవచ్చు. మన సంస్కృతి కోసం‘మాది యాదాద్రి భువనగిరి. కామర్స్‌తో డిగ్రీ పూర్తి చేశాను. పోటీ పరీక్షలకు హాజరై, ఉద్యోగం తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను. కానీ నా ఇష్టం మొత్తం పెయింటింగ్స్ మీదే ఉంది. దీంతో ఏడాది నుంచి పెయింటింగ్నే నా వృత్తిగా మార్చుకున్నాను. స్కూల్ ఏజ్ నుంచి నోట్ బుక్స్‌లో పెయింటింగ్స్ వేస్తుండేదాన్ని. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతున్న ఈ కాలంలో సోషల్‌మీడియా ద్వారా మన సంస్కృతిని, మంచిని కూడా పరిచయం చేయవచ్చు అనిపించి సంవత్సరం నుంచి ఆలయ శిల్పాన్ని, హైందవ సంస్కృతిని నా ఆర్ట్ ద్వారా చూపుతున్నాను’.రాక్ స్టోన్స్ పై జంతువులు‘మెదక్ జిల్లా మరపడ దగ్గర ఒక వెంచర్ వాళ్లు ఆర్ట్‌కు సంబంధించిన విషయం మాట్లాడటానికి పిలిస్తే నేను, మా అంకుల్ శ్రీనివాస్ వెళ్లాం. అక్కడ ఒక గ్రామదేవత టెంపుల్ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద రాళ్లను చూశాక వాటిని ఆకారాలుగా చూపవచ్చనిపించింది. మొత్తం 42 రకాల పెద్ద పెద్ద రాక్ స్టోన్స్ ఉన్నాయి. వాటిని ఏనుగులు, ఆవులు, కోతులు, తాబేలు, కొలనుగా రంగులద్ది మార్చాను. మొన్నటి మే నెల ఎండలో వేసిన పెయింటింగ్స్. అక్కడికి వచ్చినవాళ్లు ‘ఆడపిల్ల అంత పెద్ద రాళ్లు ఎక్కి ఏం పెయింటింగ్స్ వేస్తుంది’ అన్నారు. కానీ అవి పూర్తయ్యాక చాలా సంతోషించారు’ అంది లావణ్య.వెడ్డింగ్ లైవ్ ఆర్ట్‘వివాహవేడుక జరుగుతుండగా ఆ సన్నివేశం, సందర్భం చూడటానికి చాలా బాగుంటుంది. లైవ్ ఆర్టిస్ట్‌ను అని తెలియడంతో గత పెళ్లిళ్ల సీజన్లో వివాహం జరుగుతుండగా ఆ సీన్ మొత్తం పెయింటింగ్ చేసే అవకాశం వచ్చింది. చాలా ఆనందంగా ఆ కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్టుగా చిత్రించి, ఇచ్చాను. కాలేజీ రోజుల్లోనే తొమ్మిది నెలల పాటు మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. యువతకు మోటివేషనల్ స్పీచ్‌లు ఇస్తుంటాను. షీ టీమ్ వారు ‘షీ ఫర్ హర్’ అవార్డు ఇచ్చారు. నాన్న సురేందర్ కరోనా సమయంలో చనిపోయారు. అమ్మ గృహిణి. తమ్ముడు శివప్రసాద్ సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యం గల కుటుంబమే మాది. నా కళకు సపోర్ట్ చేసేవారుంటే మరెన్నో విజయాలు అందుకోవచ్చు’ అంటూ తెలిపింది ఈ హార్టిస్ట్.– నిర్మలారెడ్డి -
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కల్యాణ్, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాబు, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్ ఫరూఖ్, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్, ఎస్ సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్‌తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్రజినీకాంత్ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే -
మహాత్మునికి నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోదీ మూడోసారి దేశానికి ప్రధాని కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన ఈరోజు ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద పూలమాలలు ఉంచి, నివాళులర్పించారు.మోదీ ప్రమాణాస్వీకారోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పలు చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు అతికించారు. ఈ కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే లను ఆహ్వానించారు. #WATCH | Delhi: PM-designate Narendra Modi arrives at Rajghat to pay tribute to Mahatma Gandhi, ahead of his swearing-in ceremony, to be held today at Rashtrapati Bhawan.He will take the Prime Minister's oath for the third consecutive term, today at 7:15 PM. pic.twitter.com/L7u5S0uvHo— ANI (@ANI) June 9, 2024 ఇదీ చదవండి: నేడు మోదీ మూడోసారి -
ఉగ్రవాది గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు
వాషింగ్టన్: పంజాజీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది గోల్డీ బ్రార్ మృతి చెందినట్లు వచ్చిన వార్తలను అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు కొట్టిపారేశారు. గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని చెప్పారు. ప్రెస్నో సిటీలో మంగళవారం సాయంత్రం రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగిన కాల్పుల్లో గోల్డీ బ్రార్ మరణించాడని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, హతుడిని 37 ఏళ్ల జేవియర్ గ్లాండీగా ప్రెస్నో పోలీసులు బుధవారం గుర్తించారు. గోల్డీ బ్రార్ హతమైనట్లు భారత మీడియాలోనూ ప్రసారమైంది. -
అయోధ్యకు వెళ్లలేరా? ప్రాణప్రతిష్ఠను ఇలా ప్రత్యక్షంగా చూడండి!
జనవరి 22న అయోధ్యలో నూతన రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ వేడుకలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. అయితే ఆరోజు ప్రత్యేక అతిథులకు మాత్రమే ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అనుమతివుంది. అయితే అయోధ్యకు వెళ్లి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తిలకించలేనివారి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగం తెలిపిన వివరాల ప్రకారం జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు దూరదర్శన్ (డీడీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం దూరదర్శన్ అయోధ్యలోని రామ మందిరం చుట్టుపక్కల 40 కెమెరాలను ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమం డీడీ నేషనల్, డీడీ న్యూస్‌లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. జనవరి 23న కూడా దూరదర్శన్‌లో రామ్‌లల్లా ప్రత్యేక హారతితో పాటు సాధారణ పౌరుల కోసం ఆలయం తెరవడాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధాన ఆలయ సముదాయం మాత్రమే కాకుండా, సరయూ ఘాట్ సమీపంలోని రామ్‌కి పైడి, కుబేర్ తిల దగ్గరున్న జఠాయువు విగ్రహం, ఇతర ప్రదేశాల నుంచి కూడా దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాలు చేయనుంది. మరోవైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసేందుకు ప్రత్యేక యూట్యూబ్ లింక్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనిద్వారా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. దూరదర్శన్‌తో పాటు పలు ప్రైవేట్ ఛానెళ్లు కూడా దూరదర్శన్ నుంచి ఫీడ్‌ను అందుకుంటాయని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. దూరదర్శన్ ఈ కార్యక్రమాలను 4కె టెక్నాలజీ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేయనుందని, ఫలితంగా ప్రేక్షకులు హైక్వాలిటీ పిక్చర్‌ను చూడగలుగుతారని అపూర్వ చంద్ర తెలిపారు. ఇది కూడా చదవండి: శిల్పి అరుణ్ యోగిరాజ్ గురించి శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఏమన్నది? -
టీవీ స్టూడియోలో దుండగుల దాడి.. లైవ్‌లో వీక్షించిన ప్రేక్షకులు!
ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా తాజాగా క్రిమినల్ గ్రూప్ ‘ఈక్వెడార్ గ్యాంగ్స్టర్స్ స్టార్మ్ స్టూడియో’పై సైనిక చర్యకు ఆదేశించారు. హుడ్ ధరించిన ఈ గ్రూప్‌నకు చెందిన ముష్కరులు టెలివిజన్ స్టూడియోపై దాడి చేయడంతో పాటు భద్రతా బలగాలను, పౌరులను చంపుతామని బెదిరించడంతో అధ్యక్షుడు ఇటువంటి ఆదేశాలు జారీచేశారు. ఈక్వెడార్‌లో పేరుమోసిన నేరస్తుడు జోస్ అడాల్ఫో ఇటీవల మాసియాస్ జైలు నుండి తప్పించుకోవడంతో దేశంలో భద్రతా సంక్షోభం తలెత్తింది. దేశంపై గ్యాంగ్స్టర్లు యుద్ధం ప్రకటించారు. దీంతో దేశం అంతర్గత సాయుధ సంఘర్షణలో ఉందని అధ్యక్షుడు నోబోవా ప్రకటించారు. శాంతియుత స్వర్గధామంగా ఉన్న ఈక్వెడార్‌పై పట్టుసాధించేందుకు ఇటీవలి కాలంలో మెక్సికన్,కొలంబియన్ కార్టెల్స్‌తో సంబంధం కలిగిన ప్రత్యర్థి ముఠాలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ క్రిమినల్ గ్రూపులను మట్టుబెట్టేందుకు సైనిక చర్య చేపట్టాలని దేశ సాయుధ బలగాలను అధ్యక్షుడు నోబోవా ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పోర్ట్సిటీలోని టీసీ టెలివిజన్ స్టూడియోలో తుపాకులు, గ్రెనేడ్లతో దుండగులు దాడికి పాల్పడిన దరమిలా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. కాగా స్టూడియోలో తుపాకీ కాల్పుల మధ్య ఒక మహిళ.. ‘షూట్ చేయవద్దు, దయచేసి కాల్చకండి’ అని వేడుకుంది. అయితే ముష్కరులు వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు అక్కడున్న ఇతర ఉద్యోగులను నేలపై కూర్చోమని ఆదేశించి, తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని బెదిరించారు. ఈ ఉదంతమంతా టీవీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్‌లో తుపాకీ శబ్దాలూ వినిపించాయి. దీనిని ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. సుమారు 30 నిమిషాల గందరగోళం తర్వాత అధికారులు స్టూడియోలోకి ప్రవేశించడం కనిపించింది. దీనికి ముందు గ్యాంగ్స్టర్లు పోలీసు అధికారులను కిడ్నాప్ చేశారు. అధ్యక్షుడు నోబోవా ప్రకటించిన 60 రోజుల అత్యవసర పరిస్థితి, రాత్రిపూట కర్ఫ్యూకి నిరసనగా గ్యాంగ్స్టర్లు దేశంలోని పలు నగరాల్లో పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. కాగా 36 ఏళ్ల నోబోవా దేశంలో మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, హింసకు వ్యతిరేకంగా పోరాడతానని డేనియల్ నోబోవా ప్రతిజ్ఞ చేసిన దరిమిలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. -
Ram Mandir Pran Pratishtha: టైమ్స్ స్క్వేర్‌లో ‘ప్రాణప్రతిష్ఠ’ ప్రత్యక్ష ప్రసారం
జనవరి 22న అయోధ్యలో జరిగే బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మన దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కానుంది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో గల ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో కూడా ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం అయోధ్య పవిత్రోత్సవం వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలలో కూడా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆరోజు రామభక్తులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలను ప్రధాని మోదీ నిశితంగా పరిశీలిస్తున్నారని సమాచారం. బాలరాముని ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి 84 సెకన్ల శుభ సమయం నిర్ణయించారు. 2024, జనవరి 22న ఉదయం 12:29 నుండి 12:30 మధ్య కాలంలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరగనుంది. కాగా నూతన రామాలయం మూడు అంతస్తులలో నిర్మితమయ్యింది. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఆలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రామ్‌లల్లా విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ఐదేళ్ల బాలుని రూపంలో ఉంటుంది. కాగా ఆలయంలో ఇంతవరకూ ఉన్న బాలరాముని విగ్రహాన్ని నూతన విగ్రహంతో పాటు గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. ఇది కూడా చదవండి: అయోధ్య ‘ప్రాణప్రతిష్ఠ’కు ముఖ్య అతిథులెవరు? -
అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ...
భూమిమీద బతికే మనిషికి అన్నీ సమస్యలే... ఇంటి రెంట్ మొదలుకొని ఇన్స్యూరెన్స్ వరకూ అన్నీ మోయలేనంత భారమే. అందుకే దీనికి పరిష్కారం క్రూయిజ్ షిప్లో బతకడం అంటూ తేల్చిపారేస్తున్నారు జాన్, హెన్సెస్సీ దంపతులు. క్రూయిజ్ షిప్లో నివసించడం అంటూ మొదలుపెడితే మీరు యుటిలిటీ బిల్లులు, ఆటో బీమా, ఆస్తి బీమా మొదలైనవి అస్సలు చెల్లించాల్సిన అవసరం లేదని జాన్, హెన్సెస్సీలు ముక్తకంఠంతో చెబుతున్నారు. క్రూయిజ్ షిప్లో నివసించేందుకు సిద్ధమైన జాన్, హెన్సెస్సీ దంపతులు 2020లో ఫ్లోరిడా(అమెరికా)లోని తమ ఇల్లు, వ్యాపారం, విలువైన వస్తువులను విక్రయించేశారు. రాయల్ కరీబియన్ క్రూయిజ్ లైన్స్‌లో 274 రోజుల ప్రయాణం కోసం టిక్కెట్లను కొనుగోలు చేశారు..‘ఇప్పుడు మేము టెలిఫోన్ బిల్లు, షిప్పింగ్ బిల్లు చెల్లిస్తే సరిపోతుంది. కొన్ని క్రెడిట్ కార్టు మా దగ్గర ఉన్నాయి. ఇకపై మేము ఇంటి అద్దె, వాహన బీమా, ఆస్తి బీమా, యుటిలిటీ బిల్లులు... ఇలా పెద్ద జాబితాను చెల్లించాల్సిన అవసరం లేదు’ అని ఆ దంపతులు పేర్కొన్నారు. ఈ దంపతులు త్వరలో రెసిడెన్షియల్ క్రూయిజ్ షిప్ ఎక్కనున్నారు. దానిలో వారు క్యాబిన్‌ను కొనుగోలు చేశారు. ఇందుకోసం వారు ‘విల్లా వీ’ని ఎంచుకున్నారు. ఇది శాశ్వత నివాసాన్ని అందించే తొలి క్రూయిజ్ షిప్‌లలో ఒకటి. దీనిలోని ప్రయాణికులలో 30శాతం మంది పూర్తి సమయం దీనిలోనే ఉంటారు. మిగిలిన 85శాతం ప్రయాణికులు యూఎస్ పౌరులు. ఈ క్రూయిజ్ షిప్‌లోని క్యాబిన్ ధర 99 వేల డాలర్లు(ఒక డాలర్ రూ. 83). సీ వ్యూ కలిగిన బాల్కనీ విల్లాల ధర 249 వేల డాలర్లు. క్యాబిన్లలో కిచెన్, అతిథుల కోసం లివింగ్ రూమ్‌లో పుల్ డౌన్ బెడ్ ఉంటాయి. ఇందులో నివాసం కల్పించుకున్నవారు పోర్ట్ ఛార్జీలు చెల్లించాక తమ కుటుంబాలను ఉచితంగా ఆన్‌బోర్డ్‌లోకి తీసుకువచ్చేందుకు అనుమతివుంటుంది. ‘విల్లా వీ’ సీఈఓ మైకేల్ పెటర్సన్ మీడియాతో మాట్లాడుతూ తమ షిప్‌లోని దాదాపు సగం క్యాబిన్లలో వ్యాపార యజమానులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నారన్నారు. కాగా జాన్, హెన్సెస్సీ దంపతులు క్రూయిజ్‌లో ఉంటూనే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వీలైనంత వరకు నడుస్తుంటారు. ఈ భారీ షిప్ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూగోళాన్ని చుట్టుముడుతుంది. వెచ్చని వాతావరణంలో ఉండేందుకు సూర్యుడిని అనుసరిస్తుంది. జాన్, హెన్సెస్సీ దంపతులు తమకు కనిపించినవారందరికీ ఈ భూమిమీద నివసించడం కన్నా ఇలా క్రూయిజ్ షిప్లో బతకడమే చౌకైనదని, అదే ఉత్తమమని సలహా ఇస్తుంటారు. ఇది కూడా చదవండి: పాక్ రాజకీయాల్లో పెను సంచలనాలు! -
అప్పటి వరకు సజీవంగా కనిపించిన వ్యక్తి..సడెన్‌గా 'మమ్మీలా'...
ఈజిప్ట్‌లో మమ్మీఫికేషన్ మృతదేహాల గురించి చూశాం. అక్కడ రాజులు, ప్రముఖ వ్యక్తుల దేహాలు పాడవ్వకుండా కొన్ని రకాల రసాయనాలు పూసి సమాధి చేయడం గురించి విన్నాం. పురావస్తు శాఖ అధికారులు అలా మమ్మఫికేషన్ చేయబడిని వాటిని వెలికితీసి వాటిపై పరిశోధనలు చేస్తూ కొంగొత్త విషయాలను చెబుతుంటారు. కానీ ఇక్కడొక వ్యక్తి శాస్త్రవేత్తలకే సవాలు విసిరేలా అకస్మాత్తుగా మమ్మీలా మారిపోయాడు. ఇది ఎలా సాధ్యం అని శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకున్నారు. ఏవిధంగా చూసిన ఓ మృతదేహం మమ్మిఫికేషన్ అవ్వాలంటే కనీసం కొద్ది నెలలు పడుతుంది. మరి ఇదేంటి?.. శాస్త్రవేత్తలను ఓకింత కలవారపాటుకు గురి చేసిన ఆ అంతు పట్టని మిస్టరీ గురించే ఈ కథనం. అసలేం జరిగిందంటే..సెప్టెంబర్ 3న బల్గేరియాలోని రైల్వేలైన్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేయగా మద్యానికి బానిసకావడంతో చనిపోయినట్లు తేలింది. విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఆగస్టు 16 వరకు సజీవంగా ఉన్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. జస్ట్ 16 రోజుల తర్వాత మమ్మీలా మారిని అతడి శవంలా కనిపించింది. ఓ మృతదేహం మమ్మీఫికేషన్ అవ్వాలంటే కనీసం ఆరు నుంచి 12 నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఆ వ్యక్తి మృతదేహం మాత్రం చాలా ఏళ్ల క్రితం నాటి మమ్మీలా ఉంది. తొలుత పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని చూసి ఏదో మమ్మీలాంటి శవం ఎప్పుడోది అనుకున్నారు. ఆ తర్వాత ఆ మమ్మీ కాస్త ఫలాన వ్యక్తి అని తేలాక ఒక్కసారిగా కంగుతిన్నారు పోలీసులు. అత్యంత విచిత్రమైన అంశం ఏంటంటే బల్గేరియాలో అంతగా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండవు. కేవలం 16 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంత త్వరగా మృతదేహం పొడిగా మారిపోయి ఆధునాతన మమ్మీఫికేషన్లా ఎలా అయిపోయిందనేది అర్థంకాని అంతుపట్టని మిస్టరీలా ఉంది. అటు పోలీసులు, శాస్త్రవేత్తలు బల్గేరియా రాజధాని సోఫియాలో త్వరితగతిన మమ్మిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసే వాతావరణం లేదని కరాఖండీగా చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి మృతదేహం ఎలా మమ్మీఫికేషన్గా మారిందనేది ఎవ్వరికీ అర్థంకాని చిక్కు ప్రశ్నలా మిగిలింది. (చదవండి: ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..) -
చంద్రబాబు పూర్తి భద్రతలో ఉన్నారని ఏఏజీ వెల్లడి
-
'బతికే ఉన్న..' వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ కొత్త వీడియో వైరల్..
వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ మరణానికి ముందు ఆఫ్రికాలో ఉన్నట్లు చెప్పుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టెలిగ్రామ్ ఛానల్లో విడుదలైన వీడియోలో ప్రిగోజిన్ తన యోగక్షేమాల గురించి అలాగే తన భద్రతపై ఉన్న అనుమానాలపై మాట్లాడారు. ఆర్మీ దుస్తులు ధరించి, చేతికి వాచ్ పెట్టి ఉన్న ఆయన మృతికి ముందు ఆగష్టు 21నాటి వీడియోగా భావిస్తున్నారు. వీడియోలో ప్రిగోజిన్ మాట్లాడుతూ..' నేను బతికానా? ఇంకా చనిపోయానా..? ఎలా ఉన్నాను.. ఏం చేస్తున్నాను? అని చర్చించుకునేవారి కోసమే ఈ వీడియో. ఇది వీకెండ్ ఆగష్టు 2023 చివరి భాగంలో ఉన్నాం. నా జీవితాన్ని అంతం చేయడానికి నిరంతరం చర్చించుకుంటున్నారు. నా వ్యక్తిగత జీవితం, సంపాదన అంతా బాగానే ఉన్నాయ్' అని ప్రిగోజిన్ చెప్పారు. ఈ వీడియోను ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రికి సలహాదారు అంటోన్ గెరాష్చెంకో షేర్ చేయగా.. ట్విట్టర్(ఎక్స్) లో విపరీతంగా చర్చ జరుగుతోంది. ప్రిగోజిన్ ఇంకా బతికే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. భూగర్భంలో ఉన్నట్లు కామెంట్ బాక్స్‌లో తమ అభిప్రాయాలను రాసుకొచ్చారు. ప్రిగోజిన్‌కు సంబంధించిన మరిన్ని వీడియోలు షేర్ చేయండని మరొక నెటిజన్ స్పందించాడు. A video of Prigozhin appeared that is reportedly filmed in Africa not long before his death. "So, fans of discussing my death, intimate life, earnings, etc., I am doing fine," Prigozhin says. pic.twitter.com/UcIKpgLNZi — Anton Gerashchenko (@Gerashchenko_en) August 31, 2023 రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రిగోజిన్ తిరుగుబాటు చేసిన రెండు నెలల తర్వాత ఆయన విమాన ప్రమాదంలో చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది అనుయాయులు కూడా మృతి చెందారు. వీరి మరణ వార్తను రష్యా అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో ప్రిగోజిన్ మరణించినట్లు స్పష్టం చేసింది. ప్రమాదం వెనుక పుతిన్ హస్తం ఉందనే ఆరోపణలపై క్రెమ్లిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అవన్ని అవాస్తవాలని పేర్కొంది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
ఇద్దరు భార్యల ముద్దుల భర్త.. చెరో పదిహేను రోజులు..
భోపాల్:వివాహం అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. సంతోషాలతో పాటు కష్టాలను కూడా తెచ్చిపెడుతుంది. దంపతుల మధ్య విభేదాలు రావడం, పరిష్కరించుకోవడం నిత్యం జరిగేపనే. అయితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయినిలో ఓ వ్యక్తికి కూడా వివాహ జీవితంలో ఓ క్లిష్టపరిస్థితి ఎదురైంది. మరి ఆ చిక్కుముడిని పరిష్కరించుకున్న తీరు చూస్తే ఆశ్చర్యపోతారు..! మొదటి భార్య ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడో వ్యక్తి. రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ మొదటి భార్యతో కలిసి జీవించడానికి ఆసక్తితో ఉన్నాడు. రెండు పెళ్లి చేసుకున్నప్పటికీ భర్తను విడిచి పెట్టడానికి మొదటి భార్య అంగీకరించలేదు. తన భర్తతోనే ఉంటానని కోరింది. కానీ ఈ విషయం రెండో భార్యకు నచ్చలేదు. మొదటి భార్యను పదిహేను ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండటంతో ఆమె ఉండగానే భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్తను విడిపోవడానికి మొదటి భార్య ఒప్పుకోలేదు. కానీ రెండో భార్య ఇందుకు ఇష్టపడలేదు. దీంతో ఆమె న్యాయపరమైన మార్గాన్ని అనుసరించింది. కేసు నమోదు చేయడంతో ఈ గొడవ పరామర్శ కేంద్రాన్ని చేరింది. వీరికి సమస్యకు ఏం పరిష్కారం ఇవ్వాలో తెలియక అధికారులు తికమకపడ్డారు. ఇక నెలరోజులను చెరో పదిహేను చొప్పున పంపకాలకు అందరూ అంగీకరించడంతో వివాదం ముగిసింది. మరి ఈ రకమైన జీవిత విధానానికి మీరేమంటారు...? ఇదీ చదవండి: తరగతి గదిలోకి చొరబడి.. విద్యార్థుల సాక్షిగా భార్యకు తీన్ తలాక్! -
దారుణం: భాగస్వామిని ప్రెషర్ కుక్కర్‌తో బాది..
బెంగళూరు:కాలేజీ రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఒక్కటిగా బతకాలనుకున్నారు. ఉద్యోగం కూడా ఒకే దగ్గర చేస్తున్నారు. ఇంటికి దూరంగా ఉంటున్నందున సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్యలో అనుమానం పెనుభూతంలా మారింది. తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భాగస్వామే ప్రెషర్ కుక్కర్‌తో బాది హత్య చేశాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది. ఇదీ జరిగింది.. దేవా(24), వైష్ణవ్(29) ఇద్దరూ కేరళకు చెందినవారు. ఇద్దరు కాలేజీ రోజుల్లోంచి ఒకరికొకరు తెలుసు. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బెంగళూరులోని ఓ రెంట్ హౌజ్‌లో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దేవా తనను మోసం చేస్తోందని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ వ్యవహారంపై తరచూ గొడవ పడుతుండేవారు. శనివారం సాయంత్రం కూడా గొడవకు దిగారు. నిగ్రహం కోల్పోయిన వైష్ణవ్.. దేవాను ప్రెషర్ కుక్కర్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో దేవా అక్కడికక్కడే ప్రాణాలు విడించింది. అనంతరం ఘటనాస్థలం నుంచి వైష్ణవ్ పరారయ్యాడు. అక్క ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై దేవా చెల్లి పొరుగువారిని సంప్రదించింది. విషయం తెలుసుకున్నవారు.. పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే.. ఇద్దరి మధ్య గొడవ గురించి తమకు తెలుసని దేవా తల్లిదండ్రులు తెలిపారు. ఈ అంశంలో కలగజేసుకుని సర్దిచెప్పామని పోలీసులకు తెలిపారు. పరారీలో ఉన్న వైష్ణవ్‌ను పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఇదీ చదవండి: ప్రభుత్వాఫీస్‌లో అధికారి మద్యం సేవిస్తూ.. వీడియో వైరల్.. -
హైకోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులోని 29 కోర్టు హాళ్లలో విచారణల ప్రత్యక్ష ప్రసారాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే సోమవారం ప్రారంభించారు. ఉదయం 10.15 గంటలకు హైకోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రత్యక్ష ప్రసార సేవలను ప్రారంభించి.. న్యాయవాదులకు, ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆ తర్వాత 10.30 గంటల నుంచి కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. ప్రత్యక్ష ప్రసారాలతో న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత చేరువవుతుందని సీజే ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. లింక్ క్లిక్ చేస్తే... హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారాలకు సంబంధించిన లింక్ ఇచ్చారు. ఈ లింక్ ద్వారా కోర్టును ఎంపిక చేసుకుని ప్రత్యక్ష ప్రసారాలు వీక్షించవచ్చు. ఫస్ట్ కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం ఇప్పటికే అందుబాటులో ఉంది. కరోనా సమయంలో ప్రత్యక్ష ప్రసారాలు కొనసాగగా, ఆ తర్వాత హైబ్రిడ్ విధానంలో విచారణ చేపడుతున్నారు. 2020లో ప్రత్యక్ష ప్రసారాలను అందుబాటులోకి తెచ్చిన గుజరాత్ హైకోర్టు, ఆ తర్వాత యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, కోల్‌కతా, ఛత్తీస్గడ్ హైకోర్టులు కూడా ప్రత్యక్ష ప్రసారాలు, యూట్యూబ్ చానల్‌ను అందుబాటులోకి తెచ్చాయి. ప్రత్యక్ష ప్రసారాలతో పారదర్శకత పెరుగుతుందని న్యాయ నిపుణులు పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలాఉండగా, హైకోర్టు, కిందికోర్టుల విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ 2022లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) కూడా దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన నాటి సీజే ధర్మాసనం.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ప్రత్యక్ష ప్రసారాలకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోభాగంగా ప్రసారాలకు కావాల్సిన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం కలి్పంచింది. -
‘నాన్నా నేను బతికే ఉన్నాను’.. తలకొరివి పెట్టేంతలో తండ్రికి ‘మృతురాలి’ నుంచి ఫోన్..
ఓ తండ్రి తన కుమార్తె మృతదేహానికి తల కొరివి పెట్టేందుకు అంతా సిద్ధం చేశాడు. ఆ ఇంటిలో మౌనం తాండవిస్తోంది. నెల రోజుల క్రితం అతని కుమార్తె ఇంటి నుంచి మాయమయ్యింది. తరువాత వారు ఒక మృతదేహానికి సంబంధించిన దుస్తులను చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. దీనిపై స్థానికులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఇంతలో ఆ తండ్రికి..‘నాన్నా నేను బతికే ఉన్నాను. చనిపోలేదు’ అంటూ కుమార్తె దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఈ ఘటన బీహార్‌లోని పూర్ణియా జిల్లాలోని అక్బర్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అంశు కుమారి నెలరోజుల క్రితం ఇంటి నుంచి మాయమయ్యింది. కుటుంబ సభ్యులు ఆమె కోసం అన్నిచోట్లా గాలించారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే రెండు రోజుల క్రితం పోలీసులు ఒక యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అంశు కుటుంబ సభ్యులు ఆ మృతదేహానికి ఉన్న దుస్తులు చూసి, అది తమ కుమార్తె మృతదేహమేనని పోలీసులకు తెలిపారు. ఆ మృతదేహం నీటిలో దొరికిన కారణంగా ముఖం పూర్తిగా ఉబ్బిపోయి ఉంది. దీంతో మృతదేహాన్ని గుర్తించడం కష్టంగా మారింది. అంశు తండ్రి ఆ మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధం అయ్యాడు. ఇంతలో ఆ తండ్రి మొబైల్‌కు ఒక వీడియో కాల్ వచ్చింది. దానిలో ‘నాన్నా.. నేను బతికే ఉన్నాను’ అంటూ అతని కుమార్తె తెలిపింది. అంతే .. అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అక్కడున్నవారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. తిరిగి అతని కుమార్తె ఫోనులో.. తాను తన ప్రియుడిని వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో.. ఇంటి నుంచి పారిపోయానని తెలిపింది. ప్రస్తుతం అత్తవారింట్లో ఉన్నానని పేర్కొంది. అయితే పోలీసులకు లభ్యమైన ఆ యువతి మృతదేహం ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు వారికి సవాల్‌గా నిలిచింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: కాఫీ షాప్‌లో ప్రేమ.. 4 ఏళ్ల సహజీవనం.. యూపీ యువకునితో దక్షిణ కొరియా యువతి వివాహం! -
విద్యార్థుల మధ్య గొడవ.. హాస్టల్ గదిలో మారణాయుధాలు..
లక్నో: చదువుకోవాల్సిన విద్యార్థుల హాస్టళ్లలో మారణాయుధాలు లభించాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం హాస్టల్లో రెండు పిస్టళ్లు, 30 వరకు బాంబులు లభించాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. అదీ కాస్త తీవ్రస్థాయికి చేరడంతో పోలీసులు చొరవ తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో హాస్టల్లో తనిఖీలు చేయగా.. 2 పిస్టళ్లు, 30 బాంబులు లభించాయని పోలీసులు తెలిపారు. అయితే.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల ఉమేశ్ పాల్ హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీఎస్పీ నాయకుడు రాజు పాల్‌ను కూడా దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. ఈ రెండు కేసుల్లో నిందితులు ఈ హాస్టల్లోనే తలదాచుకోగా.. పోలీసులు అరెస్టు చేశారు. ఇదీ చదవండి: చైనీయుడనుకుని సిక్కిం వాసిపై దాడి -
శ్మశానానికి తీసుకెళ్లగా చిన్నారిలో కదలికలు.. ఒక్కసారిగా..
కర్ణాటక: చికిత్స పొందుతున్న 8 నెలల చిన్నారి చనిపోయిందని వైద్యులు భావించి తల్లిదండ్రులకు అప్పగించారు. కన్నీరు మున్నీరైన దంపతులు చిన్నారిని శ్మశానానికి తీసుకెళ్లగా కదలికలు కనిపించాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా 90 శాతం నాడి కొట్టుకుంటోందని వైద్యులు గుర్తించి చికిత్సలు ప్రారంభించారు. ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా బసాపుర గ్రామానికి చెందిన బసప్ప పూజార్ కుమారుడు (8 నెలలు) ఊపిరి సరిగా ఆడకపోవడంతో హుబ్లీ కిమ్స్‌లో చేర్పించారు. నాలుగు రోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు గురువారం సాయంత్రం.. పల్స్రేట్ తక్కువగా ఉందని, ఆక్సిజన్ తొలగిస్తే బిడ్డ బతకదని తెలిపారు. అనంతరం చిన్నారి చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులతో సంతకం తీసుకొని శిశువును అప్పగించారు. శ్మశానానికి తీసుకెళ్లి ఆచారం ప్రకారం నోట్లో పసుపు నీరు పోస్తుండగా బాలుడు ఆశ్చర్యకరంగా చేతులు, కాళ్లను ఆడించాడు. తక్షణమే నవలగుంద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ధార్వాడ సివిల్ ఆస్పత్రికి తరలించారు. నవలగుంద తాలూకా ఆస్పత్రి వైద్యురాలు వై.విద్య మాట్లాడుతూ 90 శాతం మేరకు బిడ్డ ఆరోగ్యంగానే ఉందన్నారు. కిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఈ బిడ్డ విషయంలో పూర్తిగా కేసు ఫైల్‌ను, ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకొని సమగ్రంగా పరిశీలించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. -
మరణించినా.. మరోసారి జీవించే అరుదైన అవకాశం..!
మనిషికి ఒకటే జన్మ.. అదే మనిషి అవయవాలకు మాత్రం రెండు జన్మలు. అవయవదానం చేస్తే మరణించినా మరోసారి జీవించే అవకాశం ఉంది. ఒక్క మనిషి చనిపోతే గుండె, మూత్రపిండాలు, ప్యాంక్రియాస్, ఊపిరితిత్తులు, కాలేయం, పేగులు, చేతులు, ముఖం, కణజాలం, ఎముకమజ్జ, మూలకణాలు దానం చేసి మరో 8 మంది ప్రాణాలు కాపాడొచ్చు. దేశంలో మరణాల సంఖ్య అధికంగా ఉన్నా.. అవయవదాతలు ఆ స్థాయిలో ఉండడం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువుల ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహన రాహిత్యంతో చాలామంది ముందుకు రావడం లేదు. 18ఏళ్లు దాటినవారు ఆర్గాన్స్ డొనేట్ చేయొచ్చు. నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ప్రాణం పోసిన.. దాతల సహకారంతో బతుకుతున్న వారిపై.. అన్నకు తమ్ముడి కిడ్నీ సిరిసిల్ల: తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(53) రైతు. షటిల్ ఆడేవాడు. ఉన్నట్టుండి వాంతులయ్యా యి. ఆస్పత్రికి వెళ్లగా కిడ్నీలు ఫెయిలయ్యాయని వైద్యులు నిర్ధారించారు. డయాలసిస్‌కు నెలకు రూ.40వేల నుంచి రూ.60వేల వరకు ఖర్చయ్యాయి. మూడు నెలలు గడిచాయి. విజయేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో ఆ స్థితిలో చూసిన అతని తమ్ముడు జితేందర్‌రెడ్డి(50) తన రెండు కిడ్నీల్లో ఒకటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. హైదరాబాద్ ఆస్పత్రిలో ఆపరేషన్ అయింది. మృత్యువు ముంగిట అసహాయంగా నిల్చున్న అన్నకు ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది. విజయేందర్‌రెడ్డి ప్రస్తుతం జిల్లెల్లలో వ్యవసాయం, తమ్ముడు జితేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తొలి డోనర్ లక్ష్మి సిరిసిల్లకల్చరల్: సిరి సిల్లలోని గాంధీనగర్‌కు చెందిన ఇప్పనపల్లి నారాయణ, లక్ష్మి దంపతులు. మిర్చి బండి పెట్టుకుని జీవించేవారు. 12 ఏళ్లక్రితం పనులు ముగించుకుని ఇంటికెళ్లారు. అర్ధరాత్రి దాటాక విపరీతమైన తలనొప్పితో లక్ష్మి కింద పడిపోయింది. ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్‌లో చేర్పించారు. ఆమె బ్రెయిన్‌డెడ్ కావడంతో అవయవదానంపై అవగాహన కల్పించారు. ఆమె కుమారులు సంతోష్, రమేశ్ అంగీకారం మేరకు లక్ష్మి ఊపిరితిత్తులు, కాలేయం, గుండె, మూత్రపిండాలు సేకరించి నలుగురు వ్యక్తులకు అమర్చారు. జిల్లాలోనే తొలి అవయవ దాతగా లక్ష్మి గుర్తింపుపొందారు. తండ్రి.. భార్య ఇద్దరూ దాతలే కోరుట్ల: తండ్రి.. భార్య ఇద్దరూ కిడ్నీ దాతలుగా నిలిచారు. కోరుట్లకు చెందిన గీత కార్మికుడు పోతుగంటి శ్రీనివాస్ 2017లో వెన్నునొప్పితో అవస్థ పడడంతో తండ్రి రఘుగౌడ్ వైద్యులతో పరీక్షలు చేయించాడు. శ్రీనివాస్‌కు కిడ్నీ సమస్య ఉందని తేలడంతో కలవరపడ్డాడు. వైద్యులు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయకతప్పదని చెప్పడంతో రఘుగౌడ్ తన కిడ్నీదానం చేశాడు. శ్రీనివాస్ ఆరోగ్యం కుదుటపడింది. ఐదేళ్ల తరువాత 2022లో మళ్లీ వెన్నునొప్పి మొదలైంది. మరోసారి పరీక్షించిన వైద్యులు మళ్లీ కిడ్నీ మార్పిడి చే యాల్సిందేనని చెప్పడంతో అతడి భార్య లావణ్య కిడ్నీ ఇచ్చింది. శ్రీని వాస్ తేరుకుని ప్రస్తుతం ఏ సమస్య లేకుండా తన పనులు తాను చేసుకుంటున్నాడు. అవయవదాతల‘అబ్బిడిపల్లె’ ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లె వాసులు మూకుమ్మడిగా అవయవదానానికి అంగీకరిస్తూ తీర్మానం చేశారు. సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అప్పటి కలెక్టర్ సంగీతకు లేఖ అప్పగించారు. అబ్బిడిపల్లెలో 600 జనాభా ఉంటుంది. సదాశయ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు భీష్మాచారి ఆధ్వర్యంలో అవయవదానంపై అవగాహన కల్పించగా.. సర్పంచ్ ఒజ్జ కోమలత ఆధ్వర్యంలో తీర్మానం చేసి శభాష్ అనిపించుకున్నారు. మెడికల్ కాలేజీకి మృతదేహం కోల్‌సిటీ: గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన దేవకి పార్థసారథి (85) తన మరణానంతరం అవయవాలు దానం చేస్తానని సదాశయ ఫౌండేషన్‌కు అంగీకార పత్రం రాసిచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27న అనారోగ్యంతో మృతి చెందగా.. కుటుంబసభ్యులు ఆమె నేత్రాలను ఐ బ్యాంక్‌కు, పార్థివదేహాన్ని రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అప్పగించారు. బతికుండగానే.. సారంగాపూర్: బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన పానగంటి స్వప్న(45) అంగన్వాడీ టీచర్. తాను చనిపోయాక తన అవయవాలు దానం చేయాలని భర్త నర్సయ్యతో చెబుతుండేది. తీవ్ర జ్వరంబారిన పడి చనిపోయిన ఆమె కోరిక మేరకు ఆమె రెండు కిడ్నీలు, గుండెను దానం చేశారు కుటుంబసభ్యులు. నలుగురికి ప్రాణం కోల్‌సిటీ: గోదావరిఖనిలోని ఎల్బీనగర్కు చెందిన మింగాని సంపత్(41) ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీ డైరెక్టర్. 2019 జనవరి 14న రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లి మరణించారు. నలుగురికి లివర్, రెండు కిడ్నీలు, గుండె అమర్చారు. ఏడుగురికి పునర్జన్మ కోల్‌సిటీ: తాను మరణించి మరో ఏడుగురికి పునర్జన్మిచ్చారు గోదారిఖనిలోని విద్యానగర్‌కు చెందిన సిరిసిల్ల ఇమానుయేల్(33). హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసే ఆయన 2019 జనవరి 3న బైక్‌పై ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వారంపాటు మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. ఆయన కుటుంబసభ్యులు ఆయన అవయవాలను దానం చేయగా.. ఏడుగురికి పునర్జన్మ లభించింది. దేహదానానికి నిర్ణయం కోల్‌సిటీ: గోదావరిఖని చంద్రబాబుకాలనీలో నివాసం ఉంటున్న మేరుగు లింగమూర్తి ఓసీపీ–3లోని బేస్ వ ర్క్‌షాప్‌లో ఆపరేటర్. ఎనిదేళ్ల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయా యి. డయాలసిస్‌పై ఉన్న భర్త లింగమూర్తిని బతికించుకోవడానికి అతని భార్య విజయ తన కిడ్నీని దానంచేసింది. ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో తమ మరణానంతరం తమ దేహాలను మెడికల్ కాలేజీ కొడుకు కళ్లు సజీవం.. కోల్‌సిటీ: నా కొడుకు విజయ్‌పాల్‌రెడ్డి 2018 సెప్టెంబర్ 27న చనిపోయాడు. నేను, భార్య సుశీలతోపాటు నా కుటుంబ సభ్యులు దుఃఖంలో కూడా విజయపాల్‌రెడ్డి నేత్రాలను ఐ బ్యాంక్‌కు దానం చేశాం. నా భార్య, నేను కూడా మా మరణానంతరం నేత్రదానం చేస్తామని అంగీకారం తెలిపాం. చనిపోయిన వారి అవ యవాలు మరికొందరికి ఉపయోగకరంగా ఉంటాయి. వారిలో మనవారిని చూసుకోవచ్చు. – మారెల్లి రాజిరెడ్డి, యైంటింక్లయిన్‌కాలనీ, గోదావరిఖని తమ్ముడు తోడుండాలని.. కోరుట్లరూరల్: మాది మండలంలోని సంగెం. నాకు ఒక అన్న. ఇద్దరు తమ్ముళ్లు. చిన్న తమ్ముడు చీటి రాంచందర్‌రావుకు 18ఏళ్ల క్రితం అనారోగ్యంతో రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. డయాలసిస్ చేసినా ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పారు. తమ్ముడిని కాపాడుకునేందుకు ఒక కిడ్నీ ఇచ్చా. కొంతకాలానికి తమ్ముడు అనారోగ్యంతో చనిపోయాడు. కిడ్నీ ఇచ్చిన నేను ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నా. అన్ని పనులు చేసుకుంటున్నా. తమ్ముడే దక్కలేదు. – చీటి మురళీధర్ రావు, సంగెం, కోరుట్ల రాష్ట్రం మొదటిస్థానం కోల్‌సిటీ: అవయవదానంపై ప్రజల్లో చైతన్యం వచ్చింది. మన రాష్ట్రం దేశంలో అవయవదానంలో మొదటిస్థానంలో నిలిచింది. గోదావరిఖని ప్రాంతంలో ఎక్కువ మంది ముందకు వస్తున్నారు. 2008లో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పురుడుపోసుకున్న సదాశయ ఫౌండేషన్.. రాష్ట్రవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అవయవదాతల కుటుంబాలకు, స్వచ్ఛంద సంస్థలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. – టి.శ్రవణ్‌కుమార్, సదాశయ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు మా ఆయన్ను దక్కించుకోవాలని.. విద్యానగర్(కరీంనగర్): మా వారు వారాల ఆనంద్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రíహీత. 2013లో ఆయనకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. వారానికి మూడుసార్లు డయాలసిస్ ఏడాదిపాటు చేయించుకోవాల్సి వచ్చింది. ఆయన్ను దక్కించుకునేందుకు నేను ఒక కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమయ్యా. నా కిడ్నీని ఆనంద్‌కు 15 జూలై 2014లో ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. నా జీవితంలో ఆయన లేని లోటును ఊహించలేను. నాలో భాగమైన ఒక కిడ్నీ ఇచ్చి బతికించుకున్నాను. ఇప్పుడు నేను, మావారు పిల్లలతో ఆనందంగా ఉన్నాం. – వారాల ఇందిరారాణి, గృహిణి, కరీంనగర్ కొడుకు ప్రాణం పోశాడు వేములవాడ: మాది వేములవాడ. కొన్నేళ్లక్రితం లివర్‌వ్యాధి ఉండేది. ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయింది. నా కొడుకు మారుతి లివర్ నాకు సరిపోయింది. 17 నవంబర్ 2017న మారుతి లివర్‌లోని కొంతభాగాన్ని నా లివర్‌కు జతచేశారు. ఇప్పుడు ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. నా కొడుకు లివర్ ఇచ్చి నాకు ప్రాణం పోశాడు. – కుమ్మరి శంకర్, వేములవాడ -
‘జుక్ × మస్క్’ కుబేరుల కోట్లాట లైవ్.. ఆ ఆదాయంతో..
ఎక్స్ (ట్విటర్) అధినేత ఎలాన్ మస్క్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్‌లో తలపడనున్నారని తెలిసిందే. అయితే ఈ ఫైట్‌ను తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ఎక్స్ (ట్విటర్)లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు మస్క్ తాజాగా ప్రకటించారు. ఈ ఇద్దరు టెక్ టైటాన్లు గత నెలలో కేజ్ ఫైట్‌లో ఒకరినొకరు ఎదుర్కొనే సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఆన్లైన్ షేక్ అవుతోంది. తరచూ వరి ఫైట్ గురించే చర్చ జరుగుతోంది. వారి ప్రత్యక్ష యుద్ధాన్ని వీక్షించేందుకు ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘జుక్ Vs మస్క్ ఫైట్ ఎక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని వెటరన్స్ సంక్షేమానికి వెచ్చిస్తాం’ ట్వీట్ చేశారు. పోరాటానికి తాను సిద్ధమవుతున్నానని, రోజంతా బరువులు ఎత్తుతున్నానని అంతకుముందు చేసిన ట్వీట్లో పేర్కొన్నారు. అయితే తనకు వర్కవుట్ చేసేందుకు సమయం లేదని అందుకే వర్క్ దగ్గరకే వెయిట్స్ తెచ్చుకుంటున్నట్లు చమత్కరించారు. ఈ సందర్భంగా వారి ఫైట్ గురించి ఓ యూజర్ ప్రస్తావించగా మస్క్ స్పందిస్తూ "ఇది ఒక నాగరిక యుద్ధం. మగాళ్లు యుద్ధాన్ని ఇష్టపడతారు" అని బదులిచ్చారు. 51 ఏళ్ల మస్క్, 39 ఏళ్ల జుకర్‌బర్గ్ మధ్య అన్ని విషయాల్లోనూ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా ఘర్షణ వాతావరణం కొనసాగుతోంది. ఈ మధ్య ట్విటర్‌కు పోటీగా మెటా కొత్త యాప్ థ్రెడ్స్ ప్రకటించినప్పుడు అది తారస్థాయికి చేరింది. జుకర్‌బర్గ్‌తో కేజ్ ఫైట్ కోసం తాను సిద్ధంగా ఉన్నానని మస్క్ ట్విటర్లో తన అభిమానులకు చెప్పారు. ఆ మధ్య మార్షల్ ఆర్ట్స్ వీడియోలను జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా "ఫైట్ లొకేషన్ పంపించు" అంటూ ప్రతిస్పందించారు ఎలాన్ మస్క్. కేజ్ ఫైట్‌పై ఇద్దరూ పరస్పర పోస్టులు పెడుతూ ఫాలోవర్లలో ఉత్తేజం నింపుతున్నారు. Zuck v Musk fight will be live-streamed on 𝕏. All proceeds will go to charity for veterans. — Elon Musk (@elonmusk) August 6, 2023 -
ఖమ్మంలో విచిత్ర ఘటన.. రెండేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షం..
సాక్షి, ఖమ్మం జిల్లా: రెండేళ్ల క్రితం అదృశ్యమైన తల్లి చనిపోయిందనుకొని కర్మకాండలు పూర్తి చేశారు ఆమె కుటుంబ సభ్యులు. తిరిగి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఈ విచిత్ర ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ-తిరపతయ్య దంపతులు తమ ఇద్దరు కుమారులతో కలిసి జీవనం సాగిస్తున్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుండి అదృశ్యమైంది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా సమాచారం దొరకకపోవడంతో పత్రికల్లోనూ, టీవీలోనూ ఆమె ఆచూకీ కోసం వెతక సాగారు. ఆమె వివరాల కోసం వెతికే సమయంలో సమీప ప్రాంతంలో కొండమీద ఒక మహిళను హత్య చేసిన సంఘటన జరిగింది. హత్యగావించబడ్డ మహిళ ఆధారాలు లభించకపోవడంతో మతిస్థిమితం లేక తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా భావించి ఆమె కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేసి గత్యంతరం లేని పరిస్థితిలో కర్మకాండలు కూడా పూర్తి చేశారు. తిరిగి రెండు సంవత్సరాల తర్వాత ఆమె కుమారుడు సోషల్ మీడియాలో కన్న తల్లిని గుర్తించిన కుమారుడు కుటుంబ సభ్యులకు వివరాలు తెలియజేశాడు. ఖమ్మం జిల్లా మధిరలో ఆర్కే ఫౌండేషన్ అనాథా శ్రమంలో ఉన్నట్టు ఆ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. తప్పిపోయిన నాగేంద్రమ్మనే ఆ మహిళగా గుర్తుపట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు నాగేంద్రమ్మను అనాథాశ్రమంలో కలుసుకొని సంతోషం వ్యక్తం చేశారు. మధిర పోలీసులను సంప్రదించారు. సరైన ఆధారాలు ఉండటంతో మహిళను వారి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ముగిసిన ప్రతిపక్షాల రెండో రోజు భేటీ.. కీలక అంశాలు ఇవే..
బెంగళూరు: బెంగళూరు వేదికగా ప్రతిపక్షాలు నేడు రెండు రోజు సమావేశం ముగిసింది. ఉదయం 11 నుంచి ప్రారంభించి మధ్యాహ్నం 4 గంటల వరకు భేటీ జరిగింది. దాదాపు 26 ప్రతిపక్ష పార్టీలు సమావేశంలో పాల్గొన్నాయి. భేటీలో కీలక అంశాలు ఇవే.. ► 'ఎన్డీయే, బీజేపీ.. మా 'ఇండియా' కూటమిని ఛాలెంజ్ చేస్తారా..?' అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. 'మాతృభూమిని ప్రేమిస్తాం.. దేశాన్ని ప్రేమిస్తున్న నిజమైన దేశభక్తులం మేము. హిందువులు, దళితులు, మైనారిటీలు, రైతులు, బెంగాల్, మణిపూర్‌కు బీజేపీతో ముప్పు పొంచి ఉంది. ప్రభుత్వాలను కొనడం.. అమ్మడమే వారి పని' అని బీజేపీని మమతా బెనర్జీ విమర్శించారు. ► విపక్షాల భేటీ మరో సమావేశం ముంబయిలో నిర్వహించనున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. కూటమి సమన్వయానికి 11 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ► కూటమికి నాయకుడు ఎవరనే అంశంపై ఖర్గే పెదవి విప్పారు. కన్వినర్‌గా పనిచేస్తున్న బిహార్ సీఎం నితీష్ కుమార్ ముంబయి సమావేశంలో ఈ విషయాన్ని తెల్చుతారని చెప్పారు. బెంగళూరు వేదికగా జరుగుతున్న ప్రతిపక్షాల భేటీ అనంతరం ఖర్గే మీడియా సమావేశంలో మాట్లాడారు. ► బీజేపీకి పోటీగా ఏకమైన ప్రతిపక్ష పార్టీల కూటమికి కొత్త పేరును నిర్ణయించారు. ఈ మేరకు మహాకూటమి పేరును ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయెన్స్ (ఐఎన్‌డిఐఏ)పేరును ఖరారు చేశారు. అయితే.. అలయెన్స్ (కూటమి) అనే పదంపై పునరాలోచన జరపాలని వామపక్ష పార్టీలు కోరినట్లు సమాచారం. ఐఎన్‌డిఐఏ ఉద్దేశం ఐక్యంగా పోరాడటమే అని బిహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ► ప్రతిపక్ష భేటీలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. మహాకూటమి విజయం సాధించాక పీఎం పదవికి తమకు ఆసక్తి లేదని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ► బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరగనున్న ప్రతిపక్షాల భేటీలో మొదటి రోజు నిన్న ముగిసింది. అయితే.. ఈ మహాకూటమి తరపున ప్రధాన మంత్రి పేరును యూపీఏ ఛైర్పర్సన్ సోనియాగాంధీ, కన్వినర్ నితీష్ కుమార్ సూచించనున్నట్లు సమాచారం. ► భేటీలో సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, స్టాలిన్, నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సొరేన్, మమతా బెనర్జీ, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో సహా ప్రముఖులు రెండో రోజు పాల్గొన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా నేడు సమావేశంలో పాల్గొననున్నారు. ► నిన్న సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ పక్క పక్కనే కూర్చున్నారు. దేశ రాజకీయాలపై ప్రత్యేకంగా చర్చించుకున్నారు.బీజేపీకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధపడినట్లు పేర్కొన్నారు. ► ప్రతిపక్షాల రెండో సమావేశాన్ని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది. కర్ణాటకలో తిరుగులేని విజయం సాధించాక, అదే స్థలంలో దేశ రాజకీయాల్లోనూ విజయాన్ని కాంక్షిస్తూ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. ఇదీ చదవండి: ప్రతిపక్ష భేటీ: బీజేపీకి పోటీగా మహాకూటమి పేరు ఇదే..! -
కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాదు! కొండే అడ్డు రానీ..
ఆచరణల ప్రసంగం, ఆశల ప్రణాళిక, నమ్మకాల ప్రదర్శన, అభిప్రాయాల ప్రకటన, గుణాల ప్రతాపం, భావాల ప్రవాహం, ఆలోచనల ప్రస్థానం మనిషి జీవనం, జీవితం. జీవనం, జీవితం వీటిని మనిషి ఏ మేరకు ఫలవంతం చేసుకుంటున్నాడు? ఎంత సారవంతం చేసుకుంటున్నాడు? తన జీవనం, జీవితం వీటివల్ల మనిషి ఏ మేరకు ఫలవంతం ఔతున్నాడు? ఎంత సారవంతం ఔతున్నాడు? ఈ ప్రశ్నలకు సంతప్తికరమైన జవాబులు మాత్రమే రావాలి లేదా సాధించుకోవాలి. అందుకనే మనిషికి జీవనం, జీవితం ఉన్నాయి; అందుకనే జీవనం, జీవితం వీటితో మనిషి ఉన్నాడు. మనిషికి జీవనం లేకపోతే జీవితం లేదు; జీవితం లేకపోతే జీవనం లేదు. జీవనం, జీవితం ఈ రెండూ లేకపోతే మనిషి లేడు. ఉన్న మనిషికి ఉండే జీవనం, జీవితం మనిషి సఫలం అయ్యేందుకే కాని విఫలమూ, విధ్వంసమూ అయ్యేందుకు కాదు; విఫలమూ, విధ్వంసమూ చేసేందుకు కాదు. మనిషి మస్తిష్కం ఆకాశం ఐతే అక్కడ నుంచి నాణ్యమైన, సరైన భావనల వానపడితే ఆ వానకు మనసు తడిస్తే జీవనం పూస్తుంది; జీవితం రూపొందుతుంది. జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ అవాలంటే మస్తిష్కమూ, మనస నాణ్యతతోనూ, సరిగ్గానూ ఉండాలి లేదా నాణ్యతతోనూ, సరిగ్గానూ పని చేస్త ఉండాలి. మస్తిష్కమూ, మనస నాణ్యతతోనూ, సరిగ్గానూ పని చేస్త ఉంటే జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ ఔత మనిషికి మాన్యత వస్తుంది. పుట్టేశాం కదా అని కాలాన్ని తోసెయ్యడం జీవనం కాదు; కాలంవల్ల తోసెయ్యబడడం జీవితం కాకూడదు. అభిప్రాయాల్నీ, మనోభావాల్నీ పేర్చుకుంటూపోవడం జీవనం కాదు; వాటినే మోసుకుంటూ వాటి బరువుకు కుంగిపోవడం, నలిగిపోవడం జీవితం కాకూడదు. వాగులో కొట్టుకుపోవడం కొనసాగడం ఔతుందా? ప్రవాహంలో ముందుకు ఈదడమూ, అవసరానికి ఆనుగుణంగా ప్రవాహానికి ఎదురు ఈదడమూ జీవనం అవుతుంది; నదిలో కొట్టుకుపోవడమా? కాదు, కాదు నదిలా ప్రవహించడం జీవితం ఔతుంది. రాని పిలుపును విని వడివడిగా వెళ్లడం జీవనం కాదు; లేని చోటును వెతుక్కుంటూ వెళ్లడం జీవితం కాదు. ఉన్న దారిలో లేని తలుపులు మూసుకుని ఉన్నాయి అని అనుకుని ఊరికే పడి ఉండడం జీవనం కాదు; కొండే అడ్డుగా ఉన్నా దారీ, తీరూ మార్చుకుని నీరులా ముందుకు సాగడమే జీవితం. మనిషికీ జీవితం ఒక గుంటగానూ, ఆ గుంటలో పడిపోయి పరుగెత్తుతూ ఉండడం జీవనంగానూ అవకూడదు. తనను తాను కోల్పోవడం మనిషికి జీవితం అవుతుందా? అవదు, అవదు; తన నుంచి తాను కోలుకోవడం ఏం ఔతుంది? అదే జీవితం ఔతుంది! పోగొట్టుకోవడం జీవనం అవదు అన్న తెలివిడి వస్తే పొందడం అన్నది జీవితం అవుతుంది అని తెలియవస్తుంది మనిషికి. మనిషి తననుంచి తాను విడివడడం అన్న కళను అభ్యసించి నేర్చుకోవాలి. జన్మతః మనిషికి మానసికంగానూ, చింతనపరంగానూ లోపాలు, దోషాల ఉంటాయి. లోపాలు, దోషాల లేని మనిషి ఉండడం ఉండదు. తన లోపాల్నీ, దోషాల్నీ వదులుకోవడం కోసం మనిషి తన నుంచి తాను విడివడాలి లేదా విడుదలవ్వాలి. అలా జరిగితే అప్పుడు అది జీవనం ఔతుంది. తనను తాను మాటిమాటికీ సరి చూసుకుంటూ, సరి చేసుకుంటూ తనలోకి తాను చేరుతూ ఉంటే అప్పుడు అది జీవితం ఔతుంది. జీవితం తనతో ఉన్నప్పుడు మనిషి దాన్ని ఉపయోగించుకోవడం జీవనం; జీవనం ఉపయోగపడడంవల్ల ఉన్నతిని పొందడం జీవితం. జీవనానికి జీవితం ఉండాలి; జీవితానికి జీవనం పండాలి; మహిలో మనిషి మెరవాలి. జీవనమూ, జీవితమూ ఉన్నాయి కాబట్టి మరణించాక కూడా మనిషి పరిమళించాలి. ఇక చివరిగా ఏది మనిషికి విజయం తన జీవనం, జీవితం ఇవి ఫలవంతమూ, సారవంతమూ ఐనా జీవనం, జీవితానికి విజయం, ఫలవంతమూ సారవంతమూ ఐతే జీవితానికి జీవనం విజయం. – రోచిష్మాన్ (చదవండి: ఈ అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో సమానమైనది!) -
సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి
పురాణాల్లో వింటుంటాం సముద్రాల్లో నీటి అడుగున జీవించే మనుషుల గురించి. అంతేందుకు మహాభారతంలో దుర్యోధనడు నీటి అడుగున్న ధ్యానం చేయగల ధీరుడని విన్నాం. అవన్నీ వినడమే గానీ నిజంగా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మాములుగా ఓడల్లో సముద్ర ప్రయాణాలు రోజుల తరబడి జరిగినప్పటికీ అది నీటిపైనే కానీ అడుగున కాదు. ఐతే నీటి అడుగున జీవించగలమా అక్కడ పరిస్థితులను మన శరీరీం తట్టుకోగలదా అనే దానిపై చాలా సందేహాలు శాస్తవేత్తలను మదిలో ప్రశ్నలుగా మిగిలాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఫ్లోరిడాకు చెందిన ప్రోఫెసర్ జో డిటూరి ఒక అసాధారణమైన ప్రయోగానికి నాంది పలికారు. బయో మెడికల్ ఇంజనీరింగ్ పీహెచ్డీ చేసిన డిటూరి అనేక వ్యాధులను నివారించగల మెడికల్ టెక్నాలజీపై కూడా పలు పరిశోధనలు చేశారు. ఈ మేరకు ఆయన సముద్రాన్ని మూడు నెలలపాటు తన నివాసంగా మార్చుకున్నాడు. అతను సముద్రంలోని 30 అడుగుల లోతుల్లో 100 రోజులు జీవించే ప్రయాగాన్ని నిర్వహించాడు. ఈ ప్రయోగానికి నెఫ్ట్యూన్ 100 అని పేరు పెట్టాడు. ఈ ప్రయోగం కోసం రిటైర్డ్ యూఎస్ నేవీ కమాండర్ ప్రోఫెసర్‌గా ఎంచుకున్నాడు. పనిలో పనిగా మనస్తత్వ వేత్త ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. అంతరిక్ష పర్యాటనకు సమానమైన వాతావరణంలో ఉన్నప్పుడూ మనిషి మానసిక స్థితి, ప్రభావాలు ఎలా ఉంటాయనేద దానిపై వారు పర్యవేక్షిస్తారు. ఈ ప్రయోగం సక్స్స్ అయితే భూమిపై అనుభవించిన ఒత్తిడికి 1.6 రెట్ల ఒత్తిడిని అధిగమించి బతికిబట్టగట్ట గలిగితే ప్రపంచ రికార్డుగా నిలుస్తుంది. వాస్తవానికి మానవ శరీరం నీటి అడుగున ఇంత కాలం ఉండలేదని ప్రోఫెసర్ డిటూరి అన్నారు. కాబట్టి నా శరీరం ఏమౌవుతోందో అనేది అధ్యయనాలకు ముఖ్య భూమికగా ఉపయోగపడుతుంది. అలాగే నా శరీరాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిశోధనకు ఉపకరిస్తుంది. ఒకవేళ నీటి అడుగున ఒత్తిడిని ఎదుర్కొనగలిగితే తన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటయని చెబుతున్నారు. ఈ మేరకు డిటూరి ఈప్రయోగాన్ని మార్చి1న ప్రారంభించారు. ఐతే తాను సూపర్ హ్యుమన్‌గా బయటకు వస్తానో లేదో అనేది కాస్త సందేహంగానే ఉందన్నారు. View this post on Instagram A post shared by Joe Dituri (@drdeepsea) (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..) -
ప్రపంచంలో జీవించడానికి అనువుగా ఉన్న టాప్ 10 నగరాలు (ఫోటోలు)
-
వింత ఘటన: గుండె లేకుండా జీవించిన తొలి మానవుడు!
సాటి మానవుల పట్ల జాలి, దయ లేకుండా ప్రవర్తిస్తే.. నీకు అసలు హృదయమే లేదంటూ నిందిస్తాం. అసలు మానవుడి గుండె ఒక్కనిమిషం ఆగినా చనిపోయినట్లే. అలాంటిది అసలు గుండె లేకుండా బతకడమేమిటి. నిజమేనా! అన్న డౌటు వస్తుంది ఎవరికైనా. ఎలా చూసినా, ఏవిధంగా ఆలోచించినా అది అసాధ్యం. కానీ ఇక్కడొక మనిషిని చూస్తే ఔను! అని తల ఊపకతప్పదు. ఈ అత్యంత ఆశ్చర్యం కలిగించే ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..క్రెయిగ్ లూయిస్ అనే 55 ఏళ్ల వ్యక్తి 2011లో అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది అసాధారణమైన ప్రోటీన్ల పెరుగుదలకు కారణమయ్యే అరుదైన వ్యాధి. ఈ వ్యాధి వేగంగా గుండె, మూత్రపిండాలు, కాలేయంపై దాడి చేసి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. దీంతో టెక్సాస్ హార్ట్ ఇన్స్టిట్యూట్కి చెందిన డాక్టర్ బిల్లీకోన్, డాక్టర్ బడ్ ఫ్రేజియర్, లూయిస్ రక్తాన్ని పల్స్ లేకుండా రక్తం ప్రసరించడానికి సహాయపడే పరికరాన్ని అమర్చాల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి పరికరాన్ని ఆ ఇద్దరు వైద్యులే రూపొందించారు. ఆ వైద్యులు ఈ పరికరాన్ని దాదాపు 50 దూడలపై పరీక్షించారు. వారు ఆయా జంతువుల హృదయాలను తీసేసి వాటి స్థానంలో ఈ పరికరాన్ని అమర్చారు. అవి తమదైనందిన విధులను గుండె లేకుండానే నిర్వర్తించగలిగాయి. అంతేగాదు సెతస్కోపును ఆవు ఛాతి వద్ద పెట్టి వింటే గుండె చప్పుడూ వినిపించదు. మనం ఈసీజీ పరీక్ష చేసిన ప్లాట్‌లైన్ చూపిస్తుందని డాక్టర్ కోన్ చెప్పుకొచ్చారు. ఐతే లూయిస్ పరిస్థితి మరింత విషమంగా ఉండటంతో అతని భార్య లిండా ఆపరికరాన్ని తన భర్త శరీరంలోకి అమర్చడానికి వైద్యులకు అనుమతిచ్చింది. ఈ మేరకు వైద్యులు అతడి గుండెను తీసివేసి ఈ పరికరాన్నిఅమర్చారు. ఇది శరీరంలో నిరంతరం ప్రవహిస్తున్న రక్తం ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. ఈ పరికరాన్ని అమర్చడానికి ముందు లూయిస్‌ని డయాలసిస్ మెషిన్, శ్వాసయంత్రం తోపాటు బాహ్య రక్త పంపుపై ఉంచారు. భార్య లిండా తన భర్త పల్స్ విన్నప్పుడూ ఆశ్చర్యపోయింది. అతనికి పల్స్ లేదని, ఇది చాలా అద్భుతమైనదని ఆమె చెబుతోంది. కానీ పాపం ఆ వ్యాధి కాలేయం, మూత్రపిండాలపై దాడి చేయడంతో లూయిస్ పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. అతను ఇలా పల్స్ లేకుండా ఒక నెలకుపైగా జీవించాడు. ఐతే శరీరానికి అమర్చిన పంపులు సరిగా పనిచేయకపోవడంతోనే అతను మరణించాడని వైద్యులు ధృవీకరించారు. దీంతో ప్రపంచంలోనే గుండె లేకుండా జీవించిన తొలి మానవుడిగా లూయిస్ నిలిచాడు. (చదవండి: ఆ ఘటన పట్ల చింతిస్తున్నా! క్షమించండి: ఎయిర్ ఇండియా సీఈఓ) -
రష్మిక లైవ్.. మధ్యలో విజయ్ వాయిస్
-
ఆరుబయట జీవనం.. అనాథలుగా మరణం!
రాయదుర్గం: నా అనే వారు లేక దీన స్థితిలో కాలం వెళ్లదీస్తూ కొందరు... అయినవాళ్లందరూ ఛీదరించుకుని గెంటేస్తే రోడ్డున పడిన మరికొందరు వృద్ధాప్యంలో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య పొత్తిళ్లలో నుంచి కాపాడుకుంటూ వచ్చి, విద్యాబుద్ధులు చెప్పించి, జీవితంలో ఓ స్థాయికి ఎదిగేలా చేసిన తల్లిదండ్రులను కొందరు నిర్దాక్షిణ్యంగా రోడ్డున వదిలేస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారుల పక్కనే అనాథలుగా జీవనం సాగిస్తూ.. చివరకు అనాథలుగానే మృతి చెందుతున్నారు. ఈ మూడేళ్ల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 42 మంది అనాథలుగా మృతిచెందారు. ఇందులో 15 మృతదేహాల ఆచూకీని పోలీసులు గుర్తించి సంబందీకులకు అప్పగించారు. మరో 27 కేసుల్లో మృతుల కుటుంబసభ్యులు ఎవరైంది ఆచూకీ చిక్కడం లేదు. ఇతని పేరు జి.గోవిందు. డి.హీరేహాళ్ మండలం గొడిశెలపల్లి. వివిధ కారణాలతో తల్లిదండ్రులు, సోదరి, సోదరులు మృతి చెందారు. ఒంటరిగా జీవనం సాగిస్తున్న అతనికి బళ్లారికి చెందిన ఓ యువతితో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. కొన్నేళ్లపాటు వీరి సంసారం సజావుగా సాగింది. ఇటీవల అంతు చిక్కని వ్యాధితో గోవిందు సతమతమవుతున్నాడు. కాలుకు ఇన్ఫెక్షన్ సోకి వేళ్లు తెగిపోయాయి. ఈ క్రమంలో కుటుంబపోషణ భారం కావడంతో 15 ఏళ్ల క్రితం అతణ్ని వదిలేసి పాపతో కలసి భార్య వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో అతని పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. అద్దె చెల్లించలేక ఇల్లు ఖాళీ చేసి నడిరోడ్డుపైకి చేరుకున్నాడు. గ్రామంలోని బస్ షల్టర్‌లో ఉంటూ ఇరుగుపొరుగు వారు అందించే ఆహారంతో బతుకు నెట్టుకొస్తున్నాడు. మీరు చూస్తున్న ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు ఈరమ్మ. కర్ణాటకలోని బళ్లారి జిల్లా గోనేహాళ్ గ్రామం. అనంతపురం జిల్లా రామగిరి, బొమ్మనహాళ్ ప్రాంతాల్లో సమీప బంధువులున్నారు. ఈ నెల 4న బొమ్మనహాళ్ మండలం ఉంతకల్లు క్రాస్ వద్ద ఆమె మృతి చెందింది. అంతకు ముందు 20 రోజులుగా అక్కడే చావుబతుకుల మధ్య ఆమె కొట్టుమిట్టాడింది. అయినవాళ్లు అందరూ ఉన్నా.. చివరకు అనాథగా కన్ను మూయడంతో గ్రామ నౌకర్ల సాయంతో అధికారులు అంత్యక్రియలు పూర్తి చేయించారు. మీరు చూస్తున్న ఈ చిత్రం రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోనిది. కొంతకాలంగా రాయదుర్గం – భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ప్రధాన రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద ఒంటరిగా నివసిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ నెల 6న ఆలస్యంగా ఈ విషయం వెలుగుచూసింది. అప్పటికే మృతదేహం కుళ్లి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ చుట్టుపక్కల నివాసముంటున్న వారు మృతదేహాన్ని బయలు ప్రాంతానికి మార్చారు. ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి వెంటనే పారిశుద్ధ్య కారి్మకులను పంపి ఆ మృతదేహన్ని ఖననం చేయించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో ఎవరైంది ఇప్పటి వరకూ పోలీసులు గుర్తించలేకపోయారు. భరోసానివ్వాలి అనాథలుగా ఏ ఒక్కరూ జీవించేందుకు వీల్లేదు. నిజంగా ఎవరైనా అనాథగా గుర్తింపబడితే వెంటనే వారిని ఆదరించడం మానవధర్మం. వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత బిడ్డలపై ఉంది. దగ్గరుండి వారి అవసరాలను తీర్చాలి. మేమున్నామంటూ భరోసానివ్వాలి. అలా కాదని భారంగా భావించి రోడ్లపై వదిలేయడం సరైన పద్ధతి కాదు. ఆఖరి క్షణాల్లో వారు అనుభవించే బాధను ఆలోచించాలి. – ఎస్.నాగలక్ష్మీ, కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుంటాం తల్లిదండ్రులను కేవలం వ్యక్తులుగా కాకుండా సమాజ మార్గదర్శకులుగా చూడాలి. వారి అనుభవాలు మన జీవిత గమనాన్ని మారుస్తాయి. అలాంటి దేవతామూర్తులను ఆఖరి క్షణాల్లో ఆరుబయట వదిలేయడం దారుణం. అయినవాళ్లందరూ ఉండి అనాథగా మరణిస్తున్నారంటే అది మానవ జన్మకే సిగ్గుచేటు. శిశువుగా పుట్టినప్పటి నుంచి పెద్దయ్యేవరకూ పోషించడంలో వారు పడ్డ ఇబ్బందులను గుర్తు చేసుకోవాలి. మలిదశలో వారిని సేవించడాన్ని అదృష్టంగా భావించాలి. కాదని నిర్దాక్షిణ్యంగా రోడ్లపాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ ఫక్కీరప్ప, ఎస్పీ (చదవండి: ఊపిరిపీల్చుకున్న ‘అనంత’) -
లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ
-
లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే
విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అంత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్చించిన చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా రూపొందిన లైగర్ భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా పడింది. దీంతో ఈ మూవీ నిర్మాతలు, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు లైగర్ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉంటే విడుదలకు ముందు బ్లాక్‌బస్టర్ హిట్ ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన పూరీ విడుదల అనంతరం సినిమా గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి మూవీ పరాజయంపై ఇంతవరకు ఆయన నేరుగా స్పందించింది లేదు. ఈ నేపథ్యంలో చిరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా లైవ్‌లో పాల్గొన్న పూరీ ఈ సందర్భంగా లైగర్ ఫ్లాప్‌పై స్పందించాడు. కాగా గాడ్ ఫాదర్ బ్లాక్‌బస్టర్ హిట్ నేపథ్యంలో పూరీ జగన్నాథ్-చిరంజీవి ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించారు. ఈ నేపథ్యంలో చిరు, పూరీని ఇలా ప్రశ్నించాడు. పూరీ మీరు అనుకున్న రిజల్ట్ రాకపోతో ఎలా తీసుకుంటారు? అని అడగ్గా.. ‘దెబ్బ తగినప్పుడు హీలింగ్ టైమ్ ఉంటుంది చూశారా.. అది తక్కువగా పెట్టుకోవాలి. ఆస్తులు పోవచ్చు లేదా యుద్ధాలు జరగోచ్చు ఏం జరిగినా హీలింగ్ టైమ్ నెలకు మించి ఉండకూడదు. ఒక నెలలో వేరే పనిలో పడిపోవాలి అంతే. కొన్నిసార్లు నమ్మిన వాళ్లు కూడా ఫ్లిప్ అవ్వచ్చు, ఏమైనా జరగచ్చు’ అన్నాడు. చదవండి: వెండితెర ఎంట్రీ ఇస్తున్న కార్తీక దీపం ఫేం ‘వంటలక్క’, ఫస్ట్‌లుక్ రిలీజ్ అనంతరం ‘నేను లైగర్ సినిమా తీశాను. మూడేళ్లు సినిమాకి పనిచేస్తూ ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి సెట్స్ వేశాం. కాస్ట్ అండ్ క్రూ, మైక్ టైసన్ ఇలా అంతా ఎంతో ఆనందంగా చేశాం. కానీ, సినిమా ఫ్లాప్ అయ్యింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా రిజల్ట్ కోసం ఆదివారం వరకు వేచి చూశా. ఆ తర్వాత మూవీ ప్లాప్ అని అర్థమైంది. ఆ మరుసటి రోజు సోమవారం జిమ్‌కు వెళ్లి 100 స్క్వాడ్స్ చేశా. ఒత్తిడి మొత్తం పోయింది. నా జీవితం నేను బాధగా ఉన్న రోజుల కంటే నవ్వుతూ ఉన్న రోజులే ఎక్కువ’ అంటూ పూరీ సమాధానం ఇచ్చాడు. ఇక ప్రస్తుతం తాను ముంబైలో కొత్త కథలు రాసే పనిలో ఉన్నానంటూ చెప్పుకొచ్చాడు. కాగా గాడ్ ఫాదర్లో పూరీ జర్నలిస్ట్‌గా కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. -
ఘోర అగ్ని ప్రమాదం... బస్సు కిందే సజీవ దహనమైన బైకర్లు
పోలీస్ సిబ్బందితో వెళ్తున్న బస్సు బైక్‌పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో ఇంధన ట్యాంకర్ పేలి ఘోర అగ్ని ప్రమాదం చోట చేసుకుంది. ఈ ఘటన చప్రా సివాన్ హైవేపై చోటు చేసుకుంది. ఆ బస్సులో బీహార్ పోలీసు సిబ్బంది ఉన్నారు. ఆ బస్సు డియోరియా గ్రామ సమీపంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తులను ఢీ కొనడంతో వారిలో ఒకరు బైక్‌తో సహా బస్సు కింద ఇరుక్క పోయారు. దీంతో ఒక్కసారిగా ఇంధన ట్యాంకు పేలి అగ్నికీలలు చుట్టుముట్టాయి.ఆ ముగ్గురు వ్యక్తుల బస్సు కిందకు రావడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. దీంతో బస్సు కింద ఇరుక్కన్న బైకర్‌తో సహా మిగతా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. బస్సులో మంటలు చెలరేగడంతో పోలీస్ అధికారులు వెంటనే బస్సు దిగి ప్రాణాలు రక్షించుకున్నారు. సితాబ్దియారాలో దివగంత రాజకీయ నాయకుడు జయ ప్రకాశ్‌నారాయణ 120వ జయంతి వేడుకల్లో పాల్గోని పోలీస్ సిబ్బంది తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. (చదవండి: కుక్క పిల్ల అని తెచ్చుకుంటే.. ) -
బహుళ అంతస్తుల భవనం... ఏకంగా 127 ఫ్లాట్లు...ఉండేది ఒకే ఒక్కడు!
కాల పరిమితి దాటిని బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చడం సహజం. నివాసితులను అక్కడ నుంచి వెళ్లిపోమని చెప్పి సదరు బిల్డర్లు ఎంతో కొంత డబ్బులు చెల్లించడం వంటివి జరుగుతుంది. అలానే ఇక్కడొక భవనాన్ని కూల్చేయలనుకున్నారు. అందుకోసం నివాసితులను ఖాళీ చేయించారు కూడా. కానీ ఒకే ఒక్కడు మాత్రం ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లటం లేదు. ఒంటరిగా అక్కడే ఉంటున్నాడు. వివారల్లోకెళ్తే....బ్రిటన్‌లోని స్కాట్లాండ్లో నార్త్ లానార్క్‌షైర్ కౌన్సిల్లో ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో ఏకంగా 127 ఫ్లాట్లు ఉన్నాయి. అయితే నగరానికి దూరంగా ఉండటం పెద్ద పెద్ద గాలులకు అద్దలు పగిలిపోవడం, దొంగలు పడటం తరుచుగా జరుగుతోందని ఫిర్యాదలు రావడంతో ఆ భవనాన్ని కూల్చివేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. దీంతో ఆ భవనంలోని నివాసితులందర్నీ ఖాళీ చేయించారు. ఐతే ఒకే ఒక్క వ్యక్తి నిక్ విస్నీవ్సీక్ అనే వ్యక్తి మాత్రం ససేమిరా ఖాళీ చేయనని చెప్పేశాడు. పైగా అతనోక్కడే ఒంటరిగా ఉంటున్నాడు. ఆఖరికి కౌన్సిల్ అతనకి సుమారు రూ. 34 లక్షలు తోపాటు మరోచోట అద్దెకున్నందుకు అక్కడ అద్దెను కూడా రెండేళ్ల వరకు చెల్లిస్తామని మంచి ఆఫర్ కూడా ఇచ్చింది. అయినా కుదరదని నిక్ తెగేసి చెప్పేశాడు. దీంతో కౌన్సిల్ అతను వెళ్లిపోవాలని ఆ భవనం శుభ్రం చేయకుండా, సెక్యూరిటీని తీసేసి, పట్టించుకోకుండా వదిలేసింది. అయినా అతను తన ప్లాట్‌ని వదిలి వెళ్లనని, వాళ్లు ఇచ్చే డబ్బులుతో మరో ఫ్లాట్ కొనేందుకు సరిపోవని అన్నాడు. నిక్ రైట్ టు బై స్కీమ్ కింద ఆ ఫ్లాట్‌ని 2017లో కొనుక్కున్నాడు. తాను ఒంటరిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా ఉంటాననే చెబుతున్నాడు. కౌన్సిల్ మాత్రం ఇది సున్నితమైన సమస్య అతన్ని ఎలాగైన ఖాళీ చేయిస్తానని చెబుతోంది. (చదవండి: Viral Video: ఎంత పెద్ద మనసు ఆ చిన్నారులది!) -
లైవ్ కట్ చేయకుంటే లోకేష్ కు మేమేంటో చూపించే వాళ్లం: వల్లభనేని వంశీ
-
నేను కనపడగానే జూమ్ మీటింగ్ కట్ చేసి పారిపోయాడు: కొడాలి నాని
-
లోకేష్ జూమ్ మీటింగ్ లో అందుకే జాయిన్ అయ్యా: కొడాలి నాని
-
Russia-Ukraine War: ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం
ముగిసిన చర్చలు.. అమెరికా కీలక నిర్ణయం ► ఉక్రెయిన్-రష్యా మధ్య జరిగిన శాంతి చర్చలు ఎటూ తేలకుండా ముగియడంతో ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. మరోవైపు చర్చల ముగిసిన కాసేపటికే అగ్ర రాజ్యం అమెరికా కీలక ప్రకటన చేసింది. అమెరికా ఎంబసీ సిబ్బంది రష్యాను వీడేందుకు అనుమతిచ్చింది. రష్యాలో ఉన్న అమెరికా పౌరులు సైతం వెంటనే ఆ దేశాన్ని వీడాలని సూచించింది. కాగా, భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం ►ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రష్యా ఉక్రెయిన్ దేశాలు వెంటనే కాల్పులు విరమించుకోవాలని ఐరాస పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించనున్నారు. యుద్ధంపై 193 దేశాలు తమ అభిప్రాయాన్ని తెలపనున్నాయి. తగ్గేదేలే.. 36 దేశాల విమానాలపై నిషేధం ► ఇప్పటికే పలు దేశాలు రష్యా పై పలు రకాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే రష్యా మాత్రం వాటికి ఏ మాత్రం బెదరక పోగా తాజాగా బ్రిటన్, జర్మనీ, తదితర 36 దేశాలకు చెందిన విమానాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్ సంక్షోభంపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశం ►ఉక్రెయిన్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లోని భారతీయలు తరలింపు ప్రక్రియపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే భారతీయుల తరలింపును మరింత వేగవంతం చేయడంపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బెలారస్లో ముగిసిన చర్చలు ►బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య చర్చలు ముగిశాయి. సుమారు 4 గంటల పాటు ప్రతినిధుల మధ్య ఈ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఉక్రెయిన్ నుంచి ఆరుగురు, రష్యా నుంచి ఐదుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని, క్రిమియా నుంచి కూడా బలగాలను తొలగించాలని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తుండగా.. నాటోలో చేరబోమని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని రష్యా పట్టుబడినట్టు సమాచారం. అయితే, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా చర్చలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతుగా వైట్ హౌస్ వద్ద నిరసనలు ► ఉక్రెయిన్-రష్యా సంక్షోభం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌ను తాకింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఆ దేశ జెండాలు పట్టుకుని ఉక్రేనియన్లు నిరసనలు తెలిపారు. తమ స్వదేశానికి మద్దతుగా వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ ముందు ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో ఉక్రెయిన్‌లో పుట్టి రష్యాలో పెరిగిన ఓ వ్యక్తి కూడా పాల్గొనడం విశేషం. #WATCH | With Ukrainian flags, prayers & slogan chanting against Russian President Putin, protesters gathered in front of the White House in Washington, DC in a show of support for Ukraine pic.twitter.com/1nBYZHcl2x— ANI (@ANI) February 28, 2022 స్వదేశం చేరుకున్న 1400 మంది భారతీయులు ► ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కారణంగా కేంద్రం భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది. కాగా, ఇప్పటి వరకు 6 ప్రత్యేక విమానాల్లో 1400 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు భారత విదేశాంగ శాఖకు చెందిన అధికారి అరిండమ్ బాగ్చీ తెలిపారు. ఆరు విమానాల్లో 4 బూచారెస్ట్(రొమేనియా), మరో 2 బుడాపెస్ట్(హంగేరీ) నుంచి వచ్చినట్టు పేర్కొన్నారు. As of now, six flights have arrived carrying around 1400 Indian citizens. Four flights have arrived from Bucharest (Romania) and two flights from Budapest (Hungary): MEA Spokesperson Arindam Bagchi pic.twitter.com/2K7EjEacHF — ANI (@ANI) February 28, 2022 ఉక్రెయిన్‌కు ఈయూలో సభ్యత్వంపై భిన్నాభిప్రాయాలు: చార్లెస్ మిచెల్ ► ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో తమ దేశానికి ఈయూలో సభ్యత్వం ఇవ్వాలని జెలెన్ స్కీ అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారి చార్లెస్ మిచెల్ స్పందిస్తూ.. ఈయూ కూటమిలో ఉక్రెయిన్ చేరడంపై కూటమిలోని 27 దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఈయూలో ఉక్రెయిన్‌కు వెంటనే సభ్యత్వం ఇవ్వండి: జెలెన్ స్కీ ► ఉక్రెయిన్‌పై రష్యా దాడుల చేస్తున్న వేళ తమ దేశానికి వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థించారు. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది తమ లక్ష్యమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తమ న్యాయమైన హక్కు అని తాను అనుకుంటున్నానని, ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నట్టు జెలెన్ స్కీ పేర్కొన్నారు. బెలారస్లో చర్చలు ప్రారంభం ► బెలారస్లో ఉక్రెయిన్-రష్యా బృందాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. బెలారస్లో ఇరు దేశాల విదేశాంగ శాఖ అధికారులు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్.. రష్యా తక్షణమే యుద్ధం విరమించుకోవాలని కోరింది. రష్యా దాడుల్లో 102 మంది మృతి : UN ► ఉక్రెయిన్‌లో రష్యా దాడులతో మృత్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ దాడుల్లో మొత్తం 102 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి (UN) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నట్టు వెల్లడించారు. ► అహింస ఒక్కటే మార్గం : దలైలామా ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ దాడులపై ఆధ్యాత్మిక నేత దలైలామా స్పందించారు. యుద్ధాలకు కాలం చెల్లిందని, అహింస ఒక్కటే మార్గమని అన్నారు. రెండు దేశాల మధ్య హింసాత్మక ఘటనలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవులంతా ఒక్కటే అన్న భావాన్ని పెంపొందించుకోవాలని రెండు దేశాలకు సూచించారు. యుద్ధాన్ని ఆపడానికి పుతిన్‌పై ఒత్తిడి తీసుకురండి: ఇగోర్ పోలిఖా ► ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ఆపడానికి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి డాక్టర్ ఇగోర్ పోలీఖా తెలిపారు. ఈ క్రమంలో తమ దేశ విదేశీ భాగస్వాములందరి సాయాన్ని పోలిఖా అభ్యర్థించారు. మీ ప్రాణాలు కాపాడుకోండి.. రష్యా సైన్యానికి జెలెన్ స్కీ విజ్ఞప్తి ► ఉక్రెయిన్‌పై రష్యా సైనం దాడులు కొనసాగిస్తున్న వేళ జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా బలగాలను ఉద్దేశించి మీ ప్రాణాలు కాపాడుకోండి.. ఉక్రెయిన్‌కు వదిలివెళ్లిపోండి అంటూ విజ్ఞప్తి చేశారు. ► బెలారస్‌లోని ఫ్యాపిట్ వేదికగా కాసేపట్లో రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు.. షరతులు లేకుండా ముందుకొచ్చిన రష్యా. మరోవైపు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న దాడులు. ► ఉక్రెయిన్‌కు ఊహించని సాయం!: యుద్ధ సంక్షోభ సమయంలో ఉక్రెయిన్‌కు ఊహించని సాయం అందింది. నాటో దళాలు, ఈయూ దేశాలు పరోక్ష సాయానికి పరిమితమైన వేళ.. యూరప్ దేశం లాట్వియా (లాత్వియా) నుంచి ఉక్రెయిన్‌కు ప్రత్యక్ష మద్ధతు లభించింది. ఈ మేరకు సోమవారం పార్లమెంట్లో ఓ కీలక తీర్మానం ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్‌లో ఉన్న లాట్వియా పౌరులు అవసరమైతే యుద్ధంలో ఉక్రెయిన్ తరపున పాల్గొనవచ్చని తెలిపింది. ఇందుకోసం పార్లమెంటు సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తమ పౌరులు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వీలు కల్పిస్తున్నందుకు గర్వంగా ఉందని పార్లమెంటు ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. ‘‘ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలనుకునే, ఉక్రెయిన్ స్వాతంత్ర్యం, మా ఉమ్మడి భద్రత కోసం స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే మా పౌరులు తప్పనిసరిగా అలా చేయగలరు" అని పార్లమెంటరీ రక్షణ, హోం వ్యవహారాలు, అవినీతి నిరోధక కమిషన్ ఛైర్మన్ జూరిస్ రాంకానిస్ తరపున ఒక ప్రకటన విడుదల అయ్యింది. లాట్వియా, బాల్టిక్ పొరుగున ఉన్న ఎస్టోనియా -లిథువేనియాతో కలిసి ఒకప్పుడు రష్యా పాలనలోనే ఉండేవి. రష్యాను భద్రతా ముప్పుగా చాలా కాలంగా చూసింది. చివరికి.. ఉక్రెయిన్ మాదిరిగా కాకుండా, ఆ మూడు దేశాలు యూరోపియన్ యూనియన్, NATO లో చేరాయి. అయినప్పటికీ ఉక్రెయిన్‌తో లాట్వియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ► బెలారస్‌కు చేరిన ఇరు దేశాల విదేశాంగ ప్రతినిధులు. మధ్యాహ్నాం 3గంటలకు చర్చలు మొదలయ్యే అవకాశం. ►ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు: సోమవారం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగే చర్చలు సానుకూల ఫలితం ఇస్తుందని తాను అనుకోవట్లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. పరిస్థితులు అందుకు ఆశాజనకంగా లేవని కీలక వ్యాఖ్యలు చేశారాయన. చర్చలపై ఆదివారం హైడ్రామా సాగగా.. ఓవైపు రష్యా దళాలను ఎదుర్కొంటూనే చర్చలకు సిద్ధమని ప్రకటించాడాయన. అయితే ఉక్రెయిన్ ప్రతిఘటనను రష్యా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే దాడులను తీవ్ర తరం చేస్తూనే.. చర్చల ప్రతిపాదనకు ఓకే చెప్పింది. ఈ క్రమంలో ఉక్రెయిన్‌తో పాటు రష్యా తీవ్రంగా నష్టపోతోంది కూడా. ► కీవ్‌లో వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత. విద్యార్థులు పశ్చిమ వైపు ప్రాంతాల రైల్వే స్టేషన్లకు వెళ్లాలని సూచన. అక్కడి నుంచి ప్రత్యేక రైళ్ల ఏర్పాటు చేసిన ఉక్రెయిన్ ప్రభుత్వం. ► ఉక్రెయిన్‌కు ఈయూ విమానాలు: రష్యాతో తలపడుతున్న ఉక్రెయిన్‌కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. మూడు వైపుల నుంచి చుట్టుముట్టి దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై చేతనైనంత మేర పోరాడుతున్న ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలు పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించాయి. ఈ మేరకు కూటమి విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ తెలిపారు. ► రష్యాకు సౌత్ కొరియా షాక్: రష్యాను ఆంక్షలతో ఇరకాటంలో పెడుతున్న పాశ్చాత్య దేశాలకు ఆసియా దేశం దక్షిణ కొరియా తోడైంది. రష్యా ఎగుమతులపై దక్షిణ కొరియా నిషేధం విధించింది. వ్యూహాత్మక వస్తువుల ఎగుమతులను నిషేధించడం ద్వారా.. రష్యాకు వ్యతిరేకంగా ఎగుమతి నియంత్రణలను కఠినతరం చేయాలని దక్షిణ కొరియా భావించింది. ఇప్పటికే SWIFT అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ నుంచి కొన్ని రష్యన్ బ్యాంకులను సౌత్‌కొరియా బ్యాన్ చేసింది. ఈ మేరకు రాజధాని సియోల్ నుంచి విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ► రష్యాకు మద్ధతుగా ఉన్న బెలారస్‌పై ఆంక్షలకు జపాన్ సిద్ధమైంది. ► సంచలనం.. పుతిన్‌పై ట్రావెల్ బ్యాన్: మొండిగా ఉక్రెయిన్‌పై దూసుకెళ్లి.. ఘోర విధ్వంసానికి తెర తీసిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా సంచలన ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్, ఆయన సెక్యూరిటీ కౌన్సిల్‌లోని సభ్యులపై ఆస్ట్రేలియా మరిన్ని ఆంక్షలు ప్రకటించింది. వీరందరిపై ఆర్థిక, ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్వయంగా ప్రకటించారు. ‘‘మేము రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్‌పై చేసిన అన్యాయమైన యుద్ధాన్ని ఖండిస్తున్నాం. ఆర్థిక ఆంక్షలు, ప్రయాణ నిషేధాలు రష్యా అధ్యక్షుడు మరియు రష్యా భద్రతా మండలిలో మిగిలిన శాశ్వత సభ్యులపై గత అర్ధరాత్రి నుంచే మా(ఆస్ట్రేలియా) తరపు నుంచి అమలులోకి వచ్చాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సహా 350 మందికి పైగా రష్యన్ వ్యక్తులపై ఈ ఆంక్షలు వర్తిస్తాయి’’ అని మోరిసన్ చెప్పారు. ఇదిలా ఉండగా.. యుద్ధంలోనూ ఆస్ట్రేలియా ఉక్రెయిన్‌కు బాసటగా.. రష్యా దాడిని ఎదుర్కొనేందుకు ప్రాణాంతకమైన సైనిక సామగ్రిని అందజేయనుంది. అయితే ఆస్ట్రేలియా తాజా ప్రకటనలో.. ఏ మెటీరియల్‌ను పంపుతుందనే దానిపై ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. ముట్టడి చేయబడిన ఉక్రెయిన్‌కు మద్దతుగా నాటో ట్రస్ట్ ఫండ్.. ప్రాణాంతకం కాని సైనిక పరికరాలు, వైద్య సామాగ్రి, 3 మిలియన్ డాలర్ల విరాళాన్ని శుక్రవారం అందించిన విషయం తెలిసిందే. ► రష్యా దాడుల్లో 350 మందికి పైగా మా పౌరులు మృతి చెందారు: ఉక్రెయిన్ ► ఆపరేషన్ గంగా.. ఐదో విమానం రాక: ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్ గంగను నిర్వహిస్తోంది భారత్. ఇందులో భాగంగా ఐదో విమానం.. 249 మందితో బుచారెస్ట్(రొమేనియా) నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ స్వయంగా గాంధీనగర్ వెళ్లి వంద మంది విద్యార్థులకు స్వాగతం పలికారు. Close to 100 students from Gujarat were welcomed back by CM Bhupendra Patel this morning at Gandhinagar. These students landed from Ukraine in Mumbai and Delhi & were brought to Gujarat by Volvo buses.#RussiaUkraineCrisis pic.twitter.com/AsPR48chXO — ANI (@ANI) February 28, 2022 ► బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్.. కార్కీవ్ నగరం ► దాడులను తక్షణమే నిలిపివేయాలి- భారత్: భద్రతా మండలిలో రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. వీటో అధికారంతో అడ్డుకుంది రష్యా. దీంతో అగ్రరాజ్యాలు ప్రత్యామ్నాయ చర్యలకు ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా దాడులను వెంటనే ఈ మేరకు భద్రతా మండలిలో ప్రకటన విడుదల చేసింది. అయితే భారత్ ఓటింగ్‌కు దూరంగా ఉండడంపై పలు దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ► ఈ 24 గంటలే కీలకం: ఉక్రెయిన్ పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ.. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌తో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. రాబోయే 24 గంటలు ఉక్రెయిన్‌కు కీలకమని ఈ సందర్భంగా జెలెన్స్కీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ► ఐరాస అత్యవసర భేటీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు.. ఇవాళ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశం. 11 దేశాల ఓటింగ్‌తో అత్యవసర భేటీకి తీర్మానం. భారత్, చైనా, యూఏఈ దూరం. ► రెడీగా ఉండండి-పుతిన్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగి ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికీ సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. ఏ క్షణంలోనైనా ‘యుద్ధ విధులకు’ దిగేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాల్సిందిగా రష్యా అణ్వాయుధ దళాలను పుతిన్ ఆదివారం ఆదేశించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ తదితరులతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. నాటో దేశాధినేతల దుందుడుకు వ్యాఖ్యలకు, రష్యాపై, తనపై విధించిన కఠినమైన ఆంక్షలకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో అమెరికా, పాశ్చాత్య దేశాలు కలవరపడుతున్నాయి. వివాదం చివరికి అణు యుద్ధానికి దారితీస్తుందేమోనని భయపడుతున్నాయి. అదే జరిగితే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ► అమెరికా ఆందోళన: ఈ వివాదంలో తలదూర్చే దేశాలపై అత్యంత కఠినంగా ప్రతి చర్యకు దిగుతామని యుద్ధానికి దిగిన సందర్భంగా పుతిన్ గట్టిగా హెచ్చరించడం తెలిసిందే. రష్యా తిరుగులేని అణు శక్తి అంటూ ఆ సందర్భంగా బెదిరించారు కూడా. ఉక్రెయిన్ను ఎలాగైనా ఓడించేందుకు రసాయనిక, జీవ రసాయన ఆయుధాల ప్రయోగానికి కూడా రష్యా దిగినా ఆశ్చర్యం లేదని ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై అమెరికా ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధోన్మాదాన్ని అస్సలు అంగీకారం కాని స్థాయికి పుతిన్ తీసుకెళ్తున్నారని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ దుయ్యబట్టారు. ఆయన చర్యలను అత్యంత కఠినంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ► వామ్మో ‘అణు’మానాలు: రష్యా, అమెరికా ప్రస్తుతం అతి పెద్ద అణ్వాయుధ దేశాలు. ఇవి రెండూ తమ వ్యూహాత్మక భూతల, జలాంతర్గామి అణ్వాయుధ సంపత్తిని నిరంతరం అప్రమత్తంగా, ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు సన్నద్ధంగా ఉంచుతాయి. అయితే అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాంబర్లు, యుద్ధ విమానాలు మాత్రం అవసరమనుకున్నప్పుడే రంగంలోకి దిగుతాయి. ఈ సమయంలో పుతిన్ గనక తన బాంబర్లు, యుద్ధ విమానాలను అణు దాడికి సన్నద్ధం చేసే పక్షంలో అది విపరిణామాలకే దారి తీయొచ్చు. అమెరికా కూడా అదే మాదిరిగా స్పందించక తప్పని పరిస్థితి తలెత్తుతుందని ఫెడరేసన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్‌లో న్యూక్లియర్ అనలిస్టు హన్స్ క్రిస్టెన్సన్ అభిప్రాయపడ్డారు. అది అంతర్జాతీయంగా పెను ఉద్రిక్తతలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ► అణు ఆటలొద్దు: ఐఏఈఏ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్ కేంద్రాల భద్రతపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వెలిబుచ్చింది. వాటికి ప్రమాదం కలిగించే చర్యలకు దిగొద్దని రష్యాకు సూచించింది. అలాంటి చర్యలు భారీ ప్రాణ, పర్యావరణ నష్టానికి దారి తీయవచ్చని ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ రాఫెల్ మారియానో గ్రోసీ హెచ్చరించారు. వాటివద్ద పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నట్టు ఉక్రెయిన్ నుంచి తమకు సమాచారముందని చెప్పారు. ఉక్రెయిన్‌లో నాలుగు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలోని 15 రియాక్టర్లు దేశ విద్యుత్ అవసరాల్లో సగం మేరకు తీరుస్తున్నాయి. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రాన్ని గురువారం రష్యా స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. తాజాగా దానినుంచి కాస్త హెచ్చు స్థాయిలో రేడియో ధార్మికత వెలువడుతోందని ఐఏఈఏ తెలిపింది. -
మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోండి ఇలా..?
రైల్వే ప్రయాణికుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న రైల్వేశాఖ సరికొత్తగా మరికొన్ని సేవలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది. రైలు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రైల్వే ప్రయాణికులు ప్రయాణించే రైలు సమయానికే స్టేషన్ కు వస్తుందా..? ప్రస్తుతం ఎక్కడుంది..? అనే విషయాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలున్నాయి. అయితే, ఇప్పుడు మీరు ప్రయాణించే రైలు లైవ్ స్టేటస్ మీ మొబైల్ ద్వారా సులభంగా తెలుసుకోవడానికి ఇండియన్ రైల్వే గూగుల్ మ్యాప్స్‌తో ఒప్పందం చేసుకుంది. రైలు లైవ్ స్టేటస్ కి సంబంధించిన సమాచారాన్ని గూగుల్ తన మ్యాప్స్‌లో అందిస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో రైలు లైవ్ స్టేటస్ తెలుసుకోండి ఇలా..? మొదట మీ మొబైల్ ఉన్న గూగుల్ మ్యాప్స్ యాప్ ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ మ్యాప్స్‌లో క్లిక్ చేయండి. మ్యాప్స్‌లో మీరు ఎక్కాల్సిన రైల్వే స్టేషన్ క్లిక్ చేయగానే మీకు చాలా రైళ్లకు సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు మీరు ప్రయాణించే రైలు మీద క్లిక్ చేయగానే ఆ రైలు ఎక్కడ ఉంది, ఎన్ని నిమిషాలు ఆలస్యంగా వస్తుంది అనేది మీకు చూపిస్తుంది. (చదవండి: ఉత్తర కొరియాలో రెచ్చిపోతున్న హ్యాకర్స్!! ఏం చేశారంటే..) -
దేశవ్యాప్తంగా ఉపపోరు ఫలితాలు
లైవ్ అపడేట్స్.... ►4.45pm.. కర్ణాటక - సింద్గిలో బీజేపీ, హనగల్‌లో కాంగ్రెస్ విజయం ► 4.50pm.పశ్చిమ బెంగాల్ - శాంతిపూర్ నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి విజయం...ఉపఎన్నిక జరిగిన నాలుగు స్థానాలలో విజయకేతనం ఎగరవేసింది టీఎంసీ పార్టీ ►4.47pm.. బీహార్ - కుశేశ్వర్లో జనతా దళ్( యూ) పార్టీ అభ్యర్థి గెలుపు ►3.50pm..హిమాచల్ ప్రదేశ్ - అర్కి, ఫతేపూర్జు, జుబ్బల్-కోట్‌ఖాయ్ నియోజకవర్గాలు కాంగ్రెస్ కైవసం ►3.20pm..హర్యానా - ఎల్లెనాబాద్ నియోజకవర్గంలో ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌పార్టీ అభ్యర్థి అభయ్ చౌతాలా విజయం ► 3.02pm..అస్సాం - తౌరా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి విజయం, మిగిలిన నాలుగు స్థానాలలో ఎన్డీఏ కూటమి ముందంజ ► 2.58pm.పశ్చిమ బెంగాల్ - గోశభ నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి సుభ్రత మొండల్ విజయం పశ్చిమ బెంగాల్ - దిన్హటా నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి ఉదయన్ గుహ విజయం పశ్చిమ బెంగాల్ - ఖర్దా నియోజకవర్గంలో తృణముల్ కాంగ్రెస్ అభ్యర్థి సోవందేబ్ చటోపాధ్యాయ విజయం ► 2.02pm..మేఘాలయ - రాజబాలా నియోజకర్గంలో ఎన్పీపీ అభ్యర్థి విజయం లోక్‌సభ స్థానాలు... ►01.35pm దాద్రా నగర్ హవేలీ - 15 వేల ఓట్ల ఆధిక్యంలో శివసేన ►12.05pm దాద్రా నగర్ హవేలీ - ఆధిక్యంలో శివసేన పార్టీ, రెండో స్థానంలో బీజేపీ ►12.02pm హిమాచల్ ప్రదేశ్‌లోని మండి - సుమారు 6వేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ►11.45am దాద్రా నగర్ హవేలీ - శివసేన పార్టీ సుమారు 13వేల ఓట్ల ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ ►10.45am దాద్రా నగర్ హవేలీ - శివసేన ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ ►10.45am మధ్యప్రదేశ్- ఖాండ్వాలో బీజేపీ ఆధిక్యం ►10.15 am హిమాచల్ ప్రదేశ్‌లోని మండి- 4704 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ 133458 ఓట్లతో మొదటి స్థానం, బీజేపీ 128754 ఓట్లతో రెండో స్థానం అసెంబ్లీ స్థానాలు... ►1.46pm..మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్నెంగ్ స్థానాల్లో కొనసాగుతున్న ఎన్పీపీ పార్టీ ఆధిక్యం,.. మావ్‌ఫ్లాంగ్- యూడీపీ పార్టీ ఆధిక్యం ►1.45pm.. కర్ణాటక - హనగల్‌లో కాంగ్రెస్ 7000 తేడాతో ఆధిక్యం, ►12.36pm.. హిమాచల్‌ప్రదేశ్- మూడు స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ ►12.20pm.. రాజస్థాన్ - రెండు స్థానాల్లో కొనసాగుతున్న కాంగ్రెస్ ఆధిక్యం ►12.20pm.. బీహార్ - కుశేశ్వర్లో జనతా దళ్( యూ) పార్టీ 8000 ఆధిక్యం ►12.20pm..బీహార్ - తారాపూర్‌లో 3800 ఓట్లకు పైగా ఆర్జేడీ పార్టీ ఆధిక్యం ►12.18pm..మధ్యప్రదేశ్- మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ రెండు, కాంగ్రెస్ ఒకటి ఆధిక్యంలో ఉన్నాయి ►12.18pm.. హిమాచల్‌ప్రదేశ్- రెండు స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో బీజేపీ ముందంజ ►12.00pm..మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్నెంగ్ స్థానాల్లో ఎన్పీపీ పార్టీ ముందంజ,.. మావ్‌ఫ్లాంగ్- యూడీపీ పార్టీ ఆధిక్యం ►11.48am.. మిజోరాం - తురియాల్లో 900 ఓట్ల ఆధిక్యంలో ఎంఎన్ఎఫ్ పార్టీ ►11.45am..హర్యానా - ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌పార్టీ 6000 ఆధిక్యంతో ముందంజ, రెండో స్థానంలో బీజేపీ ►11.45am.. కర్ణాటక - సింద్గిలో బీజేపీ భారీ ఆధిక్యం ►11.40am.. మహారాష్ట్ర - డెగ్లూర్‌లో సుమారు 8000 ఓట్లతో కాంగ్రెస్ ఆధిక్యం ►11.15am.. మహారాష్ట్ర - డెగ్లూర్‌లో కాంగ్రెస్ ఆధిక్యం ►11.05am.. హర్యానా -ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ 2000 ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ ►11.00am.. అస్సాం- ఐదు స్థానాల్లో ఎన్డీఏ కూటమి ఆధిక్యం ►10.45 am.. హిమాచల్‌ప్రదేశ్- మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ►10.45am.. మధ్యప్రదేశ్- మూడు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం, లోక్‌సభ ►10.25am.. కర్ణాటక- హనగల్‌లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం, సింద్గిలో బీజేపీ ఆధిక్యం ►10.25am.. రాజస్థాన్‌లోని వల్లభనగర్ ( అసెంబ్లీ )- 2540 ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కాంగ్రెస్ పార్టీ 6624 ఓట్లతో మొదటి స్థానం, రాష్ట్రీయ లోకతంత్రిక పార్టీ 4084 ఓట్లతో రెండో స్థానం, బీజేపీ 3752 ఓట్లతో మూడో స్థానం ►10.25am.. హర్యానా -ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీ ఆధిక్యం, రెండో స్థానంలో బీజేపీ ►10.02am పశ్చిమ బెంగాల్- నాలుగు అసెంబ్లీ స్థానాల్లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో మూడు లోక్ సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు నేడు ( నవంబర్ 2) . ఈ ఉప ఎన్నికల్లో చాలా చోట్ల సుమారు 60 శాతం పైనే పోలింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధిక పోలింగ్ జరిగిన నియోజకవర్గాలను పరీశిలిస్తే.. మిజోరాం, తెలంగాణ, హర్యానా, మేఘాలయలో 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. కాగా ఆక్టోబర్ 30న వీటికి ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్థానాలు... ఆంధ్రప్రదేశ్ - బద్వేల్ తెలంగాణ - హుజూరాబాద్ మేఘాలయ - రాజబాలా, మావ్రింగ్నెంగ్, మావ్‌ఫ్లాంగ్ బీహార్ - తారాపూర్, కుశేశ్వర్ కర్ణాటక - హనగల్, సింద్గి అస్సాం - గోస్సైగావ్, భబానీపూర్, తముల్పూర్, మరియాని, తౌరా హర్యానా - ఎల్లెనాబాద్ మహారాష్ట్ర - డెగ్లూర్ పశ్చిమ బెంగాల్ - దిన్హటా, శాంతిపూర్, ఖర్దా, గోసాబా మధ్యప్రదేశ్ - జోబాట్, రాయగావ్, ఫృథ్వీపూర్ హిమాచల్ ప్రదేశ్ - అర్కి, ఫతేపూర్జు, జుబ్బల్-కోట్‌ఖాయ్ మిజోరాం - తురియాల్ రాజస్థాన్ - వల్లభనగర్, ధరియావాడ్ లోక్ సభ స్థానాలు... దాద్రా నగర్ హవేలీ హిమాచల్ ప్రదేశ్- మండి మధ్యప్రదేశ్- ఖాండ్వా -
దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్
పోలింగ్ అప్డేట్స్: ► దాద్రానగర్ హావేలీలో సాయంత్రం 5 గంటల సమయానికి 66. 99శాతం పోలింగ్ నమోదు. ► బీహార్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి 49.85 శాతం పోలింగ్ నమోదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీహార్‌లో అత్యల్పంగా పోలింగ్ నమోదైంది. ► మధ్యప్రదేశ్‌లోని మూడు అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 63.02 శాతం పోలింగ్ నమోదు. మరోవైపు ఖాండ్వా లోక్ సభ నియోజకవర్గంలో 59.02 శాతం పోలింగ్ నమోదు. ► రాజస్థాన్‌లోని ధరియావాడ్, వల్లభనగర్‌లో సాయంత్రం 5 గంటల సమయానికి సరాసరిగా 65 శాతం పోలింగ్ నమోదు. ► హిమాచల్ ప్రదేశ్ ఉపఎన్నికలో జుబ్బల్-కోట్‌ఖాయ్‌లో సాయంత్రం 4 గంటల వరకు 65.88 శాతం, మండిలో 47.17 శాతం పోలింగ్ నమోదైంది. ►మేఘాలయాలో 78 శాతం మేర పోలింగ్ నమోదు. ► బెంగాల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 60 శాతానికి పైగా పోలింగ్ ►రాజస్తాన్ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.69 శాతం పోలింగ్ ►దాద్రానగర్ హవేలీ మధ్యాహ్నం 3 గంటల వరకు 53.71 శాతం పోలింగ్ ►మేఘాలయ బైపోల్స్‌లో రికార్డుస్థాయిలో పోలింగ్ జరుగుతోంది. 3 గంటల సమయానికి 64 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. ►భారత మొదటి ఓటరు..104 ఏళ్ల శ్యామ్ శరణ్ నేగి, శనివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోని కల్పా మోడల్ పోలింగ్ స్టేషన్లో మండి పార్లమెంటరీ ఉప ఎన్నికలో ఓటు వేశారు. ►హర్యానాలో మధ్యాహ్నం 2 గంటల వరకు 45 శాతం పోలింగ్ ► బెంగాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 46 శాతం పోలింగ్ ►రాజస్తాన్ మధ్యాహ్నం 1 గంట వరకు 40.64 శాతం పోలింగ్ ►అస్సాంలో ఉదయం 1 గంట వరకు 51 శాతం పోలింగ్ ►బిహార్‌లో 1 గంటకు 38 శాతం పోలింగ్ ► మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ స్ధానాలకు 45.67 శాతం పోలింగ్ ( మధ్యాహ్నం 3 గంటల వరకు), లోక్‌సభ స్థానాలకు 39.08 శాతం పోలింగ్( మధ్యాహ్నం 1 గంట వరకు) ►దాద్రానగర్ హవేలీ ఉదయం 11 గంటల వరకు 23 శాతం పోలింగ్ ►రాజస్తాన్ 11 గంటల వరకు 25 శాతం పోలింగ్ ►కర్ణాటక 10.30 గంటల వరకు 9.77 శాతం పోలింగ్ ►బిహార్‌లో ఉదయం 11 గంటలకు 21.79 శాతం ►హర్యానాలో ఉదయం 10 గంటల వరకు 10 శాతం ►అస్సాంలో ఉదయం 10 గంటల వరకు 12 శాతం ►మిజోరాంలో ఉదయం 10 గంటల వరకు 17 శాతం ►కర్ణాటకలో ఉదయం 9 గంటల వరకు 8 శాతం ► బెంగాల్లో ఉదయం 9 గంటలకు 10 శాతానికి పైగా న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేళి, డామన్ డయ్యూలో ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7 గంటలకు కొనసాగుతుంది. ఎన్నికలు జరుగుతున్న స్థానాలు దాద్రానగర్ హవేలీ, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికలు జరగుతుండగా.. అసోంలో 5, బెంగాల్లో 4, మధ్యప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, హిమాచల్‌ప్రదేశ్‌లో 3, బీహార్‌లో2, కర్ణాటకలో2, రాజస్థాన్‌లో 2, మహారాష్ట్ర, హర్యానా, మిజోరంలోని ఒక్కో స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. చదవండి: విశ్వాసం అంటే ఇదేరా ! -
భారీ ప్రమాదం నుంచి బయటపడ్డ యాంకర్
-
షాకింగ్ వీడియో: లైవ్‌లో యాంకర్‌పై కూలిన స్టూడియో సెట్టు
బొగోటా: కొలంబియాలో దారుణం చోటు చేసుకుంది. లైవ్‌లో ఉన్న యాంకర్‌పై ఉన్నట్టుండి స్టూడియో సెట్టులోని ఓ భాగం కూలింది. అయితే అదృష్టవశాత్తు అతడికి పెద్దగా గాయాలేం కాలేదు. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే.. యాంకర్‌పై సెట్టు కూలిన సమయంలో అక్కడ మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు వారిలో ఒక్కరు కూడా స్పందించలేదు. పైగా షో కంటిన్యూ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ వివరాలు.. కార్లోస్ ఓర్డుజ్ అనే యాంకర్ కొలంబియా ఈఎస్పీఎన్కు చెందిన ఒక షో ప్యానెలిస్టులలో సభ్యుడు. ఈ క్రమంలో ఈ నెల 10న షో నిర్వహిస్తుండగా.. సెట్లో ఉన్న భారీ మానిటర్ లాంటి నిర్మాణం అతనిపై పడింది. దాంతో అతడి ముఖం డెస్క్‌కు తగిలింది. ఈ ఘటనలో అతడు డెస్క్‌కు అతుక్కుపోయినట్లు కనిపించడం వీడియోలో చూడవచ్చు. ఇక ఇదే షోలో ఓర్డుజ్తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడా పాల్గొన్నారు. యాంకర్‌పై సెట్ కూలడంతో వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత వారిలో ఒక వ్యక్తి తేరుకుని.. కాసేపు షోని కంటిన్యూ చేసి.. ఆ తర్వాత బ్రేక్ అని చెప్పి.. కట్ చేశాడు. వెంటనే ఓర్డుజ్ని లేపి ఆస్పత్రికి తరలించారు. అతడికి పెద్దగా గాయాలు కాలేదని తెలిపారు వైద్యులు. ఈ క్రమంలో తన గురించి కంగారు పడినవారందరికి ధన్యవాదాలు తెలిపాడు ఓర్డుజ్. సెట్ కూలిన ఘటనలో తనకు ఎలాంటి గాయాలు కాలేదని.. క్షేమంగానే ఉన్నానంటూ ట్వీట్ చేశాడు. చదవండి: లైవ్ న్యూస్: పన్ను ఊడినా.. పట్టు వదలని యాంకర్ ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?.. -
రిపోర్టర్ లైవ్ చేస్తుండగా.. గన్‌తో బెదిరించి దోపిడి
క్విటో: రిపోర్టర్ లైవ్ ఇస్తుండగా, ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి దోపిడీ చేసిన ఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఈనెల 12న ఈక్వెడార్‌లోని ఓ ఫుట్‌బాల్ స్టేడియం వద్ద మ్యాచ్‌కు సంబంధించి డైరెక్టివి స్పోర్ట్స్ చానల్‌కు చెందిన జర్నలిస్ట్ డియెగో ఆర్డినోలా లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు రిపోర్టర్‌తో పాటు సిబ్బందిని తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న ఫోన్లు,డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన సిబ్బంది ఒకరు తన వద్ద ఉన్న వస్తువులను ఇచ్చేయడంతో, అవి తీసుకొని దుండగుడు, అతని స్నేహితుని బైక్‌పై పరారయ్యాడు. అయితే ఇదంతా పట్టపగలే అది కూడా లైవ్‌లో జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ డియోగో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు జర్నలిస్ట్‌తో సహా సిబ్బందికి తమ మద్దతును తెలుపుతున్నారు. ఇక దుండగుడు ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్క్, తలపై టోపీని ధరించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : (నగ్నంగా ఏనుగెక్కిన మోడల్!) (Shweta Memes: ఎందుకింతలా ట్రెండవుతోంది!) Ni siquiera podemos trabajar tranquilos, esto ocurrió a las 13:00 de hoy en las afueras del Estadio Monumental. La @PoliciaEcuador se comprometió a dar con estos delincuentes. #Inseguridad pic.twitter.com/OE2KybP0Od — Diego Ordinola (@Diegordinola) February 12, 2021 -
ఇన్స్టాగ్రాం: ఒకేసారి నలుగురితో లైవ్
ఇన్స్టాగ్రామ్ తన వినియోగదారులకు శుభవార్త తెలిపింది. ఇన్స్టాగ్రాం లైవ్ రూమ్స్ ద్వారా ఒకేసారి నలుగురు వ్యక్తులు లైవ్ వీడియోలో మాట్లాడొచ్చు. ఇన్స్టాగ్రామ్ ప్రారంభంలో కేవలం ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకునే వీలు ఉండేది. తర్వాత రోజు రోజుకి కొత్త ఫీచర్స్ తీసుకొస్తున్న ఇన్స్టాగ్రామ్ యూత్, కంటెంట్ క్రియేటర్ లను ఆకట్టుకునేందుకు ఇన్స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ ఫీచర్ ని తీసుకొచ్చింది. మొదట్లో ఇన్స్టాగ్రామ్ లైవ్ రూమ్స్ ద్వారా కేవలం ఇద్దరు మాత్రమే పాల్గొనే అవకాశం ఉండేది. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ఫీచర్ ద్వారా నలుగురు వ్యక్తులు ఒకేసారి లైవ్ వీడియోలో మాట్లాడుకోవచ్చు. దీనిని మొదట భారతదేశంలోనే బీటా టెస్టింగ్స్ చేసారు. ప్రస్తుతం ఈ ఫీచర్ భారత్, ఇండోనేషియా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. (చదవండి: గెలాక్సీ ఎ32 5జీలో ఆండ్రాయిడ్ 11) "ఇన్‌స్టాగ్రామ్‌లో సంస్కృతి, సంప్రదాయాలను, తమ ఆలోచనలను లైవ్ రూమ్స్ ద్వారా క్రియేటర్ లు వ్యక్త పరచడానికి మా వంతు సహకారం అందిస్తాం. రీల్స్ ప్రారంభం నుండి రోల్ అవుట్ వరకు, భవిష్యత్ ఉత్పత్తులను రూపొందించే విధానంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది ”అని ఫేస్బుక్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్ అన్నారు. ఇన్స్టాగ్రామ్ లైవ్ రూమ్ ఫీచర్‌ను ఉపయోగించడానికి ముందుగా ఇన్‌స్టాగ్రాంలో యువర్ స్టోరీలో ఉన్న ప్లస్ సింబల్‌పై క్లిక్ చేయాలి. కింద ఉన్న ఆప్షన్స్‌లో లైవ్ కెమెరా సెలెక్ట్ చేసి సెషన్ పేరు టైప్ చేయాలి. తర్వాత లైవ్ ఆన్ చేసి కింద ఉన్న వీడియో కెమెరా సింబల్‌పై క్లిక్ చేసి గెస్ట్‌లను లైవ్‌లో యాడ్ చేసుకోవచ్చు. కేవలం లైవ్ లో ఉన్న గెస్ట్‌లను మాత్రమే ఆడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లైవ్ రూమ్ లో మాత్రమే ముగ్గురు అతిథులను ఆడ్ చేయడానికి అవకాశం ఉంది. -
11.5 కిమీ.. 9 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ – సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ మధ్య మార్గం.. అనునిత్యం రద్దీగా ఉంటుంది.. ఈ మార్గంలో వాహనాల సరాసరి స్పీడు గంటకు 25 కిలోమీటర్లు మించదు.. పగటి పూట, పీక్ అవర్స్‌లో ఆ వేగం 20 కిలో మీటర్లకు చేరదు. అయితే ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ మూడు లైవ్ ఆర్గాన్స్ కోసం నగర ట్రాఫిక్ పోలీసులు శనివారం ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా ఈ 11.5 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 9 నిమిషాల్లో అధిగమించింది. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్ పోలీసుల నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ తెలిపారు. వీరి కృషిని అభినందిస్తూ నగర కొత్వాల్ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. ఉదయం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలోని పశ్చిమ, ఉత్తర మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ శనివారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ రోగికి కిడ్నీ, లంగ్స్, లివర్ మార్పిడి చేయాల్సి ఉందని, ఆ శస్త్ర చికిత్స ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా.. డోనర్ ఇస్తున్న ఆ అవయవాలు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరనుంది అన్నది వాటిలో వినిపించిన సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఉదయం 8 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలయ్యాయి. టీసీసీసీ నుంచి నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన అవయవాలతో కూడిన బాక్స్‌లను తీసుకువెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 11.5 కిలోమీటర్ల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లేందుకు సిద్ధమైంది. అలా నే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారు లు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించ డానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద యం 8 గంటల నుంచి వీరంతా తీవ్ర ఉత్కంఠతో గడిపారు. ఇదీ ప్రయాణించిన మార్గం.. శనివారం ఉదయం 9 గంటలకు ‘లైవ్ ఆర్గాన్ బాక్స్’లతో కూడిన అంబులెన్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి పంజగుట్ట, బేగంపేట రసూల్‌పురా, ప్రకాష్‌నగర్ మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.09 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి చేరింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో కేవలం 9 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. ఈ కాసేపు అంబులెన్స్ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. విలువైన ప్రా ణం కాపాడేందుకు ట్రాఫిక్ పోలీ సులు చూపిన చొరవను ఆ యా ఆస్పత్రి యాజమాన్యాలు కొనియాడాయి. -
పారా మిలటరీ సిబ్బంది లైవ్ లొకేషన్
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారా మిలటరీ దళాల్లో రెండు కరోనా పాజిటవ్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటి నుంచి పనిచేస్తున్న(వర్క్ ఫ్రం హోం), సెలవుల్లో ఉన్న పారా మిలటరీ దళాల సిబ్బంది వాట్సాప్ లైవ్ లోకేషన్ ద్వారా తమ జాడ తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) విభాగం ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలు అప్పగించింది. సెలవులను, ఇంటి నుంచి పని చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సంబంధిత పారా మిలటరీ సిబ్బంది వారి ఇళ్లలోనే ఉండేలా చూడడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని సెంట్రల్ అర్మ్డ్ పోలీసు ఫోర్స్(సీఏపీఎఫ్) కమాండర్ ఒకరు తెలిపారు. -
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యక్షం
బెంగళూరు: కర్ణాటకలో కొద్ది వారాలుగా కనిపించకుండా పోయిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం అకస్మాత్తుగా అసెం బ్లీలో ప్రత్యక్షమయ్యారు. వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు కాంగ్రెస్ సిఫారసు చేసిన రెండు రోజులకే వారు నలుగురు ప్రత్యక్షం కావడం గమనార్హం.కాంగ్రెస్ సభాపక్ష సమావేశాలకు హాజరు కావాలంటూ ఇచ్చిన ఆ పార్టీ విప్ ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ కొద్ది వారాలుగా రమేశ్ జారకిహోళి, ఉమేశ్ జాదవ్, బి.నాగేంద్ర, మహేశ్ కుమతళ్లి అనే నలుగురు ఎమ్మెల్యేలు కనిపించకుండా పోయారు. ఈనెల 6 నుంచి జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కావట్లేదు. వీరు నలుగురు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారని భావిస్తున్నారు. వీరిని తమ వైపు తిప్పుకొని జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డిసెంబర్ 22న జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రమేశ్ జారకిహోళిని మంత్రి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి ఈ నలుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ‘అసంతృప్తితో ఉన్నానన్న విషయా న్ని నేను ఖండించట్లేదు. కానీ ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. ఫిబ్ర వరి 24న జరగనున్న నా కుమార్తె పెళ్లి పనుల కోసం ముంబై వెళ్లాను’ అని రమేశ్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలు ప్రత్యక్షం కావడంతో అధికార పక్షం కాస్త ఊపిరి పీల్చుకుంది. -
ఉత్తరప్రదేశ్ ఆలీగఢ్‌లో లైవ్ ఎన్కౌంటర్
-
సగం కుళ్లిపోయినా ఆమె బతికే ఉంది
వాషింగ్టన్ : దాదాపు పాడుబడిపోయి కంపుకొడుతున్న ఓ ఇంట్లో అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఓ మహిళను అమెరికా అగ్నిమాపకశాఖ పోలీసులు గుర్తించారు. ఓ వ్యాధి కారణంగా బాగా లావెక్కి కదలలేకుండా మంచాన పడిపోయి ఉన్న ఆమెను చూసి దుఃఖితులయ్యారు. పైగా ఆమె కాళ్లకు పురుగులు పట్టి దాదాపు సగం వరకు కుళ్లిన స్థితిలోకి చేరడంతో ఆమె చనిపోయిందనే తొలుత భావించిన పోలీసులు ఆ తర్వాత ఆమె బతికి ఉండటాన్ని చూసి శర వేగంగా ఆస్పత్రికి తరలించారు. తమ జీవితంలో ఇలాంటి కేసు చూడలేదంటూ వర్ణించారు. వివరాల్లోకి వెళితే.. నార్తర్న్ జార్జియాలోని ఓ ఇంట్లో ట్రాసీ సారెల్స్ (50) అనే మహిళ చాలా రోజులుగా మంచంలో కదలేని స్థితిలో పడి ఉంది. ఆమెకు టెర్రి సారెల్స్ (54) అనే భర్తతోపాటు, క్రిస్టియాన్ (18) అనే కుమారుడు ఉన్నాడు. ఆమె మంచానికి పరిమితం కావడంతో ఆమెను పూర్తిగా వారు నిర్లక్ష్యం చేశారు. ఎంతలా అంటే ఆమె పడి ఉన్న మంచంపై కనీసం బెడ్‌షీట్ లేదు. పైగా ఆ గది మొత్తం దుర్గందంతో నిండిపోయింది. ఆమె భర్త ఉపయోగించుకునే గది కంప్యూటర్ వద్ద తప్ప మరెక్కడా కూడా శుభ్రత అంటూ లేదు. ఓ చెత్త కర్మాగారంగా ఆ ఇల్లు మారిపోయింది. వంటగదిలో సీలింగ్ వరకు చెత్త పేరుకుపోయింది. ఆమె ముఖంపై ప్లాస్లిక్ పేపర్లు, తదితర ఇతర వస్తువులు వేసి ఉంచారు. ఏ ఒక్కరు కూడా కనీసం ఆమెను చూసేందుకు వెళ్లనట్లు కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. ఇంత నిర్లక్ష్యం ప్రదర్శించిన భర్తపై కేసులు నమోదు చేశారు. అయితే, ఆమె కుమారుడు స్పందిస్తూ తమ వద్ద అసలు డబ్బులు లేవని, ఏ ఒక్కరికీ ఉద్యోగం లేకపోవడంతోనే ఎలాంటి సపర్యలు చేయలేకపోయామంటూ వివరించాడు. కాగా, ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గాలింపులు చేపట్టిన పోలీసులు ట్రాసీని గుర్తించారు. -
జియో సృష్టించిన మరో అద్భుతం
క్రికెట్ ప్రేమికులకు శుభవార్త అందిస్తూ.. సాంకేతికతలో విప్లవంలా జియో మరో కొత్త శకం ఆరంభించింది. జియో లైవ్ టీవీ యాప్‌లో మార్పులు చేస్తూ.. ప్రస్తుత మ్యాచ్ చూసే విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. జియో ప్రవేశపెట్టిన ఈ పరిజ్ఞానం ద్వారా క్రికెట్ మ్యాచ్‌ను ఐదు కెమెరా యాంగిల్స్‌లో వీక్షించవచ్చు. అంతే కాకుండా ఆడియోను గ్రౌండ్ మధ్య వికెట్ల వద్ద ఉన్న మైక్ నుంచి వినోచ్చు. మనకు కావాల్సిన భాషలో (ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ, తమిళ) కామెంట్రీని వినోచ్చు. ఇంకా, మ్యాచ్ స్కోర్, బంతులు, రన్‌రేట్, వంటి గణంకాలను మనకు నచ్చినప్పుడు, కావాల్సినప్పుడు ఒక్క క్లిక్‌తో చూసుకోవచ్చు. మ్యాచ్‌లో ఎదైన బంతిగాని, వికెట్ గాని, సిక్స్‌గాని మిస్ అయితే క్యాచ్ అప్ ద్వారా మళ్లీ వెనక్కి వెళ్లి వీక్షించవచ్చు. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లతో కొత్త జియో లైవ్ టీవీ యాప్ అందుబాటులోకి రానుంది. క్రీడల్లో ఏఆర్, వీఆర్, ఇమ్మెర్సివ్ వ్యూయింగ్లో రాబోయే రోజుల్లో జియో విశేషమైన అనుభవాన్ని అందించడానికి కొనసాగుతుంది అని జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ అన్నారు. ఇటివల జియో ఉత్తమ మొబైల్ వీడియో కంటెంట్ ప్రపంచ ప్రఖ్యాత గ్లోబల్ మొబైల్ (గ్లిమో) అవార్డును గెల్చుకుంది. మార్చి నుంచి కొలంబోలో జరిగే టీ20 క్రికెట్ సిరీస్ నిదహస్ ట్రోఫీకి ప్రత్యేకమైన డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మ్యాచ్ వీక్షణలో కొత్త అనుభూతిని పొందటానికి జియో టీవీ యాప్‌ను అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది. లేని వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. -
సెల్ఫోన్లోనే సీసీ కెమెరా లైవ్..
నగరంలో నేరాల నియంత్రణ, బాధితులను ఆదుకోవడం, సత్వరం స్పందించడం, సమన్వయం, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడం వంటి చర్యల కోసం పోలీసు అధికారిక యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఆధునిక హంగులు జోడిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు తమ సెల్ఫోన్లోనే కోరుకున్న ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను లైవ్‌లో చూసే ఆస్కారం కల్పిస్తున్నారు. ‘సీసీ కెమెరా లైవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చే ఈ సౌకర్యం ద్వారా ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు తన సెల్ఫోన్ల ద్వారానే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. న్యూ ఇయర్ డే అయిన జనవరి 1 నుంచి ఈ ‘లైవ్’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. సాక్షి, సిటీబ్యూరో: చిరాగ్ అలీ లైన్‌లోని ఓ చోట ఘర్షణ జరుగుతోందని అబిడ్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ ప్రాంతంలో పరిస్థితి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రస్తుతం సిబ్బందిని పంపాల్సి ఉంటుంది. వారు అక్కడకు వెళ్ళి, పరిశీలించి, సమాచారం అందించేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు. హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఓ నిరసన కార్యక్రమం నేపథ్యంలో అధికారులు కొందరు సిబ్బందిని మోహరించారు. అయితే ధర్నాకు ఊహించిన సంఖ్య కంటే ఎక్కువ మందే వచ్చారు. ఈ విషయం క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది తెలిపే వరకు ఉన్నతాధికారులకు తెలియదు. దీంతో అదనపు సిబ్బంది మోహరింపునకు జాప్యం జరుగుతోంది. ఇలాంటి ఇబ్బందుల్ని తొలగించేందుకు నగర పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పోలీసు అధికారిక యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఆధునిక హంగులు జోడిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఇవి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే..ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు తమ సెల్ఫోన్లోనే కోరుకున్న ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను లైవ్‌లో చూసే ఆస్కారం కలుగుతుంది. ‘సీసీ కెమెరా లైవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చే దీంతో ఉన్నతా«ధికారులు సైతం ఎప్పటికప్పుడు తన సెల్ఫోన్ల ద్వారానే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. సత్వర స్పందన, సమన్వయం, సమాచారమార్పిడి కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఈ తరహా హంగుల్ని చేరుస్తున్నారు. న్యూ ఇయర్ డే అయిన జనవరి 1 నుంచి ఈ లైవ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. క్రైమ్ మ్యాపింగ్‌లో హంగులు జోడిస్తూ... నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే సమయంలో ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి ‘క్రైమ్ మ్యాపింగ్’లో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ విభాగం ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఠాణాలు, సెక్టార్లు, బీట్లు తెలిసేలా సరిహద్దుల్నీ పొందుపరిచారు. దీన్ని మరింత అప్డేట్ చేస్తూ.. ఆయా ఠాణా పరిధిలో ఉన్న సున్నిత ప్రాంతాలు, మతపరమైన కట్టడాలు, సమస్యాత్మక ప్రాంతాలను మార్కింగ్ చేశారు. మ్యాప్ మీదే ‘సీసీ కెమెరాలు’... సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. కొన్ని రకాలైన నేరాలు జరిగినప్పుడు అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లోని ‘క్రైమ్ రాడార్’లోకి ప్రవేశిస్తే చాలు. ఈ నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది. తాజా దృశ్యాలూ కనిపించేలా... పోలీసుస్టేషన్ పరిధిలో చోట ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయనో, పెద్ద ప్రమాదం జరిగిందనో పోలీసుస్టేషన్‌కు సమాచారం వచ్చినప్పుడు ఉన్నతాధికారులు ఘటనాస్థలిలో పరిస్థితుల్ని ఎంత త్వరగా తెలుసుకోగలిగితే.. పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యల్ని అంతం వేగంగా చేపట్టే అవకాశం ఉంటుంది. దీనికోసం కేవలం సిబ్బంది పైనే ఆధారపడకుండా ‘సీసీ కెమెరా లైవ్’ సదుపాయం యాప్‌లో కల్పించారు. క్రైమ్ రాడార్‌లో కనిపించిన కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు.. దాని ఫీడ్ లైవ్‌లో కనిపించనుంది. ఈ సౌకర్యం యాప్ ద్వారా సిబ్బంది, ఉన్నతాధికారుల సెల్ఫోన్లలోకూ అందుబాటులోకి వస్తోంది. అన్ని స్థాయిల్లో సిబ్బందికీ, అన్ని ప్రాంతాల్లో ఉన్న ఫీడ్‌ను లైవ్‌లో చూసే సౌకర్యం కల్పిస్తే... కొన్నిసార్లు ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సిబ్బంది, అధికారులు విధులు నిర్వర్తించే ప్రాంతాల ఆధారంగా వారి ఫోన్లలోకి లింకేజ్ ద్వారా అందుబాటులో ఉంచాల్సిన లైవ్ ఫీడ్లను నిర్ణయిస్తున్నారు. ఉన్నతాధికారులకు మాత్రం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలతో లింకేజ్ ఇస్తారు. -
చిన్నారులతో స్పైడర్ విన్యాసాలు..!
స్పైడర్ మ్యాన్ చిత్రాలకు చాలా క్రేజ్ ఉంటుంది. ఈ సిరీస్‌లో రాబోతున్న మరో చిత్రం ‘స్పైడర్‌మ్యాన్ హోమ్ కమింగ్’ వచ్చే నెల 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరా బాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ, భాగ్యనగరంలో పలు చోట్ల ‘స్పైడర్ మ్యాన్’ ప్రత్యక్షమై, పిల్లలను సర్ప్రైజ్ చేసింది. పిల్లలందరూ స్పైడీతో ఫొటోలు దిగారు. మార్వెల్ కామిక్స్, కొలంబియా పిక్చర్స్ తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. -
మేయర్ లైవ్ షోలో అనుకోని అతిథి
-
మేయర్ లైవ్ షోలో అనుకోని అతిథి
లైవ్ షోలల్లో ఈ మధ్య ఆసక్తికరమైన దృశ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ మధ్య ఓ టీవీ చానెల్‌కు ఓ తండ్రి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అతడి చిన్న పిల్లలు దూసుకొని వచ్చి కాసేపు ఆ కార్యక్రమం దృష్టి మరల్చగా సరిగ్గా అలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుంది. లాత్వియా రాజధాని రిగాకు మేయర్‌గా పనిచేస్తున్న నిల్స్ ఉసాకోవ్స్ ఆన్లైన్ ద్వారా లైవ్ షోలో ఉండగా అందులోకి అనుకోని అతిథిగా ఓ నల్లటి పిల్లి వచ్చి ఆయన ముందు పెట్టిన గ్లాస్‌లోని నీటిని తాగి అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి వరకు పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న ఆయన ఒక్కసారిగా ఆగిపోయి ఆ పిల్లిని శ్రద్దగా చూసి నవ్వుతూ దానిని పంపించి తిరిగి విషయంలోకి వెళ్లారు. టేబుల్‌పై ల్యాప్‌టాప్ పెట్టుకొని నిల్స్ ఉండగా పక్కన ఓ గ్లాస్, ఆయన వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎదురుగా లైవ్ కెమెరా. ప్రైవేటు ల్యాండ్ ఓనర్స్‌తో వారి పెట్టుబడులపై వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమంలో నిల్స్ ఉండగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. -
ఈ హింస నా వల్లకాదు..బతకాలని లేదు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలికి చెందిన ఓ మహిళ ఎదుర్కొన్న అమానుషమైన లైంగిక దాడి, భయంకరమైన అనుభవాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. దళిత మహిళ(46) అటు జీవితంతో,ఇటు ఆధిపత్య వర్గానికి చెందిన మృగాళ్లతో అలుపెరుగని పోరాటం చేస్తోంది. ఓడిపోతున్నా..పడి లేచినా కెరటంలా నిలబడి యాసిడ్ బాధితులకు స్ఫూర్తిగా నిలిచింది. అయినా తానీ హింసను భరించ లేనంటోంది. ఈ బాధను సహించలేను.. తనకు జీవించాలనే కోరిక చచ్చిపోయిందంటోంది. న్యాయం జరుగుతుందనే ఆశ చచ్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. శరీరమంతా వెక్కిరిస్తోన్న యాసిడ్ గాయాలు కంటే మించిన బాధతో హాస్పిటల్ బెడ్ మీద విలవిల్లాడుతోంది. గ్యాంగ్ రేప్ , ఐదు యాసిడ్ దాడుల హింసకు బలైన ఈ మహిళ విషాద గాధ వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన ఈ బాధితురాలు 9 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతోంది. ఓ భూ వివాదంలో 2008 లో ఠాకూర్ యువకుల ముఠా ఈమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ధైర్యంగా నిలబడి ఈ కేసులో నిందితులను అరెస్టు చేయించింది. దీంతో కక్షగట్టిన ఆ దుర్మార్గులు 2011 , 2012లో రెండుసార్లు, 2013 యాసిడ్ దాడి చేశారు. దీనికి శరీరమంతా కప్పేసిన కాలిన గాయాలే సాక్ష్యాలు. యాసిడ్ బాధితులో కోసం ఏర్పాటు చేసిన షీరోస్ కెఫేలో పనిచేస్తున్న ఆమె మరోసారి విషాదం వెంటాడింది. హోలీ పండుగకి ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలి లో ని ఇంటికి వెళ్లి తిరిగివ లనోవ్ తిరిగి వస్తుండగా మార్చి 24న రైలులో మరోసారి యాసిడ్ దాడి చేశారు. త్వరలో ఈ కేసు విచారణకు రానున్న నేపథ్యంలో కాపు కాసిన ప్రధాన నిందితులు గుడ్డూసింగ్, బొడ్డు సింగ్ ఆమెపై దాడిచేసి , నోటిలో బలవంతంగా యాసిడ్ కుమ్మరించారు. దీంతో ఆమె నోరు, దవడ, గొంతు, ఆహార నాళిక కాలిపోయాయి. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమె ఐదురోజుల తర్వాత కనీసం నోరు తెరవలేని స్థితిలో తన ఘోషను కేవలం సైగల ద్వారా భర్తకు వివరించింది. కాగా లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ కాలేజీ ఐసీయూలో చికిత్స పొందుతున్న గ్యాంగ్ రేప్ బాధితురాలిని సీఎం యోగి ఆదిత్యనాథ్ పరామర్శించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద ఆమెకు రూ.1లక్ష పరిహారాన్ని ప్రకటించారు. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికైనా ఈ మహిళకు న్యాయం జరుగుతుందా..కాలమే తేల్చాలి. -
ఫేస్బుక్లో కలెక్టర్ లైవ్
లోకల్ వైర్ యాప్‌తో యాక్సస్ నేడు శ్రీకారం ఐటీ ఉద్యోగి వినూత్న ఆలోచన పెదగంట్యాడ: మన చుట్టూ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేని పరిస్థితి అన్ని చోట్లా నెలకొంది. కొంత మంది ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న వారు స్థానిక సమస్యలు గురించి అధికారులతో మాట్లాడేంత సమయం ఉండదు. సమస్య అధికారులకు తెలిపితే ఫలితం ఉంటుందేమో అనే సందేహం ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకుని వివరించేంత తీరిక ఎవరికీ లేదు. ఈ ఆలోచనకు సమాధానంగా రాకేశ్ అనే ఐటీ ఉద్యోగి ఫేస్బుక్లో జిల్లా కలెక్టర్‌తో లైవ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ప్రజల్లోకి ఫేస్బుక్ ద్వారా రానున్నారు. ఉపయోగం ఫేస్బుక్ లైవ్ విత్ అవర్ కలెక్టర్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది వేర్వేరు సమస్యలకు సులభ పరిష్కారం లభించవచ్చు. చాలా మందికి ఉండే సందేహాలు నివత్తి అవుతాయి. ఎలా చేస్తారు... లోకల్ వైర్ యాప్ ఉంటే ౖyð రెక్ట్ యాక్సిస్ కావచ్చు. లేదంటే ఫేస్బుక్ పేజ్‌లో లోకల్వైర్ యాప్ అని టైప్ చేసినా లాగిన్ అవ్వొచ్చు. కలెక్టర్ వద్ద కెమెరాతో పాటు లోకల్వైర్ ప్రతినిధి ఉంటారు. వచ్చిన ప్రశ్నను ఆయనకు షేర్ చేస్తారు. అభ్యంతరకరమైన ప్రశ్నలు ఉన్నా, రిపీటెడ్ ప్రశ్నలు ఉన్నా వెంటనే తొలగించి తర్వాత ప్రశ్నకు వెళ్తారు. గంటపాటు ఈ కార్యక్రమం ఉంటుంది. వైర్ యాప్ ఆదరణతోనే.. ఇంతకు ముందు లోకల్ వైర్ యాప్‌ను స్థానిక సమస్యలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మొదలు పెట్టాను. అది మంచి ఆదరణ పొందింది. లోకల్ సమస్యలు తెలిసినా పరిష్కారం కావాలని కొంత మంది అడిగారు. అలాంటి వారికోసం కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ మేరకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను కలిసి పోస్టర్ రిలీజ్ చేశాం. ఒక వేళ ఈ ఐడియా వర్కౌట్ అయితే మరికొంత మంది మమ్మల్ని ఫాలో అవుతారు. అది చాలు మేము విజయం సా«ధించాం అని చెప్పడానికి. –రాకేశ్ లోకల్ వైర్...(సీఈవో) -
వెస్టిండీస్‌తో టీ20 మ్యాచ్‌లు యప్టీవీలో..
ఇంటర్నెట్ ఆధారిత టీవీ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ యప్ టీవీ.. అమెరికా, కెనడా, కరీబియన్ దీవుల్లోని క్రికెట్ ప్రేమికులను అలరించనుంది. ఈ మేరకు ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్‌లను యప్టీవీలో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ సీఈవో ఉదయ్ రెడ్డి వెల్లడించారు. ఫ్లోరిడా వేదికగా ఆగస్ట్ 27, 28 తేదీలలో ఇండియా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. యప్‌టీవీ గతంలోనూ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడానికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. -
వన్యప్రాణులనుంచీ రక్షణకు టోల్ ఫ్రీ నెంబర్..
కర్ణాటకః అడవి జంతువులు తమ పంటపొలాలను నాశనం చేస్తున్నాయని, తమ ఖరీదైన పశువులను పులి చంపేసిందని, చెరకు పంటను ఏనుగుల గుంపు తొక్కేసిందంటూ ఆందోళన చెందే మారుమూల గ్రామాల ప్రజలను ఆదుకునేందుకు వైల్డ్ సేవా కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చారు. బాధితులకు ప్రభుత్వ పరిహారం వెంటనే అందేట్లుగా గ్రామసస్థుల్లో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో కొందరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, సమస్యలను వెంటనే తెలిపేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. లబ్ధిదారులకోసం 'వైల్డ్ సేవ' ను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో అందుబాటులోకి తెచ్చారు. కార్యక్రమంలో భాగంగా గ్రామస్థుల్లో అవగాహన కల్పించేందుకు స్థానికులు కొందరికి 'ఫీల్డ్ ఏజెంట్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తాము నష్టపోయామంటూ రైతులు దరఖాస్తులు చేసుకొని కార్యాలయాలచుట్టూ చెప్పులరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా.. లబ్ధిదారులకు వెంటనే పరిహారం అందేలా 'వైల్డ్ సేవ' కార్యక్రమం చేపట్టారు. నష్టపోయిన రైతులకు కేవలం నాలుగు రోజుల్లోనే పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైల్డ్ లైఫ్ కంజర్వేషన్ సొసైటీ (డబ్ల్యూసీఎస్) ఆధ్వర్యంలో ఓ లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ అటవీ శాఖతో కలసి కర్ణాటక, తమిళనాడుల్లోని సుమారు 284 గ్రామాల్లో వన్యప్రాణులనుంచి జనజీవనాన్ని రక్షించడంతోపాటు... వైల్డ్ సేవ కార్యక్రమంతో అంతరించిపోతున్న అడవి జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా జనాభా కలిగిన అటవీ ప్రాంతాలమీత దృష్టి సారించి.. అక్కడి ప్రజలకు, వన్యప్రాణులకు నష్టం కలగకుండా ప్రయత్సిస్తున్నారు. సుమారు 20 వేల రూపాయల ఖరీదు చేసే అవును పులి చంపేయడంతో పరిహారంకోసం దరఖాస్తు చేసుకున్నఓ రైతు.. వైల్డ్ సర్వీస్ తో 9 వేల రూపాయలు పొందాడు. అయితే పరిహారం తక్కువ వచ్చినా.. తనకు సంతృప్తిగానే ఉందన్న అతడు... గతంలో పరిహారంకోసం అధికారులచుట్టూ, కార్యాలయాలచుట్టూ తిరగడంతోపాటు పరిహారం పొందేందుకు డబ్బు ఎదురు చెల్లించాల్సి వచ్చేదని తెలిపాడు. అదీకాక ముందుగా పంటదాడులు, చనిపోయిన పశువుల ఫొటోలు తీసుకొని, గంటలకొద్దీ ప్రయాణం చేసి అటవీశాఖ కార్యాలయాలకు వెళ్ళాల్సి వచ్చేదని, సమయానికి అధికారులు లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని చెప్తున్నాడు. 'వైల్డ్ సేవ' కార్యక్రమం ప్రారంభమైన తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఏజెంట్ల ద్వారా సేవలు అందించడంతో వెంటనే పరిహారం పొందగల్గుతున్నట్లు స్థానిక రైతులు చెప్తున్నారు. అంతేకాదు 'వైల్డ్ సేవ' ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ తో తమకు జంతువులనుంచీ రక్షణతోపాటు, సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతోందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలను అడవిజంతువులు నాశనం చేశాయనో, పశువులను చంపేశాయనో గ్రామస్థులు, రైతులనుంచీ తమకు రోజుకు ఒక్క ఫోన్ కాల్ అయినా వస్తుంటుందని, ఒక్కో ఏజెంట్ కు సుమారు 20 కిలోమీటర్ల పరిథిలో ఉన్న 70 గ్రామాలనుంచీ ఫోన్లు వస్తాయని, వచ్చిన ఎనిమిది గంటల్లోపు అక్కడికి వెళ్ళి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తామని ఫీల్డ్ ఏజెంట్లు చెప్తున్నారు. ఏడుగురు ఫీల్డ్ ఏజెంట్లతో గత సంవత్సరం ప్రారంభించిన వైల్డ్ సేవా కార్యక్రమంలో భాగంగా పంటలు, ఆస్తుల నష్టం కేసుల్లో ఇప్పటిదాకా సుమారు 3,261 పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' తెలిపింది. దీంతోపాటు.. 148 వరకూ పులులు, అడవికుక్కలద్వారా నష్టపోయిన పశుసంపద, తీవ్ర గాయాలైన 11 మంది, ఇద్దరు చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన కేసులను పరిష్కరించినట్లు 'వైల్డ్ సేవ' నివేదించింది. -
మొక్కలతోనే మానవ మనుగడ
‘సాక్షి’దినపత్రిక ఏడీవీటీ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి కాల్వశ్రీరాంపూర్ : మెుక్కల పెంపకంతోనే మానవాళికి మనుగడ ఉంటుందని ‘సాక్షి’ దినపత్రిక ఏడీవీటీ డైరెక్టర్ కేఆర్పీ రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్‌లో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కాల్వరాంచంద్రా రెడ్డి ఘాట్ రోడ్డులో ఆదివారం ఆయన మొక్కలు నాటి మాట్లాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. అంతకు ముందు వారి తల్లిదండ్రులు కీ.శే.కాల్వరాంచంద్రారెడ్డి, లీలాదేవి సమాధులను దర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆయన సోదరుడు అశోక్ రెడ్డి, నాయకులు ఈశ్వరయ్య, గీట్ల రవీందర్ రెడ్డి, కొలవేన మల్లయ్య, పర్వతాలు, రాజేశం, తదతరులు పాల్గొన్నారు. -
జైల్లో ఉంటూ.. అరుదైన రికార్డు!
జైపూర్: జైలులో తండ్రితోపాటు కలిసి ఓపెన్ కారాగారంలో ఉంటూ ఓ కుర్రాడు ఐఐటీ సీటు సాధించాడు. జేఈఈ పరీక్ష పాసయ్యాడు. పూల్ చంద్ అనే వ్యక్తి ఓ నేరానికి సంబంధించి కోట ఓపెన్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఓపెన్ జైలులో కుటుంబ సభ్యులు ఉండేందుకు అనుమతి ఉండటంతో తండ్రితోపాటే అక్కడ ఉండేందుకు అతడి కుమారుడు పీయూష్ మీనా సిద్ధమయ్యాడు. పేదరికమే ఈ పరిస్థితికి దారితీసింది. తండ్రి వారించినా వినకుండా జైలులోనే 8 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు ఉండి వెలుతురు సరిగా రాని గదిలో ఉంటూ జేఈఈ పరీక్షలకు సన్నద్ధమై విజయాన్ని అందుకున్నాడు. తాజాగా విడుదలైన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షల్లో ఎస్టీ కేటగిరీ కింద 453వ ర్యాంక్ సాధించాడు. ఓపెన్ జైలులో కుటుంబసభ్యులను శిక్షను అనుభవించేవారితోపాటే ఉండనివ్వడంతోపాటు రోజూవారీ అవసరాల కోసం పనికి కూడా బయటకు వెళ్లి రావచ్చు. కాగా, తండ్రి పూల్ చంద్ కు ఇష్టం లేకపోయినా.. హాస్టల్, కోచింగ్ ఫీజులకు డబ్బు సరిపోకపోవడంతో పీయూష్ మీనా 2014 జులైలో జైలుకు వచ్చేశాడు. ఈ విషయంపై మాట్లాడిన మీనా తండ్రి బంధువులు, స్నేహితులు అందరిని సంప్రదించగా లక్ష రూపాయలు ఏర్పాటు అయ్యాయని కోచింగ్, హాస్టల్ ఫీజుకు రెండు లక్షలు అవసరమయ్యాయని తెలిపారు. ఎలాగైనా బిడ్డను చదివించుకోవాలని గతంలో ప్రభుత్వ టీచర్ అయిన తాను ప్రైవేట్ పాఠశాలల్లో టీచర్ గా ప్రయత్నిస్తే, నేరస్థుడిని కావడం మూలాన అవేమీ దొరకలేదని, దాంతో మెడికల్ స్టోర్ లో హెల్పర్ గా పనిచేసినట్లు వివరించారు. జేఈఈలో ర్యాంక్ సంపాదించడంపై మాట్లాడిన పీయూష్ మీనా.. మొదట్లో జైల్లో చదువుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉండేదని చెప్పాడు. కచ్చితమైన నిబంధనలు ఉండటంతో పాటు రాత్రి 11గంటలకు లైట్లన్నీ ఆర్పివేస్తారని తెలిపాడు. జైలు గది మరీ చిన్నదిగా ఉండటంతో పాటు వెలుతురు కూడా ఎక్కువగా వచ్చేది కాదని చెప్పాడు. తాను రోజూవారీ సిలబస్ ను పూర్తి చేయడానికి చదువుకునే సమయంలో తన తండ్రి బయట ఉండేవారని వివరించాడు. ర్యాంక్ రావడంపై ఆనందం వ్యక్తం చేసిన పీయూష్ శిక్షాకాలం ముగిసిన తర్వాత తండ్రి బాగోగులు చూసుకోవడమే తన ధ్యేయమని తెలిపాడు. మొత్తం 12 ఏళ్ల కారాగార శిక్షను అనుభవిస్తున్న పూల్ చంద్ ఇప్పటికి 10ఏళ్ల శిక్షాకాలాన్ని పూర్తి చేశాడు. -
సైనికుడి ముఖం నుంచి గ్రనేడ్ తొలగించిన వైద్యులు!
అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఓ సైనికుడి ముఖంలోకి లైవ్ గ్రనేడ్ చొచ్చుకుపోయింది. వెంటనే అప్రమత్తమైన వైద్యులు తక్షణ వైద్యం అందించి అతడ్ని ప్రాణాలతో కాపాడటంతోపాటు, ముఖంలోకి చొచ్చుకు పోయిన లైవ్ గ్రనేడ్‌ను విజయవంతంగా బయటకు తీశారు. బాధితుడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కలగకుండా గ్రనేడ్‌ను ముఖం నుంచి తొలగించి సఫలమయ్యారు. ఇందుకోసం కొలంబియా సర్జన్లు గంటల తరబడి కష్టపడ్డారు. ఆపరేషన్ కోసం సంఘటన స్థలం నుంచీ సైనికుడిని బొగోటా మిలటరీ ఆస్పత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. ఇలా తరలించేందుకు దాదాపు 8 గంటల సమయం పట్టింది. అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్ ద్వారా తరలించాల్సిన బాధితుడిని, అతడి ముఖంలో ఉన్న గ్రనేడ్ పేలే ప్రమాదం ఉండటంతో ఆలస్యం అయినా రోడ్డు మార్గంలోనే తరలించాల్సి వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. ప్రమాద పరిస్థితుల్లో అప్రమత్తమై అత్యవసర చికిత్స అందించాల్సి ఉండగా... అతడి పరిస్థితిని బట్టి అలా జరగలేదని, ఆస్పత్రి సర్జన్ల సూచనల మేరకు వైద్యులంతా కష్టపడి ఆపరేషన్ చేయడంతో పేషెంట్ కోలుకున్నాడని ఆస్పత్రి చీఫ్ సర్జన్ ఓ ప్రకటనలో తెలిపారు. సదరు సైనికుడు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు లాంచర్ యాక్టివేట్ అవ్వడంతో గ్రనేడ్ అతడి కుడి దవడలోకి దూసుకుపోయిందని అధికారులు తెలిపారు. -
యువతి ఆత్మహత్య ప్రత్యక్ష ప్రసారం
పారిస్: ఓ ఫ్రెంచ్ యువతి తన ఆత్మహత్యను పెరిస్కోప్ అనే యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసిన సంఘటన దక్షిణ పారిస్‌లోని ఇగ్లీలో చోటుచేసుకుంది. పారిస్‌కు చెందిన 19 ఏళ్ల యువతి తాను అత్యాచారానికి గురయ్యానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఫోన్లో రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ యువతి మంగళవారం ఇగ్లీలోని సబర్బన్ రైలు కిందపడి మృతి చెందినట్లు వెల్లడించారు. పోలీసులు ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, అందులోని వీడియోను పరిశీలిస్తున్నారు. అలాగే లైవ్‌లో ఈ ఆత్మహత్యను వీక్షించినవారిని విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతురాలి పేరును మాత్రం పోలీసులు వెల్లడించలేదు. కాగా పెరిస్కోప్ యాప్ ట్విట్టర్ ఖాతా ద్వారా లైవ్ వీడియోలను అనుమతించే ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్. లైవ్ వీడియోలను వీక్షించేందుకు, షేర్ చేయడానికి ఈ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంటుంది. -
శాకాహారంతోనే లైఫ్ ఎక్కువ
ఫోనిక్స్: శాకాహారులకు శుభవార్త! 17 ఏళ్లపాటు మాంసం జోలికి వెళ్లకుండా కేవలం శాకాహారమే తీసుకుంటే మనిషి ప్రామాణిక జీవితకాలం దాదాపు నాలుగేళ్లు పెరుగుతుందట. ఆరిజోనాలోని మాయో క్లినిక్ 15లక్షల మందిపై తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో మనిషి ప్రామాణిక జీవితకాలంలో 3.6 సంవత్సరాలు పెరుగుతుందని తేలింది. రోజూ మాంసం, ముఖ్యంగా శుద్ధి చేసిన మాంసాన్ని ఆరగించిన వాళ్లే తొందరగా మరణిస్తారని సర్వే తేల్చింది. గోమాంసం, పంది మాంసం, గొర్రె మాంసంతోపాటు బేకన్, సాసేజ్, సలామి, హాట్ డాగ్స్ తినేవారే త్వరగా మృత్యువాత పడుతున్నారని తాము నిర్వహించిన ఆరు రకాల సర్వేలో తేలిందని మాయో క్లినిక్ వర్గాలు తెలిపాయి. ఇలాంటి మాంసాహారం వల్ల కార్డియో వాస్కులర్, ఇస్కీమిక్ గుండె జబ్బులు వస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. మాంసాహారానికి బదులుగా శాకాహారాన్ని తీసుకోవాల్సిందిగా సలహాలివ్వాలని ఫిజిషియన్లు, డైటీషియన్లను వారు కోరారు. తక్కువ మాంసం తీసుకునే వారు ఎక్కువ మాంసం తీసుకునే వారితో పోలిస్తే 25 నుంచి 50 శాతం వరకు ప్రాణాపాయం తక్కువగా ఉందని ఐదు లక్షల మంది ఆహార అలవాట్లపై జరిపిన అధ్యయనంలో తేలిందని ఆ వర్గాలు వివరించాయి. ఈ అధ్యయన వివరాలను 'అమెరికన్ ఆస్టియోపాతిక్ అసోసియేషన్' జర్నల్‌లో ప్రచురించారు. -
ఐదువేల సంవత్సరాలు కలిసి బతికారు
టోక్యో: గత చరిత్ర మొత్తం కూడా సంఘర్షణలతో నిండుకొని రక్తపు సిరాతో రాయబడిందని చెప్తుంటారు. బలంకలవాడు బలహీనుడిని చిత్రహింసలు పెట్టి పెత్తనం చెలాయిస్తూ తన కుటుంబాన్ని సమాజాన్ని ప్రభావితం చేసే వ్యవస్థగా తయారుచేసుకున్నాడని కూడా చెప్తారు. ఈ క్రమంలోనే సమాజ నిర్మాణంలో, సంస్కృతి, సంప్రదాయాల్లో విభిన్న మార్పులు రావడం జరిగిందని, సమాజాల విచ్ఛిన్నతకు ప్రధాన కారణం యుద్ధాలవంటి ఘర్షణలే అని చెప్తారు. కానీ, ఒక్కసారి జపాన్‌లో క్రీస్తు పూర్వం కిందటి చరిత్ర చూస్తే మాత్రం పై విషయాలకు పూర్తి భిన్నం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేటగాళ్లంతా కూడా ఒకే సమాజంగా రూపొంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదువేల సంవత్సరాలపాటు కలిసి కట్టుగా జీవించారని ఓ అధ్యయనం వెల్లడిస్తోంది. జపాన్‌కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు క్రీస్తు పూర్వం 14,500 నుంచి క్రీస్తు పూర్వం 300 వరకు ఉన్న చరిత్రను పరిశీలించారు. అందులో భాగంగా ఆ మధ్య కాలంలో జీవించి చనిపోయినవారి అవశేషాలను పరిశీలించారు. ఇందులో ముఖ్యంగా వారి ఎముకలపై ప్రశ్నలు జరపగా ఏ ఒక్కరికీ కూడా గాయాలు అయినట్లు బయటపడలేదు. ఇలా దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలంలో లభించిన ఎముకలను పరిశీలించగా ఇలాంటి ఆధారాలే కనిపించాయి. ఆటవిక జీవితాన్ని అనుభవిస్తూ వేటపై ఆధారపడి జీవించే అప్పటి వారే ఎలాంటి ఘర్షణలకు దిగకుండా హాయిగా బతికేశారని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతోపాటు అప్పట్లోనే సమాజ సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా వారు జీవించారని కూడా చెప్తున్నారు. -
ఆనందం ఆయుష్షునివ్వదు!
నవ్వడం భోగం నవ్వలేకపోవడం రోగం.. ఇంకా చెప్పాలంటే సంతోషం సగం బలం. ఇలా ఆనందంగా, హాయిగా ఉంటే అనారోగ్యం దరిచేరదని చాలామంది భావిస్తారు. ఆనందం ఆరోగ్యంపై అద్భుత ప్రభావం చూపుతుందని, మానసికోల్లాసాన్ని కలిగించి, మనసుకు ప్రశాంతతనిస్తుందని నమ్మేవారంతా ఏకంగా నవ్వుల దినోత్సవాలను జరపడమేకాక, లాఫింగ్ క్లబ్బుల వంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే అవన్నీ వట్టి నమ్మకాలేనంటున్నారు లండన్ అధ్యయనకారులు. అనారోగ్యం, ప్రాణభయం వంటివి అసంతృప్తిని కలిగించి ఆయుక్షీణం కలిగిస్తాయేమో కానీ, ఆనందం వల్ల ఆరోగ్యం చేకూరే అవకాశం లేదంటున్నారు. లండన్‌లో నిర్వహించిన మిలియన్ ఉమెన్ స్టడీలో మహిళలను పరిశోధకుల బృదం.. ఒత్తిడి, సంతోషం, అసంతృప్తి, నియంత్రణ, విశ్రాంతి వంటి వాటి ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో తెలుపాలని ఓ ప్రశ్నావళిని అందించారు. సమాధానం ఇచ్చినవారిలో ఆరుగురిలో ఐదుగురు సాధారణంగా సంతోషానికే తమ ఓటేశారు. దీన్నిబట్టి చూస్తే అసంతృప్తితో ఉన్నవారిలో ధూమపానం, బద్ధకం, భాగస్వామితో సరిగా లేకపోవడం వంటి అలవాట్లు ఉండాలని, వారంతా సంతోషంగా, ఆరోగ్యంగానే ఉన్నారని అధ్యయనకారులు చెప్తున్నారు. మరోవైపు అప్పటికే అనారోగ్యంతో ఉన్న మహిళలు మాత్రం విచారంగానూ, ఒత్తిడితోనూ, నియంత్రణాశక్తిని కోల్పోయి, విశ్రాంతి లేకుండా ఉన్నట్లు ఇలా పలు భావాలను ప్రకటించినట్లు అధ్యయనంలో తేలింది. పది సంవత్సరాల కాలంలో మొత్తం ఏడు లక్షలమంది మహిళలను పరిశీలించగా సగటున 59 సంవత్సరాల వయసు పైబడినవారు సుమారుగా 30 వేలమంది మరణించినట్లుగా అధ్యయనాల ద్వారా వెల్లడైంది. అలాగే వారి జీవన శైలి, అలవాట్ల ఆధారంగా చూసినపుడు మరణాల సంఖ్య సంతోషంగా ఉన్నవారికి, విచారంగా ఉన్నవారికీ మధ్య పెద్దగా తేడా లేనట్లు తేలింది. అందుకే ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ బెట్టె లియు.. అనారోగ్యం వల్ల అసంతృప్తి చోటుచేసుకుంటుందే తప్ప... అసంతృప్తి వల్ల అనారోగ్యం దరిచేరదంటున్నారు. అసంతృప్తి, ఒత్తిడి వంటివి మృత్యువుపై ప్రత్యక్ష ప్రభావం చూపినట్లు ఎక్కడా నిరూపితం కాలేదని ఆయన అంటున్నారు. -
‘నమ్మ’కంగా బైక్ సర్వీసింగ్..!
బెంగళూరులో లైవ్‌లో సర్వీసింగ్ అందజేస్తున్న నమ్మ మెకానిక్ సంస్థ బెంగళూరు: బెంగళూరుకు చెందిన ‘నమ్మ మెకానిక్’ సంస్థ బైక్ సర్వీసింగ్, ఆయిలింగ్ ప్రక్రియను వాహన యజమానులు లైవ్‌లో దేశంలో ఎక్కడినుంచైనా చూసే ఏర్పాట్లు చేసింది. ఇందుకు గాను తొలుత గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి gdmmslite యాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అటు పై ఈ సంస్థకు చెందిన www.nammamechanik.com లో వ్యక్తిగత, బైక్ వివరాలు నమోదు చేసి ఎప్పుడు సర్వీస్‌కు ఇస్తున్నామో తెలపాలి. తొంబై రోజుల ముందస్తు బుకింగ్‌కూ వీలుంది. మనం తెలియజేసిన రోజున కంపెనీ ప్రతినిధులు ఇంటి వద్దకే వచ్చి బైక్‌ను వీడియో తీసి సీడీ అందజేస్తారు.అనంతరం దాన్ని సర్వీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఏ ర్యాంప్ పై మన బైక్ ఉందో తెలియజేసే సంక్షిప్త సమాచారంతో పాటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా మన మొబైల్‌కు పంపిస్తారు. వీటిని ఉపయోగించి బైక్ సర్వీస్ తీరును ఇంటివద్దనుంచే నేరుగా వీక్షించవచ్చు. ఏవైనా సందేహాలు, సూచనలు ఉంటే కంపెనీ సిబ్బందితో వెంటనే ఫోన్లో మాట్లాడే వీలుంది. దీనిపై ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్టీ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ... త్వరలో కార్ల సర్వీసింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బైక్ సర్వీస్‌కు రూ.500 చార్జ్ చేస్తామని, స్పేర్ పార్ట్స్‌కు అదనం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అన్ని కంపెనీల ద్విచక్ర వాహనాలకు సర్వీసు అందిస్తామని తెలిపారు. -
లైవ్‌లో బైక్ సర్వీసింగ్
బెంగళూరు: బైక్ సర్వీసింగ్, ఆయిలింగ్ ప్రక్రియను వాహనదారులు లైవ్‌లో దేశంలో ఎక్కడినుంచైనా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తూ బెంగళూరులోని నమ్మ మెకానిక్ సంస్థ వాహనదారులకు వినూత్న సేవలు అందజేస్తోంది. సాధారణంగా ఎవరైనా బైక్ సర్వీసింగ్‌కు ఇచ్చిన తర్వాత ఆ ప్రక్రియ ఆలస్యమైతే వాహనం ఇచ్చి వచ్చేస్తారు. అయితే మెకానిక్ ఏ కంపెనీ ఆయిల్ వాడారో? ఒరిజినల్ స్పేర్‌పార్ట్స్ తీసి లోకల్ స్పేర్‌పార్ట్స్ వేసేరామో? అని వాహనదారులు పరిపరి విధాలుగా ఆలోచించడం పరిపాటి. ఇలాంటి సమస్యలకు, అనుమానాలకు చెక్ పెడుతూ బెంగళూరుకు చెందిన 'నమ్మ(మీ) మెకానిక్స్' సంస్థ బైక్ సర్వీస్ ఎలా జరుగుతోందో మీరు ఇంట్లో ఉండే ప్రత్యక్షంగా చూడవచ్చు. ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌కి వెళ్లి gdmmsliteయాప్‌ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలి. అటు పై ఈ సంస్థకు చెందిన www.nammamechanik.comలో వ్యక్తిగత వివరాలు, బైక్ వివరాలు నమోదు చేసి ఎప్పుడు సర్వీస్‌కు ఇస్తున్నామో తెలపాలి. తొంబై రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం కూడా ఉంది. మనం తెలియజేసిన రోజున కంపెనీ ప్రతినిధులు ఇంటి వద్దకే వచ్చి బైక్‌ను వీడియో తీసి సీడీ అందజేస్తారు. అనంతరం బైక్‌ను సర్వీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. సర్వీస్ స్టేషన్‌లోని ఏ ర్యాంప్ పై మన బైక్ ఉందో తెలియజేసే టెక్ట్స్ మెనేజ్తో పాటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా మన మొబైల్ నంబర్‌కు పంపిస్తారు. వీటిని ఉపయోగించి బైక్ సర్వీస్ జరుగుతున్న తీరును నేరుగా వీక్షించవచ్చు. ఏవైనా సందేహాలు, సూచనలు ఉంటే కంపెనీ సిబ్బందితో నేరుగా ఫోన్లో మాట్లాడే అవకాశం కూడా ఉంది. సర్వీస్ పూర్తయిన తర్వాత వాహనంలో బైక్‌ను ఇంటి వద్దకు తీసుకు వచ్చి కంపెనీ సిబ్బంది అప్పగిస్తారని సంస్థ ఎండీ ఎన్టీ అరుణ్‌కుమార్ తెలిపారు. -
నోటి మాటతోనే..చంపేస్తారు
-
లాభాల స్వీకరణతో మార్కెట్లు డౌన్
లాభాల స్వీకరణ, పీ-నోట్స్ నిబంధనల అమలుపై భయాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు మంగళవారం రికార్డు స్థాయిల నుంచి క్షీణించి నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 161 పాయింట్లు తగ్గి 28,338 వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు తగ్గి 8,463 వద్ద ముగిశాయి. గడిచిన ఆరు వారాల్లో ఒకే రోజున ఇంత భారీగా తగ్గటం ఇదే ప్రథమం. చివరిసారిగా అక్టోబర్ 16న సెన్సెక్స్ ఒకే రోజున 350 పాయింట్లు పతనమైంది. తాజాగా రియల్టీ, ఎఫ్ఎంసీజీ, పవర్, మెటల్, కన్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఆటోమొబైల్ సంస్థల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఏకంగా 5 శాతం క్షీణించింది. మంగళవారం లాభాల్లోనే ప్రారంభమైన సెన్సెక్స్ ఒక దశలో కొత్త రికార్డు స్థాయి 28,541 పాయింట్లను, నిఫ్టీ 8,535 పాయింట్ల ఆల్ టైం గరిష్ట స్థాయిని తాకాయి. కానీ ఆ లాభాలు ఎక్కువ సేపు నిలవలేదు. చివరికి సెన్సెక్స్ 0.57 శాతం, నిఫ్టీ 0.79 శాతం క్షీణతతో ముగిశాయి. మనీలాండరింగ్ వంటివి జరగకుండా పార్టిసిపేటరీ నోట్స్ జారీ విషయంలో విదేశీ ఇన్వెస్టర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనంటూ సెబీ ఆదేశించడం మార్కెట్లను కొంత ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెప్పారు. ఈ విషయంలో ఇన్వెస్టర్స్ సెంటిమెంటును కాస్త దెబ్బతీసిందని, ఫలితంగా మార్కెట్స్ క్షీణించాయని వివరించారు. ఐటీసీ 5% పతనం: సిగరెట్ల విడి అమ్మకాలను నిషేధించాలన్న సిఫార్సులను కేంద్రం ఆమోదించిందన్న వార్తలతో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ ఏకంగా 5 శాతం నష్టపోయిందని బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరెన్ ధకన్ చెప్పారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో పొజిషన్లను ట్రేడర్లు నవంబర్ నుంచి డిసెంబర్‌కు రోలోవర్ చేసుకుంటున్న నేపథ్యంలో ఈ వారం ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు తప్పకపోవచ్చని తెలిపారు. ఎంసీఎక్స్-ఎస్ఎక్స్లో వాటాలు కొంటున్న ఝున్‌ఝున్‌వాలా ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ స్టాక్ ఎక్స్చేంజీలో పూర్తి వాటాలు విక్రయించే దిశగా ప్రముఖ ఇన్వెస్టరు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా తదితరులతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా (ఎఫ్టీఐఎల్) మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఎంసీఎక్స్-ఎస్ఎక్స్లో ఎఫ్‌టీఐఎల్‌కు ప్రస్తుతం అయిదు శాతం వాటాలు ఉన్నాయి. ఈ డీల్ విలువ రూ. 88.41 కోట్లుగా ఉండనుంది. ఎఫ్టీఐఎల్ ఒప్పందం కుదుర్చున్న సంస్థల్లో ఎడెల్వీజ్, ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మొదలైనవి ఉన్నాయి. -
సెన్సెక్స్ 130 పాయింట్లు డౌన్
కొత్త గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు మరోసారి లాభాలు స్వీకరించేందుకు అమ్మకాలు చేపట్టడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు డీలాపడ్డాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు క్షీణించి 28,033 వద్ద ముగిసింది. అయితే యథాప్రకారం తొలుత లాభాలతో మొదలైంది. ఒక దశలో 130 పాయింట్లు ఎగసి 28,294ను తాకింది. ఈ బాటలో నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 8,456కు చేరింది. ఇవి కొత్త గరిష్టాలుకాగా, చివర్లో ఉన్నట్టుండి అమ్మకాలు పెరిగాయి. వెరసి నిఫ్టీ సైతం లాభాలు పోగొట్టుకోవడమేకాకుండా 44 పాయింట్లు నష్టపోయి 8,382 వద్ద నిలిచింది. ప్రధానంగా మెటల్, పవర్, ఆయిల్ రంగాలు 2-1.5% మధ్య బలహీనపడ్డాయి. ఆరు మాత్రమే సెన్సెక్స్ దిగ్గజాలలో ఆరు మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో లాభపడ్డాయి. డాక్టర్ రెడ్డీస్ 2.5% పుంజుకోగా, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో 1% చొప్పున బలపడ్డాయి. అయితే మరోవైపు టాటా స్టీల్, సెసాస్టెరిలైట్, గెయిల్, టాటా మోటార్స్, భెల్, సన్ ఫార్మా, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, రిలయన్స్, యాక్సిస్ 3-1% మధ్య నష్టపోయాయి. ఇక మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా 0.6% చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,840 నష్టపోతే, 1,216 లాభపడ్డాయి. -
ఐదేళ్లుగా తల్లి శవం పక్కనే నివాసం!
బెర్లిన్: వినడానికి ఆశ్చర్యంగా, వింతగా ఉన్న ఇది నిజమే! జర్మనీకి చెందిన ఓ యువతి మరణించిన తల్లికి అంత్యక్రియలు చేయకుండా ఇంట్లోనే శవాన్ని దాచిపెట్టింది. ఐదేళ్లకు పైగా ఇంట్లో తల్లి శవాన్ని పెట్టుకుని నివసించింది. బెడ్ తల్లి శవం పక్కనే నిద్రించేది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన మూనిచ్ నగరంలో జరిగింది. ఆ యువతి తల్లి మరణించిన విషయాన్ని గత వారం కనుగొన్నారు. ఆ యువతిని (55) మానసిక ఆస్పత్రిలో చేర్చారు. అధికారులు ఆ యువతి నివాసానికి వెళ్లినా ఆమె లోపలికి అనుమతించలేదు. ఓ సామాజిక కార్యకర్త యువతి తల్లిని పరామర్శించేందుకు గత వారం ప్రయత్నించింది. ఆమెకూ ఇలాంటి అనుభవమే ఎదురవడంతో పోలీసులకు విషయం తెలియజేసింది. తలుపులు బద్దలు కొట్టి చూడగా అసలు విషయం వెలుగు చూసింది. వృద్ధురాలిని కొంతకాలంగా చూడలేదని అపార్ట్మెంట్ వాసులు చెప్పారు. కాగా ఆమె మరణం సహజమేనని పోస్ట్‌మార్టమ్ నివేదికలో తేలింది. 2009లో 77 ఏళ్ల వయసులో మరణించినట్టు వెల్లడైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐదేళ్లుగా ఆ యువతి తల్లి శవం పక్కనే నిద్రపోయిందట! -
నేడు సూర్య, చంద్ర ప్రభ ఉత్సవాలు
కదిరి, న్యూస్‌లైన్: లోకం.. పుట్టడం, జీవించడం, మరణించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడుని తానే అంటూ భక్తులకు చాటి చెప్పేందుకు నారసింహుడు మంగళవారం పగలు సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనాలను అధిష్ఠించి భక్తులకు దర్శనమిస్తారు. సూర్య మండల మధ్యస్థుడైన శ్రీమహావిష్ణువుకు నారాయణుడనే పేరు కలదు. పగటికి సూర్యుడు రారాజు. రేయికి చంద్రుడు అధిపతి. సృష్ఠికి ఎంతో ముఖ్యమైన ఈ రాత్రింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగివుండి వాటిని వాహనాలుగా చేసుకొని సృష్ఠిలో సర్వం తానే అని చాటిచెప్పడానికి తిరువీధుల్లో ఊరేగుతారు. సాధారణంగా ఉదయం గ్రామోత్సవం నిర్వహించి రాత్రి సమయంలో మాత్రమే శ్రీవారి విహారానికి వాహనం వినియోగిస్తారు. అయితే రెండు వాహనాల్లో విహరించడం నేటి ఉత్సవ ప్రత్యేకత. ఉదయం యాగశాల ప్రవేశం, నిత్య హోమాలతో ప్రారంభ మై శ్రీవారి తిరువీధుల్లో సూర్య ప్రభ ఉత్సవం జరుగుంది. రాత్రి విశేష అలంకరణలతో నారసింహుడు చంద్ర ప్రభ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తారని ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ పేర్కొన్నారు. -
మీడియాతో లక్ష్మిపార్వతి
-
ఆమర్నాత్ రెడ్డి మీడియా సమావేశం
-
సాక్షి ది హెడ్ లైన్ షో 8th July 2013