ఫేస్‌బుక్‌లో కలెక్టర్ లైవ్
-
లోకల్ వైర్ యాప్‌తో యాక్సస్
-
నేడు శ్రీకారం
-
ఐటీ ఉద్యోగి వినూత్న ఆలోచన
పెదగంట్యాడ: మన చుట్టూ సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేని పరిస్థితి అన్ని చోట్లా నెలకొంది. కొంత మంది ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న వారు స్థానిక సమస్యలు గురించి అధికారులతో మాట్లాడేంత సమయం ఉండదు. సమస్య అధికారులకు తెలిపితే ఫలితం ఉంటుందేమో అనే సందేహం ఉంటుంది. అపాయింట్‌మెంట్ తీసుకుని వివరించేంత తీరిక ఎవరికీ లేదు. ఈ ఆలోచనకు సమాధానంగా రాకేశ్ అనే ఐటీ ఉద్యోగి ఫేస్‌బుక్‌లో జిల్లా కలెక్టర్‌తో లైవ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో ప్రజల్లోకి ఫేస్‌బుక్ ద్వారా రానున్నారు.
ఉపయోగం
ఫేస్‌బుక్ లైవ్ విత్ అవర్ కలెక్టర్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా చాలా మంది వేర్వేరు సమస్యలకు సులభ పరిష్కారం లభించవచ్చు. చాలా మందికి ఉండే సందేహాలు నివత్తి అవుతాయి.
ఎలా చేస్తారు...
లోకల్ వైర్ యాప్ ఉంటే ౖyð రెక్ట్ యాక్సిస్ కావచ్చు. లేదంటే ఫేస్‌బుక్ పేజ్‌లో లోకల్‌వైర్ యాప్ అని టైప్ చేసినా లాగిన్ అవ్వొచ్చు. కలెక్టర్ వద్ద కెమెరాతో పాటు లోకల్‌వైర్ ప్రతినిధి ఉంటారు. వచ్చిన ప్రశ్నను ఆయనకు షేర్ చేస్తారు. అభ్యంతరకరమైన ప్రశ్నలు ఉన్నా, రిపీటెడ్ ప్రశ్నలు ఉన్నా వెంటనే తొలగించి తర్వాత ప్రశ్నకు వెళ్తారు. గంటపాటు ఈ కార్యక్రమం ఉంటుంది.
వైర్ యాప్ ఆదరణతోనే..
ఇంతకు ముందు లోకల్ వైర్ యాప్‌ను స్థానిక సమస్యలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మొదలు పెట్టాను. అది మంచి ఆదరణ పొందింది. లోకల్ సమస్యలు తెలిసినా పరిష్కారం కావాలని కొంత మంది అడిగారు. అలాంటి వారికోసం కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేశాం. ఈ మేరకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్‌ను కలిసి పోస్టర్ రిలీజ్ చేశాం. ఒక వేళ ఈ ఐడియా వర్కౌట్ అయితే మరికొంత మంది మమ్మల్ని ఫాలో అవుతారు. అది చాలు మేము విజయం సా«ధించాం అని చెప్పడానికి. –రాకేశ్ లోకల్ వైర్...(సీఈవో)