
సర్వీస్ జరుగుతున్న తీరును చూపిస్తున్న దృశ్యం
మనం తెలియజేసిన రోజున కంపెనీ ప్రతినిధులు ఇంటి వద్దకే వచ్చి బైక్‌ను వీడియో తీసి సీడీ అందజేస్తారు.అనంతరం దాన్ని సర్వీస్ స్టేషన్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఏ ర్యాంప్ పై మన బైక్ ఉందో తెలియజేసే సంక్షిప్త సమాచారంతో పాటు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను కూడా మన మొబైల్‌కు పంపిస్తారు. వీటిని ఉపయోగించి బైక్ సర్వీస్ తీరును ఇంటివద్దనుంచే నేరుగా వీక్షించవచ్చు. ఏవైనా సందేహాలు, సూచనలు ఉంటే కంపెనీ సిబ్బందితో వెంటనే ఫోన్లో మాట్లాడే వీలుంది.
దీనిపై ఆ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ ఎన్‌టీ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ... త్వరలో కార్ల సర్వీసింగ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బైక్ సర్వీస్‌కు రూ.500 చార్జ్ చేస్తామని, స్పేర్ పార్ట్స్‌కు అదనం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అన్ని కంపెనీల ద్విచక్ర వాహనాలకు సర్వీసు అందిస్తామని తెలిపారు.