ఈజిప్ట్‌లో మమ్మీఫికేషన్ మృతదేహాల గురించి చూశాం. అక్కడ రాజులు, ప్రముఖ వ్యక్తుల దేహాలు పాడవ్వకుండా కొన్ని రకాల రసాయనాలు పూసి సమాధి చేయడం గురించి విన్నాం. పురావస్తు శాఖ అధికారులు అలా మమ్మఫికేషన్ చేయబడిని వాటిని వెలికితీసి వాటిపై పరిశోధనలు చేస్తూ కొంగొత్త విషయాలను చెబుతుంటారు. కానీ ఇక్కడొక వ్యక్తి శాస్త్రవేత్తలకే సవాలు విసిరేలా అకస్మాత్తుగా మమ్మీలా మారిపోయాడు. ఇది ఎలా సాధ్యం అని శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకున్నారు. ఏవిధంగా చూసిన ఓ మృతదేహం మమ్మిఫికేషన్ అవ్వాలంటే కనీసం కొద్ది నెలలు పడుతుంది. మరి ఇదేంటి?.. శాస్త్రవేత్తలను ఓకింత కలవారపాటుకు గురి చేసిన ఆ అంతు పట్టని మిస్టరీ గురించే ఈ కథనం.
అసలేం జరిగిందంటే..సెప్టెంబర్ 3న బల్గేరియాలోని రైల్వేలైన్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేయగా మద్యానికి బానిసకావడంతో చనిపోయినట్లు తేలింది. విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఆగస్టు 16 వరకు సజీవంగా ఉన్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. జస్ట్ 16 రోజుల తర్వాత మమ్మీలా మారిని అతడి శవంలా కనిపించింది. ఓ మృతదేహం మమ్మీఫికేషన్ అవ్వాలంటే కనీసం ఆరు నుంచి 12 నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
కానీ ఆ వ్యక్తి మృతదేహం మాత్రం చాలా ఏళ్ల క్రితం నాటి మమ్మీలా ఉంది. తొలుత పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని చూసి ఏదో మమ్మీలాంటి శవం ఎప్పుడోది అనుకున్నారు. ఆ తర్వాత ఆ మమ్మీ కాస్త ఫలాన వ్యక్తి అని తేలాక ఒక్కసారిగా కంగుతిన్నారు పోలీసులు. అత్యంత విచిత్రమైన అంశం ఏంటంటే బల్గేరియాలో అంతగా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండవు. కేవలం 16 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
అంత త్వరగా మృతదేహం పొడిగా మారిపోయి ఆధునాతన మమ్మీఫికేషన్‌లా ఎలా అయిపోయిందనేది అర్థంకాని అంతుపట్టని మిస్టరీలా ఉంది. అటు పోలీసులు, శాస్త్రవేత్తలు బల్గేరియా రాజధాని సోఫియాలో త్వరితగతిన మమ్మిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసే వాతావరణం లేదని కరాఖండీగా చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి మృతదేహం ఎలా మమ్మీఫికేషన్‌గా మారిందనేది ఎవ్వరికీ అర్థంకాని చిక్కు ప్రశ్నలా మిగిలింది.
(చదవండి: ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..)
Comments
Please login to add a commentAdd a comment