mummified
-
128 ఏళ్ల నాటి మమ్మీకి అంత్యక్రియలు! అదికూడా అధికారిక..
మమ్మకీ అంత్యక్రియాలా! అని ఆశ్చర్యపోకండి. ప్రమాదవశాత్తు మమ్మీగా మారిన ఆ వ్యక్తికి ఇప్పుడు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ఏడాది అక్టోబర్ 6 వరకు సందర్శనార్థం ఉంచి మరుసటి రోజు అనగా అక్టోబర్ 7న ఖననం చేయనున్నట్లు తెలిపారు. ఈ ఘటన పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చరిత్రకారుల ప్రకారం..పెన్సిల్వేనియా వ్యక్తి 19వ శతాబ్దం చివరలో అనుకోకుండా మమ్మీగా చేయబడ్డాడు. స్టోన్‌మ్యాన్‌గా పిలిచే ఈ మమ్మీ 128 ఏళ్లుగా అలానే ఉండిపోయింది. నిజానికి అతని ఐడెంటిటీ గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు ఆ మమ్మీ ఐడెంటిటీని కనుగొనడంతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడమే గాక అతడెవరనేది బహిర్గతం చేయాలనకున్నారు. ఐతే ఈ వ్యక్తి వెనక దాగున్న కథ కాస్త విచిత్రమైనదే. ఈ వ్యక్తి మద్యానికి వ్యసనపరుడై దొంగతనం ఆరోపణలతో బెర్క్స్ కౌంటీ జైలులో పట్టుబడ్డాడు. నవంబర్ 19, 1895న మూత్రపిండాల వైఫల్యంతో మరణించాడు. అయితే ఆ వ్యక్తి అరెస్టు సమయంలో జేమ్స్ పెన్ అనే తప్పుడు పేరుని సూచించినట్లు పేర్కొన్నారు. తన కుటుంబీకులు పరువు పోతుందనే భయంతో ఇలా చేసినట్లు విచారణలో తేలిందని వెల్లడించారు. ఐతే ఆ తర్వాత అతడి మృతదేహం అతడి కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు యత్నించి విఫలమవ్వడంతో పెన్సిల్వేనియాలో రీడింగ్‌లోని ఔమాన్స్ ఫ్యూనరల్ హోమ్‌కి తరలించారు. అక్కడ ఎంబామింగ్ ప్రయోగాలు చేస్తున్నప్పుడు పొరపాటున ఇతర శరీరం మమ్మీ చేబడిందని అధికారులు వెల్లడించారు. ఇన్నేళ్లకు అతనెవరో గుర్తించడంతో అక్టోబర్ 6 వరకు ప్రజల సందర్శనార్థం బహిరంగంగా ఉంచాలే అధికారులు ఏర్పాటు చేశారు. ఆ విధంగా 128 ఏళ్లుగా చెక్కుచెదరని దంతాలు, వెంట్రుకలతో మమ్మీ చేయబడిన వ్యక్తి అంత్యక్రియలు అక్టోబర్ 7న నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మమ్మీని సంరక్షిస్తున్న రీడింగ్ ఫ్యూనరల్ హోం డైరెక్టర్ కైల్ బ్లాంకెన్బిల్లర్ మాట్లాడుతూ..ఆ మమ్మీతో గల తన అనుబంధాన్ని వివరించాడు. అతన్ని కేవలం మమ్మీ అని కాకుండా స్నేహితుడుగా భావించినట్లు తెలిపాడు. పెన్సిల్వేనియా నివాసితులు అతన్ని పట్టణంలో ఓ ప్రముఖుడిగా చూస్తున్నారు. పైగా ఆ వ్యక్తికి(మమ్మీ) మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ బలం కూడా ఉండటం విశేషం. ఆ మమ్మని సంరక్షించిన రీడింగ్ ఫ్యూనరల్ హెం 275వ వార్షికోత్సవం కావడంతో ఇప్పుడు ఆ మమ్మీకి 19వ శతాబ్దపు నాటి దుస్తులు వేసి .. కవాతు గౌరవంతో కూడిన అధికారిక లాంఛనాలతో అధికారులు అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. (చదవండి: ఎలుక పాలు లీటరు 18 లక్షలా..! దేనికి ఉపయోగిస్తారంటే..) -
అప్పటి వరకు సజీవంగా కనిపించిన వ్యక్తి..సడెన్‌గా 'మమ్మీలా'...
ఈజిప్ట్‌లో మమ్మీఫికేషన్ మృతదేహాల గురించి చూశాం. అక్కడ రాజులు, ప్రముఖ వ్యక్తుల దేహాలు పాడవ్వకుండా కొన్ని రకాల రసాయనాలు పూసి సమాధి చేయడం గురించి విన్నాం. పురావస్తు శాఖ అధికారులు అలా మమ్మఫికేషన్ చేయబడిని వాటిని వెలికితీసి వాటిపై పరిశోధనలు చేస్తూ కొంగొత్త విషయాలను చెబుతుంటారు. కానీ ఇక్కడొక వ్యక్తి శాస్త్రవేత్తలకే సవాలు విసిరేలా అకస్మాత్తుగా మమ్మీలా మారిపోయాడు. ఇది ఎలా సాధ్యం అని శాస్త్రవేత్తలు సైతం తలలు పట్టుకున్నారు. ఏవిధంగా చూసిన ఓ మృతదేహం మమ్మిఫికేషన్ అవ్వాలంటే కనీసం కొద్ది నెలలు పడుతుంది. మరి ఇదేంటి?.. శాస్త్రవేత్తలను ఓకింత కలవారపాటుకు గురి చేసిన ఆ అంతు పట్టని మిస్టరీ గురించే ఈ కథనం. అసలేం జరిగిందంటే..సెప్టెంబర్ 3న బల్గేరియాలోని రైల్వేలైన్ సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది. అతని మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేయగా మద్యానికి బానిసకావడంతో చనిపోయినట్లు తేలింది. విచిత్రమైన ట్విస్ట్ ఏంటంటే ఆ వ్యక్తి ఆగస్టు 16 వరకు సజీవంగా ఉన్నాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. జస్ట్ 16 రోజుల తర్వాత మమ్మీలా మారిని అతడి శవంలా కనిపించింది. ఓ మృతదేహం మమ్మీఫికేషన్ అవ్వాలంటే కనీసం ఆరు నుంచి 12 నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ ఆ వ్యక్తి మృతదేహం మాత్రం చాలా ఏళ్ల క్రితం నాటి మమ్మీలా ఉంది. తొలుత పోలీసులు ఆ వ్యక్తి మృతదేహాన్ని చూసి ఏదో మమ్మీలాంటి శవం ఎప్పుడోది అనుకున్నారు. ఆ తర్వాత ఆ మమ్మీ కాస్త ఫలాన వ్యక్తి అని తేలాక ఒక్కసారిగా కంగుతిన్నారు పోలీసులు. అత్యంత విచిత్రమైన అంశం ఏంటంటే బల్గేరియాలో అంతగా తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండవు. కేవలం 16 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంత త్వరగా మృతదేహం పొడిగా మారిపోయి ఆధునాతన మమ్మీఫికేషన్లా ఎలా అయిపోయిందనేది అర్థంకాని అంతుపట్టని మిస్టరీలా ఉంది. అటు పోలీసులు, శాస్త్రవేత్తలు బల్గేరియా రాజధాని సోఫియాలో త్వరితగతిన మమ్మిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసే వాతావరణం లేదని కరాఖండీగా చెబుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి మృతదేహం ఎలా మమ్మీఫికేషన్గా మారిందనేది ఎవ్వరికీ అర్థంకాని చిక్కు ప్రశ్నలా మిగిలింది. (చదవండి: ఎప్పటికి యవ్వనంగా ఉండాలని..వందకిపైగా టాబ్లెట్లు, కొడుకు రక్తం..) -
వాట్! ఈజిప్టు మమ్మీ సాయంతో పురాతన కాలం నాటి "సెంట్"!
ఈజిప్టు మమ్మీల గురించి కథనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇంతవరకు ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు విపులీకరించారు. ఆరోజుల్లో వారు ఎలాంటి వాటిని ఉపయోగించారో చూశాం. ఐతే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు ఇంకాస్తు ముందడుగు వేసి.. వేల ఏళ్ల నాటి పురానత మమ్మీ నుంచి పరిమళాలు వెదజల్లే 'సెంట్'ని తయారు చేశారు. మమ్మీఫికేషన్‌లో వాడే సుగంధాన్నే తిరిగి ఆ మమ్మీ సాయంతో రూపొందించామని చెబుతున్నారు. వాట్ పురాత మమ్మీతో సెంట్ ఎలా?! అనే కదా! వివరాల్లోకెళ్తే..మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లోని శాస్త్రవేత్తలు మమ్మీ 'సెనెట్నే' అనే ఈజిప్షియన్ మహిళ మమ్మీఫికేషన్‌లో ఉపయోగించిన పురాత సువాసనను వారు తిరిగి పునః సృష్టించారు. దీంతో ఆనాడు వారు ఉపయోగించిన పద్ధతులను తెలుసుకోగలిగామని అంటున్నారు. అందుకోసం మమ్మీ 'సెనెట్నే' ఊపిరితిత్తులు, కాలేయాన్ని రెండు పాత్రలలోకి తీసుకున్నారు. అప్పుడు వచ్చిన ఔషధ తైలాల నమునాలను సేకరించి వాటిలో ఉపయోగించిన పదార్థాలను కనుగొన్నారు. వాటిలో బీస్వాక్స్, ప్లాంట్ ఆయిల్, కొవ్వులు, బిటుమెన్, పినేసి రెసిన్లు, ట్రీ రెసిన్ వంటి పరిమళ పదార్థాల సంక్లిష్ట మిశ్రమం అని గుర్తించారు. ఇది కాస్త 3వేల సంత్సరాల క్రితం ఉపయోగించిన సువాసన గల సెంట్‌ని తిరిగి రూపొందించేందుకు దారితీసింది. శాస్త్రవేత్తలు పునాదిలో లభించిన సేంద్రీయ అవశేషాలను ఉపయోగించి ఈ సువాసన గల 'సెంట్'ని తయారు చెయ్యడం విశేషం. ఈ 'సెంట్'ని శాస్త్రవేత్తలు "సెంట్ ఆఫ్ ఎటర్నీటీ" లేదా "సెంట్ ఆఫ్ లైఫ్" అని పిలుస్తున్నారు. ఈ "సెన్ట్నే" అనే మమ్మీకి మమ్మీఫికేషన్ ఉపయోగించే పదార్థాలు ఇప్పటివరకు గుర్తించని వాటితో రూపొందించినట్లు తెలిపారు. వీటి కారణంగానే బాడీలు పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయని ఆ కాలంలోని వారు విశ్వసించటం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ఈ మమ్మీఫికేషన్‌లో అత్యంత ఖరీదైన పదార్థాలనే వాడినట్లు తెలిపారు. ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ కరోల్ కాల్వేజ్ సాయంతో పరిశోధకులు 3 వేల ఏళ్ల నాటి పురాతన సువాసనను పునః సృష్టించారు. త్వరలో డెన్మార్క్‌లోని మోస్గార్డ్ మ్యాజియంలో ఈ సెంట్ బాటిల్‌ని ఉంచనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఒకరకంగా ఈజిప్షియన్ మమ్మీల మమ్మీఫికేషన్కి సంబంధించిన రహస్యాలను మరింత చేధించేందుకు మార్గం సుగమం చేసింది. So happy to share our new paper out today in @SciReports "Biomolecular characterization of 3500-year-old ancient Egyptian mummification balms from the Valley of the Kings"https://t.co/0Uk46qvJZe — Barbara Huber (@Bara_Huber) August 31, 2023 (చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...) -
రెండు వేల గొర్రె తలలను ప్రసాదంగా ఉంచారట!
కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిసలు మమ్మీలుగా ఉండటం గురించి వినలేదు కదా!. కానీ అమెరికా పురావస్తు శాస్త్రజ్ఞులు ఈజిప్టులో వాటిని కూడా మమ్మీలుగా ఉంచినట్లు గుర్తించారు. జంతువుల మమ్మీలను అమెరికా పురావస్తు బృందం దక్షిన ఈజిప్టులోని అబిడోస్ నుంచి వెలికితీసింది. అక్కడ దేవాలయాల వద్ద జంతువుల మమ్మీల సమాధులకు ప్రసిద్ధి. కీ.పూ 1304 నుంచి 1237 వరకు దాదాపు ఏడు దశాబ్దాల పాటు ఫారో రామ్సేస్2 అనే రాజు ఈజిప్టుని పాలించాడట. దీంతో ఆయన మరణాంతరం ఆయనకో దేవాలయాన్ని కట్టారు. అయితే ఆయన మరణించిన వెయ్యేళ్లకు గుర్తుగా ఆయన ఆరాధనలో గొర్రె తలలను అర్పించేవారట. అంటే వేల గొర్రెలను శిరచ్ఛేదనం చేసి ఆయనకు నైవేద్యంగా పెట్టేవారని పురావస్తు శాఖ సుప్రీం కౌన్సిల్ మోస్తఫా వాజిరి తెలిపారు. క్రీ.పూర్వం 2374 నుంచి214 మధ్య కాలం రామ్సెస్ 2 ఆలయానికి సంబంధించిన కార్యకలాపాలు, నిర్మాణాలు గురించి తెలుస్తాయని వెల్లడించారు. అంతేగాదు ఈ ప్రదేశంలో మమ్మీగా చేయబడిన జంతు అవశేషాల తోపాటు దాదాపు 4 వేల ఏళ్లక్రితం నాటి ఐదు మీటర్ల మందం గోడలతో కూడిన ప్యాలెస్ అవశేషాలను కూడా కనుగొన్నారు. అక్కడ అనేక విగ్రహాలు, పురాతన చెట్ల అవశేషాలు, తోలు బట్టలు, బూట్లను గుర్తించారు. కైరో నదికి దక్షిణంగా నైలు నిదిపై దాదాపు 270 మైళ్ల దూరంలో ఈ అబిడోస్ ఉంది. ఇక్కడ సేటీ 1 వాటి శవపేటికల ఆలయాలకు ప్రసిద్ధి చెందింది. కైరోలో ఎప్పుడూ ఇలాంటి కొత్తకొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వస్తుండటం విశేషం. దాదాపు 105 మిలియన్ల మంది నివాసం ఉండే ఈజిప్టు ఆర్థిక సంక్షోబంలో చిక్కుకుంది. అంతేగాదు అక్కడ సుమారు 10 శాతం జీపీడీ పర్యాటకంపైనే ఆధారపడి ఉంది. పైగా ఇది సుమారు రెండు మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. అయితే కైరో కరోనా మహమ్మారికి ముందు సుమారు 13 మిలియనల మందిని లక్ష్యంగా చేసుకుంటే 2028 నాటికి సుమారు 30 మిలియన్ల మంది టార్గెట్‌గా పెట్టుకుని పర్యాటకాన్ని పునరుద్ధరించాలని భావిస్తోంది. (చదవండి: ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం) -
సాగర కన్యలు ఉన్నది నిజమే! ఔను అంటున్న జపాన్ శాస్త్రవేత్తలు
మనం సినిమాల్లో సాగర కన్యలు(మత్స్య కన్య) చూశాం. కానీ నిజంగా అవి ఉన్నాయా? అనేది మాత్రం అందరి మదిలో మెదిలే ప్రశ్నే. డిస్కవరీ ఛానెల్స్‌లో వాటి గురించి చెబుతుంటారు కానీ రియల్‌గా మాత్రం వాటిని ఎవరు చూసి ఉండే అవకాశం లేదు. అయితే జపాన్ శాస్త్రవేత్తలు మాత్రం సాగర కన్యలు ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించిన ఆధారాలతో సహా వివరిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...మానవ ముఖం, తోకతో ఉన్న 300 ఏళ్ల నాటి మత్సకన్య మమ్మీని చూసి శాస్తవేత్తలు ఆశ్చర్యపోయారు. మత్స్య కన్య ఆకారంలో ఉన్న ఈ మమ్మీని జపాన్ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేస్తోంది. 1736 మరియు 1741 మధ్యకాలంలో జపనీస్ ద్వీపం అయిన షికోకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో 12 అంగుళాల మర్మమైన జీవి పట్టుబడిందని చెబుతున్నారు. ఈ మత్స్య కన్య మమ్మీ పసిఫిక్ మహాసముద్రంలో చేపలు పట్టే వలలో చిక్కుకుందని పేర్కొంటూ ఒక లేఖ దొరికిందని కూడా అన్నారు. ఆ తర్వాత ఎండిన మత్స్య కన్యను ఒక కుటుంబం పర్యవేక్షించిందని తదనంతరం అసకుచి నగరంలోని ఒక దేవాలయంలో ఉందని చెప్పారు. ఈ మమ్మీకి దంతాలు, ముఖం రెండు చేతులు, తల, నుదురుపై వెంట్రుకలు ఉన్నాయన్నారు. ఎగువ భాగం మానవ రూపంలోనూ, దిగువ భాగం చేప లక్షణాలను కలిగి ఉందని తెలిపారు. శరీరం దిగువ భాగంలో పొలుసులు, తోక-వంటి టేపర్డ్ ఎండ్ ఉంటుందని చెప్పారు. కురాషికి యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ పరిశోధకులు వీటి గురించి మరింత లోతుగా అధ్యయనం చేయనుంది. జపనీస్ మత్స్యకన్యలకు అమరత్వపు పురాణం(యావో-బికుని) ఉందని, మత్స్యకన్య మాంసం తింటే ఎప్పటికీ చనిపోరు అని ఒకాయమా ఫోక్లోర్ సొసైటీకి చెందిన హిరోషి కినోషిత చెబుతున్నారు. ఈ పురాణం కుడా ఆ మత్య్స కన్య దొరికిన ఆలయంలోనే ఉందని చెప్పారు. ఆ పురాణాన్ని నమ్మే కొందరు మత్య్స కన్య పొలుసులను చెవిలో పెట్టుకుంటారని అన్నారు. ఆ మత్స్య కన్యలు అంటు వ్యాధులను దూరం చేస్తాయని జపాన్ వాసుల ప్రగాఢ నమ్మకం అని కూడా చెప్పారు. (చదవండి: చిన్ని చేతులు చేస్తున్న అద్భుతం!...రష్యా బలగాలు ముట్టడించకుండా చేసేందుకు యత్నం!) -
మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!
ఈజిప్ట్ మమ్మిలు గురించి మనం కథలు కథలుగా విన్నాం. సినిమాల్లో చూశాం. అయితే శాస్త్రవేత్తలు వాటి గురించి పరిశోధనలు చేయాలంటే కచ్చితంగా చేతులతో తాకక తప్పదు. పైగా వాటిని ప్రత్యేక ద్రావణాలతో పూసి చుట్టేవారు. దీంతో వారికి ఇదంతా చాలా శ్రమతో కూడిన పనిగా ఉండేది. ఇక ఆ సమస్య ఉండదంటున్నారు. పైగా మమ్మీలను టచ్ చేయకుండానే సరికొత్త సాంకేతికత కొత్త మమ్మీఫికేషన్(మమ్మీల పుట్టు పూర్వోత్తరాలు) పద్ధతులను కనుగొన్నారు. (చదవండి: పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్లో ‘హలో వరల్డ్’ ట్వీట్! ఎలాగంటే..) అసలు విషయంలోకెళ్లితే.... 1881లో కనుగొన్న ఈజిప్ ప్రఖ్యాత ఫారో అమెన్హోటెప్ I మమ్మీ చరిత్రను డిజిటల్ సాంకేతికత సాయంతో దాని రహస్యలను చేధించారు. అంతేకాదు ఆ మమ్మీ సమాధికి ఎలాంటి భంగం కలిగించకుండా అధునాతన డిజిటల్ త్రీడీ ఇమేజరీ సాయంతో పరిశోధకులు కొత్త మమ్మీఫికేషన్ పద్ధతులను కనుగొన్నారు. పైగా కైరో యూనివర్శిటీలో రేడియాలజీ ప్రొఫెసర్ సహర్ సలీమ్, ప్రసిద్ధ ఈజిప్టు శాస్త్రవేత్త జాహి హవాస్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఈ మేరకు ప్రొఫెసర్ సలీమ్, హవాస్ మమ్మీని అమెన్హోటెప్ I మమ్మీని అధునాతన ఎక్స్-రే టెక్నాలజీ సీటీ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కానింగ్ చేసి తాకాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన నాన్-ఇన్వాసివ్ పద్ధతిలో డిజిటల్‌గా మార్చే అధునాతన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించారు. ఈ పరిశోధనలో తొలిసారిగా రాజు అమెన్హోటెప్ I ముఖం, వయసు,ఆరోగ్య పరిస్థితి సంబంధించిన మమ్మిఫికేషన్ రహస్యలను వెల్లడించింది. అంతేకాదు ఆయుధాలతో మమ్మీగా చేయబడిన మొదటి ఫారో అమెన్హోటెప్ I అని పేర్కొంది. పైగా అతని మెదడు పుర్రె నుండి తొలగించలేదని తెలిపింది. పైగా ఈ మమ్మీ క్రీస్తూ పూర్వం 1500ల క్రితం నాటిదని, తన 21 సంవత్సరాల పాలనలో అనేక సైనిక ప్రచారాలను నిర్వహించిన ఫారో, 35 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో మరణించినట్లు వెల్లడించింది. (చదవండి: లైవ్‌లో పులి వేట: నోట మాట రాక కెవ్వు కేక!) -
పెన్షన్ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి
వియాన్న: తల్లి చనిపోయింది. కానీ ఆమె మరణించింది అని తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్ డబ్బులు రాకుండా ఆగిపోతాయి. అలా జరిగితే తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లి మృతదేహాన్ని మమ్మీగా మార్చాడు. అలా ఏడాది పాటు డెడ్‌బాడీని ఇంట్లోనే పెట్టుకుని కాలం వెళ్లదీయసాగాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 89 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడి(66)తో కలిసి టైరోల్ ప్రాంతంలోని ఇన్స్బ్రక్ సమీపంలో నివసిస్తుండేది. వృద్ధురాలికి ప్రతి నెల పెన్షన్ వస్తుండేది. ఈ క్రమంలో గతేడాది జూన్‌లో సదరు వృద్ధురాలి మరణించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్ ఆగిపోతుందని భావించిన ఆమె కుమారుడు.. తల్లి మృతదేహాన్ని ఐక్‌ప్యాక్స్‌లో పెట్టి భద్రపరిచాడు. (చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు?) ఆ తర్వాత తల్లి మృతదేహానికి బ్యాండేజ్‌లు చుట్టి.. రసాయనాలలో ఉంచాడు. బ్యాండేజ్‌లు ఆ ద్రవాలను పీల్చుకుని.. మృతదేహాన్ని మమ్మీలా మార్చాయి. ఆ తర్వాత మమ్మీగా మార్చిన మృతదేహాన్ని ఇంటిలోపల దాచాడు. ఇక అతడి సోదరుడు తరచుగా ఇంటికి వచ్చి తల్లి గురించి ప్రశ్నించేవాడు. దానికి నిందితుడు.. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చాను అని తెలిపేవాడు. ఇలా ఏడాదిగా తల్లి మరణాన్ని దాచి ఆమె పేరు మీద వస్తోన్న పెన్షన్ డబ్బులను తీసుకున్నాడు. అలా ఇప్పటి వరకు 60 వేల డాలర్ల(44,05,743 రూపాయలు) పెన్షన్ సొమ్మును తీసుకున్నాడు. (చదవండి: వృద్ధ గోవులకు పింఛను) ఎలా బయటిపడిందంటే.. ఏడాదిపాటుగా సాగుతున్న ఈ వ్యవహారం కొత్త పోస్ట్‌మ్యాన్ రాకతో బయటపడింది. పెన్షన్ సొమ్ము ఇవ్వడానికి ఇంటికి వచ్చిన కొత్త పోస్ట్‌మ్యాన్ తాను లబ్ధిదారుని చూశాకే డబ్బులు ఇస్తానని తెలిపాడు. అందుకు నిందితుడు అంగీకరించలేదు. దాంతో పోస్ట్‌మ్యాన్ ఈ వ్యవహారం తేడాగా ఉందని భావించి.. అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు నిందితుడి ఇంటికి వచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రసుత్తం నిందితుడిని అరెస్ట్ చేసి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విజేత: కల చెదిరినా కాసుల వర్షం కురిసింది -
శవాన్ని మమ్మీని చేసి పూజలు..
చెక్కిన రాతి శిల్పాన్ని దేవుడిగా భావిస్తారు కొందరు. బతికున్న 'బాబా'లను భగవంతుని స్వరూపమంటూ కొలుస్తారు ఇంకొందరు. నిష్క్రమించిన మహాపురుషుల సమాధుల చుట్టూ ఆలయాలు నిర్మిస్తారు మరికొందరు. కానీ, శవాన్ని మమ్మగా చేసి పూజించడం ఎప్పుడైనా విన్నారా! జాతిపిత అంతటి మావో జెడాంగ్ భారీ విగ్రహాన్ని నేలమట్టంచేసి, వ్యక్తి ఆరాధనను వ్యతిరేకిస్తామని గొప్పగా ప్రకటించుకున్న జన చైనాలోనే ఈ వింత దృశ్యం చోటుచేసుకుంది! ఫూ హోయ్ తన 13వ యేట బౌద్ధ భిక్షువుగా మారారు. ధమ్మ సూత్రాలను నలుగురికీ బోధిస్తూ, అనతికాలంలోనే గొప్ప గురువుగా పేరుపొందారు. తన 94 ఏళ్ల జీవితమంతా క్వాంజువా (దక్షిణ చైనా)లోని చాంగ్ ఫూ టెంపుల్ లోనే గడిపారు. నాలుగేళ్ల కిందట (2012లో) ఆయన పరమపదించారు. ఫూ మోయ్ మరణం ఆయన శిష్యులను తీవ్రంగా కలిచివేసింది. గురువుగారు లేని చాగ్ ఫూ ఆలయాన్ని వాళ్లు ఊహించుకోలేకపోయారు. తీవ్ర తర్జనభర్జనల అనంతరం ఒక నిర్ణయానికి వచ్చారు. చనిపోయిన ఫూ హోయ్ మృతదేహానికి ప్రాచీన పద్ధతిలో రకరకాల రసాయనాలు పూసి, పెద్ద జాడీలో భద్రపరిచారు. దాన్నొక రహస్యప్రదేశంలో దాచి, ఇటీవలే వెలికి తీశారు.బతికున్నప్పుడు ఆయన ఎలాగైతే కూర్చునేవారో అదే ఆకారంలో ఉన్న మమ్మీకి బంగారం పోతపోశారు. గురువుగారి మనసులాంటి స్వచ్ఛమైన బంగారం పోతతో ధగధగా మెరిసిపోతోన్న ఆ మమ్మీ విగ్రహం వద్ద పూజలు గట్రా నిర్వహించడంతోపాటు ధ్యానం అదీ చేస్తున్నారు శిష్యులు! కొందరు దీనిని గురువుగారికి లభించిన 'సముచిత గౌరవం' అంటున్నారు. మీరేమంటారు? -
మరణించిన మూడేళ్ళ తర్వాత...
ఓ బౌద్ధ సన్యాసి భౌతికకాయం... చైనాలో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మరణించి మూడేళ్ళు దాటిన తర్వాత కూడా ఆయన.. గడ్డం, కనుబొమలు కలిగి ఉండటం చూపరులను విస్మయానికి గురి చేస్తోంది. తన జీవితాన్ని బౌద్ధ మతానికి అంకితం చేసిన ఫుహౌ మరణం తర్వాత ఆయన భౌతికకాయాన్ని ఓ తొట్టిలో భద్రపరిచారు. ఫుహౌ మరణానంతరం మూడేళ్ళ తర్వాత బుద్ధుడుగా మారతానని చెప్పాడంటూ అనుచరులు ఇటీవల ఆ బౌద్ధ సన్యాసి మమ్మీని తెరచి చూశారు. విలక్షణంగా ఉండే ఆయన గుబురు గడ్డంతోపాటు.. కనుబొమలు కూడా ఎప్పట్లాగే ఉండటాన్నిచూసి శిష్యగణం నిశ్చేష్టులయ్యారు. 1919 సంవత్సరంలో జన్మించిన ఫుహౌ 2012 జూన్ నెలలో మరణించారు. అప్పటికి ఆయనకు 94 ఏళ్ళ వయసు. పదమూడవ ఏటనే బౌద్ధమతం స్వీకరించిన ఆయన... అప్పట్లో తల నీలాలను తీయించుకొని గుండుతో... తూర్పు ప్రావిన్స్, ప్రధాన నగరం ఖ్వాంన్జులోని ఓ మఠంలో చేరారు. ఆయన ధాతృత్వంతో పులకించిపోయిన సహచరులు ఆయన్ను అమితంగా గౌరవించడం ప్రారంభించారు. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఆయనను ఖ్వాంన్జు ఫుజ్ హావ్ దేవాలయ మఠాధిపతిగా నియమించారు. బౌద్ధ సన్యాసి అయిన ఫుహౌ మరణించిన మూడేళ్ళకు బుద్ధుడుగా మారతానని చెప్పడంతో ఆయన శరీరాన్ని శిష్యుడైన జియాంగ్ యుఫెంగ్... కమలంవంటి ఓ తొట్టిలో ప్రత్యేక భంగిమలో భద్రపరిచాడు. అయితే గతవారం ఫుజ్ హావ్ ఆలయంలో ఫుహౌను భద్రపరిచిన తొట్టెను తెరిచి చూసిన శిష్యులు... మూడేళ్ళు దాటినా ఆయన శరీరం యథాస్థితిలో ఉండటంతోపాటు.. గడ్డం, కనుబొమలు కలిగి ఉండటంతో ఫుహౌ నిజంగా బుద్ధుని అవతారమేనని ప్రకటించారు. అంతేకాక భవిష్యత్తులో ఆయన శరీరం సురక్షితంగా ఉండేందుకు కావలసిన ఏర్పాట్లు చేసి... ప్రజలు, భక్తులు సందర్శించేందుకు వీలుగా సిద్ధం చేస్తున్నారు. అయితే ఆధ్యాత్మిక పరమైన బౌద్ధ కర్మల పట్ల చైనాలోని అధిక శాతం ప్రజలు ఎప్పట్నుంచో అనుమానాలు వ్యక్తం చేస్తున్నా... స్థానిక టావోయిజం, ఇస్లాం మతం, ప్రొటెస్టంట్, కాథలిక్ మత సంస్థలతోపాటు బుద్ధిజం కూడా అధికారికంగా ఒకటి కావడంతో సన్యాసులు పారంపర్యంగా వారి సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు.