ఈజిప్టు మమ్మీల గురించి కథనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇంతవరకు ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు విపులీకరించారు. ఆరోజుల్లో వారు ఎలాంటి వాటిని ఉపయోగించారో చూశాం. ఐతే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు ఇంకాస్తు ముందడుగు వేసి.. వేల ఏళ్ల నాటి పురానత మమ్మీ నుంచి పరిమళాలు వెదజల్లే 'సెంట్'ని తయారు చేశారు. మమ్మీఫికేషన్‌లో వాడే సుగంధాన్నే తిరిగి ఆ మమ్మీ సాయంతో రూపొందించామని చెబుతున్నారు. వాట్ పురాత మమ్మీతో సెంట్ ఎలా?! అనే కదా!
వివరాల్లోకెళ్తే..మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్‌లోని శాస్త్రవేత్తలు మమ్మీ 'సెనెట్‌నే' అనే ఈజిప్షియన్ మహిళ మమ్మీఫికేషన్‌లో ఉపయోగించిన పురాత సువాసనను వారు తిరిగి పునః సృష్టించారు. దీంతో ఆనాడు వారు ఉపయోగించిన పద్ధతులను తెలుసుకోగలిగామని అంటున్నారు. అందుకోసం మమ్మీ 'సెనెట్‌నే' ఊపిరితిత్తులు, కాలేయాన్ని రెండు పాత్రలలోకి తీసుకున్నారు. అప్పుడు వచ్చిన ఔషధ తైలాల నమునాలను సేకరించి వాటిలో ఉపయోగించిన పదార్థాలను కనుగొన్నారు.
వాటిలో బీస్వాక్స్, ప్లాంట్ ఆయిల్, కొవ్వులు, బిటుమెన్, పినేసి రెసిన్లు, ట్రీ రెసిన్ వంటి పరిమళ పదార్థాల సంక్లిష్ట మిశ్రమం అని గుర్తించారు. ఇది కాస్త 3వేల సంత్సరాల క్రితం ఉపయోగించిన సువాసన గల సెంట్‌ని తిరిగి రూపొందించేందుకు దారితీసింది. శాస్త్రవేత్తలు పునాదిలో లభించిన సేంద్రీయ అవశేషాలను ఉపయోగించి ఈ సువాసన గల 'సెంట్'ని తయారు చెయ్యడం విశేషం. ఈ 'సెంట్'ని శాస్త్రవేత్తలు "సెంట్ ఆఫ్ ఎటర్నీటీ" లేదా "సెంట్ ఆఫ్ లైఫ్" అని పిలుస్తున్నారు. ఈ "సెన్‌ట్‌నే" అనే మమ్మీకి మమ్మీఫికేషన్ ఉపయోగించే పదార్థాలు ఇప్పటివరకు గుర్తించని వాటితో రూపొందించినట్లు తెలిపారు.
వీటి కారణంగానే బాడీలు పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయని ఆ కాలంలోని వారు విశ్వసించటం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ఈ మమ్మీఫికేషన్‌లో అత్యంత ఖరీదైన పదార్థాలనే వాడినట్లు తెలిపారు. ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ కరోల్ కాల్వేజ్ సాయంతో పరిశోధకులు 3 వేల ఏళ్ల నాటి పురాతన సువాసనను పునః సృష్టించారు. త్వరలో డెన్మార్క్‌లోని మోస్‌గార్డ్ మ్యాజియంలో ఈ సెంట్ బాటిల్‌ని ఉంచనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఒకరకంగా ఈజిప్షియన్ మమ్మీల మమ్మీఫికేషన్‌కి సంబంధించిన రహస్యాలను మరింత చేధించేందుకు మార్గం సుగమం చేసింది.
So happy to share our new paper out today in @SciReports
— Barbara Huber (@Bara_Huber) August 31, 2023
"Biomolecular characterization of 3500-year-old ancient Egyptian mummification balms from the Valley of the Kings"https://t.co/0Uk46qvJZe
(చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...)
Comments
Please login to add a commentAdd a comment