mummy
-
వాట్! ఈజిప్టు మమ్మీ సాయంతో పురాతన కాలం నాటి "సెంట్"!
ఈజిప్టు మమ్మీల గురించి కథనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఇంతవరకు ఎన్నో విషయాలను శాస్త్రవేత్తలు విపులీకరించారు. ఆరోజుల్లో వారు ఎలాంటి వాటిని ఉపయోగించారో చూశాం. ఐతే ఇప్పుడు తాజాగా శాస్త్రవేత్తలు ఇంకాస్తు ముందడుగు వేసి.. వేల ఏళ్ల నాటి పురానత మమ్మీ నుంచి పరిమళాలు వెదజల్లే 'సెంట్'ని తయారు చేశారు. మమ్మీఫికేషన్‌లో వాడే సుగంధాన్నే తిరిగి ఆ మమ్మీ సాయంతో రూపొందించామని చెబుతున్నారు. వాట్ పురాత మమ్మీతో సెంట్ ఎలా?! అనే కదా! వివరాల్లోకెళ్తే..మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్లోని శాస్త్రవేత్తలు మమ్మీ 'సెనెట్నే' అనే ఈజిప్షియన్ మహిళ మమ్మీఫికేషన్‌లో ఉపయోగించిన పురాత సువాసనను వారు తిరిగి పునః సృష్టించారు. దీంతో ఆనాడు వారు ఉపయోగించిన పద్ధతులను తెలుసుకోగలిగామని అంటున్నారు. అందుకోసం మమ్మీ 'సెనెట్నే' ఊపిరితిత్తులు, కాలేయాన్ని రెండు పాత్రలలోకి తీసుకున్నారు. అప్పుడు వచ్చిన ఔషధ తైలాల నమునాలను సేకరించి వాటిలో ఉపయోగించిన పదార్థాలను కనుగొన్నారు. వాటిలో బీస్వాక్స్, ప్లాంట్ ఆయిల్, కొవ్వులు, బిటుమెన్, పినేసి రెసిన్లు, ట్రీ రెసిన్ వంటి పరిమళ పదార్థాల సంక్లిష్ట మిశ్రమం అని గుర్తించారు. ఇది కాస్త 3వేల సంత్సరాల క్రితం ఉపయోగించిన సువాసన గల సెంట్‌ని తిరిగి రూపొందించేందుకు దారితీసింది. శాస్త్రవేత్తలు పునాదిలో లభించిన సేంద్రీయ అవశేషాలను ఉపయోగించి ఈ సువాసన గల 'సెంట్'ని తయారు చెయ్యడం విశేషం. ఈ 'సెంట్'ని శాస్త్రవేత్తలు "సెంట్ ఆఫ్ ఎటర్నీటీ" లేదా "సెంట్ ఆఫ్ లైఫ్" అని పిలుస్తున్నారు. ఈ "సెన్ట్నే" అనే మమ్మీకి మమ్మీఫికేషన్ ఉపయోగించే పదార్థాలు ఇప్పటివరకు గుర్తించని వాటితో రూపొందించినట్లు తెలిపారు. వీటి కారణంగానే బాడీలు పాడవ్వకుండా సురక్షితంగా ఉంటాయని ఆ కాలంలోని వారు విశ్వసించటం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ఈ మమ్మీఫికేషన్‌లో అత్యంత ఖరీదైన పదార్థాలనే వాడినట్లు తెలిపారు. ఫ్రెంచ్ ఫెర్ఫ్యూమర్ కరోల్ కాల్వేజ్ సాయంతో పరిశోధకులు 3 వేల ఏళ్ల నాటి పురాతన సువాసనను పునః సృష్టించారు. త్వరలో డెన్మార్క్‌లోని మోస్గార్డ్ మ్యాజియంలో ఈ సెంట్ బాటిల్‌ని ఉంచనున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ పరిశోధన ఒకరకంగా ఈజిప్షియన్ మమ్మీల మమ్మీఫికేషన్కి సంబంధించిన రహస్యాలను మరింత చేధించేందుకు మార్గం సుగమం చేసింది. So happy to share our new paper out today in @SciReports "Biomolecular characterization of 3500-year-old ancient Egyptian mummification balms from the Valley of the Kings"https://t.co/0Uk46qvJZe — Barbara Huber (@Bara_Huber) August 31, 2023 (చదవండి: అమ్మాయి శవాన్ని తీస్తానంటూ..వికృత బొమ్మల్ని తీశాడు అంతే...) -
ఇకపై రెంట్‌కు డాడీ.. మమ్మీ చిల్ అవ్వొచ్చు!
ఇంతవరకూ అద్దెకు సామాన్లు ఇవ్వడం గురించే వినివుంటాం. ఇకపై మనుషులను కూడా ఆద్దెకు ఇచ్చే రోజులు వచ్చేశాయి. కాలం కన్నా ప్రపంచం వేగంగా ముందుకు దూసుకుపోతున్నట్లుంది. ఆ మధ్య అద్దెకు బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ దొరుకుతారనే విషయం విని విస్తుపోయాం. అయితే ఇప్పుడు అద్దెకు డాడీ దొరుకుతాడని తెలిస్తే మనమంతా ఏమైపోవాలి? ఏమనుకోవాలి? కన్న తండ్రిలా సంరక్షిస్తూ.. అద్దెకు దొరికే డాడీ కన్న తండ్రిలా పిల్లలను చూసుకుంటుంటే మమ్మీ ఎంచక్కా చిల్ అవ్వొచ్చు. ఈ వినూత్న సేవలు చైనాలో మొదలై, ప్రజల నుంచి ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ముఖ్యంగా ఈ సేవలు చిన్నపిల్లలను చూసుకోలేని తల్లుల కోసం అందిస్తున్నారు. అలాగే ఉద్యోగ వ్యాపకాల్లో ఉంటూ పిల్లలను చూసుకునేందుకు సమయం లేనివారికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. ఈ సేవల కారణంగా పలువురు తల్లులు తమ పిల్లలను అద్దె డాడీలకు నిశ్చింగా అప్పగించి, తాము చిల్ అవగలుగుతున్నారు. ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు ఇలా.. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టును అనుసరించి చైనాలోని ఒక బాత్‌హౌస్ అద్దెకు తండ్రులను అందించే సేవలను ప్రారంభించింది. చైనాలో బాత్ హౌస్‌లు ఎంతో ఆదరణ పొందుతుంటాయి. జనం రిలాక్స్ అయ్యేందుకు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ బాత్‌హౌస్‌లకు పురుషులతో పాటు మహిళలు కూడా వస్తుంటారు. ఇక్కడ పురుషులకు, మహిళలకు వేర్వేరుగా సెక్షన్లు ఉంటాయి. అయితే ఇక్కడికు వచ్చే కొందరు మహిళలు తమ చిన్నపిల్లలను తీసుకుని స్నానం చేయించుకునేందుకు, మసాజ్ చేయించుకునేందుకు వస్తుంటారు. వీరి ఇళ్లలో పిల్లలను చూసుకునేవారు లేకపోవడంతోనే వారు పిల్లలను తీసుకుని ఇక్కడికి వస్తుంటారు. అయితే పిల్లలను పక్కనే ఉంచుకుని స్నానం చేయడం, మసాజ్ చేయించుకోవడం వారికి ఇబ్బందిగా అనిపిస్తుంది. పిల్లలను పట్టుకునేందుకు.. ఆ సమయంలో పిల్లలను పట్టుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. మహిళల ఇటువంటి ఇబ్బందులను గ్రహించిన ఒక బాత్‌హౌస్ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలను ప్రారంభించింది. మహిళలు బాత్‌హౌస్‌కు వచ్చినప్పుడు వారి పిల్లలను ఈ అద్దె డాడీలు చూసుకుంటారు. అప్పుడు ఆ చిన్నారుల మమ్మీ హాయిగా బాత్‌హౌస్‌లో చిల్ అవుతారు. ఈ ‘డాడీ ఆన్ రెంట్’ సేవలు సోషల్ మీడియాలో చర్చాంశనీయంగా మారాయి. పిల్లల కోసం సౌకర్యాలు ఈ సేవలు అందుకునేందుకు తల్లులతో పాటు వచ్చే పిల్లలను అద్దె డాడీలు సంరక్షిస్తారు.పిల్లలకు స్నానాలు చేయించడం, దుస్తులు మార్పించడం, ఆహారం వడ్డించడం లాంటి సేవలను అద్దె డాడీలే చూసుకుంటారు. ఇటీవలనే ఈ సేవలను ప్రారంభించిన బాత్‌హౌస్ అద్దె డాడీలుగా నియమితులయ్యేవారికి శిక్షణ అందిస్తోంది. అలాగే ఈ సేవలకు సంబంధించిన గైడ్‌లైన్స్ రూపొందించింది. ఇది కూడా చదవండి: 9 ఏళ్ల అనాథ అనుకుంటే.. 22 ఏళ్ల యువతి.. దత్తత తీసుకుంటే చుక్కలు చూపించింది -
మమ్మీ అనొద్దు!
ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన మానవ అవశేషాలను మమ్మీ అని పిలవొద్దని, ఇకపై ఆ పదాన్ని బ్యాన్ చేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన మ్యూజియంలు ప్రకటించాయి. అలా పిలవడం.. చనిపోయిన వాళ్లను కించపరిచినట్లే అవుతుందని, అలాంటి పనికి తాము ఒప్పుకోబోమని ప్రకటించాయి. బతికి ఉన్నవాళ్లకు ఎలాంటి హక్కులు ఉంటాయో..చనిపోయిన వాళ్ల హక్కులను కాపాడడం, గౌరవించడం అందరి బాధ్యత. మమ్మీ అనే పదానికి బదులుగా మమ్మీఫైడ్ పర్సన్ అని పిలవాలని, లేదంటే ఫలానా ఆనవాలు పేరు తెలిసిఉంటే.. పేరు పెట్టి అయినా పిలవాలని మ్యూజియంలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని ఓ మ్యూజియం ఏకంగా బ్లాగ్‌లో ఈవిషయాన్ని పొందుపరిచింది. -
వందేళ్ల క్రితం చనిపోయిన చిన్నారి... ఇంకా ఇప్పటికీ చెక్కుచెదరకుండా..
ఇంతవరకు ఎన్నోరకాల మమ్మీలు గురించి చదివాం. పైగా వాటి అవయవాలు జాలా జాగ్రత్తగా భద్రపర్చారంటూ విన్నాం. ఆయా మమ్మీల వద్ద విలువైన నాణేలు, బంగారం వంటి వస్తువులను చూశాం. ఇంతవరకు చూసిన మమ్మీలన్నీ చాలా వరకు కాస్త డికంపోజ్ అయినట్లుగానే ఉన్నాయి. చనిపోయినప్పుడు ఎలా ఉండేవో అలానే యథాతథంగా ఉండటం అసాథ్యం. కానీ ఇక్కడొక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది. వివరాల్లోకెళ్తే....రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న తన రెండో పుట్టిన రోజున చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి 1920 మధ్య కాలంలో స్పానిష్ ప్లూ మహమ్మారీ ప్రబలంగా ఉండేది. ఆ సమయంలో ఈ చిన్నారి ఆ మహమ్మారి బారిన పడి మృతి చెందింది. అప్పటి నుంచి ఆ చిన్నారి మృతదేహాన్ని మమ్మీలా అత్యంతా జాగ్రత్తగా భద్రపరిచారు. ఈ మేరకు ఆ చిన్నారి మృతదేహం ఉత్తర సిసిలీలో పలెర్మోలోని కాపుచిన్ కాటాకాంబ్స్ అనే చోట భద్రపరచారు. వందేళ్ల తర్వాత కూడా ఆ చిన్నారి మృతదేహం ఆమె చనిపోయినప్పుడూ ఎలాగా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండటం గమనార్హం. పర్యావరణ కారకాల నుంచి ఆ మృతదేహం పాడవకుండా అత్యంత బహు జాగ్రత్తగా నైట్రోజన్‌తో నిండిన గాజు సేవ పేటికలో భద్రపరిచారు. ఈ చిన్నారి మమ్మీ ప్రస్తుతం పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ కాపుచిన్ కాటాకాంబ్స్ అనేది దక్షిణ ఇటలీలో ఉండే అతి పెద్ద మమ్మీల పరిశోధన కేంద్రం లేదా మమ్మీలను భద్రపరిచే భూగర్భ శ్మశాన వాటిక. ఇందులో దాదాపు ఎనిమిది వేల మమ్మీలు ఉన్నాయి. రోసాలియా అనే రెండెళ్ల చిన్నారిని భద్రపరిచినంతగా మిగతా వాటిని భద్రపర్చలేదు. ఆ చిన్నారి రాగి జుట్టు, చర్మం రంగు మారకుండా ఏదో మనిషి నిద్రపోతున్నట్లుగా ఉంటుంది. చాలామంది నకిలీ మమ్మీ అని, మైనపు ముద్ద అంటూ పుకార్లు సృష్టించారు. మరికొంతమంది ఆ చిన్నారిని చూసినప్పుడు మమ్మల్ని చూసి రెప్పవేసిందని కూడా చెప్పారు. ఐతే వాటన్నింటిని కొట్టి పారేస్తూ...ఆ చిన్నారి శరీరం పై చేసిన పరిశోధనల్లో శరీరం, ఎముకలు, అవయవాలు ఏ మాత్రం చెక్కు చెదరలేదని, కేవలం మెదడు మాత్రమే ఉండాల్సిన పరిమాణం నుంచి 50% తగ్గిపోయిందని నిర్థారించారు ఆర్కియాలజిస్ట్‌లు. ఏ మాత్రం పాడవకుండా ఉన్న ఈ చిన్నారి మమ్మీ ఇటలీ పురాణాల్లో ప్రసిద్ద అంశంగా మారింది. ఈ చిన్నారిని టాక్సీడెర్మిస్ట్, ఎంబాల్మర్ ఆల్ఫ్రెడో సలాఫియాలు మమ్మీగా మార్చారని చెబుతున్నారు. కానీ కొంతమంది శాస్తవేత్తలు మాత్రం ఈ మమ్మీ శవపేటికలో ఉండటం వల్ల ఇరు పక్కల ఉండే గాజు విండోలు ఒక ఆప్టికల్ ఇల్యూషన్ కలిగించి ఆ మమ్మీ చెక్కుచెదరకుండా ఉన్నట్లు కనిపించేలా చేస్తున్నాయని, పగటి పూట వేరేలా ఉంటుందని చెబుతున్నారు. (చదవండి: ఏనుగులతో సెల్ఫీ అంటే... అట్లుంటది మరీ!) -
2 వేల ఏళ్లనాటి మమ్మీ కడుపులోని పిండాన్ని గుర్తించిన సైంటిస్టులు!!
Foetus Found In The Abdomen Of An Egyptian Mummy: ఇంతవరకు ఈ జిప్షియన్ మమ్మీలపై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. ఇటీవలే మమ్మీలను తాకుకుండానే సరికొత్త సాంకేతికత కూడిన మమ్మఫికేషన్ సాయంతో పరిశోధించడం గురించి విన్నాం. ఆ సాంకేతిక సాయంతో 20 ఏళ్ల నాట్టి ఈజిప్షియన్ మమ్మి కడుపులో భద్రంగా ఉన్న పిండాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. అసలు విషయంలోకెళ్తే...20 వేల ఏళ్లనాటి ఈజిప్షియన్ మమ్మీ పొత్తికడుపులో పిండాన్ని గుర్తించారు. ఈ మేరకు వార్సా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆ పిండం పై పరిశోధనుల చేశారు. సీటీ ఎక్స్ రే స్కాన్ సాయంతో పుట్టబోయే బిడ్డ అవశేషల ఉనికిని వెల్లడించారు. అంతేకాదు దీన్ని మమ్మీ పిండాన్ని కలిగి ఉన్న తొలి ఎంబాల్డ్ నమూనాగా విశ్వస్తారని చెప్పారు. అయితే 20 ఏళ్ల వయసులో చనిపోయిన ఈ మమ్మీని 'మిస్టిరియస్ లేడీ' అని పిలుస్తారు. అయితే ఆ మహిళ ప్రసవంలో చనిపోలేదని పరిశోధకులు తెలిపారు. అంతేకాదు ఆ మహిళ మరణానికి గల కారణాలు గురించి తెలియలేదని చెప్పారు. పైగా ఆ మమ్మీ సమాధి శిధిలమైపోయిందని తెలిపారు. అయితే ఆ మహిళ గర్భం దాల్చిన 26 నుంచి 30 వారాల పిండంగా నిర్ధారించారు. కానీ మమ్మీలను రసాయన పదార్థాలను పూసి ఉంచడం వల్ల ఆ మమ్మీ కడుపులోని పిండంలోని ఎముకలు నిర్విర్యం అయిపోయాయని చెప్పారు. అయితే ఆ పిండం పై ఉన్న మృదు కణజాలంతో ఆ పిండాకృతిని గుర్తించడం కష్టతరమవుతుందని తెలిపారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు మమ్మీఫికేషన్ ప్రక్రియలో మమ్మీ శరీరంలోని అంతర్గత భాగాలను తొలగించే క్రమంలో వారు ఎందుకు పిండాన్ని పొత్తికడుపులోనే వదిలేశారు అనే దాని వీద శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. -
బాప్రే.. గుర్తుపట్టలేనంతలా మారిపోయిన హీరో
వయసుపైబడే కొద్దీ హీరోయిన్లు తమ గ్లామర్‌ను కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక హీరోల్లో కూడా కొందరుపడే తాపత్రయం ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ, సినిమా కోసం ఎంతటి కష్టానినైనా ఒర్చుకునే ‘డెడికేటెడ్ యాక్టర్స్’ కొందరే ఉంటారు. అలాంటి వాళ్లలో హాలీవుడ్ నటుడు బ్రెండన్ ఫ్రాజర్ ఒకరు. మమ్మీ సిరీస్ సినిమాలతో మనదగ్గరా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. గుర్తుపట్టలేనంతలా మారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రెండన్ ఫాజర్.. జార్జ్ ఆఫ్ ది జంగిల్, మమ్మీ, బ్రేక్ అవుట్ లాంటి సినిమాలతో వరల్డ్‌వైడ్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. 52 ఏళ్ల ఈ హాలీవుడ్ స్టార్ శుక్రవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన ట్రైబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో ‘నో సడన్ మూవ్’ ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యాడు. అయితే బయట ఉన్న ఫొటోగ్రాఫర్లు ఆయనెవరో అనుకుని చాలాసేపు పట్టించుకోలేదు. చివరికి.. నటుడు డాన్ చెడల్ ఆయన దగ్గరికి రావడంతో.. అప్పుడు విషయం తెలుసుకుని ఫ్రాజర్‌ను క్లిక్ మనిపించారు. ఫ్రాజర్ ప్రస్తుతం ‘ది వేల్’ అనే ప్రాజెక్టు చేస్తున్నాడు. కూతురికి దగ్గరవ్వాలని ప్రయత్నించే తండ్రి క్యారెక్టర్ అందులో ఆయనది. తన పార్ట్నర్ చనిపోయాక ఈటింగ్ డిజార్డర్‌తో బాధపడే ఛార్లీ పాత్రలో ఫ్రాజర్ కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ కోసమే ఇంత భారీగా లావుగా తయారయ్యాడు ఫ్రాజర్. 2018లో ఓ ఇంటర్వ్యూలో బ్రెండన్ ఫ్రాజర్ తన ఫెయిల్యూర్ ఫిట్నెస్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు. రియల్ స్టంట్లకు కోసం తన ఒళ్లు హూనం చేసుకున్నానని, ఇకపై అలాంటి ప్రయోగాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. ఇక ఆరోగ్య సమస్యలతోనే 2014 నుంచి ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు ఫ్రాజర్. అంతేకాదు గతంలో తనకు చాలా సర్జరీలు జరిగాయని, వెనుక పిరుదుల దగ్గర భాగం తొలగించుకోవడం, వెన్నెముకకు సర్జరీ, మోకాలి చిప్ప రిప్లేస్మెంట్, గొంతు భాగంలో ఆపరేషన్లు చేయించుకున్నానని, వాటి ప్రతికూల ప్రభావమూ తన శరీరంపై పడిందని గుర్తు చేసుకుని బ్రెండన్ ఫ్రాజర్ బాధపడ్డాడు. చదవండి: జస్టిస్ లీగ్.. పోర్న్ సినిమానా? -
‘మమ్మీ’ రాకుమారి తన దేశానికి వెళ్లిపోయింది
సూకర్ : 500 ఏళ్లనాటి బొలీవియన్ ‘మమ్మీ’ రాకుమారి సొంత దేశానికి తిరిగి వెళ్లిపోయింది. 129 సంవత్సరాల క్రితం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ మ్యూజియానికి ఇచ్చిన మమ్మీని బొలీవియా వెనక్కు తెప్పించుకుంది. ఇతర దేశాలకు ఇచ్చిన పురాతన వస్తువులను తిరిగి తెచ్చే చర్యల్లో భాగంగా బొలీవియా ఈ నిర్ణయం తీసుకుంది. లా పజ్‌లోని యూఎస్ ఎంబసీ అధికారుల సహకారంతో మమ్మీ సొంత దేశానికి తరలివెళ్లింది. నవంబర్‌నుంచి బొలీవియన్ విద్యావేత్తలు, ఇతర పరిశోధకుల నేతృత్వంలో రాకుమారిపై పరిశోధనలు జరిగే అవకాశం ఉంది. ఈ మమ్మీ 15వ శతాబ్దానికి చెందినదని రేడియో కార్బన్ పరిశోధనల్లో తేలింది. రాకుమారి ఆండియన్ హైలాండ్స్కు దగ్గరలోని లా పజ్ ‘‘ఇంకా నాగరిత’’కు చెందినదిగా పురావస్తు పరిశోధకులు గుర్తించారు. ఈమె ఏనిమిదేళ్ల వయస్సులో సమాధి చేయబడినట్లు భావిస్తున్నారు. సమాధి నుంచి వెలికి తీసినపుడు రాకుమారి చెప్పులు ధరించి ఉంది. మట్టి పాత్రలతో పాటు ఇతర వస్తువులు, ఈకలు, మొక్కలు సమాధిలో ఉన్నాయి. ఇప్పటికీ మమ్మీ రాకుమారి చేతి వేళ్ల మధ్య ఈకలు ఉండటం మనం గమనించవచ్చు. -
‘మమ్మీ’ చెప్పిన కథ.. కట్టుకథేనట...
ఈ ‘మమ్మీ’ చెప్పిన కథ.. కట్టుకథేనట. ఎలుగుబంటి దాడిలో గాయపడి.. దాని గుహలో నెలరోజులపాటు ఉండి.. మృత్యుంజయుడిలా బయటపడ్డాడంటూ అలెగ్జాండర్ అనే వ్యక్తి గురించి పాశ్చాత్య మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ‘నన్ను తర్వాత తినడానికి వీలుగా ఇక్కడ దాచి పెట్టి ఉంచింది’ అంటూ అతడు చెప్పాడని తెలిపాయి. అయితే.. అవన్నీ అబద్ధాలని కజకిస్థాన్‌కు చెందిన వైద్యుడు రుస్తుం ఇసేవ్ చెబుతున్నారు. ‘మమ్మీ’లా కనిపించిన అలెగ్జాండర్ అసలు ఫొటో ఇదిగో ఇదేనట. ఇతడు తీవ్రమైన సొరియాసిస్ వ్యాధితోపాటు ఇతర రుగ్మతలతో బాధపడుతున్నాడట. అందువల్లే అలా అయిపోయాడట. అలెగ్జాండర్ కజకిస్థాన్‌కు చెందినవాడని.. ప్రస్తుతం ఔట్ పేషెంట్ కింద తమ వద్ద చికిత్స తీసుకుంటున్నాడని రుస్తుం తెలిపారు. తమ కుమారుడిని ఎలుగుబంటి దాడి బాధితుడిగా చూపించడం.. మమ్మీ అనడం వంటి వాటి వల్ల అలెగ్జాండర్ తల్లి ఎంతో బాధపడుతున్నారని.. అతడి గురించి మరే వివరాలు వెల్లడించవద్దని తమను కోరారని వివరించారు. చదవండి: ‘మమ్మీ’ మనిషి కథలో కొత్త మలుపు! అలెగ్జాండర్ అసలు ఫొటో.. -
ఆ ద్రావం తాగితే అతీత శక్తులు..!!
సాక్షి, వెబ్ డెస్క్ : 2018 ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా రకాల వింతలు జరిగాయి. మరీ ముఖ్యంగా వంటల విషయంలో. ఎలాంటి పానీయం తీసుకోకుండా టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడిని తినడం నుంచి లిక్విడ్ డిటర్జెంట్‌ను గడగడా తాగేయడం లాంటి వీడియోలు నెట్టింట్లో సంచలన సృష్టించాయి. తాజాగా 17 వేల మందికి కలిగిన సరికొత్త కోరిక గురించి తెలిస్తే షాక్‌కు గురవుతారు. ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నగరం కింద భూమి లోపల 16 అడుగుల లోతులో నల్లరాతి శవకోష్టిక లభ్యమైన సంగతి తెలిసిందే. దాదాపు 2000 ఏళ్ల క్రితం శవకోష్టికను భూస్థాపితం చేశారు. శాపానికి గురవుతామా? అనే భయాల మధ్య ఈజిప్టు పురాతత్వ కౌన్సిల్ చీఫ్ ఆదేశాల మేరకు ఇటీవల ఆ శవకోష్టికను తెరిచారు. అందులో ముగ్గురు వ్యక్తుల మమ్మీలు బయల్పడ్డాయి. అయితే, ఆ మూడు మమ్మీలు ఎరుపు రంగులో ఉన్న ఓ ప్రత్యేక ద్రావంలో మునిగి ఉన్నాయి. మమ్మీలను బయటకు తీసిన పరిశోధకులు అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవి కావని తేల్చారు. ఈ సంఘటనను కళ్లప్పగించుకుని చూసిన కొందరు ఇప్పుడు ఆ ఎరుపు రంగు ద్రావాన్ని తాగేందుకు తమను అనుమతించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఛేంజ్.ఆర్గ్ అనే ఓ వెబ్సైట్ పిటిషన్‌ను సైతం దాఖలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 17 వేల మందికి పైగా శవ కోష్టికలో ఉన్న ద్రావాన్ని తాగడానికి ఇష్టపడుతున్నారని, వారికి అవకాశం ఇవ్వాలనేది సదరు పిటిషన్ సారాంశం. శాపగ్రస్తమైన నల్లరాతి శవకోష్టికలోని ఆ ద్రావాన్ని తాగితే అతీత శక్తులు సంక్రమిస్తాయని, ఆ తర్వాత చనిపోతామని వారందరూ విశ్వసిస్తున్నారని పిటిషనర్ మెక్కెన్డ్రిక్ పేర్కొన్నారు. మరణించే హక్కును గురించి ప్రస్తావిస్తూ సదరు ద్రావాన్ని తాగేందుకు వారికి అనుమతి ఇవ్వాలని ఆయన పిటిషన్లో కోరారు. అయితే, ఈజిప్టు పురాతత్వ శాఖ మాత్రం వేల మంది ప్రజలు శవకోష్టికలోని ద్రావాన్ని తాగేందుకు ఆసక్తి కనబరచడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సదరు ద్రావం ఒట్టి మురికి నీరు మాత్రమేనని పేర్కొంది. ఎముకలు, ఇతర శరీర భాగాల నుంచి ఆ ద్రవం తయారైందని తెలిపింది. దానికి ఎలాంటి అతీత శక్తులు లేవని కొట్టిపారేసింది. దీనిపై అరిజోనా స్టేట్ యూనివర్శిటీలోని బయోడిజైన్ ఇనిస్టిట్యూట్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న రోల్ఫ్ హాల్డెన్ మాట్లాడుతూ.. కుళ్లిపోతున్న శరీరాలను నుంచి ఆ ద్రవం తయారైవుంటుందని చెప్పారు. వేల సంవత్సరాలుగా అలానే ఉన్న ఆ ద్రవంలో అతి భయంకరమైన బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయని హెచ్చరించారు. పొరబాటున ఆ ద్రవాన్ని తాగితే విపత్కర పరిస్థితిని ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. శవ కోష్టికను తెరిచారు.. శాపం తగిలిందా..? -
శవ కోష్టికను తెరిచారు.. శాపం తగిలిందా..?
అలెగ్జాండ్రియా : చారిత్రక ఈజిప్టు పోర్టు నగరం అలెగ్జాండ్రియా కింద 16 అడుగుల లోతులో భద్రపర్చిన 2000 సంవత్సరాల నాటి నల్లరాతి శవకోష్టికను శాస్త్రవేత్తలు తెరిచారు. దాదాపు 10 అడుగుల పొడవు, 30 టన్నుల బరువున్న కోష్టిక నుంచి మూడు మమ్మీల పుర్రెలు బయటపడ్డాయి. పుర్రెలతో పాటు కోష్టికలోని ఎరుపు రంగు పదార్థం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పదార్థం వల్ల మృతదేహాలు అతి వేగంగా కుళ్లిపోయి ఉంటాయని పరిశోధకులు భావిస్తున్నారు. శవ కోష్టికను తెరిస్తే శాపానికి గురవుతామనే నమ్మకం నరనరాల్లో జీర్ణించుకుని పోయిన వేళ ఈజిప్టు పురాతత్వ సుప్రీమ్ కౌన్సిల్ ముస్తఫా వాజిరీ దాన్ని తెరవాలని ఆదేశించి సంచలనం రేపారు. ఆయన ఆదేశాల మేరకు కొద్ది రోజుల క్రితం కోష్టికను తెరవగా మూడు పుర్రెలు, ఎరుపు రంగు పదార్థం బయల్పడ్డాయి. దీనిపై మాట్లాడిన వాజిరీ కోష్టికను తెరిచామని, ఎలాంటి శాపానికి గురి కాలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేకమైన నల్లరాతి కోష్టికలో మృతదేహాలను భద్రపర్చడంతో అవి రోమన్ రాజ కుటుంబానికి చెందినవని తొలుత భావించారు. పైగా కోష్టికపై కింగ్ అలెగ్జాండర్ పేరు ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. అయితే, బయల్పడిన మూడు మమ్మీలు రోమన్ రాజ కుటుంబానికి చెందిన వ్యక్తులవి కావని పరిశోధకులు తేల్చారు. రాజ కుటుంబీకుల సమాధులు ఇంకా భారీగా ఉంటాయని వారు పేర్కొన్నారు. అలెగ్జాండర్ సమాధి దీనికి ఎన్నో రెట్లు పెద్దగా ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. -
ఆ తల ఎవరిదో తెలిసింది..!!
సాక్షి, వెబ్ డెస్క్ : నాలుగు వేల సంవత్సరాల క్రితం మరణించిన ఓ వ్యక్తి తల వెనుక దాగివున్న రహస్యాన్ని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) చేధించింది. 1915లో ఈజిప్టులోని డెయిర్ ఎల్ బర్షా ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుండగా వారికి ఓ మమ్మీ తల లభ్యమైంది. అయితే, ఎంత ప్రయత్నించినా మమ్మీ ఏ కాలానికి చెందినదో వారు కనుక్కోలేకపోయారు. 1920 నుంచి తవ్వకాల్లో శాస్త్రవేత్తలకు లభ్యమైన వస్తువులు అన్నింటిని(మమ్మీ తలతో సహా) బోస్టన్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజియంలో భద్రపరిచారు. తాజాగా దాదాపు 100 ఏళ్ల తర్వాత మమ్మీ తల వెనుక దాగివున్న మిస్టరీని ఎఫ్‌బీఐ బయటపెట్టింది. మమ్మీ పన్నుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా అది ఒక పురుషుడిగా తేలిందని ఎఫ్‌బీఐ ‘జెనెస్’ అనే జర్నల్‌లో పేర్కొంది. డీఎన్ఏ పరీక్షల్లో అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడం వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు అంటున్నారు. నిజానికి ఆ మమ్మీ తల అప్పటి బ్రిటీష్ గవర్నర్ డ్జేహుటైనాక్ట్‌ది అని ఎఫ్‌బీఐ తెలిపింది. గవర్నర్ దంపతుల మరణం అనంతరం వారిని ప్రత్యేక ప్రదేశంలో పూడ్చిపెట్టారని చెప్పింది. కానీ దొంగలు వారి శరీరంపై ఉన్న ఆభరణాల కోసం 30 అడుగుల లోతులో పాతిపెట్టిన శవపేటికను తవ్వి తీశారని వివరించింది. ఆ తర్వాత ఆభరణాలను చోరీ చేసి పేటికను దగ్గరలోని గుహలో పడేశారని వెల్లడించింది. -
సమాధుల వయసు 3500 ఏళ్లు
-
ఆ.. సమాధుల వయసు 3500 ఏళ్లు
లగ్జర్ సిటీ (ఈజిఫ్ట్) : ఈజిఫ్ట్‌లోని లగ్జర్ సిటిలో అత్యంత పురాతనమైన రెండు సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు శనివారం గుర్తించారు. ఈజిఫ్ట్‌ను పాలించిన ఫారో రాజుల్లో 18వ రాజవశాంనికి చెందినవారివిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. రెండు సమాధుల్లో ఒకదానికి 5 ప్రధాన ద్వారాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. రెండు సమాధులు దీర్ఘచతురస్రాకారంలో ఉన్నట్లు వారు చెప్పారు. సమాధుల్లోపల పెద్ద హాల్, అందులో రెండు అంత్యక్రియల కోసం నిర్వహించే వస్తువులు, మట్టి పాత్రలు ఉన్నాయి. అందులోనే రెండు మమ్మీలతో పాటు బంగారు ఆభరణాలను కూడా అధికారులు గుర్తించారు. ఈ సమాధుల వయసు సుమారు 3,500 ఏళ్లు ఉంటాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మమ్మీ శాపం నిజమా?
బంగారు నిధిని కనిపెట్టాం దాన్ని తవ్వాలంటే నరబలి ఇవ్వాలి. లేదంటే ఆ నిధి మనల్ని శపిస్తుందన్న కారణంతో జరిగే ఆకృత్యాలను మనం అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం. గుప్తనిధి, సమాధుల్లో అతీంద్రియ శక్తులు ఉంటాయని వాటిని తవ్వితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. ఈజిప్టులో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమాధిని తవ్విన వ్యక్తులు వివిధ కారణాలతో ఆకస్మాత్తుగా మరణించారు. మరి వారి మరణానికి కారణాలేంటి...? నిజంగా సమాధిలోని శక్తి వారిని చంపిందా లేక మరేదైనా కారణాలతో చనిపోయారా అన్న విషయాలను ఈ రోజు తెలుసుకుందాం...! ఈజిప్టువాసులకు పునర్జన్మ, మరణం అనంతరం జీవితంపై అంతులేని విశ్వాసం. అందుకే, వ్యక్తి మరణించినా.. వారు తిరిగి లేస్తారని భావించేవారు. అందుకే, వారి శరీరాలు పాడవకుండా జాగ్రత్తగా ఖననం చేసేవారు. చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణమొస్తే.. అతనికి ఉపయోగపడేలా.. కావాల్సిన పాత్రలు, వస్తువులను సమాధిలో ఉంచేవారు. చనిపోయింది రాజులైతే.. వారికి తోడుగా పనివాళ్లని కూడా బతికుండగానే.. మమ్మీలుగా మార్చేవారు. అలాంటిది ఏకంగా ఈజిప్టు రాజు ట్యుట్ అంక్ మూన్ అనే రాజు మరణించాడు. వారి ఆచారాల ప్రకారం అతినికిష్టమైన వస్తువులు, కళాఖండాలు బంగారంతో పొదిగిన ఆభరణాలు అతనితోపాటే సమాధిలో పెట్టారు. అంతేకాదు సమాధిలో ఆయన తినడానికి వీలుగా బంగారు, వెండితో చేసిన పాత్రలను కూడా ఉంచారు. టూట్స్ సమాధిలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయని అక్కడి ప్రజలందరికి తెలిసినప్పటికీ దాన్ని ఎవరూ తెరిచేందుకు సాహసించేవారు కాదు. ఎందుకంటే ఆ సమాధిని తెరిస్తే తాము శాపానికి గురై అకాలమరణం చెందుతామని వారి విశ్వాసం. స్థానికులు వారించినా 1923లో బ్రిటిష్ ఆర్కియాలజికల్ సంస్థకు చెందిన లార్డ్ కార్నర్వాన్, హవర్డ్కార్టర్లు టూట్స్ సమాధి తెరిచేందుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను జార్జ్ హెబర్ట్ నిధులు సమకూర్చారు. సమాధి తెరిస్తే శాపానికి గురౌతారని స్థానికులు ఎంత వారించినప్పటికీ వారి ప్రయత్నాన్ని మాత్రం విరమించుకోలేదు. ఇలాంటి మూఢవిశ్వాసాలను తామేమాత్రం లెక్కచేయమన్నారు. కార్నర్వాన్ ఆధ్వర్యంలో సమాధిని తెరిచారు. అయితే సమాధిని తెరిచిన నెలరోజులకు ఒకరోజు ఉదయం కార్నర్వాన్ గడ్డం గీసుకుంటుండగా అతని చెంపపై దోమ కుట్టింది. అది ఇన్ఫెక్షన్గా మారడంతో ఆసుపత్రికి వెళ్లాడు. ఆయన ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, ఎన్ని మందులు వాడినప్పటికీ ఇన్ఫెక్షన్ తగ్గలేదు. చివరికి ఆయన శరీరంలోని రక్తం కుళ్లిపోయి కార్నర్వాన్ మరణించాడు. ఇలా ఆ సమాధి తెరిచినప్పుడు ఉన్న వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మరణించడం మొదలైంది. ఒకరు ఆత్మహత్య చేసుకుంటే మరొకరు అనారోగ్య కారణాలతోగానీ మరేదైనా కారణాలతోగానీ మరణించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే ఆ సమాధిని తెరవడం వల్లనే శాపానికి గురై మరణించారని ప్రచారం మొదలైంది. స్థానికంగా ఉన్న మీడియా కూడా సమాధిలో ఉన్న శక్తే వీరిని శపించిందని కథనాలు రాసింది. కార్నర్ మరణం ఒక్కటే కాదు ఆ సమాధిలో ఉన్న ప్రతిఒక్కరూ మరణిస్తారనుకున్నారు స్థానికులు. సమాధి తెరిచేందుకు సహకరించిన వ్యక్తులు ఆకస్మాత్తుగా మరణిస్తుండటంతో ఈ పుకార్లు మరింత షికారు చేసాయి. ఏది నిజం? ఇలా ఒకరితర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఆకస్మిక మరణాలకు కారణాలేంటని శాస్త్రవేత్తలు పరిశోధనలు మొదలుపెట్టారు. నిజంగా సమాధిలో ఉన్న శక్తి శపించడం మూలాన వారు మరణించారా? లేదా మరేదైనా కారణాలతో మరణించారా అని అధ్యయనం సాగించారు. దానికి వారు కొన్ని కారణాలను ఉదహరించారు. సమాధిని ఇతరులెవరూ తెరవకుండా ఉండేందుకు ఆ శవపేటికల గోడలకు గుర్తు తెలియని విషాన్ని పూసి ఉంటారన్నది కొందరు విశ్లేషించారు. లేదా వేల ఏళ్లుగా సమాధి గోడలపై ఉన్న ప్రమాదకర బ్యాక్టీరియా వారి చేతుల ద్వారా శరీరంలోకి వెళ్లి అనారోగ్యం బారిన పడిఉంటారని మరికొందరు వివరించారు. అంతేకాదు.. అక్కడున్న వ్యక్తులకు ఇదివరకు వివిధ అనారోగ్య సమస్యలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ, పుకారుకు వేగమెక్కువ కాబట్టి.. జనాలు శాపాన్నే ఎక్కువగా నమ్మారు. అయితే, సమాధిని తెరిచిన తర్వాత తొలిసారి అందులోకి దిగిన హవార్డ్ కార్టర్ మాత్రం పది సంవత్సరాలకు పైగా జీవించడం విశేషం.– సాక్షి స్కూల్ ఎడిషన్ -
ఒక మమ్మీ.. ఏడు శాపాలు
చావుకు చావు ఉండదన్నది మమ్మీని చూస్తేనే అర్థం కావాలేమో! మట్టిలో కొట్టుకుపోవాల్సింది ఇసుకై లేస్తుందని మనకెలా తెలుసు? వంద శవపేటికలు కూడా బందీ చెయ్యలేని దానిని కట్లు కట్టి.. పీట ముడులు వేసి, పాతి పెడితే... ఏడు శాపాలను ఈనింది.. ఈ మమ్మీ! ఏడు సమాధుల్ని కట్టింది. అనగనగా ఏడుగురు రాకుమారులు. ఏడుగురూ వేటకెళ్లి... కథ తెలిసిందే. కానీ ఇది ఏడు చేపల కథ కాదు. ఏడు శాపాల కథ. లొకేషన్ : ఈస్ట్ వ్యాలీ ఆఫ్ కింగ్స్ కంట్రీ : ఈజిప్టు ::: సంవత్సరం : 1922 హోవర్డ్ కార్టర్, ఆయన పరిశోధక బృందం ఇసుక మేటల్లో నడుస్తోంది. వాళ్లంతా ఆర్కియాలజిస్టులు, ఈజిప్టాలజిస్టులు. ప్రాచీన ఈజిప్టులోని మార్మికతల్ని శోధించడం కోసం కొన్నాళ్లుగా అక్కడక్కడే తిరుగుతున్నారు. ‘‘మిస్టర్ హోవర్ట్.. ఇక్కడేదో కనిపిస్తోంది’’... పెద్దగా అరిచాడు ఆ బృందంలోని ఒక సైంటిస్ట్. అవును కనిపిస్తోంది. మెట్లమార్గం! ఆ రోజు నవంబర్ 4. మర్నాటికి బృందమంతా ఆ మెట్ల మార్గంలోంచి లోపలికి వెళ్లగలిగింది. అక్కడొక సమాధి ఉంది! ‘తెరిచి చూద్దాం’ అనుకున్నారంతా. కానీ ఇరవై ఐదు రోజులకు గానీ తెరవలేకపోయారు. అంత మిస్టిక్‌గా ఉంది సమాధి చుట్టూ ఉన్న నిర్మాణం. మొత్తానికి నవంబర్ 29న సమాధి మూత తెరిచారు. మర్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. పర్మిషన్ల కోసం మధ్యలో కొన్ని రోజులు పని ఆగింది. డిసెంబర్ 27న సమాధిలోపలి పేటిక పక్కన ఉన్న ఒక పురావస్తువును బయటికి తీశారు. తర్వాత మళ్లీ కొన్ని రోజులు పని ఆగింది. 1923 ఫిబ్రవరి 16న.. సమాధి లోపలి శవపేటికను తెరిచారు. ఏప్రిల్ 5న లార్డ్ కార్నర్వాన్ చనిపోయాడు! కార్నర్వాన్... ఈ పురావస్తు పరిశోధనకు డబ్బులు పెట్టిన పెద్దమనిషి. శవపేటికలో మమ్మీ ఉంది! ఆ మమ్మీలో ఉన్నది ఈజిప్టు చక్రవర్తి టుటంఖమున్. ఎవరో అన్నారు.. టుటంఖమున్ మమ్మీ శపించి ఉంటుందని! టెర్రర్ మొదలైంది. మమ్మీని చూసి ఎవరైనా టెర్రర్ అవ్వాల్సిందేమీ లేదు! మమ్మీ శపిస్తేనే.. వర్రీ అవ్వాలి! మమ్మీ శపిస్తుందా! అవునట. సమాధిలో తన నిద్రను డిస్టర్బ్ చేస్తే అంతు చూస్తుందట. టుటంఖమున్ కూడా శపించే ఉంటాడా? టుటంఖమున్ క్రీ.పూ. 1332 నుంచి 1322 వరకు కింగ్. అతడెలా చనిపోయాడో ఎవరికీ తెలీదు. అదొక మిస్టరీ. దాన్ని ఛేదించడానికి రాల్ఫ్ మిషెల్ అనే హార్వర్డ్ యూనివర్సిటీ మైక్రోబయాలజిస్ట్ బయల్దేరాడు. సమాధి చుట్టూ ఉండే గోడలపై కొన్ని చోట్ల పచ్చిగా ఉన్నప్పుడే పెయింట్ చెదిరిపోయినట్లుగా ఉన్నట్లుంది. సో.. టుటంఖమున్ని హర్రీగా పూడ్చిపెట్టారు. ఖతం చేసి, ఖననం చేశారు. ఇదీ ఆయన అబ్జర్వేషన్. అక్కడితో ఊరుకున్నాడు రాల్ఫ్. బతికిపోయాడు. కానీ.. లార్డ్ కర్నార్వన్ అలా ఊరుకోలేదు. తవ్వి తియ్యండి చూద్దాం అన్నాడు. ఎవరైనా దుస్సాహసాలు చేస్తుంటే డబ్బులిచ్చి ప్రోత్సహించడం కర్నార్వన్కి.. అదో కిక్కు. ఆ డబ్బులు తీసుకుని హోవార్డ్ కార్టర్ అండ్ టీమ్.. టుటంఖమున్ సమాధిని ఓపెన్ చేసింది. మమ్మీకి నిద్రాభంగం అయింది. ఇది జరిగిన ఏడాదికి కర్నార్వన్.. దోమ కుట్టి చచ్చిపోయాడు! అంతా అది సమాధిలోంచి వచ్చిన దోమ అన్నారు. అది కాదు విషయం. ఇక్కడ సమాధిని తవ్వుతుండగానే అక్కడ హోవార్డ్ కార్టర్ గారి పాటలు పాడే పెంపుడు పక్షి పంజరంలోనే కోబ్రా కాటేసి చనిపోయింది! మమ్మీ కోపం అక్కడితో చల్లారిపోలేదు. టుటంఖమున్ సమాధితో ఏదో ఒక విధంగా సంబంధం ఉన్నవారు ఏడుగురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. హోవార్డ్ కార్టర్ లక్ ఏంటంటే.. మమ్మీ అతడిని వదిలేసింది! 1939లో అతడు తనకై తను కాలం తీరి చనిపోయాడు. శాపగ్రస్థులు 1 – 2 : లార్డ్ కార్నర్వాన్, జార్జి జే గోల్డ్ లార్డ్ కార్నర్వాన్ చనిపోయినప్పుడు ఎవ్వరూ అతడు మమ్మీ శాపం వల్ల చనిపోయాడని అనుకోలేదు. తర్వాత కొద్ది రోజులకు మే 16 ఫ్రాన్స్‌లో జార్జి జే గోల్డ్ అనే అతను హటాత్తుగా మరణించాడు. అతడొక ఫైనాన్షియర్. టుటంఖమున్ మమ్మీ మూత తెరిచారన్న వార్త తెలిసి ఈజిప్టు Ðð ళ్లి చూసి వచ్చాక అతడి మరణం సంభవించడంతో మమ్మీ శపిస్తోందన్న అనుమానం బయల్దేరింది! శాపగ్రస్థుడు 3 : ప్రిన్స్ అలి కామెల్ ఫామీ బే ఫామీ బే ఈజిప్టు రాకుమారుడు. అతడి భార్య మేరీ మార్గరెట్. మొదటి భర్తకు విడాకులు ఇచ్చాక ఇతడిని చేసుకుంది. దంపతులిద్దరూ లండ¯Œ లో ఉన్నప్పుడు మాటామాట వచ్చి పిస్టల్‌తో అతడిని కాల్చి చంపేసింది మేరీ మార్గరెట్. ఈ హత్య జూలై 9న జరిగింది. అంతకుముందే ప్రిన్స్ ఫామీ బే.. టుటంఖమున్ సమాధిని చూసి వచ్చాడు. శాపగ్రస్థుడు 4: ఆబ్రే హెర్బెట్ ఈయన బ్రిటిష్ దౌత్య అధికారి. ట్రావెలర్. అంతకన్నా కూడా కర్నార్వన్ (మొదటి శాపగ్రస్థుడు) కజిన్ బ్రదర్. ఎప్పుడూ దేశాలు తిరుగుతుంటాడు. టుటంఖమున్ సమాధిని చూసి వచ్చిన వెంటనే జబ్బున పడ్డాడు. చూపు మందగించింది. చికిత్స చేస్తుంటే వికటించి రక్తానికి ఇన్ఫెక్షన్ సోకింది. మొదటి ముగ్గురూ చనిపోయిన ఏడాదే ఈయనా చనిపోయాడు సెప్టెంబర్ 23న. కర్నార్వన్ శాపం కొద్దిగా ఈయనకూ తగిలినట్లుంది. శాపగ్రస్థుడు 5 : సర్ ఆర్చిబాల్డ్ డగ్లాస్ రీడ్ ఇతడు రేడియాలజిస్టు. టుంటంఖమున్ మమ్మీకి ఎక్స్‌రే తీసింది ఇతడే. తర్వాత ఇతడికి తెలియని అనారోగ్యమేదో పట్టుకుంది. 1924 జనవరి 15న చనిపోయాడు. శాపగ్రస్థుడు 6 : సర్ లీ స్టాక్ ఈ సైడాన్ గవర్నర్ జనరల్ 1924 నవంబర్ 19న కారులో కైరోకు ప్రయాణిస్తుండగా ఆగంతకులు రివాల్వర్‌తో కాల్చి చంపారు. సర్ టీ స్టాక్.. టుటంఖుమున్ సమాధి ఉన్న ప్రదేశాన్ని కలియదిరిగి వచ్చిన కొన్నాళ్లకే ఇలా జరిగింది. శాపగ్రస్థుడు 7 : ఎ.సి.మేస్ బ్రిటిష్ ఈజిప్టాలజిస్టు. టుటంఖుమున్ సమాధిన తవ్విన హోవార్డ్ కార్టర్ బృందంలో సభ్యుడు. టుటంఖుమున్ సమాధిని తవ్వేటప్పుడు తనూ ఒక చెయ్యి వేశాడు. మేస్‌కి వెంటనే ఏమీ కాలేదు కానీ పరిశోధనలు చేస్తున్నప్పుడు చేతికి అంటుకున్న అర్సెనిక్ మూలకాలు క్రమంగా అతడిలో చొరబడి 1928లో అతడి ప్రాణం తీశాయి. నిజానికి మమ్మీలలో చెడ్డ మమ్మీలు, శపించే మమ్మీలు ఉండవు. వాటి చుట్టూ మాత్రమే శాపాలు, కోపాల కథలు ఉంటాయి. ఆ కథల్లోంచి వచ్చిన కొత్త హాలీవుడ్ మూవీ ‘ది మమ్మీ’ గతవారమే విడుదలైంది. ఇప్పుడొక ఓల్డెస్టు మమ్మీ గురించి, లేటెస్టు మమ్మీ గురించి తెలుసుకుని కథ ముగిద్దాం. ఓల్డెస్టు మమ్మీ మమ్మీలు వేల ఏళ్లనాటివే అయినా ప్రపంచం చూసిన ఫస్ట్ మమ్మీ.. జింజర్ మమ్మీ. ఈజిప్టు ఏడారి సమాధులలో 1900 సం. తవ్వకాల్లో జింజర్ మమ్మీ బయటపడింది. 18–20 మధ్య వయసుగల ఈ మమ్మీ క్రీ.పూ.3400 నాటిది. మనిషి చనిపోయాక ఏమౌతాడు అనే ప్రశ్న అన్ని దేశాల్లోనూ ఉంది. కానీ ఈజిప్టులో ఎక్కువగా ఉంది. అందుకే అక్కడ అన్ని మమ్మీలు. భద్రపరిచిన మమ్మీ ఏదో ఒక రోజు తిరిగి ప్రాణంతో లేస్తుందని వారి నమ్మకం. అందుకే ఈజిప్టియన్లు గొప్పగొప్ప మమ్మీలకు పిరమిడ్లు కట్టేశారు! మమ్మిఫికేషన్ చాలా పకడ్బందీగా జరుగుతుంది. డెడ్‌బాడీ మొత్తాన్ని గుడ్డలో చుట్టేయరు. కాలేయం, పేగులు, ఊపిరితిత్తులు వేరుగా తీసి ‘కేనోపిన్’ అనే జార్లలో ఉంచుతారు. వీటిని పెద్ద మమ్మీతో పాటు ఉంచుతారు. పెద్ద మమ్మీని శుద్ధి చేసి, అవి పాడవకుండా పొరలు పొరలుగా రసాయనాలు పూస్తారు. పైన గుడ్డలు చుడతారు. మమ్మీ.. దేహం కాదు. బతికున్నవాళ్ల ఆత్మ. మమ్మీల గురించి మనిషి ఏం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడో అవి తెలుస్తూనే ఉన్నా, వాటి వెంటే తెలియని మిస్టరీలు.. సమాధుల నుంచి పైకి లేస్తున్నాయి. ఇదొక అంతులేని అన్వేషణ. ఫేమస్ మమ్మీలు రామసేన్ చక్రవర్తి: మూడవ రామసేస్ చక్రవర్తి సమాధి కెవి11 అనే చోట ఉంది. ఈ కేవీ లెవ¯Œ , కేవీ సిక్స్టీటు.. ఇవన్నీ ఈజిప్టులోని ‘వాలీ ఆఫ్ ది కింగ్’ అనే ప్రాంతంలో ఉంటాయి. రామసేస్–త్రీ క్రీస్తుపూర్వపు ఈజిప్టు చక్రవర్తి. హటాత్తుగా చనిపోయాడు. ఎలా చనిపోయాడన్నది వెయ్యేళ్ల మిస్టరీ. చివరికి భయం భయంగా మమ్మీని ఓపెన్ చేశారు. సీటీ స్కాన్‌లో చక్రవర్తి గొంతులో ఏడు సెంటీమీటర్ల పొడవున కత్తి గాటు కనిపించింది. చరిత్రను గాలించి చూస్తే రామసేస్ను చంపే దమ్ము ఎవరికీ లేదని తేలింది. చంపితే అతడి కొడుకులే చంపి ఉండాలి. అదింకా తేల్లేదు. ది గ్రాబెల్ మ్యాన్: ఈ మమ్మీ 1952లో డెన్మార్క్‌లోని గ్రాబెల్ అనే చోట బయట పడింది. ఇది క్రీ.పూ.3వ శతాబ్దం నాటి మగ మనిషిది. అతడి కాలేయం చెక్కుచెదర్లేదు. ఆ కాలేయానికి రేడియోకార్బన్ డేటింగ్ పరీక్షలు చేసి చూస్తే.. బాడీ కనీసం రెండువేళ ఏళ్ల క్రితం నాటిదని తేలింది. చనిపోయినప్పుడు అతడి వయసు 30. మెడకింద కోసినట్లు ఉంది. ఏవో అంచనాలను బట్టి ఇతడు ప్రాణత్యాగం చేసి ఉండాలని అనుకోవడం తప్ప రూఢీ కాలేదు. యుకోక్ రాకుమారి: ఈ మమ్మీని 1993లో రష్యాలో కనుక్కున్నారు. 2,500 ఏళ్ల క్రితం నాటి మనిషి ఈ మమ్మీ. చనిపోయేనాటికి ఆమె వయసు 25. ఒంటి నిండా పచ్చబొట్టు బొమ్మలు ఉన్నాయి. ఈ అమ్మాయి సెర్బియా కొండల్లో ఉండే పజిరిక్ గిరిజన తెగల పిల్ల అట! ఇలా పచ్చబొట్టు పొడిపించుకున్న వారంతా చనిపోయాక పైన ఒకర్నొకరు కలుసుకుంటారని ఆ తెగల్లో ఒక నమ్మకం. రాకుమారి అన్నది.. ఈ మమ్మీకి ముద్దుపేరు మాత్రమే. పాతికేళ్లకే ఎలా చనిపోయింది? ఒక సాధారణ గిరిజన మహిళను ఇంత కాస్టీ›్లగా ఎవరు మమ్మిఫై చేశారు అన్నది మిస్టరీ. దషీ–దోర్జో ఇటిగిలోవ్: దోర్జో మమ్మీ ఒక బౌద్ధ సన్యాసి. రష్యాలో పుట్టాడు. 1927లో ఓ రోజు రాత్రి తోటి భిక్షువులతో, శిష్యులతో కలిసి ధ్యానంలో ఉండగానే పరలోకాలకు వెళ్లిపోయారు. అప్పుడతడు పద్మాసనంలో ఉన్నాడు. ఆయన్ని ఆ స్థితిలోనే ‘మమ్మిఫై’ చేసి అలా ఉంచేశారు. అప్పట్నుంచీ... శిథిలమవుతున్న ప్రతిసారీ మళ్లీ ఒక కోటింగ్ ఇచ్చి దోర్జో మమ్మీని ‘బతికిస్తున్నారు’. దోర్జో చనిపోయి వందేళ్లు కావస్తున్నా.. 36 గంటల క్రితం చనిపోయిన మనిషిలానే కనిపిస్తుంటాడు. ఆధునికులు ఏం పూసి ఈ మమ్మీని ఫ్రెష్‌గా ఉంచుతున్నారన్నది మిస్టరీ. ఈవా పెరాన్: జువాన్ పెరాన్ 1946–1955 మధ్య కాలంలో అర్జెంటీనాకు అధ్యక్షుడు. ఆయన భార్య ఈవా పెరాన్. 1952 జూలై 26న చనిపోయింది. ఆమె క్యాన్సర్ పేషెంట్. ముప్పై మూడేళ్లకే కన్నుమూసింది. ఈవా మృతదేహాన్ని మమ్మీగా మార్చి భద్రపరిచారు. జువాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో భార్య ఇసాబెల్. ఆమె ఈవా మమ్మీని ఎంతగానో ప్రేమించేవారు. ప్రతిరోజూ పేటిక తెరిచి ఈవా తల దువ్వేవారు. కొన్నిసార్లు శవపేటికలో ఈవా పక్కనే పడుకునేవారు. ఇప్పుడా మమ్మీ జువాన్ వారసుల కుటుంబ ప్రార్థనా స్థలం చర్చి అడుగుభాగంలో ఖననం అయి ఉంది. -
ప్రాచీన మమ్మీ నుంచి డీఎన్ఏ సేకరణ
పరిశోధకులు మొదటిసారి 300 ఏళ్ళనాటి ప్రాచీన డీఎన్ఏ అవశేషాలను కనుగొన్నారు. దక్షిణాఫ్రికాలోని ఓ మమ్మీనుంచి విజయవంతంగా ప్రాచీన డీఎన్ఏ ను వెలికి తీశారు. ముందుగా మమ్మీకి కంప్యూటరరైజ్జ్ టోమోగ్రఫీ (సీటీ స్కాన్) నిర్వహించి డీఎన్ఏ అవశేషాలను గుర్తించారు. అనాటమికల్ సైన్సెస్ స్కూల్ ప్రొఫెసర్ మెరీనా స్టెయిన్... స్విట్జర్లాండ్ లోని జురిచ్, ప్రెటోరియా, బోట్స్వానా విశ్వవిద్యాలయాలనుంచి వచ్చిన ఇతర అధ్యయనకారుల బృందంతో కలసి ఈ తాజా అధ్యయనాలు నిర్వహించారు. తులిబ్లాక్ కు చెందిన ఇనుప యుగంనాటి మమ్మీపై జరిపిన జన్యు విశ్లేషణ పరిశోధనా ఫలితాలను సౌతాఫ్రికాలోని బోట్స్వానా సైన్స్ జర్నల్ లో ప్రచురించారు. తాజాగా కనుగొన్న ప్రాచీనకాలంనాటి మమ్మీ అవశేషాలు.. అప్పటి జనాభాకు సంబంధించిన విలువైన సమాచారాన్ని తెలిపేందుకు మంచి వనరుగా ఉపయోగిస్తాయని పరిశోధకులు అంటున్నారు. అయితే పరిశోధనలు జరిపిన మమ్మీ.. తులి ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా మొదట్లో భావించిన పరిశోధకులు... అనంతరం మమ్మీ అవశేషాలను బట్టి ఆఫ్రికన్ మాలాలు కలిగిన పురుషుడికి చెందినదిగా గుర్తించారు. అతడి మమ్మీ కదలసి స్థితిలో ఉండి, జంతు చర్మంతో చుట్టి, తాళ్ళతో గట్టిగా కట్టి ఉన్నట్లు పరిశోధనా ఫలితాల్లో ప్రచురించారు. మమ్మీలోని అంతర్గత అవయవాలు ఏవీ సురక్షితంగా లేవని సీటీ స్కాన్ ద్వారా తెలుసుకున్న పరిశోధక బృదం... అనేక పోస్టు మార్టం లను కూడ నిర్వహించి వెన్నెముక కింది భాగంలో కొన్నిప్రమాదకర మార్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అస్థిపంజరం మాత్రం చెక్కు చెదరకుండా ఉందని తెలుసుకున్నారు. అయితే వెన్నెముకలో కనిపించిన మార్పులను బట్టి చూస్తే వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తిలా కనిపించిందని, అతడి మరణం ఎప్పుడు జరిగింది, ఏ కారణంగా జరిగింది అన్న వివరాలు ధృవీకరించడం సాధ్యం కాలేదని వెల్లడించారు. శరీరంలో ఎలాంటి గాయాలు ఉన్నట్లు కూడ కనిపించలేదని చెప్పారు. అయితే విజయవంతంగా తాము కనుగొన్న డీఎన్ ఏ విశ్లేషణను బట్టి ఆ వ్యక్తి సోతో సెటస్వానా లేదా ఖోయెసాన్ ప్రాంతానికి చెందిన వాడిగా నిర్థారించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. -
ఇప్పుడు మా అమ్మ గుర్తుకొస్తోంది! - జెనీలియా
జెనీలియా... ఈ పేరు చెప్పగానే ‘బాయ్స్’ చిత్రంలోని టీనేజ్ అమ్మాయి దగ్గర నుంచి ‘బొమ్మరిల్లు’లోని హాసిని పాత్రధారిణి దాకా ఎన్నో వెండితెర దృశ్యాలు గుర్తుకొస్తాయి. తెలుగు, తమిళ చిత్రాల్లో అగ్రస్థాయికి చేరుకొని, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్ళి చేసుకున్న ఈ అందాల నటి కొద్ది నెలల క్రితమే ఒక బాబుకు తల్లి అయ్యారు. అమ్మగా కొత్త బాధ్యతలు మీద పడ్డ జెనీలియా ఈ కొత్త పాత్రను కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. గర్భవతిగా ఉన్నప్పుడు పిల్లల డయాపర్ల బ్రాండ్ ‘ప్యాంపర్స్’ ప్రకటనకు ఎండార్స్మెంట్ చేసిన జెనీలియా తన తల్లి పాత్ర గురించి తొలిసారిగా పంచుకున్న విశేషాలు... ♦ ఏకకాలంలో ఇంటి పని, చంటిబాబు పని చూసుకోవడం కొద్దిగా కష్టమే. కానీ, నా తొలి ప్రాధాన్యం బాబుకే! ఆ తరువాతే ఇంటి వ్యవహారాలు. మా బాబు రియాన్‌కు మూడు నెలలే. అదృష్టం ఏమిటంటే - రియాన్ రాత్రంతా నిద్రపోతాడు. అందువల్ల తల్లిగా నేను హ్యాపీ. నేను సంతోషంగా ఉండడం వల్ల అన్ని పనులూ సవ్యంగా చేసుకోగలుగుతున్నా. సానుకూలంగా స్పందించగలుగుతున్నా. బాబును హాయిగా ఆడించగలుగుతున్నా. ♦ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా బాబు పనులన్నీ స్వయంగా నేనే చేసుకోవడం వల్ల బాగా అలసిపోతున్నా. అయితే, కొత్తగా వచ్చిన ఈ తల్లి పాత్రను బాగా ఆస్వాదిస్తున్నా. తల్లి కావడం ఒక అద్భుతమైన అనుభూతి. నాకు పదే పదే మా అమ్మ గుర్తుకొస్తుంటుంది. మనకంటూ ఒక బిడ్డ పుట్టాక, మనకు మన అమ్మ మీద అమితంగా ప్రేమ పెరుగుతుందంటే నమ్మండి. ♦ చంటిపిల్లాణ్ణి పెంచడంలో మా అమ్మ నుంచి, మా అత్త గారి నుంచి బోలెడన్ని సలహాలు తీసుకుంటూ ఉంటా. అయితే, నా బుద్ధికి తోచినట్లు చేస్తా. చంటిపిల్లాడికి ఏం కావాలన్నది తల్లికి తెలిసినట్లుగా వేరెవరికీ తెలియదు. అయినా ఎవరో అన్నట్లు, చెడ్డ పిల్లలు ఉంటారేమో కానీ, చెడ్డ తల్లులు మాత్రం ఉండరు! ♦ మా ఆయన రితేశ్ దేశ్‌ముఖ్ కూడా పరిస్థితులను బాగా అర్థం చేసుకున్నారు. నేను గర్భవతినన్న సంగతి తెలిసిన క్షణమే ఆయన ఒక మాట అన్నారు... ‘నిజానికి, నువ్వొక్కదానివే కాదు, మన ఇద్దరం ఇప్పుడు ప్రెగ్నెంటే!’ జీవిత భాగస్వామి నుంచి ఏ స్త్రీకైనా అంతకు మించి ఇంకేం కావాలి! తండ్రి కాబోతున్న క్షణంలో ఆయనకొచ్చిన గొప్ప ఆలోచన అది. ఇలాంటి ఆలోచన వల్ల జీవిత భాగస్వాములిద్దరూ ఆ గర్భధారణ సమయాన్నీ, ప్రసవాన్నీ కలసి ఆస్వాదిస్తారు. అలాగే, తల్లితండ్రులుగా వచ్చిపడ్డ కొత్త బాధ్యతల్ని పంచుకుంటారు. రితేశ్ కూడా మా బాబుకి డయాపర్స్ మారుస్తారు, స్నానం చేయిస్తారు. బాబు నిద్రపోకపోతే, నాతో పాటే రాత్రంతా మెలకువగా ఉంటారు. పసిపిల్లల్ని పెంచడం కేవలం తల్లి బాధ్యతే కాదు, తండ్రి బాధ్యత కూడా అని గ్రహిస్తే, ఆ సంసారంలో అంతకన్నా ఆనందం ఏముంటుంది! ♦ నన్నడిగితే తల్లులకు మాతృత్వపు సెలవు ఇచ్చినట్లే, తండ్రులకు ‘పేటర్నిటీ లీవ్’ ఇవ్వాలి. దాన్ని చట్టబద్ధం చేయాలి. లేకపోతే, ఇతర పనుల్లో పడిపోయి, భార్యాబిడ్డలతో గడిపే తీరికే వాళ్ళకు ఉండదు. ♦ పెళ్ళయ్యాక మీలో వచ్చిన మార్పేమిటి? తల్లయ్యాక వచ్చిన మార్పేమిటి? అని నన్ను అందరూ అడుగుతుంటారు. నిజం చెప్పాలంటే, మనం మనంగా ఉంటూ, మన వ్యక్తిత్వాన్ని కాపాడుకొంటూ పిల్లల్ని పెంచాలి. అది చంటిపిల్లల పెంపకంలో ప్రతిఫలిస్తుంది. అలా కాకుండా మరొకరిలా ఉండడానికి ప్రయత్నిస్తే అప్పుడిక మొత్తం కుప్పకూలిపోతుంది. హుషారుగా, ఆనందంగా ఉండే అమ్మాయి మా అమ్మ అని గుర్తించేలా మా అబ్బాయి పెరగాలనుకుంటున్నా. ♦ పసిబిడ్డకు తల్లి అయ్యాక సెలబ్రిటీలకే కాదు, ఎవరికైనా శారీరక మార్పులు తప్పవు. గర్భవతిగా ఉన్నప్పుడు మనం ఎంతైనా లావు కావచ్చు. బిడ్డ పుట్టాక మళ్ళీ క్రమంగా అందం మీద దృష్టి పెట్టక తప్పదు. అలాగే, తల్లి పాత్ర వల్ల నటిగా లైమ్‌లైట్‌కు దూరమయ్యానని అనుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే, జీవితంలో నేనేమీ మిస్సవడం లేదు. తల్లి పాత్ర అలవాటయ్యాక ఇప్పుడిప్పుడే మళ్ళీ కొద్ది కొద్దిగా బయటకు వస్తున్నా. మొన్నటిదాకా నటిగా, నిన్న గర్భవతిగా, ఇప్పుడు తల్లిగా - ఇలా ప్రతి దశనూ ఆస్వాదిస్తూనే ఉన్నా. -
‘మమ్మీ’ పచ్చబొట్టూ.. చెరిగీపోలే..!
సూడాన్‌లో 1,300 ఏళ్ల క్రితం నివసించిన ఓ మహిళకు చెందిన మమ్మీ(మృతదేహం) 3డీ విజువల్ చిత్రాలివి. సుమారు 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఈ మహిళ కుడి తొడపై పొడిపించుకున్న ఓ పచ్చబొట్టును తాజాగా బ్రిటిష్ మ్యూజియం పరిశోధకులు సీటీ స్కాన్‌లో గుర్తించారు. మైఖేల్ అనే అర్థం వచ్చేలా గ్రీకులో ‘ఎం-ఐ-ఎక్స్-ఏ-హెచ్-ఏ’ అనే అక్షరాలను (ఇన్సెట్లో) ఈ మహిళ టాటూ పొడిపించుకుందని, అది రక్షణ కోసం పొడిపించుకునే సంకేతమని చెబుతున్నారు. ఇంత పాతకాలం నాటి మమ్మీపై పచ్చబొట్టు వెలుగుచూడటం ఇదే తొలిసారట. మొత్తం 8 మమ్మీలను స్కాన్ చేసిన పరిశోధకులు.. 3డీ విజువలైజేషన్ ద్వారా పరిశీలించగా.. అప్పట్లో వీరు హై కొలెస్ట్రాల్, గుండెజబ్బు, దంతాల వద్ద కణితులతో బాధపడేవారని, బహుశా గుండెపోటు, పక్షవాతం, కణితుల వల్ల మరణించి ఉండొచ్చని అంచనా వేశారు -
అమ్మా.. ఇక్కడో మమ్మీ ఉంది!!
అమ్మా.. అమ్మమ్మ ఇంట్లో అటక మీద 'మమ్మీ' ఉంది!! ఓ జర్మన్ పిల్లాడు వేసిన కేక ఇది. అవును.. అత్యంత పురాతనమైన ఈజిప్షియన్ మమ్మీ ఒకటి అతడికి తన అమ్మమ్మ ఇంట్లో అటకమీద కనపడింది. చాలా దశాబ్దాలుగా ఎవ్వరూ కదిలించకపోవడంతో అది ఒక చెక్కపెట్టెలో ఒక మూల అలా పడి ఉంది. ఆ పిల్లాడి పేరు అలెగ్జాండర్. ఉత్తర జర్మనీలోని డైఫోల్జ్ నగరంలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లినప్పుడు ఆడుకుంటూ అటక ఎక్కాడు. అక్కడ ఏవేం ఉన్నాయోనని గాలించడం మొదలుపెట్టాడు. ఉన్నట్టుండి ఓ పెద్ద చెక్కపెట్టె కనిపించింది. చిన్న వయసు, ఏముందో చూడాలనే ఉత్సాహం, కుతూహలం అతడిని ఆగనివ్వలేదు. వెంటనే ఎలాగోలా కష్టపడి చెక్కపెట్టె తలుపు తెరిచాడు. తీరా చూస్తే.. లోపలున్నది ఓ మమ్మీ!! కొద్దిసేపు భయపడినా, తర్వాత సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. అయితే, అసలు అక్కడున్నది నిజమైన పురాతన ఈజిప్షియన్ మమ్మీయేనా, లేకపోతే దానికి నకలు లాంటిది ఏమైనా చేయించి పెట్టుకున్నారా అనే విషయాన్ని తేల్చాలని నిపుణులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలెగ్జాండర్ తండ్రి లట్జ్ వుల్ఫ్ గ్యాంగ్ కెట్లర్ ఓ దంతవైద్యుడు. తన తండ్రి ఉత్తర ఆఫ్రికాలో 1950 కాలంలో ప్రయాణించేటప్పుడు ఈ పెట్టె తీసుకుని దాన్ని జర్మనీకి తెచ్చారని ఆయన చెప్పారు. అయితే దాని గురించి ఆయన ఎప్పుడూ ఏమీ చెప్పలేదని తెలిపారు. జర్మనీలోని ఉన్నత కుటుంబాల్లో 1950ల కాలంలో 'మమ్మీ అన్రాపింగ్ పార్టీలు' చాలా ప్రముఖంగా జరిగేవని ఆయన వివరించారు. బహుశా తమ ఇంట్లో ఉన్నది అసలు మమ్మీ కాదేమోనని, దానికి నకలు అయి ఉంటుందని భావించారు. దానికి ఎక్స్-రే తీయడం తప్ప ఈ విషయం నిర్ధారించుకోడానికి మరో మార్గం ఏమీ లేదని తెలిపారు.