ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన మానవ అవశేషాలను మమ్మీ అని పిలవొద్దని, ఇకపై ఆ పదాన్ని బ్యాన్ చేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన మ్యూజియంలు ప్రకటించాయి. అలా పిలవడం.. చనిపోయిన వాళ్లను కించపరిచినట్లే అవుతుందని, అలాంటి పనికి తాము ఒప్పుకోబోమని ప్రకటించాయి.
బతికి ఉన్నవాళ్లకు ఎలాంటి హక్కులు ఉంటాయో..చనిపోయిన వాళ్ల హక్కులను కాపాడడం, గౌరవించడం అందరి బాధ్యత. మమ్మీ అనే పదానికి బదులుగా మమ్మీఫైడ్ పర్సన్ అని పిలవాలని, లేదంటే ఫలానా ఆనవాలు పేరు తెలిసిఉంటే.. పేరు పెట్టి అయినా పిలవాలని మ్యూజియంలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని ఓ మ్యూజియం ఏకంగా బ్లాగ్‌లో ఈవిషయాన్ని పొందుపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment