mummified body
-
ఆ నరమాంస భక్షకిని భద్రపరుస్తారట!
కైరో: మమ్మీఫైయింగ్ ద్వారా ఈజిప్ట్ ఫారో చక్రవర్తులను, రాణులను భద్రపర్చడం.. వాటిని పిరమిడ్ల కింద మమ్మీలుగా బయటకు తీస్తుండడం తెలిసిందే కదా. ఈజిప్ట్‌లో, ప్రపంచంలోని పలు దేశాల మ్యూజియంలో మమ్మీలను చూడడం షరామామూలే కావొచ్చు. అయితే ఇప్పుడు అక్కడ ఒక కిల్లర్ షార్క్‌ను మమ్మీఫైయింగ్ చేసి ప్రదర్శన కోసం ఉంచనున్నారు. ఈజిప్ట్ నగరం హుర్ఘదా ఎర్ర సముద్ర పరిధిలో ఉన్న ఓ రిసార్ట్ తాజాగా జరిగిన ఘోరం గురించి తెలిసే ఉంటుంది. 23 ఏళ్ల రష్యన్ యువకుడిని అతని తండ్రి సమక్షంలోనే దాడి చేసి.. చంపి తినేసింది ఓ షార్క్(టైగర్ షార్క్). సెకండ్ల వ్యవధిలో జరిగిన ఈ ఘటన ఆ తండ్రితో సహా అక్కడున్నవాళ్లందరినీ షాక్‌కు గురి చేసింది. ఆ టైంలో తనను రక్షించమంటూ ఆ వ్యక్తి కేకలు వేయడం గమనించొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది కూడా. అయితే.. ఆ తర్వాత ఆ షార్క్‌ను చంపేశారు కూడా. అది పక్కా కమర్షియల్ రిసార్ట్. ఎప్పుడూ బోట్లు సంచరిస్తూనే ఉంటాయి. అలాంటి చోట ఈ ఘటన జరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కళ్లు మూసి తెరిచేలోపే ఘోరం జరగడం.. నీళ్లలోకి లాక్కెళ్లి మరీ 20 సెకండ్లలోనే అతన్ని చంపి మింగేయడం లాంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇక మృతుడి శరీర భాగాలను జాలర్లు నీటి నుంచి సేకరించగా.. మరికొన్ని భాగాలు షార్క్ పొట్టలో దొరికాయి. ఇదిలా ఉంటే.. ఆ టైగర్షార్క ప్రవర్తన గురించి పరిశోధకుల్లో ఆసక్తి నెలకొంది. అంత వేగంగా అది దాడి చేసి చంపినందుకు నరమాంసభక్షకిగా అభివర్ణిస్తున్నారు వాళ్లు. అంతేకాదు దానిని పరిశీలించేందుకు ఇప్పుడొక అవకాశం దొరికిందని.. అందుకే దానిని భద్రపర్చాలని నిర్ణయించుకున్నట్లు మెరైన్ సైన్సెస్ ఇనిస్టిట్యూట్, రెడ్సీ రిజర్వ్స్ వాళ్లు చెబుతున్నారు. సోమవారం నుంచి ఆ షార్క్ బాడీకి ఎంబామింగ్ చేయడం ప్రారంభించారు. ఆ ప్రక్రియ పూర్తికాగానే.. ఆ షార్క్‌ను ఇనిస్టిట్యూట్‌లోని మ్యూజియంలో భద్రపరుస్తారట. దాని ప్రవర్తనకు అధ్యయనం చేసేందుకు దానిని భద్రపరుస్తున్నామని, తర్వాతి తరాలకు ఆ కిల్లర్ షార్క్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు దొరికిన భాగాలకు అంత్యక్రియలు నిర్వహించిన ఆ తండ్రి.. పుట్టెడు దుఖంతో ఆ అస్తికలను తీసుకుని రష్యాకు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: శవపేటిక నుంచి సౌండ్ రావడంతో.. -
మమ్మీ అనొద్దు!
ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన మానవ అవశేషాలను మమ్మీ అని పిలవొద్దని, ఇకపై ఆ పదాన్ని బ్యాన్ చేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన మ్యూజియంలు ప్రకటించాయి. అలా పిలవడం.. చనిపోయిన వాళ్లను కించపరిచినట్లే అవుతుందని, అలాంటి పనికి తాము ఒప్పుకోబోమని ప్రకటించాయి. బతికి ఉన్నవాళ్లకు ఎలాంటి హక్కులు ఉంటాయో..చనిపోయిన వాళ్ల హక్కులను కాపాడడం, గౌరవించడం అందరి బాధ్యత. మమ్మీ అనే పదానికి బదులుగా మమ్మీఫైడ్ పర్సన్ అని పిలవాలని, లేదంటే ఫలానా ఆనవాలు పేరు తెలిసిఉంటే.. పేరు పెట్టి అయినా పిలవాలని మ్యూజియంలు ఒక ప్రకటనలో స్పష్టం చేశాయి. ఈ మేరకు ఇంగ్లండ్‌లోని ఓ మ్యూజియం ఏకంగా బ్లాగ్‌లో ఈవిషయాన్ని పొందుపరిచింది. -
బంగారు గనుల్లో అరుదైన 'మమ్మీ' అవశేషాలు
Miners in the Klondike gold fields of Canada's: కొంతమంది యువకులు ఉత్తర కెనడాలోని బంగారు గనుల్లో అరుదైన మమ్మీ అవశేషాలను కనుగొన్నారు. ఇది ఒక ఆడ జంతువిగా గుర్తించారు. ఇది యుఎస్ రాష్ట్రానికి అలాస్కా సరిహద్దులో ఉన్న కెనడాలోని యుకాన్ మంచు ప్రదేశంలోని బంగారు గనుల్లో జరిపిన తవ్వకాల్లో ఈ అవశేషాలను కనుగొన్నారు. ఈ మమ్మీ ప్రపంచంలో ఇప్పటివరకు కనుగొనబడని అత్యద్భుతమైన మంచు యుగం నాటి జంతువులకు సంబంధించిన మమ్మీలలో ఇది ఒకటి. సుమారు 30 వేల ఏళ్ల క్రితం అడవి గుర్రాలు సింహాలు తదితర జంతువులు ఈ ప్రాంతంలో సంచరించేవని, అవి మంచు తుఫాను కారణంగా చనిపోయి ఉండవచ్చని పాలియోంటాలజిస్ట్ గ్రాంట్ జాజులా చెప్పారు. ఐతే ఈ యువ బృందం ఈ మమ్మీకి 'నన్ చో'(పెద్ద పిల్ల) అనే పేరు పెట్టారు. ఇదిలా ఉండగా 2007లో సైబీరియాలో 'లియుబా' అనే 42 వేల ఏళ్ల నాటి ఒక మమ్మీని గుర్తించారు. ప్రస్తుతం బయటపడ్డ ఈ నన్ చో, ఈ లియుబా మమ్మీ రెండు దాదాపు ఒకే పరిమాణంలో ఉండటం గమనార్హం. (చదవండి: ఇమ్రాన్ ఖాన్ని హత్య చేసేందుకు స్కెచ్...పట్టుబడ్డ ఉద్యోగి) -
పర్వతపు అంచున ఏళ్లనాటి మృతదేహం
అది మెక్సికోలోని అత్యంత ఎత్తైన మంచు పర్వతం. దానిని చూడగానే వెంటనే పర్వతారోహణ చేయాలన్నఆలోచన మనసులో మెదలుతుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో కొంతమంది పికో డీ ఒరిజాబా అనే ఈ 5,610 మీటర్ల పర్వతాన్ని అధిరోహించి షాక్ గురయ్యారు. అందుకు కారణం పర్వతపు చివరి అంచులో శిథిలమై ఉన్న ఓ మృతదేహం. కేవలం ఎముకలు, పుర్రె మాత్రమే అక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని కిందికి వచ్చాక వారు సమీప అధికారులతో చెప్పగానే మొత్తం పన్నెండు మంది కలిసి తగిన రక్షణలతో అక్కడికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకొన్నారు. 50 ఏళ్ల కింద ఓ వ్యక్తి పర్వతారోహణకు అక్కడికి వెళ్లి చనిపోయి ఉండొచ్చని స్థానిక మీడియా చెబుతోంది. డీఎన్ఏ పరీక్ష నిర్వహించి సదరు వ్యక్తి వివరాలు గుర్తిస్తామని చెప్తున్నారు.