పర్వతపు అంచున ఏళ్లనాటి మృతదేహం | Mission to Find Mummified Body at Mexico's Highest Peak 5,610-meter Pico de Orizaba | Sakshi
Sakshi News home page

పర్వతపు అంచున ఏళ్లనాటి మృతదేహం

Published Fri, Mar 6 2015 1:56 PM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM

పర్వతపు అంచున ఏళ్లనాటి మృతదేహం

పర్వతపు అంచున ఏళ్లనాటి మృతదేహం

అది మెక్సికోలోని అత్యంత ఎత్తైన మంచు పర్వతం. దానిని చూడగానే వెంటనే పర్వతారోహణ చేయాలన్నఆలోచన మనసులో మెదలుతుంది. సరిగ్గా ఇదే ఆలోచనతో కొంతమంది పికో డీ ఒరిజాబా అనే ఈ 5,610 మీటర్ల పర్వతాన్ని అధిరోహించి షాక్ గురయ్యారు. అందుకు కారణం పర్వతపు చివరి అంచులో శిథిలమై ఉన్న ఓ మృతదేహం. కేవలం ఎముకలు, పుర్రె మాత్రమే అక్కడ ఉన్నాయి. ఈ విషయాన్ని కిందికి వచ్చాక వారు సమీప అధికారులతో చెప్పగానే మొత్తం పన్నెండు మంది కలిసి తగిన రక్షణలతో అక్కడికి వెళ్లి దానిని స్వాధీనం చేసుకొన్నారు. 50 ఏళ్ల కింద ఓ వ్యక్తి పర్వతారోహణకు అక్కడికి వెళ్లి చనిపోయి ఉండొచ్చని స్థానిక మీడియా చెబుతోంది.  డీఎన్ఏ పరీక్ష నిర్వహించి సదరు వ్యక్తి వివరాలు గుర్తిస్తామని చెప్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement